అరు గ్యారంటీలు అమలు చేయకున్నా...కనీసం ప్రజల ప్రాణాలకైనా రక్షణ కల్పించండి.
అరు గ్యారంటీలు అమలు చేయకున్నా...కనీసం ప్రజల ప్రాణాలకైనా రక్షణ కల్పించండి.
-దావ వసంతసురేష్
జగిత్యాల అక్టోబర్ 1 (ప్రజా మంటలు )
జిల్లాలో శానిటేషన్ నిర్లక్ష్యంతో విజృంభిస్తున్న విషజ్వరాలపై బిఆర్ఎస్ పార్టీ జిల్లా కార్యాలయంలో మీడియా సమావేశంలో పాల్గొన జిల్లా పరిషత్ తొలి చైర్ పర్సన్ దావ వసంత సురేష్
వసంత సురేష్ మాట్లాడుతూ
తొమ్మిది నెలలు పూర్తయినా ప్రభుత్వం పాలన మెరుగు పడలేదని
రాయికల్ మండలం అల్లీపూర్ లో 11 ఏళ్ల చిన్నారి జ్వరంతో బాధ పడుతూ చనిపోయిన ఘటన కలిచివేసిందన్నారు.
జిల్లా వ్యాప్తంగా విషజ్వరాలు ప్రభలుతున్న ప్రాణాలు పోతున్న ప్రభుత్వం, అధికారులకు పట్టడం లేదు.
డెంగ్యూ పాజిటివ్ లు వచ్చిన వైద్యులు కనీసం అందుబాటులో ఉండడం లేదని
బ్లీచింగ్ పౌడర్ కు బదులు సున్నం చల్లుతూ మమ అనిపించే ప్రయత్నం చేస్తున్నారు.
ఓట్లేసి గెలిపించిన పాపానికి ప్రజల ప్రాణాలతో చెలగాటం ఆడుతున్నారు. చీమ కుట్టినట్లు లేదు.
కేసీఆర్ పాలన లో సీజనల్ వ్యాధులపై విస్తృతంగా శానిటేషన్ ప్రక్రియను వేగవంతం చేశారు.
వానకాలం సీజన్ ముగిసిన రైతు భరోసా అందలేదు. పూర్తి స్థాయిలో రుణమాఫీ కాలేదన్నారు.
విత్తనం పెట్టి చేతికి వచ్చే టైం వచ్చిన కనీసం సౌకర్యాలు అందడం లేదన్నారు
ఇచ్చినా హామీలు అమలు చేయడంలో విఫలం అయ్యారు.
మహాలక్ష్మి, విద్యా భరోసా, ఫీజు రియాంబర్స్ మెంట్ విడుదల కాలేదని అరు గ్యారంటీ లు ఒక్కటి అమలు కాలేదన్నారు.
పంచాయతీ రాజ్ మినిస్టర్ సీతక్క ని విజ్ఞప్తి చేస్తున్న. మా పల్లెల దుస్థితి పై సమీక్ష చేయాలన్నారు.
పథకాలు అమలు చేయకున్నా ప్రాణాలను కాపాడండి. శానిటేషన్ ని నిర్వహించండన్నారు.
అధికారులు ప్రజలకు సేవకులుగా ఉంటూ ప్రజలకు మెరుగైన సేవలు అందేలా చూడాలన్నారు.
