ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి తన పదవికి రాజీనామా? హైదారాబాద్ లో చర్చలు -సంప్రదింపులు
ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి తన పదవికి రాజీనామా?హైదారాబాద్ లో చర్చలు -సంప్రదింపులు
హైదారాబాద్ జూన్ 25 :
ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి ఈరోజు తన పదవికి రాజీనామా చేయనున్నట్లు తెలుస్తోంది.
ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి తన సన్నిహితులతో కలిసి, బేగంపేట్ లోని స్వగృహంలో సంప్రదింపులు జరుపుతున్నట్లు,మధ్యాహ్నం అసెంబ్లీకి వచ్చి అసెంబ్లీ సెక్రటరీకి జీవన్ రెడ్డ తన రాజీనామా లేఖ ఇవ్వనున్నట్లు ప్రచారం జరుగుతుంది
జగిత్యాల ఎమ్మెల్యే డాక్టర్ సంజయ్ కుమార్ కాంగ్రెస్‌లో చేరడాన్ని జిల్లా ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి.. ససేమిరా ఒప్పుకోవడం లేదు. పార్టీలో తానో.. అతనో.. అనే విధంగా వ్యవహారం మాట్లాడుతున్నాడని, నిన్నటి శ్రీధర్ బాబు, ఇతర ఎమ్మేల్యేలు జరిపిన సంప్రదింపులు ఒక కొలిక్కిరాలేదు. .
నిన్న మంత్రి శ్రీధర్ బాబు బుజ్జగింపు లకు ప్రయత్నించినా, జీవన్ రెడ్డి వెనక్కి తగ్గలేదు. తాజాగా జీవన్ రెడ్డి కీలక నిర్ణయం తీసుకున్నట్టు తెలుస్తుంది.
తనకు సమాచారం అందించకుండా, జగిత్యాల ఎమ్మెల్యే సంజయ్ ను పార్టీలో చేర్చుకోవడాన్ని జీవన్ రెడ్డి తీవ్రంగా తప్పుబడుతున్నారు.
కాంగ్రెస్ వ్యవహారాల ఇంచార్జ్ దీపాదాస్ మున్షీతో చర్చలు జరిపేందుకు ఆయన హైదరాబాద్ చేరుకున్నా, దీపామున్షి అందుబాటులో లేకపోవడంతో,
గాంధీభవన్ లో నిరసన తెలియజేయడానికి వచ్చిన కాంగ్రెస్ నాయకులు,కార్యకర్తలు ఇప్పుడు హైదరాబ్ లోని జీవన్ రెడ్డి ఇంటి వద్ద గుమికూడారు.
పార్టీ కోసం ఇంతకాలం కష్టపడి పనిచేశానని,కార్యకర్తల మనోభావాలను గౌరవించాల్సిన బాధ్యత తనపై ఉందని, ఈనేపథ్యపం లోనే జీవన్ రెడ్డి రాజీనామా చేసే యోచనలో ఉన్నట్టు తెలుస్తుంది..
More News...
<%- node_title %>
<%- node_title %>
వైద్యుల పరిరక్షణ బాధ్యత ప్రజలదే -మాతా శిశు కేంద్ర సూపరింటెండెంట్ సుమన్ రావు

సిగాచి పరిశ్రమలో గాయపడిమావారిని ఆస్పత్రిలో పరామర్శించిన ఎమ్మెల్సీ కవిత

ఎంపీ రఘునందన్ రావును పరామర్శించిన బీజేపీ స్టేట్ చీఫ్
.jpg)
కన్నులపండువగా మహాకాళి అమ్మవారి ఘటము ఊరేగింపు

పాశమైలారం ప్రమాద ఘటనపై ఎన్హెచ్ఆర్సీ లో పిటీషన్

ఆపదలో ఉన్న వారిని కాపాడే గొప్ప వృత్తి - గాంధీలో ఘనంగా డాక్టర్స్ డే సెలబ్రేషన్స్..

పవర్ గ్రిడ్ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ గా దోమన్ యాదవ్

చుట్టాల బస్తీ యూపీహెచ్సీలో ఘనంగా డాక్టర్స్ డే సెలబ్రేషన్స్

శ్రీకృష్ణ భగవానుని ఆశీస్సులు అందరిపై ఉండాలి మాజీ జెడ్పి చైర్ పర్సన్ దావ వసంత

ఈ ఏడాది ఘనంగా బల్కంపేట ఎల్లమ్మ కళ్యాణోత్సవం హపీసీసీ వైస్ ప్రెసిడెంట్ డాక్టర్ కోట నీలిమ

తల్లిదండ్రులు జన్మనిస్తే... వైద్యులు పునర్జన్మ నిస్తారు...!

ఆధ్యాత్మిక కార్యక్రమాలు ప్రజల్లో భక్తి, శాంతి, సమన్వయ భావాలను పెంపొందిస్తాయి - ఎమ్మెల్యే డా.సంజయ్ కుమా
