తీహార్ జైలు నుంచి విడుదలైన బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవిత.
(సిరిసిల్ల. రాజా విక్రాంత్ శర్మ - 9963349493/9348422113).
న్యూఢిల్లీ 27 ఆగస్టు (ప్రజా మంటలు) :
తీహార్ జైలు నుంచి బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత మంగళవారం రాత్రి 9:12 గంటలకు విడుదలయ్యారు..
కవిత జైలు నుంచి బయటకు రాగానే అక్కడే ఉన్న తన కొడుకును ఆలింగనం చేసుకొని భావోద్వేగానికి లోనయ్యారు. ఆ తర్వాత భర్త అనిల్, అన్నయ్య కేటీఆర్‌ను గుండెలకు హత్తుకుని ఆనంద భాష్పాలు రాల్చారు. ఈ సమయంలో హరీశ్ రావు తీవ్ర భావోద్వేగానికి లోనయ్యారు.
దాదాపు 165 రోజుల తర్వాత ఆమె తిహాడ్ జైలు నుంచి విడుదలైన అనంతరం ఎమ్మెల్సీ కవిత భావోద్వేగానికి గురయ్యారు.. ఆ తర్వాత మీడియాతో మాట్లాడుతూ.. పిల్లలను వదిలి ఐదున్నర నెలలు జైలులో ఉండటం ఇబ్బందికర విషయమన్నారు.
“నేను కేసీఆర్ బిడ్డను.. తప్పు చేసే ప్రసక్తే లేదు. నేను మొండి దాన్ని.. మంచి దాన్ని. ఇబ్బందులకు గురి చేసిన వారికి వడ్డీతో సహా చెల్లిస్తాం"అని కవిత అన్నారు.
కష్ట సమయంలో తన కుటుంబానికి తోడుగా ఉన్న వారికి ధన్యవాదాలు తెలిపారు..