కొద్దిగా ఆలస్యం జరిగిన నిజం, న్యాయమే గెలిచింది. - జగిత్యాల జిల్లా పరిషత్ తొలి చైర్ పర్సన్ దావ వసంతసురేష్
(రాజా విక్రాంత్ శర్మ - 9963349493/9348422113).
జగిత్యాల ఆగస్ట్ 27(ప్రజా మంటలు )
బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవితకు సర్వోన్నత న్యాయస్థానం బెయిలు మంజూరు చేసిన సందర్భంగా జగిత్యాల జిల్లా పరిషత్ తొలి చైర్ పర్సన్ దావ వసంతసురేష్ ఆధ్వర్యంలో బాంబులు కాల్చి,స్వీట్లు పంచి సంబరాలు ఘనంగా జరిగాయి.
ఈ సందర్బంగా దావ వసంతసురేష్ మాట్లాడతూ....
ఏ ఆధారాలు చూపకుండా లిక్కర్ కేసులో 166 రోజులు కవితక్క మీద అక్రమ కేసులు పెట్టి జైల్లో ఉంచడం జరిగింది.
ఇన్ని రోజులు అక్రమ కేసులు పెట్టి ఉంచిన తరువాత భారతదేశ అత్యున్నత న్యాయస్థానంలో నిజం గెలిచి బెయిల్ మంజూరు అవడం జరిగింది.అంతే కాకుండా మంగళవారం కడిగిన ముత్యంల కవితక్క బయటికి రావడమే కాకుండా రానున్న రోజుల్లో కూడా నిజం,న్యాయం గెలిచి ఈ యుద్ధంలో కవితక్క విజయం సాధిస్తుంది.
కోర్ట్ ల మీద అవగాహన లేని బండి సంజయ్ సుప్రీం కోర్ట్ తీర్పును తప్పుపట్టడం సిగ్గు చెటు,అంతేకాకుండా బీజేపీ ప్రభుత్వం కేసీఆర్ ని ఎదురుకునే దమ్ము లేక వారి కుటుంబ సభ్యుల మీద ఇలా అక్రమ కేసులు పెట్టడం సబబు కాదు.
మంగళవారం ఈడీ పై కూడా సుప్రీం కోర్ట్ చివాట్లు పెట్టింది ఎందుకు ఈ కేసులో విచారణ పూర్తి అయినా కూడా ఎందుకు ఆలస్యం చేసారు,ఈ దశలో కవితను జ్యూడిషీయాల్ కస్టడీలో ఉంచడం కరెక్ట్ కాదు,493 మందిని కూడా విచారించగ ఇలా ఆలస్యం చేయడం కూడా కరెక్ట్ కాదని సుప్రీం కోర్ట్ ఈడీ పై విచారం చేసారు.
అంతే కాకుండా అప్రూవర్ మారాలి అని ఒత్తిడి చేసిన కూడా దేనికి భయపడకుండా ముందుకు నడిచి ఈరోజు సుప్రీం కోర్ట్ లో కవితకు బెయిల్ సాధించి విజయం సాధించింది అని పేర్కొన్నారు..
ఈ కార్యక్రమంలో బిఆర్ఎస్ పార్టీ ప్రధాన కార్యదర్శి అల్లాల ఆనందరావు,ఉపాధ్యక్షుడు వొళ్లెం మల్లేశం,కౌన్సిలర్లు దేవేందర్ నాయక్,సమిండ్ల వాణి శ్రీనివాస్,అవారి శివకేసరి బాబు,మాజీ జెడ్పీటీసీ కొండపలకుల రాంమోహన్ రావు,బిఆర్ఎస్ సీనియర్ నాయకులు అమీన్ బాయ్,నక్క గంగాధర్,కిషోర్ మాజీ మార్కెట్ కమిటీ చైర్మన్ శీలం ప్రియాంక ప్రవీణ్,మాజీ మార్కెట్ కమిటీ వైస్ చైర్మన్ ఆసిఫ్ మైనారిటీ నాయకులు ఏతేమద్,రిజ్వన్,మరియు దయాల మల్లారెడ్డి,జగిత్యాల అర్బన్ సమన్వయ సమితి నుండి తుమ్మ గంగాధర్,యువత నుండి సన్నిహిత్ రావు,ప్రణయ్,ప్రతాప్, భగవాన్,భరత్,హరీష్,సాయి చరణ్ తదితరులు పాల్గొన్నారు.
More News...
<%- node_title %>
<%- node_title %>
జగిత్యాల మెడికల్ కళాశాలకు ఎన్ఎంసి నోటీస్ జారీ చేయడం రాష్ట్ర ప్రభుత్వానికి సిగ్గుచేటు

చిన్న వయసులోనే సామాజిక బాధ్యతతో వ్యవహరించడం అభినందనీయం

రైతుల భూ సమస్యలను మళ్ళీ కలెక్టర్,తహసీల్దార్లకు ఇవ్వడం సరికాదు

తెలంగాణ వర్కింగ్ జర్నలిస్ట్ ఫెడరేషన్ నిర్వహించిన జిల్లా మహాసభ పాల్గొన్న ఎమ్మెల్యే డా సంజయ్ కుమార్

ఎమ్మెల్యే డాక్టర్ సంజయ్ కుమార్ కు పెద్దమ్మ తల్లి బోనాల ఆహ్వాన పత్రిక అందజేత

నూతన సాంకేతిక పరిజ్ఞానాన్ని అందిపుచ్చుకొని ఎదగాలి. -ఆర్ఎస్ఎస్ జిల్లా సంఘచాలక్, డాక్టర్ ఆకుతోట శ్రీనివాసరెడ్డి

దశాబ్దం తర్వాత నెరవేరుతున్న పేదల సొంతింటి కల

బహరేన్ లో తొమ్మిది మంది తెలంగాణ వసూల అరెస్ట్

బీజేపీ జగిత్యాల పట్టణ అధ్యక్షులు కొక్కు గంగాధర్

బోనాల జాతర నిధులు పక్కదారి పడుతున్నాయి..

ఉద్యోగ సిబ్బంది కృషితోనే సౌత్ సెంట్రల్ రైల్వేకు దేశంలో గుర్తింపు

గల్ఫ్ అడ్వైజరి బొర్డ్ కు చాంద్ పాషా విజ్ఞప్తి
