ఫాం హౌస్ కేసులో పోలీసు విచారణకు రాజ్ పాకల హాజరు - 9 గంటలు కొనసాగిన విచారణ
పోలీసుల వైఖరి వల్ల తమ కుటుంబం చాలా డిస్టర్బ్ అయిందన్న రాజ్ పాకాల
ఫాం హౌస్ కేసులో రాజ్ పాకాల పోలీసుల విచారణకు హాజరు 9 గంటలపాటు విచారణ
హైదారాబాద్ అక్టోబర్ 30:
ధన్వాడ ఫామ్‌హౌస్ కేసులో ముగిసిన రాజ్ పాకాల పోలీస్ విచారణ, రాజ్ పాకాలను 9 గంటలపాటు విచారించిన మోకిల పోలీసులు, రాజ్ పాకాల స్టేట్మెంట్ రికార్డు చేసిన పోలీసులు BNSS 35(3) సెక్షన్ కింద రాజ్ పాకాలకు నోటీసులు, విజయ్ మద్దూరి స్టేట్మెంట్ ఆధారంగా కొనసాగిన విచారణ, విచారణ మధ్యలో రాజ్ పాకాలను ఫామ్‌హౌస్‌కు తీసుకెళ్లిన పోలీసులు ఫామ్‌హౌస్‌లో గంటపాటు పోలీసుల సోదాలు, గతంలో జరిగిన పార్టీలపై పోలీసుల ఆరా.
పోలీసుల వైఖరి వల్ల తమ కుటుంబం చాలా డిస్టర్బ్ అయిందన్న రాజ్ పాకాల
విచారణలో పోలీసులు అడిగిన వాటికి సమాధానం చెప్పా -;కేటీఆర్ బావమరిది రాజ్ పాకాల
పోలీసుల విచారణకు సహకరించానన్న రాజ్ పాకాల
మా ఇంట్లో పార్టీ చేసుకున్నామన్న కేటీఆర్ బావమరిది
పోలీసుల వైఖరి వల్ల తమ కుటుంబం చాలా డిస్టర్బ్ అయిందన్న రాజ్ పాకాల
తాను పోలీసుల విచారణకు సహకరించానని... అడిగిన ప్రశ్నలకు సమాధానం చెప్పానని కేటీఆర్ బావమరిది రాజ్ పాకాల వెల్లడించాడు. జన్వాడ ఫాంహౌస్‌లో జరిగిన పార్టీకి సంబంధించి మోకిల పోలీసులు ఆయనను ప్రశ్నించారు. బీఎన్ఎస్ సెక్షన్ 35(3) ప్రకారం పోలీసులు రాజ్ పాకాలకు నోటీసులు ఇచ్చారు. అతని మొబైల్ ఫోన్‌ను సీజ్ చేశారు. ఈరోజు సుదీర్ఘంగా విచారించారు.
పోలీసుల విచారణ అనంతరం రాజ్ పాకాలను మీడియా పలకరించింది. విచారణకు సహకరించానని తెలిపాడు. ఫాంహౌస్‌లో జరిగింది కేవలం ఫ్యామిలీ పార్టీ మాత్రమే అన్నాడు. మా ఇంట్లో మేం ఫ్యామిలీ పార్టీ చేసుకోకూడదా? అన్నాడు.
పోలీసుల వైఖరి వల్ల తమ కుటుంబం చాలా డిస్టర్బ్ అయిందని ఆవేదన వ్యక్తం చేశాడు. విజయ్ మద్దూరి పోలీసుల వద్ద తమకు వ్యతిరేకంగా ఎలాంటి స్టేట్మెంట్ ఇవ్వలేదని వెల్లడించారు. అయినా అక్కడకు వచ్చిన వారిలో ఎవరో ఒకరకి డ్రగ్ పాజిటివ్ వస్తే తనకు సంబంధం ఏమిటని ప్రశ్నించారు. కావాలనే ఈ అంశాన్ని పెద్దదిగా చిత్రీకరిస్తున్నారని ఆరోపించారు.
రాజ్ పాకాల విచారణ పూర్తయిందని నార్సింగి ఏసీపీ రమణ గౌడ్ తెలిపారు. ఈ కేసు దర్యాఫ్తు దశలో ఉందన్నారు. అవసరమైతే రాజ్ పాకాలను మరోసారి విచారణకు పిలుస్తామన్నారు.
మరోవైపు, తాను ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నానని, విచారణకు హాజరు కాలేనని విజయ్ మద్దూరి పోలీసులకు తెలిపాడు. ఈ మేరకు ఆయన తన లాయర్ల ద్వారా పోలీసులకు సమాచారం పంపించాడు.
More News...
