చదువుకోవాలని ఉందా?కూలీగా మారిన బాలికను చూసి ఆగి, పలకరించిన ఎంపి బండి సంజయ్
హాస్టల్ లో చేర్పించి, చదివిస్తానని బండి సంజయ్ హామీ
చదువుకోవాలని ఉందా?కూలీగా మారిన బాలికను చూసి ఆగి, పలకరించిన ఎంపి బండి సంజయ్
హాస్టల్ లో చేర్పించి, చదివిస్తానని బండి సంజయ్ హామీ
కరీంనగర్/ చొప్పదండి జులై 27:
కరీంనగర్ పార్లమెంట్ నియోజకవర్గ పర్యటనలో ఉన్న కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్ కుమార్ ఈరోజు మధ్యాహ్నం చొప్పదండి నియోజకవర్గంలోని చర్లపల్లిలో నిర్మించిన సీసీ రోడ్డు నిర్మాణాన్ని ప్రారంభంచి, తిరిగి వెళుతుండగా, గ్రామ శివారులో పొలం పనుల్లో నిమగ్నమైన రైతు కూలీలు జోరు వానలోనే రోడ్డుపైనే భోజనాలను చేయడాన్ని గమనించి, తన వాహనాన్ని ఆపారు. వారి వద్దకు వెళ్లి సమస్యలను అడిగి తెలుసుకున్నారు.
ఆ కూలీల గుంపులో మైనర్ బాలికను చూసి ‘ఏం తల్లి... పనికి వెళుతున్నవ్. చదువు ఇష్టం లేదా?’అని ప్రశ్నించడంతోపాటు కుటుంబ పరిస్థితిపై ఆరా తీశారు. తన పేరు బోళ్ల అక్షయ అని, టెన్త్ క్లాస్ పాసైనప్పటికీ ఆర్దిక పరిస్థితి బాగోలేక కూలీ పనులకు వెళుతున్నానని బదులిచ్చారు.
తనకు చదువుకోవాలని ఉందని చెప్పడంతో వెంటనే అక్కడున్న పార్టీ జిల్లా అధ్యక్షులు గంగాడి క్రిష్ణారెడ్డి పిలిచి బాలిక వివరాలు తీసుకుని వెంటనే కాలేజీలో చదివించడంతోపాటు, ఆసక్తి ఉంటే హాస్టల్ లో చేర్పించాలని చెప్పారు. ఈ సందర్భంగా అక్షయ్య బండి సంజయ్ కు థ్యాంక్స్ చెప్పారు.
More News...
<%- node_title %>
<%- node_title %>
వైద్యుల పరిరక్షణ బాధ్యత ప్రజలదే -మాతా శిశు కేంద్ర సూపరింటెండెంట్ సుమన్ రావు

సిగాచి పరిశ్రమలో గాయపడిమావారిని ఆస్పత్రిలో పరామర్శించిన ఎమ్మెల్సీ కవిత

ఎంపీ రఘునందన్ రావును పరామర్శించిన బీజేపీ స్టేట్ చీఫ్
.jpg)
కన్నులపండువగా మహాకాళి అమ్మవారి ఘటము ఊరేగింపు

పాశమైలారం ప్రమాద ఘటనపై ఎన్హెచ్ఆర్సీ లో పిటీషన్

ఆపదలో ఉన్న వారిని కాపాడే గొప్ప వృత్తి - గాంధీలో ఘనంగా డాక్టర్స్ డే సెలబ్రేషన్స్..

పవర్ గ్రిడ్ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ గా దోమన్ యాదవ్

చుట్టాల బస్తీ యూపీహెచ్సీలో ఘనంగా డాక్టర్స్ డే సెలబ్రేషన్స్

శ్రీకృష్ణ భగవానుని ఆశీస్సులు అందరిపై ఉండాలి మాజీ జెడ్పి చైర్ పర్సన్ దావ వసంత

ఈ ఏడాది ఘనంగా బల్కంపేట ఎల్లమ్మ కళ్యాణోత్సవం హపీసీసీ వైస్ ప్రెసిడెంట్ డాక్టర్ కోట నీలిమ

తల్లిదండ్రులు జన్మనిస్తే... వైద్యులు పునర్జన్మ నిస్తారు...!

ఆధ్యాత్మిక కార్యక్రమాలు ప్రజల్లో భక్తి, శాంతి, సమన్వయ భావాలను పెంపొందిస్తాయి - ఎమ్మెల్యే డా.సంజయ్ కుమా
