సభ్యత్వ నమోదు ప్రతిష్టాత్మకంగా తీసుకోవాలి - బిజెపి రాష్ట్ర కార్యవర్గ సభ్యురాలు భోగ శ్రావణి.
(సిరిసిల్ల. రాజా విక్రాంత్ శర్మ - 9963349493/9348422113).
జగిత్యాల ఆగస్ట్ 29( ప్రజా మంటలు) :
భారతీయ జనతా పార్టీ జగిత్యాల్ పట్టణ, జగిత్యాల రూరల్,మరియు అర్బన్ మండల సభ్యత్వ నమోదు వర్క్ షాప్ కార్యక్రమంలో ముఖ్య అతిథిగా పాల్గొని కార్యకర్తలకు దిశా నిర్దేశించిన బిజెపి రాష్ట్ర కార్యవర్గ సభ్యురాలు జగిత్యాల నియోజకవర్గం ఇంచార్జ్ డా. బోగ శ్రావణి
ఈ సందర్భంగా డాక్టర్ బోగ శ్రావణి మాట్లాడుతూ...
బిజెపి కార్యకర్త ప్రతి ఒక్కరూ సభ్యత్వ నమోదును ప్రతిష్టాత్మకంగా తీసుకోవాలని డాక్టర్ బోగ శ్రావణి కార్యకర్తలకు సూచించారు. ప్రతి ఆరు సంవత్సరలకు సభ్యత్వ నమోదు కార్యక్రమం ఉంటుందని, సభ్యత్వ నమోదు చేయడం కార్యకర్త తన హక్కుగా భావించాలని తెలియజేశారు.
ఇప్పుడు సభ్యత్వం తీసుకున్న కార్యకర్తలు ఆరు సంవత్సరాల వరకు మళ్లీ సభ్యత్వం తీసుకోవాల్సిన అవసరం లేదని అన్నారు. కేంద్రంలో అధికారంలో ఉన్న బిజెపి పార్టీ సభ్యత్వ నమోదును ప్రతిష్టాత్మకంగా తీసుకున్నదని కావున ప్రతి కార్యకర్త ఈ సభ్యత్వ నమోదు కార్యక్రమంలో పాల్గొని పెద్ద ఎత్తున సభ్యత్వం చేయించాలని కార్యకర్తలకు దిశా నిర్దేశం చేశారు.
సెప్టెంబర్ 1వ తేదీ నుండి సభ్యత్వ నమోదు ప్రక్రియ దేశవ్యాప్తంగా ప్రారంభమవుతుంది, ప్రధానమంత్రి నరేంద్ర మోడీ కూడా ఈ సభ్యత్వ నమోదు కార్యక్రమంలో పాల్గొని వారి సభ్యత్వాన్ని నమోదు చేసుకుంటారు, నరేంద్ర మోడీ ప్రభుత్వం ప్రవేశపెట్టిన పథకాలను తెలియజేస్తూ ప్రతి పోలింగ్ బూత్ లో 200 పైచిలుకు సభ్యత్వాలు అయ్యే విధంగా బీజేపీ కార్యకర్తలు కృషి చేయాలని అన్నారు. నరేంద్ర మోడీ పరిపాలన పట్ల ప్రజలు సానుకూలంగా ఉన్నారని, మొన్న జరిగిన పార్లమెంటు ఎన్నికల్లో బిజెపికి వచ్చిన ఓట్లు, సీట్లు దానికి నిదర్శమని గుర్తు చేశారు.
11 కోట్ల పైచిలుకు సభ్యత్వంతో ప్రపంచంలోనే అతిపెద్ద రాజకీయ పార్టీగా బిజెపి ఉన్నదని, గతంలో కంటే ఎక్కువ సభ్యత్వం నమోదు చేయాలని కార్యకర్తలకు పిలుపునిచ్చారు.
ఈ కార్యక్రమంలో జిల్లా ప్రధాన కార్యదర్శి రాగిల సత్యనారాయణ, జగిత్యాల పట్టణ అధ్యక్షులు రంగు గోపాల్,జగిత్యాల రూరల్ మండల అధ్యక్షులు నలువాల తిరుపతి,పట్టణ ప్రధాన కార్యదర్శి ఆముదరాజు, జిల్లా కార్యదర్శి పెద్ద గంగన్న, జిల్లా కోశాధికారి సుంకేట దశరథ రెడ్డి, జిల్లా మహిళా మోర్చా ప్రధాన కార్యదర్శి సాంబారి కళావతి, పట్టణ ఇంచార్జ్ మ్యాదరి అశోక్, జిల్లా కార్యవర్గ సభ్యులు ఇట్టినేని రమేష్, కౌడు వెంకన్న, జిల్లా అధికార ప్రతినిధి కుర్మా రమేష్ మరియు భారతీయ జనతా పార్టీ నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు.
More News...
<%- node_title %>
<%- node_title %>
శ్రీ శ్రీనివాస ఆంజనేయ భవాని శంకర దేవాలయంలో ఘనంగా శ్రీ కృష్ణాష్టమి వేడుకలు

ప్రజా సమస్యల పరిష్కార వేదిక ప్రజావాణి పలు సమస్యలపై వినతులు స్వీకరించిన జిల్లా కలెక్టర్ బి. సత్యప్రసాద్

పశువైద్యశాల నిర్మాణానికి భూమి పూజ చేసిన ఎమ్మెల్యే డా .సంజయ్ కుమార్

గోధుర్ శ్రీ లక్ష్మి నరసింహ స్వామి గుడికి ₹2 లక్షల నిదుల ప్రొసీడింగ్

గాంధీ సమస్యలను అధికారుల దృష్టికి తీసుకెళ్ళిన పి.వై.ఎల్ నాయకులు

పాత గొడవల నేపధ్యంలో హత్య, ఇద్దరికి జీవిత ఖైదు
.jpeg)
గొల్లపల్లిలో సామూహిక శ్రీ విశ్వకర్మ వ్రతం

బాధితుల సమస్యల పరిష్కారానికే గ్రీవెన్స్ డే_ జిల్లా ఎస్పీ శ్రీ అశోక్ కుమార్

పాక్ జట్టుతో భారత జట్టు కరచాలనం చేయకపోవడంపై పాక్ నిరసన

వక్ఫ్ చట్టంపై స్టే నిరాకరణ - కొన్ని సెక్షన్ల నిలుపుదల - సుప్రీంకోర్టు మధ్యంతర తీర్పు

పేదింటి ఆడబిడ్డ సానియా బేగం వివాహానికి ఎమ్మెల్యే సహాయం

ఎంబిబిఎస్ సీటు సాధించిన అమన్ కాణం కు ₹10, వేలు అందించిన సూరజ్ శివ శంకర్