<%- node_title %>
<%- node_title %>
నేరెళ్ల గ్రామంలో యువకుని ఆదృశ్యం
గొల్లపల్లి జనవరి 11 (ప్రజా మంటలు ):
ధర్మపురి మండలం నేరెళ్ల గ్రామానికి చెందిన మంద నరేష్ (35) నేరెళ్లలో కుటుంబంతో సోమవారం మధ్యాహ్నం భార్యతో కిరాణా షాపుకు వెళ్తున్నాను అని చెప్పి ఇంటి నుండి వెళ్ళి ఇంటికి రాకపోవడంతో కుటుంబ సభ్యులు చుట్టుపక్కల ఎంత వెతికినా ఆచూకీ లభించకపోవడంతో తల్లి మంద శంకరమ్మ నిజాంపేట్ ఫేజ్–3లో సంక్రాంతి కానుకల పంపిణీ
సికింద్రాబాద్, జనవరి 11 (ప్రజా మంటలు):
మల్కాజిగిరి పార్లమెంట్ సభ్యులు ఈటెల రాజేందర్ గారు నిజాంపేట్ ఫేజ్–3లో నిర్వహించిన సంక్రాంతి కానుకల పంపిణీ కార్యక్రమంలో పాల్గొని మహిళలకు చీరలను అందజేశారు. ఈ కార్యక్రమాన్ని పద్మ ప్రసాద్ ఆధ్వర్యంలో బీజేపీ నాయకులు సమన్వయంతో నిర్వహించారు.ఈ సందర్భంగా నిజాంపేట్ బీజేపీ అధ్యక్షులు ఎం. బిక్షపతి యాదవ్, ఓబీసీ నిజాంపేట్... హైదరాబాద్‌లో స్కై ఫౌండేషన్ 292వ అన్నదాన కార్యక్రమం
సికింద్రాబాద్, జనవరి 11 (ప్రజా మంటలు):
స్కై ఫౌండేషన్ ఆధ్వర్యంలో నగరంలో రోడ్ల పక్కన జీవనం సాగిస్తున్న అనాథలు, నిరాశ్రయులు, నిరుపేదలకు 292వ అన్నదాన కార్యక్రమం నిర్వహించారు. వాహనంలో నగరమంతా సంచరిస్తూ ఆకలితో ఉన్నవారిని గుర్తించి ఒక్కపూట భోజనం అందించారు.ఈ కార్యక్రమంలో ఫౌండర్ & ప్రెసిడెంట్ డా. వై. సంజీవ కుమార్, వైస్ ప్రెసిడెంట్... మేడిబావిలో ఆర్యసమాజ్ రంగవల్లిక పోటీలు
సికింద్రాబాద్, జనవరి 11 (ప్రజా మంటలు):
మేడిబావి ఆర్యసమాజ్ ఆధ్వర్యంలో ఈరోజు నిర్వహించిన రంగవల్లిక పోటీలకు 50కిపైగా మంది పాల్గొన్నారు. విజేతలకు బహుమతులు అందజేశారు. ముఖ్యఅతిథిగా హాజరైన ఆర్యసమాజ్ ప్రెసిడెంట్ ఎం.ఆర్. రవీందర్ మాట్లాడుతూ పండుగలు మన సంస్కృతికి ప్రతీకలని, ప్రతి ఒక్కరూ సంక్రాంతి పండుగను ఆనందంగా జరుపుకోవాలని సూచించారు. ఈ కార్యక్రమంలో ఆర్యసమాజ్ సభ్యులు... బతికుండగానే సమాధి నిర్మించుకున్న నక్క ఇంద్రయ్య మృతి – సంతాపం
జగిత్యాల, జనవరి 11 (ప్రజా మంటలు):
జగిత్యాల రూరల్ మండలం లక్ష్మీపూర్ గ్రామానికి చెందిన సీనియర్ సిటిజన్, జగిత్యాల రూరల్ మండల సీనియర్ సిటిజెన్స్ అధ్యక్షుడు నక్క ఇంద్రయ్య శనివారం రాత్రి మృతి చెందారు. ఆయన బతికుండగానే స్వయంగా నిర్మించుకున్న సమాధిలోనే ఆదివారం ఆయన భౌతిక కాయాన్ని భూస్థాపితం చేశారు. ఈ ఘటన స్థానికంగా విషాదాన్ని... తొలగించిన IAS పూజా ఖేడ్కర్ తల్లిదండ్రులు సహా ఐదుగురు అచేతనం
పుణే, జనవరి 11:పదవి నుంచి తొలగించబడిన IAS ట్రైనీ అధికారి పూజా ఖేడ్కర్ తల్లిదండ్రులు సహా మరో ముగ్గురు పుణేలోని వారి బంగ్లాలో అచేతన స్థితిలో కనిపించడం కలకలం రేపింది. బానెర్–ఆంధ్ ప్రాంతంలోని నివాసంలో జరిగిన ఈ ఘటనలో నిద్ర మందులు కలిపి వారిని అచేతనం చేసి దొంగతనం చేసినట్లు అనుమానం వ్యక్తమవుతోంది.
సమాచారం... ఇరాన్ లో ఇంటర్నెట్ సేవలు బంద్: ప్రపంచంతో తెగిన సంబంధాలు
టెహ్రాన్ జనవరి 11:
నిరసనలు తీవ్రమవుతున్న తరుణంలో, ఇరాన్ ప్రపంచంతో సంబంధాలను తెంచుకుంది.ఆర్థిక వ్యవస్థపై నిరసనలు వ్యాపిస్తున్న నేపథ్యంలో ఇరాన్లో ఇంటర్నెట్ సేవలు నిలిచిపోయాయి.
