కొత్త క్రిమినల్ చట్టాలు జూలై 1 నుంచి అమలు - కేంద్ర మంత్రి అర్జున్ మేఘ్వాల్ వెల్లడి..
(సిరిసిల్ల. రాజా విక్రాంత్ శర్మ - 9963349493/9348422113).
న్యూఢిల్లీ జూన్ 16 (ప్రజా మంటలు) :
మూడు కొత్త క్రిమినల్ చట్టాలు 'భారతీయ న్యాయ్ సంహిత', 'భారతీయ సురక్షా సంహిత', 'భారతీయ సాక్ష్య అభినయం' ఈ ఏడాది జూలై 1 నుంచి అమల్లోకి రానున్నట్టు కేంద్ర న్యాయ శాఖ సహాయ మంత్రి (స్వతంత్ర హోదా) అర్జున్ మేఘ్వాల్ ఆదివారం నాడు తెలిపారు.
ఐపీసీ, సీఆర్‌పీసీ, ఇండియన్ ఎవిడెన్స్ యాక్ట్ లలో మార్పు జరిగిందని, తగిన సంప్రదింపుల ప్రక్రియ, లా కమిషన్ నివేదిక ఆధారంగా మూడు చట్టాల్లోనూ మార్పులు చేశామని చెప్పారు.
మూడు చట్టాలు కొత్త పేర్లతో అమల్లోకి వస్తాయని, ఈ చట్టాలకు సంబంధించి అన్ని రాష్ట్రాల్లోనూ తగిన శిక్షణ ఇస్తామని చెప్పారు. ఇందుకు అసవరమైన శిక్షణను బ్యూరో ఆఫ్ పోలీస్ రీసెర్చ్ అండ్ డెవలప్‌మెంట్ (BPRD) అందిస్తుందని చెప్పారు.
జ్యుడిషియల్ అకాడమీలు, నేషనల్ లా యూనివర్శిటీ లకు సైతం శిక్షణ ఉంటుందని, దేశంలో క్రిమినల్ జస్టిస్ వ్యవస్థ సమర్ధవంతంగా పని చేసేందుకు ఈ మూడు కొత్త చట్టాలు కీలకమని మంత్రి మేఘ్వాల్ తెలిపారు.
కాగా,
- భారతీయ నాగరిక్ సురక్ష సంహిత కింద నేరాల తీవ్రతను బట్టి పోలీసు కస్టడీని 15 రోజుల నుంచి 90 రోజులకు పొడిగించ నున్నారు.
- భారతీయ న్యాయ సంహితలో 358 సెక్షన్లు (ఐపీసీలో 511 సెక్షన్లకు బదులుగా) ఉంటారు. బిల్లులో కొత్తగా 20 నేరాలను కూడా చేర్చారు.
భారతీయ నాగరిక్ సురక్ష సంహితలో 532 సెక్షన్లు (సీఆర్‌పీసీ లోని 484 సెక్షన్ల స్థానే) ఉంటాయి. 177 ప్రొవిజన్లను బిల్లులో మార్పు చేశారు. 9 కొత్త సెక్షన్లు, 39 సబ్ సెక్షన్లు చేర్చారు.
- భారతీయ సాక్ష్య అభియాన్‌లో 14 సెక్షన్లను మార్చడం, తొలగించడం జరిగింది. ఇందులో 170 ప్రొవిజన్లు (ఒరిజనల్ ప్రొవిజన్లు 167) ఉండగా, 24 ప్రొవిజన్లను మార్చారు. రెండు కొత్త ప్రొవిజన్లు, ఆరు సబ్ ప్రొవిజన్లు చేర్చగా, ఆరు ప్రొవిజన్లను బిల్లు నుంచి తొలగించారు.
ముఖ్యంగా మహిళలు, పిల్లలపై జరుగుతున్న నేరాలకు వ్యతిరేకంగా కట్టుదిట్టమైన మార్పులను కొత్త చట్టాల్లో తీసుకు వచ్చారు.
More News...