ఈ కార్యక్రమంలో జగిత్యాల పట్టణ అధ్యక్షుడు గట్టు సతీష్,అర్బన్ మండల అధ్యక్షుడు తుమ్మ గంగాధర్,మాజీ జెడ్పీటీసీ మహేష్,పట్టణ ప్రధానకార్యదర్శి ఆనంద్ రావు,ఉపాధ్యక్షులు వొల్లెం మల్లేశం,మాజీ ఏ ఎం సి చైర్మన్ శీలం ప్రియాంకప్రవీణ్,రూరల్ మండల సమన్వయ కమిటీ సభ్యులు పడిగేల గంగారెడ్డి,ఆనంద్ రావు,కౌన్సిలర్లు సమీండ్ల వాణిశ్రీనివాస్,శ్రీధర్ రెడ్డి,మహేష్ గౌడ్,అర్బన్ మండల ఎస్సీ సెల్ అధ్యక్షుడు సంగేపు ముత్తు,అర్బన్ మండల యూత్ అధ్యక్షుడు సన్హిత్ రావు,రూరల్ మండల యూత్ అధ్యక్షుడు సదానందం,ప్రధాన కార్యదర్శి బాలే చందు,పట్టణ యూత్ ఉపాధ్యక్షుడు ప్రణయ్,సెక్రటరీ నీలి ప్రతాప్,భగవాన్ రాజ్,రాయికల్ పట్టణ అధ్యక్షుడు అనిల్,మండల మహిళా అధ్యక్షురాలు స్పందన,రాయికల్ మండల సమన్వయ కమిటీ సభ్యులు బర్కం మల్లేష్,కొల్లూరి వేణు,దొంతి నాగరాజు,తదితరులు పాల్గొన్నారు.
More News...
<%- node_title %>
<%- node_title %>
రిపోర్టర్లపై థర్డ్ డిగ్రీ ప్రయోగించారనే ఆరోపణల తొ ఎస్సై బదిలీ
సిరిసిల్ల, అక్టోబర్ 15 (ప్రజా మంటలు):
రాజన్న సిరిసిల్ల జిల్లా గంభీరావుపేటలో రిపోర్టర్లు శేఖర్, సంపత్‌లపై ఎస్ఐ శ్రీకాంత్ థర్డ్ డిగ్రీ ప్రయోగించారనే ఆరోపణలు కలకలం రేపుతున్నాయి. పోలీసుల అధికార దుర్వినియోగం, లంచాల వసూళ్లపై వార్తలు రాసిన నేపథ్యంలోనే ఈ ఘటన చోటుచేసుకున్నట్లు ఆరోపణలు వెలువడ్డాయి.
ఈ ఘటనపై జర్నలిస్టులు, ప్రజా సంఘాల నుంచి నిరసనలు... తెలంగాణలో మూడు చోట్ల ఏసీబీ దాడులు
హైదరాబాద్, అక్టోబర్ 15 (ప్రజా మంటలు):
తెలంగాణలో అవినీతి నిరోధక శాఖ (ఏసీబీ) అధికారులు మూడు చోట్ల దాడులు, సోదాలు నిర్వహించారు. హైదరాబాద్‌లోని సంతోష్‌నగర్ విద్యుత్ సబ్‌స్టేషన్‌లో, మేడ్చల్-మల్కాజిగిరి జిల్లాలోని కీసర తహసీల్దార్ కార్యాలయంలో లంచం తీసుకుంటున్న ఇద్దరు అధికారులు ఏసీబీకి పట్టుబడగా, రాజన్న సిరిసిల్ల జిల్లా వేములవాడ రూరల్ తహసీల్దార్ కార్యాలయంలో అధికారులు సోదాలు... ఆడబిడ్డల ఆత్మగౌరవం,సంస్కృతికి ప్రతీక బతుకమ్మ కలెక్టరేట్ లో ఘనంగా బతుకమ్మ సంబరాలు
జగిత్యాల, అక్టోబర్ 14 (ప్రజా మంటలు)
బతుకమ్మ సంబరాల్లో భాగంగా బుధవారం జిల్లా సమీకృత కార్యాలయాల సముదాయంలో ప్రభుత్వ ఆదేశాల మేరకు మహిళాభివృద్ధి,శిశు సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో బతుకమ్మ సంబరాలు నిర్వహించగా ముఖ్య అతిథిగా జిల్లా కలెక్టర్ బి. సత్యప్రసాద్ పాల్గొన్నారు.
