వీరభద్ర మాల దీక్ష స్వీకరించిన మంత్రి పొన్నం ప్రభాకర్
మొక్కు నెరవేర్చుకున్న మంత్రి
నేటి నుండి 27 రోజులపాటు వీరభద్ర నక్షత్ర మాలలో మంత్రి పొన్నం ప్రభాకర్
భీమదేవరపల్లి ఆగస్టు 6 (ప్రజామంటలు ప్రతినిధి కాశిరెడ్డి ఆదిరెడ్డి) :
హనుమకొండ జిల్లా భీమదేవరపల్లి మండలం కొత్తకొండ గ్రామంలో శ్రీ వీరభద్ర దేవాలయంలో రాష్ట్ర రవాణా శాఖ, బీసీ సంక్షేమ మంత్రి పొన్నం ప్రభాకర్ వీరభద్రుడి నక్షత్ర దీక్ష మాలను స్వీకరించారు. సార్వత్రిక ఎన్నికలలో భాగంగా పిసిసి అధ్యక్షుని హోదాలో ప్రస్తుత సీఎం రేవంత్ రెడ్డి తో పాటు, మంత్రి పొన్నం ప్రభాకర్ వీరభద్రుడుని దర్శించుకున్నారు. ఆ సమయంలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తే వీరభద్ర నక్షత్ర దీక్ష చేపడతానని పొన్నం మొక్కుకున్నారు. వారి కోరిక నెరవేరడంతో పాటు, కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి తీసుకురావడమే కాకుండా, స్వామి ఆశీర్వాదంతో మంత్రి పదవి కూడా పొన్నం ను వరించింది.
*మొక్కు తీర్చుకున్న మంత్రి*
అసెంబ్లీ ఎలక్షన్స్ కి ముందు ప్రచారంలో భాగంగా భీమదేవరపల్లి మండలంలో పర్యటించిన సందర్భంలో మొదటగా కొత్తకొండ వీరభద్ర స్వామిని దర్శించుకున్నారు. ఆ సమయంలో తనకు టికెట్ తో పాటు, కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తే వీరభద్ర నక్షత్ర దీక్షను తీసుకుంటానని మొక్కుకున్నారు. అనంతరం రాష్ట్రవ్యాప్తంగా కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రావడం, పొన్నం మంత్రి కావడం చకా చకా జరిగిపోయాయి. తాను కోరుకున్న కోరికలు నెరవేరడంతో, శ్రావణమాసంలో వీరభద్ర దీక్ష తీసుకొని మాల వేసుకున్నారు.
*శ్రీ వీరభద్ర దీక్ష విశిష్టత*
శ్రావణ మాసంలో ప్రతి సంవత్సరం భద్రకాళి సమేత శ్రీ వీరభద్ర ఆలయంలో 27 రోజులపాటు నక్షత్రమాల ఉంటుంది. అత్యంత ప్రాచుర్యం కలిగిన వీరభద్రుడి మాల వేసుకోవడం సకల సౌభాగ్యాలకు మంచిదని నక్షత్ర దీక్ష వ్యవస్థాపక గురుస్వామి, ఆలయ అర్చకులు మొగిలిపాలెం రాంబాబు అన్నారు.
*ఈ సందర్భంగా మంత్రి పున్నం ప్రభాకర్ మాట్లాడుతూ...*
ఈ దీక్ష స్వప్రయోజనాల కొరకు కాకుండా రాష్ట్ర ప్రజలు, నియోజకవర్గ ప్రజలు సుభిక్షంగా ఉండాలని, పాడి పంటలతో పసిడి సిరులు కురువాలని అన్నారు. నియోజకవర్గ వ్యాప్తంగా ప్రజల సమస్యల పరిష్కారానికి, తన వంతు కృషి చేస్తూ, తన పనిలో ఆ భగవంతుడు ఎల్లవేళలా ఉండాలని కోరుకుంటున్నాను అని అన్నారు.
ప్రతి ఒక్కరూ దైవచింతను అలవర్చుకొని, మానసిక ప్రశాంతతను పొందాలని అన్నారు. మంగళవారం కొత్తకొండ వీరభద్రుని సన్నిధిలో ప్రత్యేక పూజలు నిర్వహించారు.
