ములుగు వరద ప్రాంతాల పరిశీలనకు వెళ్లిన మంత్రి సీతక్క

On
ములుగు వరద ప్రాంతాల పరిశీలనకు వెళ్లిన మంత్రి సీతక్క

ములుగు వరద ప్రాంతాల పరిశీలనకు వెళ్లిన మంత్రి సీతక్క

హైదారాబాద్ సెప్టెంబర్ 01 :  

ఎడ‌తెరిపి లేకుండా కురుస్తున్న భారి వ‌ర్షాల నేప‌థ్యంలో స‌హ‌య‌క కార్య‌క్ర‌మాల‌ ప‌రిశీల‌న కోసం మంత్రి సీత‌క్క‌ ములుగు జిల్లాకు బ‌య‌లు దేరి వెళ్లారు.

వ‌ర‌ద ముప్పు త‌గ్గే వ‌ర‌కు ప్ర‌జ‌లు, అధికారులు అప్ర‌మ‌త్తంగా ఉండాలని, ప్ర‌జ‌లు వాగులు, చెరువులు దాట‌కుండా పోలీసులు జాగ్ర‌త్త‌లు తీసుకోవాలని మంత్రి సీత‌క్క‌ సూచించారు 
చెరువులు, వాగుల కింద గ్రామాల ప్ర‌జ‌లను అవ‌స‌ర‌మైతే త‌ర‌లించేలా ఏర్పాట్లు చేయాలని మంత్రి సీత‌క్క‌ అధికారులను ఆదేశించారు 

శిధిలావస్థ‌లో ఉన్న ఇండ్ల‌లో నివ‌సించే వారిని పున‌రావాస కేంద్రాల‌కు త‌ర‌లించాలను,
మ‌ట్టిగోడ‌లు నాని కూలిపోయే ప్ర‌మాదం ఉందని, ప్రజలు జాగ్రత్తగా ఉండాలని ఆమె కోరారు.

అధికారుల‌కు స‌మ‌చార‌మందిస్తే పున‌రావస కేంద్రాల‌కు త‌ర‌లిస్తారాని, తాను ఆ ప్రలకు అందుబాటులో ఉండడానికి నియోజక వర్గానికి వెళుతున్నట్లు మంత్రి సీతక్క తెలిపారు

Tags