ఘనంగా ప్రారంభమైన " ప్రవాసీ ప్రజావాణి " గల్ఫ్ కార్మికుల కష్టాలు తీరుస్తాం - మంత్రి పొన్నం
ఘనంగా ప్రారంభమైన " ప్రవాసీ ప్రజావాణి "
గల్ఫ్ కార్మికుల కష్టాలు తీరుస్తాం - మంత్రి పొన్నం
హైదరాబాద్ సెప్టెంబర్ 27:
జ్యోతిరావు పూలే ప్రజా భవన్ లో ప్రవాసి ప్రజావాణి ( గల్ఫ్ కార్మికులు, ఎన్నారై ల కోసం) ప్రత్యేక కౌంటర్ ను మంత్రి పొన్నం ప్రభాకర్ ప్రారంభించారు
ప్రవాసి ప్రజావాణి ప్రత్యేక కౌంటర్ ను రిబ్బన్ కట్ చేసి హైదరాబాద్ ఇంచార్జి మంత్రి పొన్నం ప్రభాకర్ ప్రారంభించారు.
కార్యక్రమంలో ప్రణాళిక సంఘం వైస్ చైర్మన్, ప్రజావాణి ఇంచార్జీ డాక్టర్ జీ చిన్నారెడ్డి , ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి, పిసిసి ఎన్నారై సెల్ ఛైర్మన్ వినోద్ కుమార్, ప్రజావాణి నోడల్ ఆఫీసర్ దివ్య, ఎన్నారై విభాగం ప్రతినిధులు మంద భీం రెడ్డి, నంగి దేవేందర్ రెడ్డి, అమరేందర్ రెడ్డి, చాంద్ పాషా, నరేష్ రెడ్డి, నవీన్ రెడ్డి, చెన్నమనేని శ్రీనివాస్ రావు, తదితరులు పాల్గొన్నారు.
గల్ఫ్ దేశాల్లో ఇబ్బందులు పడుతున్నా షేక్ హుస్సేన్ కుటుంబం నుండి మొదటి అభ్యర్థనను మంత్రి పొన్నం ప్రభాకర్, చిన్నారెడ్డి, జీవన్ రెడ్డి లు స్వీకరించారు.
సమస్యల వినతి కోసం భారీగా పాల్గొన్న గల్ఫ్ కార్మికులు, వారి కుటుంబసభ్యులు పాల్గొన్నారు
మంత్రి పొన్నం ప్రభాకర్ మాట్లాడుతూ, ప్రజావాణి కార్యక్రమానికి తెలంగాణ వ్యాప్తంగా గల్ఫ్ కార్మికులు సమస్యలపై పెద్ద ఎత్తున తరలి వచ్చిన వారిని చూస్తేనే సమస్య ఎంత పెద్దగా ఉంది అర్థం అవుతుందని, ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో ఎన్నికల్లో చెప్పినట్టు 4 అంశాల పై నిర్ణయం తీసుకోవడం జరిగిందని,అందులో మొదటిది తెలంగాణ ప్రభుత్వం పక్షాన ప్రజా భవన్ లో ప్రవాసి ప్రజావాణి కార్యక్రమాన్ని ప్రారంభించడం జరిగిందను అన్నారు
ఇంకా, రాష్ట్రం నుండి గల్ఫ్ దేశాలకు పెద్ద ఎత్తున ఉపాధి నిమిత్తం వెళ్ళారు.వారి సమస్యల పరిష్కారానికి తక్షణమే చర్యలు తీసుకోవడానికి ఇది ఉపయోగపడుతుందనీ అన్నారు.
గల్ఫ్ ప్రమాదంలో చనిపోయిన వారికి 5 లక్షల ఎక్ఫ్ గ్రెషీయ ఇవ్వడానికి ఇప్పటికే జీవో జారీ చేసుకున్నాం. గల్ఫ్ కార్మికుల కుటుంబాల పిల్లల చదువులకు ఇబ్బందులు లేకుండా గురుకులాల్లో సీట్లు కల్పిస్తున్నాం..
గల్ఫ్ కార్మికుల కోసం ఉత్తర తెలంగాణ ప్రాంతం నుండి ప్రాతినిద్యం వహిస్తున్న ఎమ్మెల్యేలతో అడ్వైజరి కమిటీ ఏర్పాటు చేయడం జరుగుతుంది..
నా నియోజకవర్గం లో జాబ్ మేళా పెడితే 9 వేల మంది వచ్చారు.విదేశాల్లో ఉపాధి అవకాశాల కోసం పోయేవరికి అక్కడి చట్టాలు తెలియడం లేదు..
వారికి ఇక్కడి కంపెనీలపై అవగాహన కల్పించాలి..వాటిపై విస్తృత సమాచారం అందించాలి..సంస్థను మరింత బలోపేతం చేసే దిశగా అడుగులు వేయాలి.
ప్రజలను మోసం చేస్తూ విదేశాలకు పంపించి అక్కడ ఇబ్బందులు పడేలా చేస్తున్నారు.అలాంటి వారిపై పోలీసులు కఠిన చర్యలు తీసుకోవాలి.ప్రభుత్వ సంస్థలు ఉన్నాయి. అక్కడ శిక్షణ పొంది విదేశాలకు ఉద్యోగ అవకాశాలు కల్పించాలను సంకల్పించారు.
ఎన్నారై విభాగం ఆధ్వర్యంలో ఈ ప్రజావాణి తీసుకురావడానికి కృషి చేసిన అందరికీ ధన్యవాదాలు తెలిపారు.
More News...
<%- node_title %>
<%- node_title %>
మైనర్లు వాహనాలు నడిపితే చర్యలు తప్పవు *పట్టణ సీఐ కరుణాకర్

బి ఆర్ ఎస్ అధినేత కేసీఆర్ పంపిన చెక్కును బీఆర్ఎస్ కార్యకర్తకు అందించిన కోరుట్ల ఎమ్మెల్యే డా. కల్వకుంట్ల సంజయ్ మాజీ ఎమ్మెల్యే సుంకె రవి శంకర్

ప్రజాస్వామ్యంలో జర్నలిస్టులు మూలస్తంబాలు - సీనియర్ సిటీజేన్స్ రాష్ట్ర కార్యదర్శి హరి ఆశోక్ కుమార్.

నవ్య బాలికల కళాశాలలో ఘనంగా స్వాగతోత్సవ వేడుకలు

టీయూడబ్ల్యూజే (ఐజేయు) జగిత్యాల జిల్ల ప్రెస్ నూతన కమిటీని సన్మానించిన బిజెపి రాష్ట్ర సీనియర్ నాయకులు ముదిగంటి రవీందర్ రెడ్డి.

భూ కబ్జాదారుల చేతుల్లో ప్రభుత్వ భూమి

ప్రజలకు అందుబాటులో ఉంటూ మెరుగైన సేవలందించాలి: జిల్లా ఎస్పీ అశోక్ కుమార్

హిందువులు, బౌద్ధులు, సిక్కులు కాకుండా ఇతర వ్యక్తుల ఎస్సీ సర్టిఫికెట్లు రద్దు చేస్తాం:మహారాష్ట్ర సీఎం ఫడ్నవీస్
.jpeg)
సికింద్రాబాద్ ఎలక్ర్టికల్స్ ట్రేడర్స్ ప్రెసిడెంట్ గా సురేశ్ సురానా

గాంధీ మెడికల్ కాలేజీలో బోనాల ఉత్సవాలు
