అన్న ను గెలిపించుకున్న చెల్లి.
నేడే అసలైన రాఖీ పండగ. - జగిత్యాల బీజేపీ శ్రేణులు.
(సిరిసిల్ల. రాజా విక్రాంత్ శర్మ - 9963349493/9348422113):
జగిత్యాల జూన్ 04 (ప్రజా మంటలు) :
రాజకీయంగా నా అనుకున్న గత పార్టీ పెద్దలే తనను తీవ్ర ఇబ్బందులకు గురిచేస్తే తన ప్రాణాలు సైతం లక్ష్య పెట్టక ఊబి వంటి వారి కబంధ హస్తాల నుంచి పైకి ఎగిసి కమలంగా ఏర్పడి తన ప్రజాసేవా, అకుంఠితదీక్ష తో తనను చేరదీసిన పార్టీ నియోజకవర్గ స్థాయిలో నేటి లోక్ సభ ఎన్నికల ఫలితాల ద్వారా మరింత వికసించేలా చేసిన మహిళా శక్తి జగిత్యాల బిజెపి ఎంఎల్ఏ అభ్యర్థి డా. భోగ శ్రావణి అని నియోజకవర్గ బీజేపీ శ్రేణులు తనను కొనియాడారు.
సునిశిత శక్తితో తన పార్టీ శ్రేణులను అందరినీ కలుపుకుంటూ పోతూ నియోజక వర్గంలో బిజెపి పార్టీ యొక్క ప్రభంజనం మరింత పెరిగేలా చేయడంతో బిజెపి విజయ సాధన ముందుగా నిర్ణయం అయ్యింది అని బిజెపి శ్రేణులు గర్వంగా చెప్పుకుంటున్నారు.
అలాగే తనలో విశ్వాసం నింపి తనను నమ్మి బీజేపీలో కార్యవర్గ సభ్యురాలిగా, ఎంఎల్ఏ అభ్యర్థి గా ఎదగడంలో సహకరించిన తన దేవుడిచ్చిన అన్నయ్య ధర్మపురి అరవింద్ ఎంపీ గా గెలవడం కోసం జిల్లా నుండి నియోజకవర్గం స్థాయిలో గడప గడపకు తిరుగుతూ అహర్నిశలు కష్టపడ్డ విధానం తాలూకా నేటి విజయాన్ని చూసి గెలవడం మాత్రమే కాదు గెలిపించుకోవడంలో ఉంటుంది కాషాయ పొగరు అని నియోజకవర్గ బీజేపీ శ్రేణులు సంబరాలు చేసుకుంటూ నేటి లోక్ సభ ఎన్నికల ఫలితాల్లో గెలిచిన ధర్మపురి అరవింద్ కు వారి గెలుపుగా భావిస్తూ, ఈ విజయ గర్వంలో డా.భోగ శ్రావణి తో వారు ఉన్నందుకు ఈరోజే మాకు అసలైన రాఖీ పండగ అని అలాయ్ బలాయ్ లు చేసుకుంటున్నారు నియోజక వర్గ బిజెపి శ్రేణులు.
ఈ సందర్భంగా తనతో పాటు ఆర్వీంద్ అన్న గెలుపులో పాలు పంచుకున్న ప్రతీ ఒక్క కార్యకర్తకు తన ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారు డా. భోగ శ్రావణి.
More News...
<%- node_title %>
<%- node_title %>
రైతుల సంక్షేమానికి పీఏసీఎస్‌లు సమర్థవంతంగా పనిచేయాలి: ఎమ్మెల్యే డా. సంజయ్ కుమార్
రాయికల్, అక్టోబర్ 7 (ప్రజా మంటలు):
రైతుల సంక్షేమం కోసం ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘాలు (పీఏసీఎస్) మరింత సమర్థవంతంగా పనిచేయాలని జగిత్యాల ఎమ్మెల్యే డా. సంజయ్ కుమార్ సూచించారు.
రాయికల్ మండలం ఇటిక్యాల గ్రామంలో నిర్వహించిన ఇటిక్యాల పీఏసీఎస్ నూతన కార్యవర్గ ప్రమాణ స్వీకార కార్యక్రమానికి ఎమ్మెల్యే హాజరయ్యారు. నూతనంగా బాధ్యతలు స్వీకరించిన పీఏసీఎస్... కుటుంబ విలువలను కాపాడాల్సిన బాధ్యత మహిళలదే: మున్సిపల్ చైర్పర్సన్ వాణి శ్రీనివాస్
జగిత్యాల, అక్టోబర్ 07 (ప్రజా మంటలు):
కుటుంబ విలువలు, భారతీయ సంస్కృతి, సంప్రదాయాలను కాపాడుతూ భావితరాలకు అందించాల్సిన బాధ్యత మహిళలపై ఉందని జగిత్యాల మున్సిపల్ చైర్పర్సన్ సమిండ్ల వాణి శ్రీనివాస్ అన్నారు.
