బీమా సంస్థ పాలసీదారులకు గోవర్ధనుడు ధీమా.
(సిరిసిల్ల. రాజా విక్రాంత్ శర్మ - 9963349493/9348422113).
జగిత్యాల ఆగస్టు 30( ప్రజా మంటలు)
భీమా సంస్థ పాలసీదారులకు గోవర్ధనుడు దీమా అని వక్తలు కొనియాడారు. జగిత్యాల ఎల్ఐసి కార్యాలయంలో శుక్రవారం సాయంత్రం అడ్మినిస్ట్రేటివ్ ఆఫీసర్ గా పదవీ విరమణ పొందిన బండ పెల్లి గోవర్ధన్ కు కార్యాలయ సిబ్బంది, ఎల్ఐసి ఏజెంట్లు ఘనంగా సత్కరించి వీడ్కోలు ఏర్పాటు చేశారు.
ఈ సందర్భంగా ఎల్ఐసి సీనియర్ బ్రాంచ్ మేనేజర్ బలరామకృష్ణ, ఏ డి ఎం రవీందర్ లు మాట్లాడుతూ.... బండపల్లి గోవర్ధన్ మొట్టమొదట అసిస్టెంట్ గా జగిత్యాల లోనే ఉద్యోగ జీవితాన్ని ప్రారంభించి తిరిగి పదవి విరమణ కూడా జగిత్యాల బ్రాంచ్ లోనే కావడం విశేషం అన్నారు.
39 సంవత్సరాలు పాటు వివిధ హోదాల్లో ఉద్యోగ నిర్వహణ తో పాటు వివిధ హోదాల్లో సేవలు అందించిన మృదుస్వభావి, స్నేహశీలి గోవర్ధన్ సంస్థకు, పాలసీదారులకు చేసిన సేవలు అగణితమన్నారు.
సహచర ఉద్యోగులు పలువురు మాట్లాడుతూ..... బండపల్లి గోవర్ధన్ పాలసీదారులకు ఏజెంట్లకు అందుబాటులో ఉంటూ సమస్యలను ఎప్పటికప్పుడు పరిష్కరిస్తూ సేవలందించేవాడని ఆయన సేవలను కొనియాడారు. అంతే కాకుండా యూనియన్ లో వివిధ హోదాలో ఉంటూ ఆయన అందించిన సేవల పట్ల కృతజ్ఞతలు తెలిపారు.
విశ్రాంత ఉద్యోగిగా మారిన తర్వాత కూడా పెన్షన్ దారుల సమస్యల పరిష్కారానికి చేదోడు వాదోడుగా ఉండాలని యూనియన్ ప్రెసిడెంట్ లక్ష్మీ రాజం గోవర్ధన్ ను కోరారు.
ఈ సందర్భంగా కుటుంబ సభ్యులు, మిత్రులు గోవర్ధన్ దంపతులను ఘనంగా సత్కరించారు. ఈ కార్యక్రమంలో బీమా సంస్థ ఉద్యోగులు ఏజెంట్లు తదితరులు పాల్గొన్నారు.
More News...
<%- node_title %>
<%- node_title %>
మైనర్లు వాహనాలు నడిపితే చర్యలు తప్పవు *పట్టణ సీఐ కరుణాకర్

బి ఆర్ ఎస్ అధినేత కేసీఆర్ పంపిన చెక్కును బీఆర్ఎస్ కార్యకర్తకు అందించిన కోరుట్ల ఎమ్మెల్యే డా. కల్వకుంట్ల సంజయ్ మాజీ ఎమ్మెల్యే సుంకె రవి శంకర్

ప్రజాస్వామ్యంలో జర్నలిస్టులు మూలస్తంబాలు - సీనియర్ సిటీజేన్స్ రాష్ట్ర కార్యదర్శి హరి ఆశోక్ కుమార్.

నవ్య బాలికల కళాశాలలో ఘనంగా స్వాగతోత్సవ వేడుకలు

టీయూడబ్ల్యూజే (ఐజేయు) జగిత్యాల జిల్ల ప్రెస్ నూతన కమిటీని సన్మానించిన బిజెపి రాష్ట్ర సీనియర్ నాయకులు ముదిగంటి రవీందర్ రెడ్డి.

భూ కబ్జాదారుల చేతుల్లో ప్రభుత్వ భూమి

ప్రజలకు అందుబాటులో ఉంటూ మెరుగైన సేవలందించాలి: జిల్లా ఎస్పీ అశోక్ కుమార్

హిందువులు, బౌద్ధులు, సిక్కులు కాకుండా ఇతర వ్యక్తుల ఎస్సీ సర్టిఫికెట్లు రద్దు చేస్తాం:మహారాష్ట్ర సీఎం ఫడ్నవీస్
.jpeg)
సికింద్రాబాద్ ఎలక్ర్టికల్స్ ట్రేడర్స్ ప్రెసిడెంట్ గా సురేశ్ సురానా

గాంధీ మెడికల్ కాలేజీలో బోనాల ఉత్సవాలు
