రామ మందిరంలో ధ్యాన మందిర నిర్మాణ భూమిపూజ
On
రామ మందిరంలో ధ్యాన మందిర నిర్మాణ భూమిపూజ
జగిత్యాల ఆగస్ట్ 30 :
పట్టణ బ్రాహ్మణవాడ శ్రీరామ మందిరంలో టీటీడీ ద్వారా మంజూరైన 10లక్షల రూపాయల నిధులతో ధ్యాన మందిరం నిర్మాణానికి భూమి పూజ చేసిన జగిత్యాల శాసనసభ్యులు డాక్టర్ సంజయ్ కుమార్ గారు.అంతకుముందు ఆలయం లో శ్రీరాముల వారిని దర్శించుకొని ప్రత్యేక పూజలు నిర్వహించారు ఎమ్మెల్యే.ఈ సందర్భంగా ఎమ్మెల్యే గారికి తీర్థ ప్రసాదాలు అందజేసి,సత్కరించిన ఆలయ అర్చకులు.
ఈ కార్యక్రమంలో మున్సిపల్ చైర్మన్ అడువాల జ్యోతి లక్ష్మణ్, వైస్ చైర్మన్ గోలి శ్రీనివాస్, కౌన్సిలర్ జయశ్రీ,సభాపతి తీగుళ్ళ సూర్యనారాయణ శర్మ,బ్రాహ్మణ సంఘం సభ్యులు,తదితరులు పాల్గొన్నారు.