తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు ఉద్యమ అమర వీరుల త్యాగఫలం - జిల్లా కలెక్టర్ యస్మిన్ భాష
తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు ఉద్యమ అమర వీరుల త్యాగఫలం జగిత్యాలలో ఘనంగా రాష్ట్రావిర్భవ వేడుకలు జిల్లా కలెక్టర్ యస్మిన్ భాష
తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు ఉద్యమ అమర వీరుల త్యాగఫలం
- జగిత్యాలలో ఘనంగా రాష్ట్రావిర్భవ వేడుకలు
- జిల్లా కలెక్టర్ యస్మిన్ భాష
జగిత్యాల జూన్ 02 : తెలంగాణ రాష్ట్రం ఏర్పడి నేటితో పదేండ్లు నిండాయి. స్వరాష్ట్ర సాధన పోరాటంలో అసువులు బాసిన అమర వీరులకు ఘనంగా నివాళులు అర్పిస్స్తూ, ఎందరెందరో అమర వీరుల త్యాగాల పునాదుల మీద ఏర్పడిన తెలంగాణ రాష్ట్రం ఈ రోజు అన్ని రంగాల్లో అగ్రగామిగా నిలుస్తుందని, ఈ సందర్భంగా అమరుల కుటుంబాలకు, ఉద్యమ కారులకు, స్వరాష్ట్ర సాధన పోరాటంలో పాలుపంచుకున్న చిన్నా పెద్దలందరికీ.. పేరుపేరునా నమస్కారాలు తెలుపుకొంటున్నాని జిల్లా కలెక్టర్ యస్మిన్ భాష అన్నారు.
ఇంకా, తెలంగాణ రాష్ట్రం గొప్ప చరిత్ర, సాంప్రదాయ కళలు మరియు విభిన్నమైన వంటకాలకు ప్రసిద్ధి చెందింది.తెలంగాణలో అనేక చారిత్రక ప్రదేశాలు మరియు స్మారక చిహ్నాలు కూడా ఎన్నో ఉన్నాయి.
తెలంగాణలో విభిన్న జనాభా కలిగియుండి, వివిధ వర్గాలు మరియు వివిధ ప్రాంతాల ప్రజలు సామరస్యంతో జీవిస్తున్నరాణి, తెలంగాణ అవతరణ దినోత్సవం సందర్భంగా, రాష్ట్ర గొప్పతనం, వారసత్వం, చరిత్ర మరియు రాష్ట్ర గుర్తింపును జరుపుకోవడానికి, రాష్ట్రవ్యాప్తంగా వివిధ సాంస్కృతిక కార్యక్రమాలు నిర్వహించుకుంటున్నామనీ కలెక్టర్ యస్మిన్ భాషా అన్నారు.
కొత్త ప్రభుత్వం ఏర్పడిన తరువాత ప్రతివారంలో రెండు రోజులు ప్రజలు తమ సమస్యలను నేరుగా అధికారులకు చెప్పుకునే అవకాశం కల్పించామని, వచ్చిన ప్రతి దరఖాస్తును సమగ్రంగా పరిశీలించి, సంబంధిత అధికారులకు పంపించి, సత్వర పరిష్కారం కోసం అవసరమైన చర్యలు తీసుకుంటున్నామనీ, మహిళల సంక్షేమం మరియు ఆర్థికంగా, సామాజికంగా అభివృద్ధి పరచడానికి పెద్దపీట వేసి వారిని ముందుకు తీసుకువెళ్తున్నామని, ఈ కార్యక్రమంలో భాగంగా 1,22,000 పిల్లల ఏకరూప దుస్తులు కుట్టించే పనులను స్వయం సహాయక గ్రూప్ మహిళలకు అందజేస్తూ, మహిళా స్వశక్తికరణకు బాటలు వేస్తున్నామని తెలిపారు.
