గ్రూప్ 1 మెయిన్స్ పరీక్షలు అక్టోబర్ 21-27 వ తేదీ వరకు
గ్రూప్ 1 మెయిన్స్ పరీక్షలు అక్టోబర్ 21-27 వ తేదీ వరకు
- రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి శాంతి కుమారి.
హైదరాబాద్ అక్టోబర్ 17:
ఈనెల 21 వ తేదీ నుండి 27 వ తేదీ వరకు జరిగే గ్రూప్ 1 మెయిన్స్ పరీక్షలను ఏవిధమైన పొరపాట్లు లేకుండా అత్యంత పకడ్బందీగా నిర్వహిస్తున్నట్లు రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి శాంతి కుమారి స్పష్టం చేశారు.
గ్రూప్-1 మెయిన్స్ పరీక్షల నిర్వహణపై జిల్లా కలెక్టర్లు, పోలీస్ కమీషనర్లు, సంబంధిత ఉన్నతాధికారులతో నేడు సచివాలయం నుండి వీడియో కాన్ఫ రెన్స్ నిర్వహించి సమీక్షించారు.
తెలంగాణా పబ్లిక్ సర్వీస్ కమీషన్ కార్యాలయం నుండి కమీషన్ చైర్మన్ డా. మహేందర్ రెడ్డి, సభ్యులు పాల్గొనగా, సచివాలయం నుండి డీజీపీ జితేందర్, కమీషన్ కార్యదర్శి నవీన్ నికోలస్, SPDCL MD ముష్రాఫ్ అలీ, రాష్ట్ర కుటుంబ సంక్షేమ శాఖ కమీషనర్ కర్ణన్, హైదరాబాద్, రంగారెడ్డి, మేడ్చల్ మల్కాజిగిరి జిల్లాల కలెక్టర్లు అనుదీప్, శశాంక్, గౌతమ్ తదితర అధికారులు హాజరయ్యారు.
ఈ సందర్బంగా సి.ఎస్ శాంతి కుమారి మాట్లాడుతూ, గ్రూప్-1 మెయిన్స్ పరీక్షలకు 31,383 మంది అభ్యర్థులు హాజరవుతున్నారు. దీనికోసం 46 పరీక్షా కేంద్రాలను హైదరాబాద్, రంగారెడ్డి, మేడ్చల్ మల్కాజిగిరి జిల్లాల్లో ఏర్పాటు చేశామని వివరించారు.
ఈ పరీక్షలు నిర్వహించే అన్ని కేంద్రాల వద్ద ఏవిధమైన అవకతవకలు,అవాంఛనీయమైన సంఘటనలు జరగకుండా గట్టి బందోబస్తు, విస్తృత స్థాయిలో సీనియర్ అధికారులతో పర్యవేక్షణను ఏర్పాటు చేసినట్లు తెలిపారు. జిల్లా కలెక్టర్లు నేరుగా ఈ పరీక్షల నిర్వహణను పర్యవేక్షిస్తారని,సంబంధిత పోలీస్ కమీషనర్లు కూడా తగు బందోబస్తు ఏర్పాట్లను చేపడుతారని తెలిపారు. అన్ని శాఖల అధికారులు ఏవిధమైన స్వల్ప సంఘటనలు జరుగకుండా అత్యంత అప్రమత్తంగా ఈ పరీక్షల నిర్వహణా విధులు నిర్వహించాలని పేర్కొన్నారు.
TGPSC చైర్మన్ డా. ఎం. మహేందర్ రెడ్డి మాట్లాడుతూ, 2011 సంవత్సరం అనంతరం గ్రూప్ -1 మెయిన్స్ పరీక్షలు జరుగుతున్నాయని, కొన్ని సంవత్సరాల అనంతరం జరిగే ఈ పరీక్షల నిర్వహణలో ప్రతీ అంశంలోనూ అత్యంత జాగ్రత్తగా విధులు నిర్వహించాలని అధికారులకు సూచించారు. ఆధునిక సాంకేతికత, సోషల్ మీడియా ఆక్టివ్ గా ఉన్న ప్రస్తుత పరిస్థితుల్లో పరీక్షల నిర్వహణ కూడా సవాలుతో కూడుకుంటున్నదని, ఈ నేపథ్యంలో ఏవిధమైన అపోహలు, పుకార్లకు తావివ్వకుండా తగు జాగ్రత్తలు చేపట్టాలని మహేందర్ రెడ్డి అన్నారు.