<%- node_title %>
<%- node_title %>
పటిష్ఠ బందోబస్తు మధ్య సమ్మక్క సారలమ్మ పగిడిద్ద రాజు తిరుగు ప్రయాణం
లక్షలాది భక్తులతో మహాజాతర విజయవంతం
ఎల్కతుర్తి జనవరి 31 (ప్రజా మంటలు):
ఎల్కతుర్తి మండల కేంద్రంలోని దామేర బీమదేవరపల్లి మండలంలో ముల్కనూర్ ప్రాంతం మరోసారి ఆధ్యాత్మిక శోభతో కళకళలాడింది. జనవరి 28. 29. 30. ప్రారంభమైన సమ్మక్క సారలమ్మ జాతరకు ఈసారి కూడా లక్షలాది భక్తులు తండోప తండాలుగా తరలివచ్చారు. గ్రామాల నలుమూలల నుంచి మాత్రమే... పొలంలో నాటు వేస్తూ బీహార్ వలస కార్మికుడు మృతి
ఎల్కతుర్తి జనవరి 31 (ప్రజా మంటలు)
ఎల్కతుర్తి మండలం వీరనారాయణపూర్ శివారులో విషాదం చోటుచేసుకుంది. పొలంలో నాటు వేస్తూ బీహార్ కు చెందిన ఓ వలస కార్మికుడు అకస్మాత్తుగా కుప్పకూలి మృతి చెందాడు. ఉపాధి కోసం తెలంగాణకు వచ్చి వ్యవసాయ పనుల్లో నిమగ్నమైన సదరు వ్యక్తి, శనివారం పనిలో ఉండగానే ప్రాణాలు విడిచినట్లు గ్రామస్తులు తెలిపారు.... గంజాయి స్మగ్లర్ల దాడిలో ఎక్సైజ్ కానిస్టేబుల్ సౌమ్య మృతి
ములుగు, ఫిబ్రవరి 01 (ప్రజా మంటలు):
గంజాయి స్మగ్లర్ల దాడిలో తీవ్రంగా గాయపడి నిమ్స్ ఆసుపత్రిలో చికిత్స పొందుతూ ఎక్సైజ్ కానిస్టేబుల్ సౌమ్య మృతి చెందడం పట్ల రాష్ట్ర మంత్రి దనసరి అనసూయ సీతక్క తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు.
విధి నిర్వహణలో ప్రాణాలు కోల్పోయిన సౌమ్యకు మంత్రి సీతక్క నివాళులు అర్పిస్తూ, ఆమె కుటుంబ... ధర్మపురి మున్సిపాలిటీ ఎన్నికలు: 15 వార్డుల అభ్యర్థుల పేర్ల ప్రకటన
ధర్మపురి, జనవరి 31 (ప్రజా మంటలు):ధర్మపురి మున్సిపాలిటీ ఎన్నికల్లో భాగంగా 15 వార్డులకు సంబంధించిన బిఆర్ఎస్ పార్టీ అభ్యర్థుల పేర్లను మాజీ మంత్రి కొప్పుల ఈశ్వర్ అధికారికంగా ప్రకటించారు. ఈ సందర్భంగా ప్రతి వార్డుకు ప్రత్యేకంగా ఇంచార్జీలను కూడా నియమించారు.
ఈ కార్యక్రమంలో మాట్లాడిన కొప్పుల ఈశ్వర్, ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వ... రేపు తెలంగాణ వ్యాప్తంగా బీఆర్‌ఎస్ శాంతియుత నిరసనలు: కేటీఆర్ పిలుపు
హైదరాబాద్, జనవరి 31 (ప్రజా మంటలు):
మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్‌ను సిట్ విచారణ పేరుతో ఉద్దేశపూర్వకంగా వేధిస్తున్నారని ఆరోపిస్తూ, రేపు తెలంగాణ రాష్ట్రవ్యాప్తంగా బీఆర్‌ఎస్ పార్టీ ఆధ్వర్యంలో శాంతియుత నిరసనలు చేపట్టనున్నట్లు పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ప్రకటించారు.
ఈ నిరసనలలో భాగంగా రాష్ట్రంలోని 12 వేలకుపైగా గ్రామాల్లో ప్రభుత్వ దిష్టిబొమ్మల దహనాలు నిర్వహించనున్నారు. అలాగే... PRTU–TS ఆధ్వర్యంలో టెట్ రద్దు కోసం చలో ఢిల్లీ - పోస్టర్ ఆవిష్కరణ
జగిత్యాల, జనవరి 31 (ప్రజా మంటలు):
ఎఐజాక్ట్ పిలుపు మేరకు, పీఆర్‌టీయూ–టీఎస్ జగిత్యాల జిల్లా శాఖ ఆధ్వర్యంలో టెట్ రద్దు మరియు సర్వీసులో ఉన్న ఉపాధ్యాయులకు టెట్ మినహాయింపు ఇవ్వాలనే డిమాండ్‌తో ఫిబ్రవరి 5న నిర్వహించనున్న “చలో ఢిల్లీ” కార్యక్రమానికి సంబంధించిన పోస్టర్‌ను ఆవిష్కరించారు.
ఈ పోస్టర్ ఆవిష్కరణ కార్యక్రమంలో జిల్లా శాఖ అధ్యక్షుడు బోయినిపెల్లి... పౌరహక్కుల దినోత్సవానికి పూర్తి స్థాయి అధికారులు గైర్హాజరు
గొల్లపల్లి, జనవరి 31 (ప్రజా మంటలు):
గొల్లపల్లి మండలంలోని మల్లన్నపేట్ గ్రామంలో శనివారం నిర్వహించిన పౌరహక్కుల దినోత్సవం కార్యక్రమానికి మండల స్థాయి పూర్తి అధికారుల హాజరు లేకపోవడం చర్చనీయాంశంగా మారింది. ప్రజాస్వామ్య విలువలు, పౌరుల హక్కులు–బాధ్యతలపై అవగాహన కల్పించాల్సిన కీలక అధికారులు హాజరు కాకపోవడంపై గ్రామ ప్రజలు అసంతృప్తి వ్యక్తం చేశారు.