ప్రభుత్వ పాఠశాలలను ఆదర్శ పాఠశాలలుగా తీర్చిదిద్దేందుకు వినూత్న కార్యక్రమాన్ని ప్రారంభించుకోవడం జరిగింది. అన్ని పాఠశాలల్లో అమ్మ ఆదర్శ పాఠశాలల కమిటీలు ఏర్పాటు చేయడం జరిగింది. జూన్ లో పాఠశాలల ప్రారంభానికి ముందే జిల్లాలో నోట్ బుక్స్, టెక్స్ట్ బుక్స్, యునిఫార్మ్ పంపిణి చేయడం జరుగుతుంది. పాఠశాలల్లో అవసరమైన పనులన్నీ గ్రామాల్లో నిర్వహించడం జరుగుతుంది. ఇందులో భాగంగా అమ్మ ఆదర్శ పాఠశాలల కార్యక్రమం కింద జిల్లాలో 591 పాఠశాలల్లో విద్యుత్ సరఫరా, త్రాగునీరు, చిన్న, పెద్ద మరమ్మతులు, టాయిలెట్స్ ఏర్పాటు చేయడం జరుగుతున్నది. తెలంగాణ రైతులు దేశానికే ఆదర్శంగా ఉండాలనే లక్ష్యంతో రైతుల సంక్షేమం, వ్యవసాయ అభివృద్ధి కోసం ఆర్థికంగా బలపరుస్తూ రైతుల సమస్యలను పరిష్కరించడానికి రైతు వేదికల నుండి వీడియో కాన్ఫరెన్స్
ద్వారా రైతులు నేరుగా రాష్ట్ర అధికారులతో మరియు వ్యవసాయ నిపుణులతో మాట్లాడే అవకాశం కల్పించామని తెలీపారు.
యువతకు ఉపాధి, ఉద్యోగ అవకాశాలు కల్పించడానికి జిల్లాలో అవసరమైన శిక్షణా కార్యక్రమాలు నిర్వహించడం జరుగుతుంది. శాంతి భద్రతలకు కృషి చేస్తున్న గౌరవ జిల్లా న్యాయమూర్తులకు, జిల్లా ఎస్.పి మరియు పోలిస్ యంత్రాంగానికి, జగిత్యాల జిల్లా ప్రజలకు, రాష్ట్ర సాధనలో భాగస్వామ్యమైన ఉద్యోగ, ఉపాధ్యాయ, కార్మిక, కర్షక, మేధావులు, కవులు, కళాకారులు, విద్యార్థులు, యువత, మహిళలు మరియు జర్నలిస్టులు, ప్రింట్ అండ్ ఎలక్ట్రానిక్ మీడియా వివిధ వర్గాల వారికి మరోసారి తెలంగాణ రాష్ట్ర అవతరణ దినోత్సవ నా హృదయపూర్వక శుభాకాంక్షలు చెబుతూ, అభినందనలు తెలిపారు.
More News...
<%- node_title %>
<%- node_title %>
జగిత్యాల రాజకీయాల్లో జీవన్ రెడ్డి కొత్త సంకేతాలు : అధిష్ఠానం మాట వినని జీవన్ రెడ్డి
బీఆర్‌ఎస్/ బీజేపీ లోకి వెళితే పరిస్థితి?
