చిరంజీవికి అక్కినేని జాతీయ అవార్డు ప్రదానం చేసిన అమితాబ్
జాతీయ అవార్డు ప్రదానంలో భావోద్వేగానికి గురైన -చిరు-
On
అన్నపూర్ణ స్టూడియోలో అక్కినేని జాతీయ పురస్కార వేడుకలు
హైదరాబాద్ అక్టోబర్ 29:
మెగాస్టార్ చిరంజీవికి అక్కినేని జాతీయ అవార్డు ను అమితాబ్ బచ్చన్ ప్రదానం చేసారు.
అక్కినేని జాతీయ అవార్డు ప్రదానంలో చిరంజీవి భావోద్వేగానికి గురయ్యారు.నా సినీ ప్రస్థానంలో రచ్చ గెలిచాను. ఎవరైనా ఇంటి గెలిచి రచ్చ గెలవాలంటారు, నేను ఈ రోజు ఆ ఘనత సాధించానని చిరంజీవి అన్నారు.
ఇంట గెలిచే అవకాశం సినీ వజ్రోత్సవాల్లో వచ్చింది. నాకు లెజెండరీ అవార్డు ప్రదానంతో ధన్యుడిగా భావించా.. నాకు లెజెండరీ అవార్డు ఇవ్వడాన్ని కొందరు హర్షించలేదు.. హర్షించనప్పుడు అవార్డు తీసుకోవడం సముచితం అనిపించలేదు అందుకే, ఆ రోజు లెజెండరీ అవార్డును క్యాప్సుల్ బాక్సులో వేశా.పద్మవిభూషణ సహా ఎన్ని అవార్డులొచ్చినా..ఆ అసంతృప్తి ఇంకా మిగిలే ఉందనీ తనలోని బాధను వ్యక్తం చేశారు
అక్కినేని నాగార్జున, అమల తదితర కుటుంబ సభ్యులు, సినీ రంగ ప్రముఖులు అభిమానులు పాల్గొన్నారు.
Tags