గొల్లపల్లి లో వృద్దురాలిని సురక్షిత ప్రాంతానికి తరలిస్తున్న తహసీల్దార్ జమీర్
వృద్దురాలిని సురక్షిత ప్రాంతానికి తరలిస్తున్న తహసీల్దార్ జమీర్
గొల్లపెల్లి మండల కేంద్రం లో జలమయమైన ప్రధాన రహదారి
గొల్లపల్లి సెప్టెంబర్ 01 (ప్రజా మంటలు):
గొల్లపెల్లి మండలం లో ఆదివారం ఎడతెరిపి లేకుండా కురిసిన కుండపోత వర్షానికి జనజీవనం స్థంభించింది. భారీ వర్షం ధాటికి రోడ్లన్నీ జలమయం అయ్యాయి. గ్రామాల్లో అంతర్గత రోడ్లు వరద నీటితో బురద మయమాయ్యాయి. మురికి కాల్వలు వరద నీటితో ఉప్పొంగి రోడ్ల పైకి పొంగి పోర్లయి. మురికి కాల్వలు వర్షం నీటితో పొంగి పోర్లడం తో స్థానికులు తీవ్ర అసౌకర్యానికి గురయ్యారు. ఎడతెరిపి లేకుండ కురిసిన కుండపోత వర్షానికి, కాలువలు, వాగులు వంకలు, చెరువుల మత్తడులు, పలు గ్రామాల్లోని రహదారుల పై ఉన్న వంతెనలు వరద నీటితో పొంగిపోర్లయి. పై నుంచి వరద నీరు భారీగా వచ్చి చేరడం తో చెరువులు నిండు కున్నాయి.పలు గ్రామాల్లో పై నుంచి వచ్చిన వరద నీటితో ఇటీవల వేసిన వరి పంట కొట్టుకుపోయి రైతంగానికి కన్నీళ్లు మిగిల్చింది. పలు గ్రామాల్లో వర్షం ధాటికి మొక్కజొన్న పంట నెలవాలి రైతులకు తీవ్ర నష్టం వాటిల్లింది. చిల్వకోడూరు, గోవిందుపల్లె, దట్నూర్, చెందోలి, భీంరాజ్ పల్లె, లక్ష్మి పూర్, ఆత్మకూరు, దమ్మన్నపేట గొల్లపెల్లి, అబ్బపూర్, లోత్తునూరు తదితర గ్రామాల్లో పత్తి చేన్లలోకి వరద నీరు వచ్చి చేరి పత్తి పంట తీవ్రంగా దెబ్బ తిన్నది. మండల కేంద్రంలోని కేజీబివి పాఠశాల వసతి గృహం సమీపంలోకి పై నుంచి వరద నీరు వచ్చి చేరడం తో వసతి గృహం లోని నీరు కలుషి తమయినట్లు ప్రత్యేక అధికారి పద్మ, సిబ్బంది, విద్యార్థులు తహసీల్దార్ జమీర్ కు సమాచారం అందించారు. దింతో అక్కడికి చేరుకున్న తహసీల్దార్ పక్కనే ఉన్న ఊర చెరువును పరిశీలించారు. ఈ సందర్బంగా విద్యార్థినిలను ఒక్క రోజు ఇళ్లలోకి పంపించేందుకు ఉన్నంతధికారులకు సమాచారం అందించారు. అలాగే మండల కేంద్రం లో ఒక ఇంటిలోకి వర్షం నీరు వచ్చి చేరడం తో అందులో ఒంటరిగా నివాసం ఉంటున్నా నిరుపేద వృద్దురాలిని తహసీల్దార్ జమీర్ తన సొంత వాహనం లో బంధువుల ఇంటికి పంపించారు. జిల్లా కలెక్టర్ ఆదేశాల మేరకు తహసీల్దార్ జమీర్, ఎంపిడివో రామ్ రెడ్డి సురేష్ రెడ్డి, కార్యదర్శి మధు, ఆయా శాఖల అధికారులు, సిబ్బంది ఆయా గ్రామాలను పరిశీలించిరు. ఎస్సై సతీష్ కుమార్ వెనుగు మట్ల, బొంకురు గ్రామాల్లోని సదజాల వాగును పరిశీలించారు.
More News...
<%- node_title %>
<%- node_title %>
రాపల్లి శివారులో పేకాట స్థావరాలపై దాడి
1.jpeg)
మహాత్మ జ్యోతిబా పూలే గురుకుల పాఠశాలను ఆకస్మిక తనిఖీ చేసిన కలెక్టర్ సత్యప్రసాద్

టీయూడబ్ల్యూజే(ఐ జే యు) నూతన ఎన్నికైన జిల్లా కమిటీ సభ్యులను సన్మానించిన జంబి హనుమాన్ ఆలయ కమిటీ సభ్యులు

ప్లేట్లెట్లు దానం చేసి మానవత్వం చాటుకున్న పోలీస్ కానిస్టేబుల్

ఆయిల్ పామ్ మెగా ప్లాంటేషన్ కార్యక్రమంలో పాల్గొన్న జిల్లా కలెక్టర్ సత్య ప్రసాద్.

తల్లిని ఇంట్లోంచి గెంటేసిన కొడుకులు -ఆర్డీవోకు ఫిర్యాదు

దేవరకొండ ఎస్ టి గురుకుల బాలికల ఘటనపై కేసు నమోదు

అహ్మాదీయ ముస్లిం కమ్యూనిటీ మహిళా విభాగం ఆధ్వర్యంలో బ్లడ్ డోనేషన్

జర్నలిస్టుల సంక్షేమమే ధ్యేయంగా పనిచేయాలి.

బోనాల జాతరలో భక్తులకు సేవ చేయడం అదృష్టం

రాసుల కొద్దీ తెప్పించుకుంటున్నారు...కాని తనకు గోరంత కూడ దక్కడం లేదు- రంగంలో భవిష్య వాణి వినిపించిన స్వర్ణలత

వేలేరు మాజీ జడ్పిటిసి చాడ సరిత అంత్యక్రియల్లో పాల్గొన్న ప్రముఖులు