రాజకీయ భవిష్యత్తుపై అనిశ్చితి
జగిత్యాల మార్చ్ 16 (ప్రజా మంటలు):
జగిత్యాల రాజకీయాల్లో నాలుగు దశాబ్దాలకుపైగా కాంగ్రెస్ పార్టీకి అంకితమై పనిచేసిన మాజీ మంత్రి తాటిపర్తి జీవన్ రెడ్డి రాజకీయ భవిష్యత్తుపై ఇప్పుడు కొత్త చర్చ మొదలైంది. ఆయన ఇంటి ముందు గతంలో ఏర్పాటు చేసిన కాంగ్రెస్ జాతీయ,... ఫీజు రియంబర్స్మెంట్ బకాయిలను వెంటనే విడుదల చేయాలి
జగిత్యాల డిసెంబర్ 16 (ప్రజా మంటలు)గత నాలుగేళ్లుగా రాష్ట్ర ప్రభుత్వం పెండింగ్లో ఉంచిన డిగ్రీ కళాశాల విద్యార్థుల ఫీజు రియంబర్స్మెంట్ నిధులను వెంటనే విడుదల చేయాలని కోరుతూ జగిత్యాల పట్టణంలోని వివిధ డిగ్రీ కళాశాలకు చెందిన అధ్యాపక మరియు అధ్యాపకేతర సిబ్బంది సోమవారం రోజున జిల్లా కలెక్టరేట్లో జరిగిన ప్రజావాణి కార్యక్రమంలో వినతి పత్రం... కొడిమ్యాల మండలంలో మళ్లీ పెద్దపులి దాడి – రెండో రోజు మరో ఆవు బలి, భయాందోళనలో గ్రామస్తులు
కొడిమ్యాల, మార్చి 16 (ప్రజా మంటలు):
జగిత్యాల జిల్లా కొడిమ్యాల మండలంలోని గంగారం తండాలో మళ్లీ పెద్దపులి దాడి జరగడంతో గ్రామస్తుల్లో తీవ్ర ఆందోళన నెలకొంది. వరుసగా రెండో రోజు పులి దాడి చేసి మరో ఆవును చంపింది.గ్రామానికి చెందిన రైతు తేజావాద్ మోతీలాల్‌కు చెందిన ఆవుపై సోమవారం పెద్దపులి దాడి చేసి చంపింది.... రాష్ట్రస్థాయి బాస్కెట్‌బాల్ పోటీలకు మౌంట్ కార్మెల్ హైస్కూల్ విద్యార్థిని జి.శివాణి ఎంపిక
జగిత్యాల మార్చి 16(ప్రజా మంటలు)ఈ నెల 20 నుండి 22 వరకు హైదరాబాద్ వాక్సన్ యూనివర్శిటీ లో జరగనున్న రాష్ట్రస్థాయి జూనియర్స్ బాస్కెట్‌బాల్ పోటీలకి జగిత్యాల ధరూర్ లోని మౌంట్ కార్మెల్ హైస్కూల్ కి చెందిన జి.శివాణిఎంపిక కావడము జరిగింది.
ఈ సందర్భంగా విద్యార్థినిని పాఠశాల *ప్రధానోపాధ్యాయురాలు సిస్టర్ జ్యోతిస్మరియ, సిస్టర్స్ రెజిన,లిల్లీ,రాణి, వ్యాయామ... హైడ్రా కమిషనర్ రంగనాథ్‌పై కవిత ఆగ్రహం – డిఫమేషన్ కేసు వేస్తా, మూసీ ప్రక్షాళనపై తీవ్ర విమర్శలు
.“హైడ్రాపై కవిత తీవ్ర ఆరోపణలు: పేదల ఇళ్లు కూల్చి పెద్దలను కాపాడుతున్నారా?”“మూసీ ప్రక్షాళనలో 1400 కోట్లు ఎలా పెరిగాయి? ప్రభుత్వం సమాధానం చెప్పాలి: కవిత”“హైడ్రా వీడియోలు వెంటనే తొలగించాలి.. లేదంటే కోర్టు!” – రంగనాథ్‌కు కవిత హెచ్చరిక“మూసీ ప్రక్షాళన పేరుతో ప్రజాధనం దోపిడీ జరుగుతోంది: కవిత సంచలన వ్యాఖ్యలు”
వెలుగుమట్ల... బీసీ ఎస్సీ ఎస్టీ జేఏసీ ,ధర్మసమాజ్ పార్టీ సంయుక్త ఆధ్వర్యంలో కాన్సిరాం మహారాజ్ 92వ జయంతి ఉత్సవాలు
జగిత్యాల మార్చి 15) ప్రజా మంటలు) జిల్లా దేవిశ్రీ గార్డెన్ లో నిర్వహించడం జరిగింది .కాన్షిరం కలలు కన్నా రాజ్యాన్ని తెలంగాణ గడ్డపై డాక్టర్ విశారదన్ మహరాజ్ నాయకత్వంలో సాధించి ఆయనకి ఘన నివాళులు అర్పిస్తాం అని తెలియజేయడం జరిగింది.
