జర్నలిస్ట్ ల దీక్షకు సంఘీభావం తెలిపిన కరీంనగర్ పట్టభద్రుల ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి, మున్సిపల్ చైర్ పర్సన్ అడువాల జ్యోతి లక్ష్మణ్
సిరిసిల్ల. రాజా విక్రాంత్ శర్మ - 9963349493/9348422113.
జగిత్యాల ఆగస్ట్ 5 (ప్రజా మంటలు) ;
సమాజంలో జర్నలిస్ట్ ల పాత్ర కీలకం అని ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి అన్నారు.
ప్రభుత్వం పారదర్శకత విధానంతో ముందుకు సాగేందుకు తోడ్పాటును అందించేది జర్నలిజం వ్యవస్థ.
గతంలో ప్రింట్ మీడియకే పరిమితం అయిన సమాచార వ్యవస్థ ఎలక్ట్రానిక్ మీడియా రాకతో క్షణంలో వార్తలు ప్రజల ముంగిట ఉండే పరిస్థితి వచ్చిందని జగిత్యాల పాత్రికేయ సోదరుల ఇండ్ల స్థలాల కల్పన ప్రక్రియ నాన్చడం జరుగుతుందని అన్నారు
ఇందులో నా బాధ్యత ఎంత ఉందొ, మీ బాధ్యత అంతే ఉందన్నారు.
నలభై ఏళ్లలో నాలుగు పార్టీలకు చెందిన ప్రభుత్వాలు అధికారంలోకి వచ్చాయి.
అప్పటి నుండి ఇప్పటివరకు ఉన్న నాయకత్వం మన ముందరే ఉన్నారు.
నాకు ఇళ్ల స్థలాల కల్పన పై ఒక అభిప్రాయం ఉందని పేర్కొన్నారు.
ధరూర్ క్యాంప్ లో స్థలాల కేటాయింపునకు కొంత వెనక్కి వచ్చిన మాట వాస్తవమే అన్నారు.
భవిష్యత్ కు ఏకైక ఆధారం ధరూర్ క్యాంప్. దాన్ని కాపాడుకోవాల్సిన బాధ్యత మన అందరి పై ఉందన్నారు.
కొన్ని సమయాల్లో ప్రత్యామ్నాయం గా స్థలాలు సూచించిన. కొంత భేదభిప్రాయం ఉండడం వల్ల సమస్య మొదలైందన్నారు.
జర్నలిస్ట్ లకు ఇళ్ల స్థలాలు కల్పించడం ప్రభుత్వం భాద్యత అన్నారు.
ఈ విషయాన్నీ సీఎం రేవంత్ రెడ్డి దృష్టికి తీసుకెళ్లి నివేదిస్తానని తెలిపారు.
నన్ను మీరు అన్యధా భావించవద్దు. నా అభిప్రాయం నేను కలిగి ఉన్న అన్నారు.
గత పదేళ్లలో బీఆరెస్ ప్రభుత్వం పాలన చేసింది. అప్పుడే స్థలాలు కేటాయిస్తే ఈ పరిస్థితి వచ్చేది కాదన్నారు.
తెలంగాణ ఉద్యమ సాధనలో జర్నలిస్ట్ ల పాత్ర కీలకమన్నారు.
ఇండ్ల స్థలాల ఆశలు ఫలప్రదం అయ్యే విధంగా ప్రభుత్వం పని చేస్తుందని భావిస్తున్నాను అన్నారు.
అందరి పరిస్థితి భిన్నం - నా పరిస్థితి విభిన్నం. నేను కొంత ఆశించిన మేరకు స్పందించకున్న ఏనాడూ విభేదించలేదన్నారు.
ఏది ఏమైనా సాధ్యం అయినంత మేరకు ఇళ్ల స్థలాల కల్పనాకు నా వంతు తోడ్పాటు అందిస్తామన్నారు.
ఈ కార్యక్రమంలో టిపిసిసి కార్యదర్శి బండ శంకర్ మున్సిపల్ ఫ్లోర్ లీడర్ దుర్గయ్య కాంగ్రెస్ నాయకులు గాజుల రాజేందర్ పాల్గొన్నారు.
More News...