గ్రూప్ -1 జరిగే అన్ని పరీక్షా కేంద్రాల వద్ద విస్తృతమైన బందోబస్తు తోపాటు పరీక్షలు ప్రశాంతంగా కొనసాగేందుకు అన్ని చర్యలు చేపట్టామని డీజీపీ జితేందర్ తెలిపారు.
TGPSC కార్యదర్శి నవీన్ నికోలస్ మాట్లాడుతూ, హైదరాబాద్ జిల్లాలో 8 , రంగారెడ్డి జిల్లాలో 11 , మేడ్చల్ మల్కాజిగిరి జిల్లాలో 27 మొత్తం 46 కేంద్రాలలో గ్రూప్-1 మెయిన్స్ పరీక్షలు నిర్వహిస్తున్నట్టు తెలిపారు. ప్రతి పరీక్ష హాల్, చీఫ్ సూపరింటెండెంట్ రూమ్, పరిసర ప్రాంతాలన్నింటిలోనూ సీసీ టీవీ లను ఏర్పాటు చేసి, TGPSC కార్యాలయంలో ఏర్పాటు చేసిన కంట్రోల్ రూమ్ ద్వారా పర్యవేక్షిస్తున్నట్టు తెలిపారు. పరీక్షల నిర్వహణలో ప్రతి స్టెప్ లోనూ కచ్చితమైన నియమ నిబంధనలు పాటించేలా స్పష్టమైన మార్గదర్శకాలు అందచేశామని తెలిపారు. పరీక్షలకు హాజరయ్యే అభ్యర్థుల బయోమెట్రిక్ హాజరు తీసుకునేందుకై ప్రత్యేక సిబ్బందిని నియమించినట్లు, మధ్యాహ్నం ఒకటిన్నర తర్వాత పరీక్ష కేంద్రంలోకి అభ్యర్థులను అనుమతించేది లేదని స్పష్టం చేశారు.
ఇప్పటికే, 85 శాతం అభ్యర్థులు తమ హాల్ టికెట్లను డౌన్ లోడ్ చేసుకున్నారని తెలిపారు. దివ్యాంగులకు ప్రత్యేకంగా ఒక గంటను అదనంగా కేటాయిస్తున్నట్టు చెప్పారు. ఎవరికైతే పరీక్ష రాయడానికి సహాయకులు (స్క్రైబ్ ) అవసరమో, ఆ అభ్యర్థుల హాల్ టికెట్లపై ప్రత్యేకంగా పేర్కొనడం జరిగిందని, స్క్రైబ్ ల సహాయంతో పరీక్షలు వ్రాసే వారికి ప్రత్యేకంగా 4 కేంద్రాలను ఏర్పాటు చేసినట్లు కార్యదర్శి వెల్లడించారు.
అన్నిపరీక్షా కేంద్రాల 46 వద్ద ప్రత్యేక వైద్య శిబిరాలను ఏర్పాటు చేసినట్లు కుటుంబ సంక్షేమ శాఖ కమీషనర్ కర్ణన్ తెలిపారు. నిరంతరం విధ్యుత్ సరఫరా అందించేవిధంగా చర్యలు చేపట్టినట్టు, ఇందుకుగాను ముగ్గురు సి.ఈ లు పర్యవేక్షిస్తారని SPDCL ఎండీ ముషారఫ్ అలీ అన్నారు. అన్ని కేంద్రాలకు ప్రత్యేక ఆర్టీసీ బస్సులను ఏర్పాటు చేసినట్లు ఆర్టీసీ అధికారులు తెలిపారు.
--
More News...
<%- node_title %>
<%- node_title %>
హఫీజ్‌పేట్‌లో రుమాల్ హోటల్లో సిలిండర్ పేలి అగ్నిప్రమాదం
హైదరాబాద్ హఫీజ్‌పేట్‌లోని రుమాల్ హోటల్లో గ్యాస్ సిలిండర్ పేలడంతో అగ్నిప్రమాదం. కిచెన్‌లో మంటలు చెలరేగినా యాజమాన్యం అప్రమత్తతతో ప్రాణనష్టం తప్పింది. ఫైర్ సిబ్బంది మంటలను అదుపులోకి తీసుకున్నారు. జగిత్యాల–కరీంనగర్ రహదారి పై రైతుల ఆందోళన
పూడూరు నవంబర్ 16 (ప్రజా మంటలు):
జగిత్యాల–కరీంనగర్ ప్రధాన రహదారి పై శనివారం ఉదయం ఉద్రిక్తత నెలకొంది. కొడిమ్యాల మండలంలోని పూడూర్ గ్రామం వద్ద స్థానిక రైతులు రాస్తారోకో నేపథ్యంలో వాహనాలు కిలోమీటర్ల మేర నిలిచిపోయాయి.