పౌరహక్కుల దినోత్సవం వంటి... కేసీఆర్‌పై రాజకీయ వేధింపులకు నిరసనగా ఆందోళనలకు పిలుపు
జగిత్యాల, జనవరి 31 (ప్రజా మంటలు):
మాజీ ముఖ్యమంత్రి, భారత రాష్ట్ర సమితి అధినేత కల్వకుంట్ల చంద్రశేఖర్ రావు (కేసీఆర్) గారిని సిట్ విచారణకు పిలవడం పూర్తిగా కాంగ్రెస్ ప్రభుత్వం చేపట్టిన రాజకీయ కక్షసాధింపు చర్యేనని జగిత్యాల జిల్లా బిఆర్ఎస్ పార్టీ అధ్యక్షులు శ్రీ కల్వకుంట్ల విద్యాసాగర్ రావు తీవ్రంగా ఆగ్రహం వ్యక్తం చేశారు.
తెలంగాణ... ఘనంగా జంతు సంక్షేమ పక్షోత్సవంనిర్వహణ
జగిత్యాల జనవరి 31 ( ప్రజా మంటలు)జంతు సంక్షేమ పక్షోత్సవం కార్యక్రమం లో భాగంగా జెడ్ పి హెచ్ ఎస్ పాఠశాల పురానిపేట జగిత్యాల లో జరిగిన కార్యక్రమం అదనపు కలెక్టర్ రెవెన్యూ బి. ఎస్. లత గారు మరియు జిల్లా పశు వైద్య మరియు పశుసంవర్ధక శాఖ అధికారి డాక్టర్ బి.ప్రకాష్ పాల్గొన్నారు... రోడ్డు భద్రత ప్రతి ఒక్కరి బాధ్యత జిల్లా అదనపు ఎస్పీ శేషాద్రిని రెడ్డి
జగిత్యాల జనవరి 31 (ప్రజా మంటలు)లయన్స్ క్లబ్ ఆఫ్ జగిత్యాల, మరియు జగిత్యాల జిల్లా పోలీస్ శాఖ సంయుక్తంగా నిర్వహించిన రోడ్డు భద్రత మాసోత్సవాల ముగింపు రోజు సందర్భంగా స్థానిక ఆర్డిఓ ఆఫీస్ ముందర హెల్మెట్ పై అవగాహన సదస్సులు నిర్వహించడం జరిగింది.
రోడ్డు ప్రమాదాలను నివారించడo, ప్రజలలో ట్రాఫిక్ నియమాలపై అవగాహన కల్పించడo,ప్రజలు... జగిత్యాల బల్దియా పై కాంగ్రెస్ జండా ఎగరవేయాలి :: mlc వెంకట్
జగిత్యాల, జనవరి 31 (ప్రజా మంటలు):
జగిత్యాల పట్టణ మున్సిపల్ ఎన్నికల నేపథ్యంలో కాంగ్రెస్ పార్టీలో రాజకీయ వేడి ఒక్కసారిగా పెరిగింది. జగిత్యాల మోతే రోడ్డులోని కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో పట్టణ మున్సిపల్ కౌన్సిలర్ అభ్యర్థులు, ముఖ్య కార్యకర్తలతో కీలక సమావేశం నిర్వహించారు.
ఈ సమావేశంలో తెలంగాణ రాష్ట్ర PCC ఉపాధ్యక్షులు, ఎమ్మెల్సీ బలుమూరి వెంకట్... UGC కుల విచక్షణ నిరోధక రూల్స్ – అగ్రవర్ణ రాజకీయాల అసలు ముఖం
(ప్రత్యేక వ్యాసం)
పూర్వ నేపథ్యం – అమలు కాని న్యాయం
2012లో యూనివర్సిటీల్లో కుల ఆధారిత వివక్షను నిర్మూలించేందుకు UGC ప్రత్యేక రూల్స్ రూపొందించింది. కానీ అవి చట్టాలుగా ఉన్నా, ఆచరణలో అమలుకాకుండా అగ్రవర్ణాల ఒత్తిడితో మూలకు నెట్టబడ్డాయి. దళితులు, BC, ST విద్యార్థులపై అవమానాలు, వేధింపులు, అకృత్యాలు కొనసాగుతూనే ఉన్నాయి. ఇది ప్రభుత్వాలు, యూనివర్సిటీ... 