<%- node_title %>
<%- node_title %>
జగిత్యాల జిల్లా ఉత్తమ ఉపాధ్యాయ అవార్డు గ్రహీతలకు ఘన సన్మానం
జగిత్యాల, అక్టోబర్ 4 (ప్రజా మంటలు):
జగిత్యాల జిల్లా ఉత్తమ ఉపాధ్యాయ అవార్డు గ్రహీతలను ఆర్య వైశ్య అఫీషియల్స్ అండ్ ప్రొఫెషనల్స్ అసోసియేషన్ (అవోపా) జగిత్యాల జిల్లా శాఖ ఆధ్వర్యంలో ఘనంగా సన్మానించారు. జగిత్యాల పట్టణంలోని స్థానిక సమావేశ మందిరంలో ఆదివారం మధ్యాహ్నం నిర్వహించిన కార్యక్రమానికి అవోపా జిల్లా శాఖ అధ్యక్షుడు రాజేషుని శ్రీనివాస్ అధ్యక్షత... కాంగ్రెస్ ఎన్నికల హామీల అమలుపై జీవన్‌రెడ్డి ప్రశ్నలు
జగిత్యాల, అక్టోబర్ 4 (ప్రజా మంటలు):
కాంగ్రెస్ ప్రభుత్వం 2023 ఎన్నికల సందర్భంగా ప్రజలకు ఇచ్చిన హామీలను పూర్తిస్థాయిలో అమలు చేయాలని బీఆర్ఎస్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి, మాజీ మంత్రి టి. జీవన్‌రెడ్డి డిమాండ్ చేశారు. ఈ మేరకు ఆయన ప్రభుత్వానికి పలు అంశాలను ప్రస్తావిస్తూ లేఖ రాశారు.
ఎన్నికల సమయంలో కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన... ఈవీఎంలు పోవాలి.. పేపర్ బ్యాలెట్ విధానం రావాలి
హైదరాబాద్ అక్టొబర 04 (ప్రజా మంటలు):
దేశంలో ఎన్నికల ప్రక్రియను తిరిగి పేపర్ బ్యాలెట్ విధానంలో నిర్వహించాలని తెలంగాణ రక్షణ సేన చీఫ్ కల్వకుంట్ల కవిత డిమాండ్ చేశారు. ఈవీఎంలలో మానిప్యులేషన్‌కు అవకాశం ఉందన్న అనుమానాలు ఉన్నందున పారదర్శకత కోసం బ్యాలెట్ విధానాన్ని తీసుకురావాలని కోరారు. ఇందుకోసం ఢిల్లీ వరకు వెళ్లైనా పోరాటం చేస్తామని తెలిపారు.... నేరెళ్ల బాధితులను కాంగ్రెస్, బీఆర్ఎస్ దగా చేస్తున్నాయి
హైదరాబాద్, అక్టోబర్ 4 (ప్రజా మంటలు):
నేరెళ్ల బాధితులకు న్యాయం చేయడంలో కాంగ్రెస్, బీఆర్ఎస్ పార్టీలు విఫలమయ్యాయని తెలంగాణ రక్షణ సేన చీఫ్ కల్వకుంట్ల కవిత ఆరోపించారు. నేరెళ్ల ఘటనకు సంబంధించిన కీలక ఆధారాలు, నివేదికలు ఏమయ్యాయో ప్రభుత్వం స్పష్టం చేయాలని డిమాండ్ చేశారు. ఈ మేరకు ఆదివారం ఆమె మీడియాకు వీడియో సందేశం విడుదల... స్మశాన వాటికలో స్వచ్ఛత సేవలు, మెట్ల నిర్మాణం
జగిత్యాల, అక్టోబర్ 4 (ప్రజా మంటలు):
జగిత్యాల భగవాన్ శ్రీ సత్యసాయి సేవా సమితి ఆధ్వర్యంలో స్థానిక సత్యహరిశ్చంద్ర స్మశాన వాటికలో ఆదివారం స్వచ్ఛత సేవా కార్యక్రమం నిర్వహించారు. సమితి కన్వీనర్ బట్టు రాజేందర్ ఆధ్వర్యంలో సేవా సభ్యులు స్మశాన వాటిక పరిసరాలను శుభ్రం చేశారు. స్నానాల గదులు, బాత్రూమ్లు, పూజా మంటపం, వంటగదిని శుభ్రం... జగిత్యాల పీఏసీఎస్ చైర్మన్‌గా కొలుగూరి దామోదర్‌రావు
జగిత్యాల, అక్టోబర్ 4 (ప్రజా మంటలు):
జగిత్యాల ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘం (పీఏసీఎస్) చైర్మన్‌గా ధరూర్‌కు చెందిన ప్రముఖ న్యాయవాది కొలుగూరి దామోదర్‌రావును రాష్ట్ర ప్రభుత్వం నియమించింది. ఆయనతో పాటు పీఏసీఎస్ పాలకవర్గంలో 12 మంది సభ్యులను నియమిస్తూ ఉత్తర్వులు జారీ చేసింది.