ధాన్యం కొనుగోలు చేయకపోవడంతో రైతుల ఆగ్రహం
పూడూర్ గ్రామ వ్యవసాయ మార్కెట్లో వరి ధాన్యం కొనుగోలు లేకపోవడం, ప్రభుత్వ... కరీంనగర్లో అమానవీయ ఘటన:
కరీంనగర్ నవంబర్ 16 (ప్రజా మంటలు):
కరీంనగర్ నగరంలోని వావిలాలపల్లి ప్రాంతంలో శుక్రవారం ఉదయం అమానవీయ సంఘటన చోటుచేసుకుంది. కుటుంబ కలహాలు, పిల్లల అంగవైకల్యం కారణంగా తండ్రి మల్లేశం తన ఇద్దరు పిల్లలకు ఉరివేసి చంపేందుకు ప్రయత్నించాడు. ఈ ఘటన స్థానికంగా తీవ్ర కలకలం రేపింది.
కూతురిని హత్య చేసిన మల్లేశంమల్లేశం ముందుగా తన... ఐబొమ్మ.. ఇక ‘నో బొమ్మే' నా? వెండితెరకు శని: రవి అరెస్ట్ – అసలు ఏం జరుగుతుంది?
హైదరాబాద్, నవంబర్ 15 (ప్రజా మంటలు)
తెలంగాణలో అత్యంత చర్చనీయాంశంగా మారిన పిరేటెడ్ సినిమా సైట్ ‘ఐబొమ్మ’ వ్యవహారం కొత్త మలుపు తిరిగింది. ఈ సైట్‌ను నడిపిస్తున్న వ్యక్తిగా భావిస్తున్న **ఇమ్మడి రవి (ఐ రవి)**ను శనివారం ఉదయం కూకట్పల్లి ప్రాంతంలో సీసీఎస్ పోలీసులు అరెస్ట్ చేశారు. ఇటీవలే ఫ్రాన్స్ నుంచి హైదరాబాద్‌కు వచ్చిన రవిని... రాజీ ద్వారానే సత్వర న్యాయం సీనియర్ సివిల్ జడ్జి డి.నాగేశ్వర్.
మెట్టుపల్లి నవంబర్ 15 (ప్రజామంటలు దగ్గుల అశోక్)
పరస్పరం రాజీ పడటం ద్వారానే సత్వర న్యాయం జరుగుతుందని సీనియర్ సివిల్ జడ్జి డి. నాగేశ్వర్ రావు అన్నారు. శనివారం మండల లీగల్ సర్వీసెస్ ఆధ్వర్యంలో జరిగిన న్యాయ విజ్ఞాన సదస్సులో పాల్గొన్నారు. ఈ సందర్బంగా ఆయన మాట్లాడుతూ, దీర్ఘ కాలికాంగ కేసుల్ని కొట్లాడకుండా, రాజీ చేసుకోవడం... ఎం ఎన్ కే విట్టల్ సెంట్రల్ కోర్టులో ఘనంగా శివపార్వతి కళ్యాణం
సికింద్రాబాద్, నవంబర్ 15 (ప్రజా మంటలు):
న్యూ బోయిగూడలోని సెంట్రల్ కోర్టు అపార్టుమెంటు వెల్ఫేర్ అసోసియేషన్ ప్రెసిడెంటు డాక్టర్ జి. హనుమాన్లు, జి. వనిత జ్యోతి ప్రజ్వలనతో ప్రారంభమైన అభిషేకం కార్యక్రమంలో వందలాదిమంది తమ స్వహస్తాలతో క్షీరాభిషేకం చేశారు. అనంతరం అపార్టుమెంటు దంపతులు కన్యాదాతలుగా వ్యవహరించి శివపార్వతి కళ్యాణం కన్నులపండువగా నిర్వహించారు.
