సీనియర్ సిటీజేన్స్ డిమాండ్లను పరిష్కరించాలి -టాస్కా జిల్లా అధ్యక్షుడు హరి ఆశోక్ కుమార్.
సీనియర్ సిటీజేన్స్ ఆధ్వర్యంలో అంతర్జాతీయ వయోవృద్ధుల దినోత్సవం. సీనియర్ సిటీజేన్స్ డిమాండ్లను పరిష్కరించాలి
-టాస్కా జిల్లా అధ్యక్షుడు హరి ఆశోక్ కుమార్.
జగిత్యాల అక్టోబర్ 1:
తెలంగాణ ఆల్ సీనియర్ సిటీజేన్స్ అసోసియేషన్ జగిత్యాల జిల్లా శాఖ ఆధ్వర్యంలో అంతర్జాతీయ వయోవృద్ధుల దినోత్సవంను ఘనంగా నిర్వహించారు.మంగళవారం జిల్లా కేంద్రంలోని తెలంగాణ అల్ సీనియర్ సిటీజేన్స్ అసోసియేషన్ కార్యాలయంలో అంతర్జాతీయ వయోవృద్ధుల దినోత్సవం వేడుకలను రాష్ట్ర కార్యదర్శి,జిల్లా అధ్యక్షుడు హరి ఆశోక్ కుమార్ ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు. వివిధ రంగాల్లో విశిష్ట సేవలందించిన 46 మందిని పట్టు శాలువాలతో,మెమోంటో లు,వయోవృద్ధుల చట్టం పుస్తకాలు అందించి సన్మానించారు.ఈ సందర్భంగా హరి ఆశోక్ కుమార్ మాట్లాడుతూ తమ సమస్యలని సత్వరం పరిష్కరించాలని ప్రభుత్వం ను డిమాండ్ చేశారు.ప్రత్యేక వయోవృద్ధుల శాఖ ఏర్పాటు చేయాలన్నారు.ఏజెన్సీ తో నడుపుతున్న టోల్ ఫ్రీ నెంబర్.14567 ను రద్దుచేసి ఆ స్థానంలో సత్వరమే స్పందించే 100,104 ల వలె ప్రభుత్వ టోల్ ఫ్రీ ఏర్పాటు చేయాలని,వయోవృద్ధులకు అన్ని ఆసుపత్రుల్లోఉచిత వైద్య సేవలు అందించాలని కోరారు.
హైదరాబాద్లో సీనియర్ సిటిజెన్ల భవన్ కోసం 2 ఎకరాల స్థలం కేటాయించి,నిర్మాణం కోసం నిధులు మంజూరు చేయాలని,అన్ని మున్సిపాలిటీల్లో వయోవృద్ధులకి డే కేర్ సెంటర్లు ఏర్పాటు చేయాలని డిమాండ్ చేశారు.
ఈ కార్యక్రమంలో జిల్లా ప్రధాన కార్యదర్శి గౌరిశెట్టి విష్వనాథం,కోశాధికారి వెల్ముల ప్రకాష్ రావు,పెన్షనర్స్ జిల్లా సహాయ అధ్యక్షుడు పి.సి.హన్మంత్ రెడ్డి,సీనియర్ సిటిజెన్ల ప్రతినిధులు ఎం.డి.యాకూబ్,పబ్బా శివానందం,రాజ్ మోహన్,ఒజ్జల బుచ్చిరెడ్డి,సౌడాల కమలాకర్,సత్యనారాయణ,నారాయణ,ఎం.డి.ఎక్బాల్,సయ్యద్ యూసుఫ్,జంగిలి రామానందం,దేవర శెట్టి జనార్ధన్,ధర్మ చొక్కారావు,రాపర్తి రాజేశం,భూమయ్య,కుందునూరి అనసూయ,గంగం జలజ, కరుణ, జిల్లా,డివిజన్,మండలగ్రామాల,సీనియర్ సిటిజెన్ల సంఘాల ప్రతినిధులు పాల్గొన్నారు.
More News...
<%- node_title %>
<%- node_title %>
రానున్న గోదావరి పుష్కరాల ప్రణాళికపై, ప్రాథమిక సమీక్ష ఆగమన, వాస్తు శాస్త్రం ప్రకారం శ్రీ లక్ష్మీనరసింహ స్వామి దేవాలయం పునః నిర్మాణం ధర్మపురి పట్టణానికి మాస్టర్ ప్లాన్

గోదావరి పుష్కరాలను కుంభమేళా తరహాలో నిర్వహించాలి -రాష్ట్ర సంక్షేమ మంత్రి అడ్లూరి
.jpg)
మిసెస్ చికాగో యూనివర్స్ గా ధర్మపురి చెందిన సౌమ్య బొజ్జా

చాలా రాష్ట్రాలలో సగానికిపైగా ఓటర్లు ఏ కాగితం చూపక్కర లేదు - ఎన్నికల కమీషన్

శిల్పకళ, వాస్తుశిల్పి మూలపురుషుడు విశ్వకర్మ జిల్లా సమీకృత భవనంలో ఘనంగా విశ్వకర్మ జయంతి వేడుకలు పాల్గొన్న •బిసి కమిషన్ చైర్మన్ జి. నిరంజన్

ఉత్తమ అధ్యాపకుని అభినందించిన ఎమ్మెల్యే డా సంజయ్ కుమార్

బన్సీలాల్ పేట్ డివిజన్ బీజేపీ ఆధ్వర్యంలో విశేష కార్యక్రమాలు

గాంధీ ఆస్పత్రిలో ఘనంగా మధుసుధాకర్రెడ్డి వీడ్కోలు సభ

కల్లుగీత పారిశ్రామిక సంఘం భవన నిర్మాణ శంకుస్థాపనకు ఎమ్మెల్యేకు. సంఘం ఆహ్వానం

జిల్లా పోలీస్ ప్రధాన కార్యాలయంలో ఘనంగా ప్రజా పాలన దినోత్సవ వేడుకలు

స్టైఫండ్ ల విడుదలలో జాప్యం నివారించండి

గాంధీ ఆవరణలో గుర్తుతెలియని మహిళ డెడ్ బాడీ
