నిజామాబాద్ ఎం పి ఎన్నికల్లో జగిత్యాల సెగ్మెంట్ లో కాంగ్రెస్ ఆధిక్యం

On
నిజామాబాద్ ఎం పి ఎన్నికల్లో జగిత్యాల సెగ్మెంట్ లో కాంగ్రెస్ ఆధిక్యం

నిజామాబాద్ ఎం పి ఎన్నికల్లో జగిత్యాల సెగ్మెంట్ లో కాంగ్రెస్ ఆధిక్యం

రెండవ స్థానంలో బిజేపి, మూడోస్థానంలో బి ఆర్ ఎస్

(సిరిసిల్ల రాజేందర్ శర్మ)  

జగిత్యాల జూన్ 04 ( ప్రజా మంటలు) : నిజామాబాద్ పార్లమెంట్ ఎన్నికల్లో, జగిత్యాల శాసన సభ నియోజకవర్గంలో  కాంగ్రెస్ పార్టీకి మెజార్టీ రాగా భారతీయ రాష్ట్ర సమితి మూడవ స్థానంలోకి వెళ్ళింది. నిజామాబాద్ నియోజకవర్గంలో విజయం సాధించిన బిజేపి అభ్యర్థి అరవీందహ ధర్మపురి కి 74,298 వోట్లు వచ్చాయి. ఎమ్మెల్సీ, మాజీ మంత్రి తాటిపర్తి జీవన రెడ్డికి 76,145 వోట్లు వచ్చాయి. గత శాసన సభ ఎన్నికల్లో విజయం సాధించిన బి ఆర్ ఎస్ కపార్టీకి ఈ ఎన్నికల్లో 16,194 వోట్లతో మూడవ స్థానంతో సరి పెట్టుకోవాల్సి వచ్చింది.

 

మొత్తం 15 రౌండలలో జరిగిన వోట్ల లెక్కింపులో కాంగ్రెస్ పార్టీ మొదటి నుండి ముందంజలో ఉండి. స్థానీకుడైన జీవన రెడ్డి తన ఆధిక్యాన్ని కాపాడుకోగా, స్థానిక ఎమ్మెల్యే స్థానాన్ని గెలుచుకొన్న బి ఆర్ ఎస్ ఆరునెలలోనే తన స్థానంలో అతి తక్కువ ఓట్లను తెచ్చుకోంది. జగిత్యాల మున్సిపల్ కౌన్సిల్ కూడా ఇటీవలే కాంగ్రెస్ చేతికి చేరడం, కౌన్సిలర్లలో ఎక్కువ మంది కన్నగరేశ్ పార్టీకి మద్దతు ఇవ్వడం జరిగినది.

 

ఆధిపత్యాన్ని నిలుపుకొన్న బిజేపి

గత శాసన సభ ఎన్నికల్లో ఒడిపోయినా, ఎన్నడూ లేనట్లుగా 42 వేల పై చిలుకు వోట్లు సంపాదించుకొన్న బిజేపి అభ్యర్థి బొగ శ్రావణి, పార్లమెంట్ ఎన్నికల్లో కూడా తన అధియాతయాన్ని నిలుపుకోంది. శాసన సభలో తన కు వచ్చిన వోట్ల కన్నా ఎక్కువగా, అంటే 74,298 వోట్లు సాధించింది. ఇందులో బి ఆర్ ఎస్ కు గతం లో వచ్చిన వోట్లు కూడా ఉండడం విశేషం. గతం శాసన సభ ఎన్నికల్లో బి ఆర్ ఎస్ కు పనిచేసిన చాలా మంది గ్రామా స్థాయి నుండి జిల్లా స్థాయి కార్యకర్తలు, నాయకులు బిజేపి అనుకూలంగా పనిచేసినట్లు చెప్పుకొంటున్నారు.

 

గత ఏన్నికల్లో సాధారణంగా జీవన రెడ్డికి మద్దతు ప్రకటించే మున్నూరు కాపు సంఘాల నాయకులు, ఈ సారి తమ వర్గానికి చెందిన బిజేపి అభ్యర్థి అరవీందహ ధర్మపురికి సహకరించినట్లు చెప్పుకొంటున్నారు.  గత పార్లమెంట్ ఎన్నికల్లో కూడా బి ఆర్ ఎస్ అభ్యర్థిగా పోటీ చేసిన కల్వకుంట్ల కవితకు కూడా జగిత్యాల నియోజకవర్గంలో ఆధిక్యం లభించలేదు. అప్పుడు కూడా శాసన సభ ఎన్నికల్లో బి ఆర్ ఎస్ గెలిచింది.

మారిన సమీకరణాల మధ్య త్వరలో జరగబోయే స్థానిక సంస్థల ఎన్నికల్లో బి ఆర్ ఎస్ పార్టీ తన పరువు కాపాడుకోవడానికి, ఉనికి కాపాడుకోవడానికి కాంగ్రెస్, బిజేపి లనుంది వచ్చే గట్టి పోటీని ఎదుర్కొనాల్సి ఉంది. కానీ స్నాధానిక యకత్వం అంతగా పట్టించుకోవడంలేదనే ప్రచారం కూడా పార్టీకి నష్టం కలిగిస్తుంది. ఇప్పటికే చాలామంది స్థానిక సంస్థల ప్రజా ప్రతినిధులు కాంగ్రెస్, బీజేపీ ల పంచన చేరడం brs కు నష్టమే 

 

 

Tags