కార్తీక ఏకాదశి పర్వదినాన... రోటరీ ఇంటర్నేషనల్ యంగ్ అచీవర్ అవార్డు–2025కి ఆకర్షణ
సికింద్రాబాద్, నవంబర్ 15 (ప్రజా మంటలు):
హైదరాబాద్‌కు చెందిన 14 ఏళ్ల ఆకర్షణ అద్భుత ప్రతిభకు జాతీయ స్థాయిలో గుర్తింపు లభించింది. రోటరీ ఇంటర్నేషనల్ అధ్యక్షుడు ఆర్‌టిఎన్. ఫ్రాన్సిస్కో అరెజ్జో చేతుల మీదుగా ఆమె Rotary International Young Achiever Award 2025ను హ్యూమానిటేరియన్ సర్వీస్ విభాగంలో అందుకున్నారు. ఈ అవార్డ్‌ను పొందిన వారిలో ఆమెనే... వశిష్ట కళాశాలలో బీర్సా ముండా 150వ జయంతి
సికింద్రాబాద్, నవంబర్ 15 ( ప్రజా మంటలు):
ఎబీవీపీ సికింద్రాబాద్ జిల్లా, ఎస్ఆర్ నగర్ శాఖ ఆధ్వర్యంలో వశిష్ట కళాశాలలో భగవాన్ బీర్సా ముండా 150వ జయంతి నిర్వహించారు. కార్యక్రమంలో మాట్లాడిన ఎబీవీపీ రాష్ట్ర కార్యదర్శి మాచర్ల రాంబాబు బీర్సా ముండా గాంధీ, నేతాజీ, అల్లూరి, భగత్ సింగ్‌లతో సమానమైన ఆదివాసి స్వాతంత్ర్య వీరుడని చెప్పారు.... గ్లోబ్ ట్రాటర్ (SSMB29) – మహేష్ బాబు, రాజమౌళి సినిమా టీజర్ విడుదల
హైదరాబాద్, నవంబర్ 15 (ప్రజా మంటలు):
ఎస్.ఎస్. రాజమౌళి – మహేష్ బాబు కాంబినేషన్లో తెరకెక్కుతున్న భారీ పాన్–వరల్డ్ యాక్షన్ అడ్వెంచర్ సినిమా ‘గ్లోబ్ ట్రాటర్’ (వర్కింగ్ టైటిల్ SSMB29), అధికారికంగా ‘వారణాసి’ అనే టైటిల్‌తో గ్రాండ్ ఈవెంట్లో టీజర్‌ను ఆవిష్కరించారు. హైదరాబాద్ రామోజీ ఫిల్మ్ సిటీలో శనివారం నిర్వహించిన ప్రత్యేక కార్యక్రమంలో ఈ ఫస్ట్... మాధ్యమాలు ఏకపక్షంగా మారాయి: ప్రపంచంలో చెత్త టీవీ న్యూస్ ఛానల్స్‌లోనే..
“భారత మీడియా విమర్శించే శక్తిని కోల్పోయింది
నితీష్, మోడీ, రాహుల్ – ఎవ్వరూ మీడియాకు ఇంటర్వ్యూ ఇవ్వలేదు
న్యూఢిల్లీ నవంబర్ 15:
భారత టెలివిజన్ వార్తా ఛానల్స్ నాణ్యతపై ప్రముఖ పాత్రికేయుడు, ది హిందూ మాజీ ఎడిటర్-ఇన్-చీఫ్ ఎన్. రామ్ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. బీహార్ ఎన్నికల మీడియా కవరేజ్‌పై ‘ది వైర్’ కోసం... గౌతమ ఉన్నత పాఠశాలలో ఘనంగా చిల్డ్రన్స్ డే వేడుకలు
జగిత్యాల నవంబర్ 15 (ప్రజా మంటలు) గౌతమ ఎడ్యుకేషన్ సొసైటీ విద్యాసంస్థల్లో రెండు రోజులుగా చిల్డ్రన్స్ డే వేడుకలు ఘనంగా నిర్వహిస్తున్నారు.
కాగా శనివారం గౌతమ ఉన్నత పాఠశాల లో చిల్డ్రన్స్ డే వేడుకలు అంగరంగ వైభవంగా నిర్వహించారు. ఈ సందర్భంగా విద్యార్థులు వివిధ సాంస్కృతిక కార్యక్రమాలు నిర్వహించారు . సాంస్కృతిక కార్యక్రమాలు ఆహుతులను ఎంతగానో... పదేళ్ల బాలికపై లైంగిక దాడి: కేరళలో బీజేపీ నేతకు జీవిత ఖైదు
థలసేరి / కన్నూర్ నవంబర్ 15:
కేరళలోని పలాథాయి పాఠశాలలో 10 ఏళ్ల బాలికపై లైంగిక దాడి కేసులో బీజేపీ మాజీ నేత కె. పద్మరాజన్ కు థలసేరి POCSO ఫాస్ట్-ట్రాక్ కోర్టు జీవిత ఖైదు శిక్ష విధించింది. ఈ తీర్పుతో ఐదేళ్లుగా నడుస్తున్న ఈ కీలక కేసు ముగిసింది.
ఘటన ఎలా జరిగింది?
2020... 