*దేవుడి మహిమ మీద విశ్వాసం ఉంది..*
- మంత్రి పొన్నం ప్రభాకర్
భక్తుల ఆకాంక్షలకు, విశ్వాసాలకు అనుగుణంగా, ఈ దీక్ష నా ఒక్కడి మంచి కొరకే కాకుండా, సర్వేజనా సుఖినోభవంతు స్ఫూర్తితో రైతులు వ్యవసాయం, ప్రతి ఒక్కరూ పాడి పంటలతో సస్యశ్యామలంగా, బాగుండాలని ఈ దీక్ష తీసుకోవడం జరిగిందని అన్నారు. ఈ నియోజకవర్గానికి సంబంధించిన అన్ని సమస్యలు పరిష్కారం అయ్యేలా, వీరభద్రుడు ధైర్యాన్ని, మనో బలాన్ని ఇవ్వాలని కోర మీసాల స్వామిని వేడుకున్నట్లు తెలిపారు.
*నక్షత్ర దీక్ష తీసుకున్న స్వాములకు నిత్య అన్నదాన కార్యక్రమం*
రవాణా, బీసీ సంక్షేమ శాఖా మంత్రి పొన్నం ప్రభాకర్ గౌడ్ నక్షత్ర దీక్ష మాలను తీసుకొని మూడు రోజులపాటు వీరభద్ర స్వామి దేవాలయం వద్దనే ఉంటూ ప్రత్యేక పూజలు నిర్వహిస్తారు. నక్షత్ర దీక్ష స్వాములకు అల్పాహారము, అన్నదాన కార్యక్రమం 27 రోజులపాటు పొన్నం సతీమణి పొన్నం మంజుల నిర్వహించుచున్నారు.
*27 రోజుల దీక్ష*
వీరభద్ర మాల స్వీకరించిన భక్తులు 11 రోజులు లేదా 27 రోజులు మాల వేసుకుని దీక్షలో ఉంటారు. ఆగస్టు 6 నుండి సెప్టెంబర్ 2 వ, తేదీ వరకు దీక్ష ఉంటుంది. మంత్రి పొన్నంతోపాటు 100 మందికి పైగా స్వాములు మంగళవారం మాల వేసుకుని నక్షత్ర దీక్ష తీసుకున్నారు.
*కార్యక్రమంలో పాల్గొన్న నాయకులు*
హుస్నాబాద్ నియోజకవర్గ వ్యాప్తంగా అన్ని గ్రామాల, మండలాల కాంగ్రెస్ కార్యకర్తలు పెద్ద ఎత్తున హాజరైనారు. ఆలయ ఈవో కిషన్ రావు, మాజీ చైర్మన్ మాడిశెట్టి కుమారస్వామి, ముల్కనూర్, వేలేర్ ఎస్సైలు సాయిబాబు, సురేష్, కాంగ్రెస్ సీనియర్ నాయకులు చిట్టంపల్లి ఐలయ్య, బొజ్జపురి అశోక్ ముఖర్జీ, కేతిరి లక్ష్మారెడ్డి, కొలుగూరి రాజు, ఊసకోయిల ప్రకాష్, ఆదరి రవీందర్, చంద్రశేఖర్ గుప్తా, మంగ రామచంద్రం, కొడకండ్ల సుదర్శన్ రెడ్డి, డబ్బా శంకర్, నరేందర్ గౌడ్, చిట్కురి అనిల్, జక్కుల అనిల్, ఊరడి జయపాల్ రెడ్డి, సత్తిరెడ్డి, కోటేశ్వర్ రెడ్డి, దేవరాజు శంకర్, నాగరాజు తదితరులు పాల్గొన్నారు.
More News...
<%- node_title %>
<%- node_title %>
బంగారం, వెండి ధరల్లో రెండో రోజు కూడా తగ్గుదల – స్పష్టంగా అంతర్జాతీయ ప్రభావం
హైదరాబాద్, అక్టోబర్ 28:
అంతర్జాతీయ మార్కెట్ ధోరణులను అనుసరించి దేశీయంగానూ బంగారం ధరలు రెండవ రోజు కూడా తగ్గుముఖం పట్టాయి. పెట్టుబడిదారులు లాభాల స్వీకరణకు వెళ్ళడంతో పాటు అమెరికా–చైనా వాణిజ్య ఒప్పందం కుదరొచ్చన్న అంచనాలు పసిడి మార్కెట్పై ప్రభావం చూపిస్తున్నాయి.