వాల్మీకి ఆవాసం సేవా భారతి ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న ఉచిత కుట్టు శిక్షణ కేంద్రంలో ఎనిమిదో బ్యాచ్ శిక్షణ పూర్తి చేసుకున్న మహిళలకు బుధవారం... జగిత్యాలలో వికసిత్ భారత్ సంకల్ప సభ
జగిత్యాల, అక్టోబర్ 7 (ప్రజా మంటలు):
బీజేపీ జగిత్యాల జిల్లా అధ్యక్షుడు రాచకొండ యాదగిరి బాబు ఆధ్వర్యంలో ‘సేవా సంకల్ప్ అభియాన్’లో భాగంగా బుధవారం జగిత్యాలలో వికసిత్ భారత్ సంకల్ప సభ, సేవా జ్యోతి పాదయాత్ర నిర్వహించారు.
ఎస్వీఎల్ఆర్ గార్డెన్లో జరిగిన సభలో ప్రధాని నరేంద్ర మోదీ ప్రసంగాన్ని నాయకులు, కార్యకర్తలు వీక్షించారు. అనంతరం గార్డెన్... జగిత్యాలకు మూడు జూనియర్ సివిల్ జడ్జి కోర్టులు
జగిత్యాల అక్టోబర్ 07 (ప్రజా మంటలు
జగిత్యాల జిల్లా కేంద్రానికి మూడు జూనియర్ సివిల్ జడ్జి కోర్టులను రాష్ట్ర ప్రభుత్వం మంజూరు చేయడంతో జగిత్యాల బార్ అసోసియేషన్ సభ్యులు ఎమ్మెల్యే డా. సంజయ్ కుమార్‌ను బుధవారం క్యాంపు కార్యాలయంలో కలిసి ధన్యవాదాలు తెలిపారు.
ఈ సందర్భంగా న్యాయవాదులు మాట్లాడుతూ.. మూడు జూనియర్ సివిల్ జడ్జి కోర్టుల... జగిత్యాల మెడికల్ కాలేజీ .విద్యార్థుల ఆందోళన
మౌలిక వసతుల కల్పనలో జాప్యం, ఎన్ఎంసీ నిబంధనల ఉల్లంఘనపై నిరసన
జగిత్యాల, అక్టోబర్ 7 (ప్రజా మంటలు):
జగిత్యాల ప్రభుత్వ వైద్య కళాశాల (జీఎంసీ)లో మౌలిక వసతుల కల్పనలో తీవ్ర జాప్యం, విద్యార్థులకు అవసరమైన సౌకర్యాల కొరత, జాతీయ వైద్య కమిషన్ (ఎన్ఎంసీ) నిబంధనల అమలులో లోపాలను నిరసిస్తూ వైద్య విద్యార్థులు బుధవారం నుంచి నిరవధిక... ఎర్రవల్లి భూములపై వెంటనే సర్వే నోటిఫికేషన్: సీఎం రేవంత్ రెడ్డి
సిద్దిపేట, అక్టోబర్ 6: (ప్రజా మంటలు)
సిద్దిపేట జిల్లా మర్కూక్ మండలం ఎర్రవల్లి, శివారు వెంకటాపురం గ్రామాల పరిధిలో రికార్డుల్లో ఉన్నా ఆచూకీ లభించని 45 ఎకరాల భూములను గుర్తించేందుకు వెంటనే సర్వే నోటిఫికేషన్ జారీ చేయాలని ముఖ్యమంత్రి ఎ. రేవంత్ రెడ్డి అధికారులను ఆదేశించారు.