చైర్మన్‌గా నియమితులైన దామోదర్‌రావు తన నియామకానికి సహకరించిన రాష్ట్ర మంత్రి... గడ్డి మందు పిచికారీతో రైతు వరి పంట ధ్వంసం
వెల్గటూర్, అక్టోబర్ 4 (ప్రజా మంటలు):
జగిత్యాల జిల్లా వెల్గటూర్ మండలం జగదేవ్‌పేటలో రైతు బద్దం మాధవరెడ్డి సాగు చేసిన వరి పంట గుర్తుతెలియని వ్యక్తులు గడ్డి మందు పిచికారీ చేయడంతో ధ్వంసమైంది. సర్వే నంబర్ 135లోని 16 గుంటల భూమిలో సాగు చేసిన పంట చేతికొచ్చే సమయంలో ముగ్గురు వ్యక్తులు పొలంలోకి ప్రవేశించి మందు... కేసీఆర్ మళ్లీ సీఎం కావాలని యువకుల పాదయాత్ర
ఎర్రవెల్లి అక్టొబర్ 04 (ప్రజా మంటలు):
04 (ప్రజా మంటలు):కేసీఆర్ తిరిగి ముఖ్యమంత్రి కావాలని కోరుతూ పెద్దపల్లి జిల్లా మంథని నుంచి ఐదు రోజుల పాటు పాదయాత్ర చేసిన ముగ్గురు యువకులు ఆదివారం ఎర్రవెల్లికి చేరుకున్నారు. మంథనికి చెందిన బూర్ల వెంకటేశ్, కొండ వెంకటేశ్, మంథని బెన్నిపాల్ కేసీఆర్‌ను ఆయన నివాసంలో కలిసి తమ
కేసీఆర్... అమారత్-ఎ-మిల్లత్-ఎ-ఇస్లామియా ఎన్నికలకు సర్వం సిద్ధం
జగిత్యాల, అక్టోబర్ 4 (ప్రజా మంటలు):
అమారత్-ఎ-మిల్లత్-ఎ-ఇస్లామియా జగిత్యాల అధ్యక్ష పదవికి నిర్వహించనున్న ఎన్నికలకు అన్ని ఏర్పాట్లు పూర్తయ్యాయని ఎన్నికల కమిషనర్ ఇంజినీర్ మసియుద్దీన్ అఫ్సర్ తెలిపారు. ఆదివారం జగిత్యాల ప్రెస్‌క్లబ్‌లో నిర్వహించిన విలేకరుల సమావేశంలో ఆయన ఎన్నికల వివరాలను వెల్లడించారు.
అక్టోబర్ 9న శుక్రవారం నమాజ్ అనంతరం మధ్యాహ్నం 1.30 గంటలకు పట్టణంలోని 25... సంతానం కోసం ఏళ్ల నిరీక్షణ.. బిడ్డను కని కన్నుమూసిన తల్లి
ఖమ్మం అక్టొబర్ 04 (ప్రజా మంటలు);ఏళ్ల నిరీక్షణ తర్వాత పండంటి బిడ్డకు జన్మనిచ్చిన ఓ తల్లి.. ఆ బిడ్డను కళ్లారా చూడకుండానే కన్నుమూసిన విషాద ఘటన ఖమ్మంలో చోటుచేసుకుంది.వికారాబాద్ జిల్లా తాండూరు మండలం చంబల్‌కు చెందిన గౌడి లక్ష్మి (36) సంతానం కోసం ఐయూఐ, ఐవీఎఫ్ చికిత్సలు చేయించుకున్నారు. ఇందుకోసం సుమారు రూ.10... ఒకే వేదికపై తండ్రీకొడుకులకు భారత్ కళా పురస్కారాలు
ధర్మపురి, అక్టోబర్ 4 (ప్రజా మంటలు):
ధర్మపురికి చెందిన ప్రముఖ ఫొటోగ్రాఫర్ వడ్లూరి రవీందర్, ఆయన కుమారుడు సాత్విక్ వడ్లూరికి ప్రతిష్ఠాత్మక భారత్ కళా పురస్కార్ అవార్డులు లభించాయి. తెలంగాణ భాషా సాంస్కృతిక శాఖ సౌజన్యంతో ఫొటో పరివార్ ఇండియా ఆధ్వర్యంలో హైదరాబాద్‌లో నిర్వహించిన ఫొటో ట్రేడ్ షోలో వీరికి అవార్డులు అందజేశారు.
వడ్లూరి రవీందర్‌కు ... గోదావరి పుష్కరాలకు పకడ్బందీ ఏర్పాట్ల పై సమీక్ష
జగిత్యాల, అక్టోబర్ 3 (ప్రజా మంటలు):
గోదావరి పుష్కరాలు–2027ను దృష్టిలో ఉంచుకుని చేపడుతున్న అభివృద్ధి, మౌలిక వసతుల పనులను వేగవంతం చేసి నిర్ణీత గడువులోగా పూర్తి చేయాలని దేవాదాయ శాఖ ప్రిన్సిపల్ సెక్రటరీ శైలజ రామయ్యర్ సంబంధిత జిల్లా కలెక్టర్లను ఆదేశించారు.
శనివారం సంబంధిత జిల్లాల కలెక్టర్లతో నిర్వహించిన వీడియో కాన్ఫరెన్స్‌లో గోదావరి పుష్కరాల ఏర్పాట్లపై... 