గ్రూప్-1 ప్రిలిమినరీ పరీక్షకు ఏర్పాట్లు పూర్తి.

On
గ్రూప్-1 ప్రిలిమినరీ పరీక్షకు ఏర్పాట్లు పూర్తి.

 

జూన్ 8 ( ప్రజా మంటలు)

తెలంగాణ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా ఆదివారం నిర్వహిస్తున్న గ్రూప్-1 ప్రిలిమినరీ పరీక్షకు ఏర్పాట్లు పూర్తి చేసినట్టు ఎస్ కె ఎన్ ఆర్ ప్రభుత్వ డిగ్రీ కళాశాల ప్రిన్సిపల్ , గ్రూప్-1 ప్రిలిమినరీ పరీక్ష చీఫ్ సూపరిండెంట్ అరిగెల అశోక్ తెలిపారు. జగిత్యాల జిల్లా కలెక్టర్ గారి ఆదేశాల మేరకు గ్రూప్-1 ప్రిలిమినరీ పరీక్షకు సంబంధించి పకడ్బందీగా ఏర్పాట్లు చేసినట్లు తెలిపారు.

పరీక్షకు సంబంధించి ఇన్విజిలేటర్లకు శిక్షణ తరగతులు శనివారం నిర్వహించారు ఎలాంటి సమస్యలు తలెత్తకుండా చూసుకోవాలని ఏవైనా సమస్యలు తలెత్తితే చర్యలు తప్పవని ఆదేశించారు. అభ్యర్థులు కూడా ఉదయం 10 గంటలకు గంట ముందుగానే సెంటర్ కి చేరుకోవాలని నిమిషం ఆలస్యమైనా పరీక్ష కేంద్రంలోకి అనుమతించేది లేదని పేర్కొన్నారు.

ఎటువంటి ఎలక్ట్రానిక్ మరియు నిషేధిత వస్తువులు పరీక్ష కేంద్రంలోకి అనుమతించేది లేదని, అభ్యర్థులు హాల్ టికెట్, ఐడి ప్రూఫ్, బ్లాక్ లేదా బ్లూ బాల్ పాయింట్ పెన్నులతో మాత్రమే పరీక్షకు హాజరవ్వాలని చీఫ్ సూపరిండెంట్ , కళాశాల ప్రిన్సిపల్ డాక్టర్ అరిగెల అశోక్ పేర్కొన్నారు.

ఈ సమావేశంలో అబ్జర్వర్ డాక్టర్ పడాల తిరుపతి, డిపార్ట్మెంట్ ఆఫీసర్ డాక్టర్ బోనగిరి నరేష్, ఇన్విజిలేటర్లు, ఆఫీస్ సిబ్బంది పాల్గొన్నారు.

Tags