హైదరాబాద్ బులియన్ మార్కెట్లో మధ్యాహ్నం 12.30 గంటల సమయానికి 10 గ్రాముల స్వచ్ఛమైన పసిడి... కురిక్యాల జెడ్పీహెచ్ఎస్ ప్రధానోపాధ్యాయురాలు కమల సస్పెన్షన్
— విద్యార్థుల భద్రత నిర్లక్ష్యం, వాస్తవాల దాచిపెట్టడంపై చర్య
కరీంనగర్, అక్టోబర్ 28:
కరీంనగర్ జిల్లా గంగాధర మండలం కురిక్యాల గ్రామంలోని జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో చోటుచేసుకున్న లైంగిక వేధింపుల ఘటనపై జిల్లా పరిపాలన కఠిన చర్యలు తీసుకుంది. ఆఫీస్ సబార్డినేట్ ఎం.డి. యాకూబ్ పాషా బాలికలపై లైంగిక వేధింపులకు పాల్పడిన ఘటనలో వాస్తవాలను... సిద్ధిపేట ఎమ్మెల్యే హరీశ్ రావు తండ్రి సత్యనారాయణ రావు మరణంపై జి. రాజేశం గౌడ్ సంతాపం
హైదరాబాద్ అక్టోబర్ 28:
సిద్ధిపేట ఎమ్మెల్యే, మాజీ మంత్రివర్యులు తన్నీరు హరీశ్ రావు తండ్రి తన్నీరు సత్యనారాయణ రావు పరమపదించారు. ఈ విషాద సమాచారాన్ని తెలుసుకున్న మాజీ మంత్రి, తెలంగాణ రాష్ట్ర ప్రథమ ఆర్థిక సంఘం చైర్మన్ జి. రాజేశం గౌడ్,పబ్లిక్ సర్వీస్ కమీషన్ మాజీ సభ్యులు పైడిపల్లి రవీంద్ర రావులు,హరీశ్ రావు నివాసం కోకాపేట్కు... బీహార్లో ఘనంగా ఛఠ్ పూజా వేడుకలు
నేడు సూర్యోదయ పూజలు - ఉషా ఆర్గ్యా
పాట్నా, అక్టోబర్ 28:
బీహార్ రాష్ట్రవ్యాప్తంగా మహిళలు ఎంతో భక్తి, శ్రద్ధలతో ఛఠ్ పండుగను జరుపుకుంటున్నారు. సూర్యదేవుడు మరియు ఛఠ్ మాతకు అంకితమైన ఈ మహా పర్వం, ఉత్తర భారతదేశంలోని అత్యంత పవిత్రమైన వ్రతాలలో ఒకటిగా పరిగణించబడుతుంది.
నాలుగు రోజులపాటు జరిగే ఈ పండుగలో భక్తులు... మహిళలపై అసభ్యకరమైన, బెదిరింపు వ్యాఖ్యలపై సిక్కిం మహిళా కాంగ్రెస్ తీవ్ర ఖండన
గ్యాంగ్టాక్ అక్టోబర్ 28:
గాంగ్టక్: సోషల్ మీడియాలో మహిళలపై అసభ్యకరమైన, బెదిరింపు వ్యాఖ్యలు చేసిన ఘటనపై సిక్కిం ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ మహిళా విభాగం తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసింది.కాంగ్రెస్ మహిళా విభాగం విడుదల చేసిన ప్రకటనలో — ఎస్డీఎఫ్ ప్రతినిధి యోజనా ఖాలింగ్, ప్రతిపక్ష సభ్యురాలు రీమా చాపగైతో పాటు మరికొన్ని మహిళలపై... 12 రాష్ట్రాల్లో స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్ (SIR) ప్రక్రియ ప్రారంభం — ఎన్నికల సంఘం ప్రకటన
న్యూ డిల్లీ అక్టోబర్ 28:
భారత ఎన్నికల సంఘం (ECI) దేశవ్యాప్తంగా ఓటరు జాబితాలను సమగ్రంగా నవీకరించేందుకు స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్ (SIR) పేరుతో భారీ ప్రక్రియను ప్రారంభించింది. ఈ రెండో దశలో మొత్తం 12 రాష్ట్రాలు మరియు కేంద్ర పాలిత ప్రాంతాలు చేర్చబడ్డాయి. తుది ఓటరు జాబితా 2026 ఫిబ్రవరి 7న విడుదల కానుంది... పుతిన్ భారత్ పర్యటన డిసెంబర్ 5–6న — ప్రపంచ రాజకీయాల మధ్య కీలక శిఖరాగ్ర సమావేశం
