కోరుట్ల త్రిశక్తి మాత ఆలయంలో దుర్గామాత దీక్షలు
కోరుట్ల త్రిశక్తి మాత ఆలయంలో దుర్గామాత దీక్షలు
కోరుట్ల అక్టోబర్ 3:-
కొలిచినవారికి కొంగుబంగారంగా గణేష్ నవదుర్గమండలి ఆద్వర్యంలో త్రిశక్తి మాత ఆలయంలో నవరాత్రోత్సవాలకోసం ఆలయ అర్చకులు పాలేపు శివ కుమార్ నిర్వహణలో 250 పైనే దుర్గామాత దీక్షలు చేపట్టారు.
పిల్లలనుండి,వృద్దుల వరకు నియమనిష్టలతో తొమ్మిదిరోజులపాటు దీక్షలో ఉంటారు.
కోరుట్ల పట్టణంలో గణేష్ నవదుర్గమండలి ఆద్వర్యంలో త్రిశక్తి మాత ఆలయం ఎంతో ప్రాశస్త్యం కలిగిన ఆలయంగా చెప్పుకుంటారు,సుమారు 47 సంవత్సరాలుగా ఇక్కడ ప్రతి సంవత్సరం పెద్ద ఎత్తున దీక్షలు తీసుకుంటారు.ఇక్కడి అమ్మవారిని దర్శించుకునేందుకు నిజామాబాదు, వరంగల్, ఆదిలాబాదు, కరీంనగర్ తోపాటు వివిధ ప్రాంతాలనుండి భక్తులు వస్తుంటారు. దుర్గామాత నవరాత్రుల ఉత్సవాలు ఈ ఆలయంలో అత్యంత వైభవంగా నిర్వహిస్తారు, పెద్ద ఎత్తున దుర్గామాత దీక్షలు తీసుకోవడం ఇక్కడి విశిష్టత, గురువారం ఆలయంలో పెద్ద ఎత్తున సుమారు 250 పైన దుర్గామాత దీక్షలు తీసుకున్నారు.
తొమ్మిది రోజులపాటు నియమ నిష్ఠలతో అమ్మవారిని కొలిచి, అనంతరం దీక్ష విరమింప చేస్తారు, గణేష్ నవదుర్గ మండలి ఆధ్వర్యంలో త్రిశక్తి మాతా దేవాలయంలో ఇక్కడ నిత్యం పూజలు నిర్వహిస్తారు,
ఈ కార్యక్రమంలో గణేష్ నవదుర్గ మండలి అధ్యక్షులు కటుకం గణేష్, ప్రధాన కార్యదర్శి గజ్జల శంకర్, కోశాధికారి ఆడువాల ప్రభాకర్,11వ వార్డు కౌన్సిలర్ దాసరి సునిత, గంగుల రాంగోపాల్,ముక్కెర చంద్రశేఖర్, సభ్యులు కస్తూరి రాజేశ్వర్, కటుకం గంగారాం, సంకు అశోక్, గాజుల రమేష్,వెంకటేశం, కస్తూరి లక్ష్మీనారాయణ తదితరులు పాల్గొన్నారు.
More News...
<%- node_title %>
<%- node_title %>
ఘనంగా శ్రీసాయి సప్తాహం ముగింపువేడుకలు

మృతుల కుటుంబాలను పరామర్శించిన మాజీ శాసనసభ్యులు అలిగిరెడ్డి ప్రవీణ్ రెడ్డి

నేడు అధికారభాష హిందీ గోల్డెన్ జూబ్లీ వేడుకలు

కిమ్స్-సన్‌షైన్ హాస్పిటల్స్, బేగంపేటలో కేవలం 3 నెలల్లో 50 రోబోటిక్ సర్జరీలు

ఉద్యోగులు సామాజిక సేవా కార్యక్రమాల్లోనూ పాల్గొనాలి

ఆరోగ్యవంతులైన బాలికలే దేశ భవిత

మీ హామీలపై చర్చిద్దాం రండి - సీఎం రేవంత్ రెడ్డికి తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు, బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత సవాల్

కొండగట్టు 30.వ.గిరిప్రదక్షిణ ఆదివారం మద్యం, మాంసం మానేద్దాం'

కేజీవీలతో ట్రాక్టర్లు తారు రోడ్డుపై తిరిగితే కేసులు నమోదు - ఎస్ఐ, కృష్ణ సాగర్ రెడ్డి

బాల్య వివాహాల నిర్మూలనపై అవగాహన కార్యక్రమం

షిరిడి సాయి మందిరంలో ఘనంగా గురు పూర్ణిమ వేడుకలు

జగిత్యాల జిల్లా జర్నలిస్ట్ సంఘ్ అధ్యక్షునిగా చీటీ శ్రీనివాస్ రావు
