ఘనంగా బ్రాహ్మణ సంక్షేమ వేదిక ఆధ్వర్యంలో ద్వాదశ ఆలయ ప్రధాన అర్చక సన్మాన మహోత్సవం.
(సిరిసిల్ల. రాజా విక్రాంత్ శర్మ - 9963349493/9348422113).
కొడిమ్యాల బృందావన్ రిసార్ట్ సెప్టెంబర్ 29 (ప్రజా మంటలు) :
బ్రాహ్మణ సంక్షేమ వేదిక ఆధ్వర్యంలో నాచుపెల్లి వద్ద గల బృందావనం ఫ్యామిలీ రిసార్ట్ కొండగట్టు వారి సౌజన్యంతో ప్రధాన ఆలయాల ద్వాదశ ఆలయ ప్రధాన అర్చక సన్మాన మహోత్సవం అంగరంగ వైభవంగా నిర్వహించారు. అంతకు పూర్వము జ్యోతి ప్రజ్వలనతో కార్యక్రమం ప్రారంభించారు. కార్యక్రమంలో ముఖ్యఅతిథిగా బంగారయ్య శర్మ, పురాణం మహేశ్వర శర్మ, నంబి వేణుగోపాల ఆచార్య తదితరులు జ్యోతి ప్రజలను చేసి కార్యక్రమాన్ని ప్రారంభించారు.
సాంస్కృతిక కార్యక్రమాలు అంగరంగ వైభవంగా కొనసాగాయి. చిన్నారులు చేసిన నృత్యాలు ఆహుతులను ఎంతగానో ఆకట్టుకున్నాయి.
విచ్చేసిన బ్రాహ్మణ బంధువులకు రిసార్ట్ యజమాని కొండల్ రావు బ్రాహ్మణ సమారాధన ఏర్పాటు చేశారు.
కార్యక్రమంలో బ్రాహ్మణ సంక్షేమ వేదిక అధ్యక్షులు బాల శ్రీనివాస్ తమ సంస్థ ద్వారా చేస్తున్న సంక్షేమ కార్యక్రమాలను వివరించారు. కార్యదర్శి ఉజ్వల విచ్చేసిన అతిధులను స్వాగతించి తన కార్య నిర్వహణ నైపుణ్యంతో వేదిక కార్యక్రమంలో అన్ని తానై ఏర్పాట్లు చేశారు.
అంతకుముందు అతిథులకు వైదిక సాంప్రదాయం ప్రకారం మంగళవాద్యాల ఘోషతో పూర్ణకుంభ స్వాగతం పలికారు రిసార్ట్ యజమాని కొండలరావు దంపతులు.
విచ్చేసిన అర్చకులకు ముఖ్య అతిథులకు బృందావనం రిసార్ట్ లో శాలువలతో సత్కరించి జ్ఞాపికలు అందజేశారు.
More News...
<%- node_title %>
<%- node_title %>
ఘనంగా జగిత్యాల ఎమ్మెల్యే డా సంజయ్ కుమార్ పుట్టిన రోజు వేడుకలు.

హనుమాన్ చాలీసా భక్త బృందం చే హరిహరాలయంలో సామూహిక విష్ణు సహస్రనామ పారాయణం

ఏకలవ్య భవనాన్ని త్వరగా పూర్తి చేయాలి - ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత

వేములకుర్తి గంగనాల ఆయకట్టకు నీటి విడుదల

కళ్యాణం..కమనీయం.. కన్నులపండువగా శ్రీలక్ష్మీనారాయణ కళ్యాణ వేడుకలు

కాపులకు అన్యాయం చేస్తున్న కాంగ్రెస్ ప్రభుత్వం..

ఎస్ఎస్ఎస్ ఎం డి .జి స్కూల్లో ఘనంగా గోరింటాకు ఉత్సవము

పద్మారావునగర్ లో సాయి సప్తాహం

ఉత్తమ డాక్టర్లకు మెడికల్ ఎక్సలెన్సీ అవార్డులు *రాజ్ భవన్ లో ప్రధానం చేసిన గవర్నర్

ఢిల్లీ పాలకులు దిగివచ్చేలా రైల్ రోకో - బీసీ రిజర్వేషన్ల ఉద్యమంలో పౌర సమాజం కలిసి రావాలి

అనాధ పిల్లలకు సాయం చేయడం ఆదర్శనీయం..

కల్వకుంట్ల కవిత తో జాగృతి వైస్ ప్రెసిడెంట్ మంచాల వరలక్ష్మీ భేటి
