ప్రజామంటలు వార్తకు స్పందన

ములుకనూర్ బీసీ కాలనీ రోడ్డుకు మరమత్తులు

On
ప్రజామంటలు వార్తకు స్పందన

చినుకు పడితే ఈ దారిలో నడవడం కష్టమే...... రోడ్డంతా బురదమయం ..... ముల్కనూర్ బీసీ కాలనీ వాసుల ఇక్కట్లు

భీమదేవరపల్లి జూన్ 29 (ప్రజామంటలు)

చినుకు పడితే ఈ దారిలో నడవడం కష్టమే...... రోడ్డంతా బురదమయం ..... ముల్కనూర్ బీసీ కాలనీ వాసుల ఇక్కట్లు అనే శీర్షికన ఈ నెల 27 న, ప్రచురితమైన కథనానికి ములుకనూర్ గ్రామ పంచాయితి సెక్రెటరీ జంగం పూర్ణచందర్ వెంటనే స్పందించి శనివారం జేసిబితో గుంతలలో మొరం నింపి బురద లేకుండా చేశారు. వివరాల్లోకి వెళితే ములకనూరు స్టేట్ బ్యాంక్ ఎదురుగా దారి బీసీ కాలనీ, కొత్తపల్లికి వెళ్లే దారిలో వర్షం పడితే చాలు నీరు నిలవడంతో ప్రజలు ఇక్కట్లు పడుతున్నారు. తాత్కాలికంగా నైనా ప్రజల ఇక్కట్లు తీరడంతో బీసీ కాలనీవాసులు, వ్యవసాయ క్షేత్రాలకు వెళ్లే వారు, కొత్తపెల్లి గ్రామానికి వెళ్లేవారు హర్షం వ్యక్తం చేశారు. సమస్యను అధికారుల దృష్టికి తీసుకు వెళ్లిన ప్రజామంటలు జాతీయ దినపత్రికను అభినందించారు.

Tags