పార్లమెంట్లో ప్రసంగం — ప్రతీకాత్మక ప్రాధాన్యం
రష్యా-భారత్ వ్యూహాత్మక బంధం
ప్రపంచ పరిణామాల మధ్య ఈ పర్యటన ప్రాధాన్యం
న్యూ ఢిల్లీ/ మాస్కో అక్టోబర్ 28:
భారత్-రష్యా సంబంధాలకు కొత్త దశ
రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్ డిసెంబర్ 5 మరియు 6 తేదీలలో భారతదేశాన్ని సందర్శించనున్నారు. ఇది రెండు దేశాల మధ్య 23వ వార్షిక... హరీశ్ రావుకు పితృవియోగం
హరీశ్ రావుకు పితృవియోగం
మాజీ మంత్రి తన్నీరు హరీశ్ రావు తండ్రి సత్యనారాయణ రావు కన్నుమూత
హైదరాబాద్, అక్టోబర్ 28 (ప్రజామంటలు) :తెలంగాణ మాజీ మంత్రి, సిద్దిపేట ఎమ్మెల్యే తన్నీరు హరీశ్ రావు పితృవియోగం కలిగింది. హరీశ్ రావు తండ్రి తన్నీరు సత్యనారాయణ రావు ఈ రోజు, అక్టోబర్ 28,తెల్లవారు 4 గంటల ప్రాంతంలో... తెలంగాణ మానవ హక్కుల కమిషన్ లో ఎన్కౌంటర్లో మరణించిన షేక్ రియాజ్ కుటుంబ ఫిర్యాదు
హైదరాబాద్, అక్టోబర్ 27 (ప్రజా మంటలు):ఇటీవల పోలీస్ ఎన్కౌంటర్లో మరణించిన షేక్ రియాజ్ కుటుంబ సభ్యులు ఈరోజు తెలంగాణ రాష్ట్ర మానవ హక్కుల కమిషన్ (TGHRC) ముందు హాజరై, ఫిర్యాదు సమర్పించారు. రియాజ్ తల్లి, భార్య, మరియు చిన్నపిల్లలు కలిసి కమిషన్ ఎదుట తమపై పోలీసుల వేధింపులు జరుగుతున్నాయని ఆరోపించారు.
కుటుంబ సభ్యుల ప్రకారం,... జిల్లాలోని మద్యం దుకాణాల లైసెన్స్ దారుల ఎంపిక డ్రా పద్ధతి ద్వారా ఎంపిక చేసిన జిల్లా కలెక్టర్ బి. సత్యప్రసాద్
జగిత్యాల అక్టోబర్ 27(ప్రజా మంటలు)జిల్లా కలెక్టర్ సమక్షంలో జగిత్యాల విరూపాక్షి గార్డెన్ లో A4 దుకాణాల వైన్ షాపుల కోసం డ్రా నిర్వహణ.
A4 దుకాణాల మద్యం దుకాణాల కోసం లాట్ల డ్రాను సోమవారం జగిత్యాల జిల్లా కలెక్టర్ సమక్షంలో జగిత్యాల పట్టణంలోని విరూపాక్షి గార్డెన్ లో నిర్వహించారు.
డ్రా నిర్వహణ సందర్బంగా ఎలాంటి... ఆదిలాబాద్లో సైబర్ మోసం కేసు — వలపు వలతో ఎనిమిది లక్షలు స్వాహా
ఆదిలాబాద్, అక్టోబర్ 27 (ప్రజా మంటలు):
వలపు పేరుతో ప్రజలను మోసం చేస్తున్న ఘరానా సైబర్ ముఠాను ఆదిలాబాద్ జిల్లా పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. మహిళా గొంతుతో మాట్లాడి, ప్రేమ పేరుతో బాధితులను బురిడీ కొట్టిస్తున్న ముగ్గురు నిందితులను సూర్యాపేట జిల్లాలో పోలీసులు అరెస్టు చేశారు. వారి వద్ద నుంచి రూ.1.5 లక్షల నగదు, మూడు... ఒంటిపై పెట్రోల్ పోసుకుని ఏఆర్ కానిస్టేబుల్ ఆత్మహత్య — కామారెడ్డి విషాదం
కామారెడ్డి అక్టోబర్ 27 (ప్రజా మంటలు):
కామారెడ్డి జిల్లాలో విషాదకర ఘటన చోటుచేసుకుంది. ఏఆర్ కానిస్టేబుల్ రేకులపల్లి జీవన్ రెడ్డి (37) వ్యక్తిగత కారణాలతో మనస్తాపం చెంది ఆత్మహత్యకు పాల్పడ్డాడు.
సోమవారం ఉదయం “డ్యూటీకి వెళ్తున్నా” అని ఇంటి నుండి బయలుదేరిన జీవన్ రెడ్డి, అడ్లూర్ శివారులోని రాధాస్వామి సత్సంగ్ సమీపంలో ఒంటిపై పెట్రోల్ పోసుకుని... 