తెలంగాణ ఆడబిడ్డల ఆత్మగౌరవం సాంస్కృతిక వారసత్వానికి ప్రతీక బతుకమ్మ పండుగ అని
మహిళలు... ఈనెల 30న ఇంద్రవెల్లిలో పాంచజన్య సంకల్ప సభ
హైదరాబాద్ అక్టోబర్ 14 (ప్రజా మంటలు):
ఆదిలాబాద్ జిల్లా ఇంద్రవెల్లిలో ఈనెల 30న తెలంగాణ రక్షణ సేన ఆధ్వర్యంలో పాంచజన్య సంకల్ప సభ నిర్వహించనున్నారు. ఈ సభకు సంబంధించిన పోస్టర్‌ను బుధవారం బంజారాహిల్స్‌లోని పార్టీ కార్యాలయంలో సీనియర్ నాయకులు ఆవిష్కరించారు.
పార్టీ చీఫ్ కల్వకుంట్ల కవిత ఆధ్వర్యంలో ఇప్పటికే నిజామాబాద్, కొడంగల్ నియోజకవర్గంలోని కోస్గిలో పాంచజన్య... సుదర్శన్ గౌడ్ కుటుంబానికి రూ.6 లక్షల ఆర్థిక సాయం
జగిత్యాల అక్టోబర్ 14 (ప్రజా మంటలు):
రష్యా–ఉక్రెయిన్ యుద్ధంలో ప్రాణాలు కోల్పోయిన జగిత్యాల జిల్లా హస్నాబాద్ గ్రామానికి చెందిన వావిలాల సుదర్శన్ గౌడ్ కుటుంబానికి రాష్ట్ర ప్రభుత్వం రూ.6 లక్షల ఆర్థిక సాయం అందించింది. ఈ మేరకు సంక్షేమ శాఖ మంత్రి అడ్లూరి లక్ష్మణ్ కుమార్, జగిత్యాల ఎమ్మెల్యే డా. సంజయ్ కుమార్‌తో కలిసి బాధిత... టీజేఎస్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శిగా కంతి మోహన్ రెడ్డీ
, హైదరాబాద్, అక్టోబర్ 14 (ప్రజా మంటలు):
తెలంగాణ జన సమితి (టీజేఎస్) రాష్ట్ర ప్రధాన కార్యదర్శిగా కంతి మోహన్ రెడ్డి నియమితులయ్యారు. పార్టీ వ్యవస్థాపక అధ్యక్షుడు ప్రొఫెసర్ కోదండరాం మంగళవారం హైదరాబాద్‌లోని పార్టీ కార్యాలయంలో 2026–28 సంవత్సరాలకు నూతన కార్యవర్గాన్ని ప్రకటించారు. పార్టీ అభివృద్ధికి గత కొన్ని సంవత్సరాలుగా మోహన్ రెడ్డి చేసిన సేవలను... మారుపాక"కు మరణo లేదు... నిరుపేదలకు సేవలు అందిస్తున్న ఆత్మీయుల రూపంలో వినోద్ బతికే..
" కోరుట్ల, అక్టోబర్ 13(ప్రజా మంటలు )
మారుపాక వినోద్ గత ఏడాది రోడ్డు ప్రమాదం రూపంలో మృత్యువు కబళించింది అయితే ఆయన ఆత్మీయులు "మారుపాక"కు మరణo లేదని నిరుపేదలకు సేవల రూపంలో వినోద్ జీవించే ఉండాలనే ఆత్మీయులు ఆకాంక్ష.. కోరుట్ల పట్టణానికి చెందిన మారుపాక వినోద్ గత ఏడాది రోడ్డు ప్రమాదం లో అకాలమరణం... పర్యావరణ పరిరక్షణ అందరి బాధ్యత అంబారి పేట గ్రామ సర్పంచ్ గంగాధర్
జగిత్యాల అక్టోబర్ 12 (ప్రజా మంటలు)పర్యావరణ పరిరక్షణ అందరి బాధ్యత అని ఇది కేవలం ప్రభుత్వం చేసే పని అని భావించరాదని అంబర్‌పేట సర్పంచ్ గంగాధర్ అన్నారు. దుర్గా శరన్నవరాత్రి ఉత్సవాల శోభాయాత్రలో డిస్కో పేపర్లు సల్లుతూ నృత్యాలు చేయడం మన సంస్కృతి కాదని శోభాయాత్రలో దేవతలపై పూలు చల్లడం మంగళహారతులు ఇవ్వడం మంగళ... సద్దుల బతుకమ్మ 18 వ తేదీ ఆదివారం విజయదశమి 20వ తేదీ మంగళవారం జరుపుకోవాలి నంబి వేణుగోపాల ఆచార్య జ్యోతిష్య, వాస్తు పండితులు
జగిత్యాల అక్టోబర్ 12 (ప్రజా మంటలు)ఈనెల 18వ తేదీన సద్దుల బతుకమ్మ నిర్వహించుకోవాలని అదేవిధంగా మంగళవారం 20వ తేదీన విజయదశమి నిర్వహించుకోవాలని ప్రముఖ జ్యోతిష్య వాస్తు పండితులు నంబి వేణుగోపాల ఆచార్య తెలియజేశారు.