గత నెల 16న శాసనసభలో జరిగిన చర్చ... గాంధీ ఆస్పత్రిలొ వైద్య విద్యార్థులకు ‘యాప్రాన్’ ప్రదానం
సికింద్రాబాద్, అక్టోబర్ 06 (ప్రజా మంటలు):
వైద్య విద్యలోకి అడుగుపెట్టిన విద్యార్థులకు తెల్ల కోటు (యాప్రాన్) స్వచ్ఛతతో కూడిన నిస్వార్థ సేవకు నిదర్శనంగా నిలుస్తుందని గాంధీ వైద్య కళాశాల ప్రిన్సిపల్ డాక్టర్ ఇందిర పేర్కొన్నారు. మంగళవారం గాంధీ మెడికల్ కళాశాల ఆడిటోరియంలో 2026–27 విద్యా సంవత్సరంలో మొదటి సంవత్సరంలోకి ప్రవేశించిన నూతన ఎంబీబీఎస్ విద్యార్థులకు వైట్... అక్రమ ఆస్తులను ప్రశ్నించినందుకే కక్షసాధింపు చర్యలు : బీఆర్ఎస్ నేత మన్నె క్రిశాంక్ ధ్వజం
సికింద్రాబాద్, అక్టోబర్ 06 (ప్రజా మంటలు):
ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి కుమార్తె, అల్లుడికి చెందిన రూ.13,200 కోట్ల విలువైన ఆస్తుల వాటాలను బట్టబయలు చేసినందుకే ప్రభుత్వం తనపై కక్షపూరితంగా అక్రమ కేసులు బనాయించిందని బీఆర్ఎస్ పార్టీ అధికార ప్రతినిధి మన్నె క్రిశాంక్ తీవ్రస్థాయిలో మండిపడ్డారు. మంగళవారం ఆయన నివాసంలో గోపాలపురం పోలీసులు క్రిశాంక్‌ను అదుపులోకి తీసుకున్నారు.ఈ... కోరుట్లలో రోడ్డు ప్రమాదం.. 10 మంది విద్యార్థులకు గాయాలు
కోరుట్ల అక్టొబర్ 06 (ప్రజా మంటలు):
జగిత్యాల జిల్లా కోరుట్ల పట్టణ శివారులోని వేములవాడ రోడ్డుపై మంగళవారం రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. శ్రీ చైతన్య పాఠశాల విద్యార్థులతో వెళ్తున్న టాటా ఏస్ మ్యాజిక్ వాహనాన్ని ఆర్టీసీ బస్సు ఢీకొట్టింది.
ఈ ప్రమాదంలో వాహనంలో ఉన్న 10 మంది విద్యార్థులు గాయపడినట్లు సమాచారం. ప్రమాదాన్ని గమనించిన స్థానికులు... ప్రముఖ కవి రఘువర్మ కన్నుమూత
.జగిత్యాల, అక్టోబర్ 6 (ప్రజా మంటలు):
ప్రముఖ కవి, అనువాదకుడు, సాహితీవేత్త డాక్టర్ తుమ్మనపల్లి లక్ష్మీనారాయణ (రఘువర్మ) మంగళవారం సాయంత్రం జగిత్యాలలో గుండెపోటుతో కన్నుమూశారు. ఆయన మృతి తెలుగు సాహిత్య లోకానికి, ముఖ్యంగా సంస్కృత సాహిత్యాన్ని తెలుగులోకి పరిచయం చేసిన అనువాద రంగానికి తీరని లోటుగా సాహితీవేత్తలు పేర్కొన్నారు.
‘రఘువర్మ’ కలం పేరుతో... విద్యుత్ ‘ట్రూ అప్’ చార్జీల భారాన్ని ప్రభుత్వమే భరించాలి: జీవన్‌రెడ్డి
జగిత్యాల, అక్టోబర్ 6 (ప్రజా మంటలు):
ప్రతికూల వాతావరణ పరిస్థితులు, విద్యుత్ ఉత్పత్తి కేంద్రాల్లో సాంకేతిక సమస్యల కారణంగా ఏర్పడిన ‘ట్రూ అప్ చార్జీల’ భారాన్ని వినియోగదారులపై మోపకుండా రాష్ట్ర ప్రభుత్వమే భరించాలని బీఆర్ఎస్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి, మాజీ మంత్రి టి. జీవన్‌రెడ్డి కోరారు.
ఈ మేరకు సీఎం రేవంత్‌రెడ్డికి ఆయన లేఖ రాశారు.... సిరిసిల్లలో తప్పు కంటికి ఆపరేషన్‌పై టీజీహెచ్ఆర్సీ సుమోటో
హైదరాబాద్, అక్టోబర్ 06 (ప్రజా మంటలు): .
రాజన్న సిరిసిల్ల జిల్లాలో ఓ వృద్ధురాలికి చేయాల్సిన కంటికి బదులుగా మరో కంటికి శస్త్రచికిత్స చేసినట్లు వచ్చిన వార్తలపై తెలంగాణ మానవ హక్కుల కమిషన్ (టీజీహెచ్ఆర్సీ) సుమోటోగా కేసు స్వీకరించింది
సిరిసిల్లకు చెందిన కొమ్ము వెంకమ్మకు ఎడమ కంటికి బదులుగా కుడి కంటికి ఆపరేషన్ చేసినట్లు... 