ఇరాన్లో ఆర్థిక సంక్షోభం కారణంగా ప్రారంభమైన నిరసనలు నేషన్లవైడ్ స్థాయిలో విస్తరుతూ తీవ్ర ఉద్రిక్త పరిస్థితులను సృష్టిస్తున్నాయి. ప్రభుత్వం ఇంటర్నెట్, టెలిఫోన్ నెట్‌వర్క్‌లను పూర్తిగా నిలిపివేయడం వంటి చర్యలు... వడ్డే ఓబన్న జయంతి కార్యక్రమాల్లో మాజీ మంత్రి జీవన్ రెడ్డి, ఎమ్మెల్యే డా. సంజయ్ కుమార్
జగిత్యాల, జనవరి 11 (ప్రజా మంటలు):
జగిత్యాల జిల్లా కేంద్రంలో వడ్డే ఓబన్న జయంతి సందర్భంగా నిర్వహించిన కార్యక్రమాల్లో మాజీ మంత్రి తాటిపర్తి జీవన్ రెడ్డి, జగిత్యాల శాసనసభ్యులు డాక్టర్ సంజయ్ కుమార్ వేర్వేరు ప్రాంతాల్లో పాల్గొన్నారు.
గోవింద్పల్లె సమీపంలో నిర్వహించిన జయంతి ఉత్సవాల్లో మాజీ మంత్రి తాటిపర్తి జీవన్ రెడ్డి పాల్గొని మాట్లాడుతూ, వడ్డే... మంత్రి వాకిటి శ్రీహరి తో ముదిరాజ్ నేత భేటి
సికింద్రాబాద్, జనవరి 11 (ప్రజా మంటలు):
తెలంగాణ రాష్ట్ర మంత్రి వాకిటి శ్రీహరి ముదిరాజ్ ను ఆదివారం జాతీయ ముదిరాజ్ సమాజ్ ఎగ్జిక్యూటివ్ మెంబర్ పొట్లకాయల వెంకటేశ్వర్లు మర్యాదపూర్వకంగా కలిశారు. దీర్ఘకాలికంగా పెండింగ్‌లో ఉన్న ముదిరాజ్ రిజర్వేషన్ల అంశాన్ని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి దృష్టికి తీసుకెళ్లి పరిష్కరించాలని మంత్రి కి విజ్ఞప్తి చేశారు. అలాగే మంత్రి... జగిత్యాల మున్నూరు కాపు వర్తక–వ్యాపార సంఘం 2026 క్యాలెండర్ ఆవిష్కరణ
వేములవాడ, జనవరి 11 (ప్రజా మంటలు):
జగిత్యాల మున్నూరు కాపు వర్తక–వ్యాపార సంఘం ఆధ్వర్యంలో రూపొందించిన 2026 సంవత్సర క్యాలెండర్‌ను వేములవాడ ఎమ్మెల్యే, ప్రభుత్వ విప్ శ్రీ ఆది శ్రీనివాస్ ఆవిష్కరించారు.
ఈ సందర్భంగా ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్ మాట్లాడుతూ మున్నూరు కాపు కులబాంధవులందరికీ నూతన సంవత్సరం, సంక్రాంతి శుభాకాంక్షలు తెలిపారు. సంఘం అభివృద్ధికి... మున్సిపల్ ఎన్నికలకు సిద్ధం కావాలి –కార్యకర్తలకు ఎమ్మెల్యే సంజయ్ పిలుపు
రాయికల్, జనవరి 12 (ప్రజా మంటలు):
రాష్ట్ర ప్రభుత్వం మున్సిపల్ ఎన్నికలు నిర్వహించనున్న నేపథ్యంలో కాంగ్రెస్ పార్టీ శ్రేణులంతా ఎన్నికలకు సిద్ధంగా ఉండాలని జగిత్యాల ఎమ్మెల్యే డాక్టర్ సంజయ్ కుమార్ పిలుపునిచ్చారు. రాయికల్ పట్టణంలోని ప్రగతి స్కూల్లో నిర్వహించిన మున్సిపల్ ఎన్నికల సన్నాహక సమావేశంలో ఆయన ముఖ్య అతిథిగా పాల్గొని మాట్లాడారు.
ఈ సందర్భంగా ఎమ్మెల్యే... ఓసి జేఏసీ సింహ గర్జనకు తరలి వెళ్లిన జగిత్యాల ఓసి జేఏసీ నాయకులు
జగిత్యాల జనవరి 11 (ప్రజా మంటలు)
ఓసి ల సింహ గర్జన సభ సక్సెస్ కోసం జగిత్యాల నుండి ఓసి జెఏసి సభ్యులు ప్రత్యేక వాహనంలపై తరలి వెళ్లారు
ఓసి ఐకాస రాష్ట్ర ఉపాధ్యక్షులు ఎన్నం కిషన్ రెడ్డి, ఓసి జేఏసీ జగిత్యాల జిల్లా కో ఆర్డినేషన్ కమిటీ కన్వీనర్ మహంకాళి రాజన్న కో కన్వీనర్... 