విశ్వహిందూ పరిషత్ ఆధ్వర్యంలో పండుగల విషయంలో వేణుగోపాల ఆచార్యులను కలిసినప్పుడు పండుగల విశిష్టతలు వివరిస్తూ నిర్వహించుకునే తేదీలను పంచాంగాల ఆధారంగా... గజ్వేల్ తహశీల్దార్ స్వామి సస్పెండ్.. రైతుపై అనుచిత వ్యాఖ్యలే కారణం
సిద్దిపేట అక్టోబర్ 11, 2026
రైతుపై అనుచిత వ్యాఖ్యలు చేసిన వ్యవహారంలో సిద్దిపేట జిల్లా గజ్వేల్ తహశీల్దార్ పీహెచ్ స్వామిపై ఉన్నతాధికారులు చర్యలు తీసుకున్నారు. రైతుతో మాట్లాడిన తీరుకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ కావడంతో, జిల్లా కలెక్టర్ కె. హైమావతి ఆయనను సస్పెండ్ చేస్తూ ఉత్తర్వులు జారీ చేశారు. రెవెన్యూ డివిజనల్ అధికారి... జగిత్యాల మున్సిపాలిటీలో మొక్కల కొనుగోళ్లు, బయోమైనింగ్‌పై విచారణ జరపాలి - హనుమండ్ల జయశ్రే
జగిత్యాల, అక్టోబర్ 10 (ప్రజా మంటలు):
జగిత్యాల మున్సిపాలిటీలో వనమహోత్సవం పేరుతో మొక్కల కొనుగోళ్లు, వాటి నిర్వహణ ఖర్చులు, బయోమైనింగ్ పనుల్లో అవకతవకలు జరిగాయనే ఆరోపణలపై సమగ్ర విచారణ జరిపించాలని మాజీ కౌన్సిలర్ హనుమండ్ల జయశ్రీ డిమాండ్ చేశారు. ఈ మేరకు అక్టోబర్ 10న తెలంగాణ మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్, పట్టణాభివృద్ధి శాఖ కమిషనర్‌కు ఫిర్యాదు... శిశువుతో మహిళా జర్నలిస్టుకు సీసీఎస్‌లో గంటల తరబడి విచారణ
హైదరాబాద్, అక్టోబర్ 8 (ప్రజా మంటలు):
ఆరు నెలల పసికందును చేతుల్లో ఎత్తుకుని సెంట్రల్ క్రైమ్ స్టేషన్ (సీసీఎస్)కు వెళ్లిన మహిళా జర్నలిస్టు జల్లి రేఖను దాదాపు ఏడు గంటలపాటు అక్కడే ఉంచి ప్రశ్నించారనే ఆరోపణలు హైదరాబాద్‌లో తీవ్ర చర్చకు దారితీశాయి. ఆమె వెంట మూడేళ్ల కుమారుడు కూడా ఉన్నట్లు వార్తా కథనాలు పేర్కొన్నాయి. మహిళా... 