ఈ కార్యక్రమం లో జిల్లా అధ్యక్షుడు మానల కిషన్, ఇంచార్జి దువ్వక శివ మహారాజ్,... ఘనంగా శ్రీ వెంకటేశ్వర స్వామి కళ్యాణ వేడుకలు
జగిత్యాల మార్చి 15 ( ప్రజా మంటలు)జిల్లా కేంద్రం కూరగాయల మార్కెట్ లోని,,శ్రీ శ్రీనివాస, ఆంజనేయ,భవాని, శంకర, దేవాలయంలో, ప్రతి మాసం, వెంకటేశ్వర స్వామి జన్మ నక్షత్రమైన శ్రవణా నక్షత్రం పురస్కరించుకొని, శ్రీదేవి,భూదేవి,సమేత శ్రీ శ్రీనివాసుని కళ్యాణం ఘనంగా జరిగింది.
ప్రతి శనివారం ఉదయం 8 గంటల నుండి 9 గంటల వరకు సత్సంగం... జిల్లా కేంద్రంలో ఇంటర్మీడియట్ మూల్యాంకనం ప్రారంభం
జగిత్యాల మార్చి 14 (ప్రజా మంటలు)జిల్లా కేంద్రంలోని ఎస్ కె ఎన్ ఆర్ ప్రభుత్వ జూనియర్ కళాశాల లో 15 .03.2026 ఆదివారం నుండి మొదటి విడత మూల్యాంకనము ప్రారంభమవుతుందని క్యాంప్ ఆఫీసర్ బి నారాయణ తెలిపారు
మొదటి విడతలో ఆంగ్లము,తెలుగు, హిందీ, గణితము మరియు రాజనీతి శాస్త్రము (సివిక్స్) మొదలైన సబ్జెక్టులలో మూల్యాంకనము... సోనం వాంగ్చుక్‌పై ఎన్‌ఎస్‌ఏ కేసు ఉపసంహరణ… విడుదలకు మార్గం సుగమం
న్యూ ఢిల్లీ మార్చి 14 (ప్రజా మంటలు):
లడాఖ్ ప్రాంతానికి చెందిన ప్రముఖ విద్యావేత్త, పర్యావరణ ఉద్యమకారుడు సోనం వాంగ్చుక్‌పై నమోదైన ఎన్‌ఎస్‌ఏ కేసును ప్రభుత్వం ఉపసంహరించుకోవడంతో ఆయన విడుదలకు మార్గం సుగమమైంది. ఈ కేసుకు సంబంధించిన తదుపరి విచారణ ఈ నెల 17వ తేదీన జరగాల్సి ఉండగా, దానికి ముందుగానే కేసు ఉపసంహరణ నిర్ణయం... ఘనంగా కల్వకుంట్ల కవిత జన్మదిన వేడుకలు - గోధుమలతో భారీ చిత్రం, డాక్యుమెంటరీ విడుదల
హైదరాబాద్ మార్చి 13 (ప్రజా మంటలు):
తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు కల్వకుంట్ల కవిత జన్మదిన వేడుకలు హైదరాబాద్‌లో ఘనంగా నిర్వహించారు. అర్ధరాత్రి తర్వాత తెలంగాణ జాగృతి నాయకులు కేక్ కట్ చేసి వేడుకలను ప్రారంభించారు.
శుక్రవారం ఉదయం వేద పండితులు ఆశీర్వాదాలు అందించగా, బంజారా పూజారులు సంప్రదాయ విధానంలో దీవించారు. జాగృతి నాయకులు, కార్యకర్తలు, అభిమానులు... క్రీడలు మానసిక ఉల్లాసం శారీరక దారుఢ్యం పెంపొందిస్తాయి- ఎమ్మెల్యే డా సంజయ్ కుమార్
జగిత్యాల మార్చి 12(ప్రజా మంటలు)క్రీడలు మానసిక ఉల్లాసానికి శారీరక దారుఢ్యాన్ని పెంపొందిస్తాయని ఎమ్మెల్యే డా సంజయ్ కుమార్ అన్నారు.పట్టణ వివేకానంద మినీ స్టేడియంలో తెలంగాణ యూత్ స్పోర్ట్స్ అథారిటీ వారి ఆద్వర్యం లో అంతర్జాతీయ మహిళా దినోత్సవం సందర్భంగా అస్మిత ఖేలో ఇండియా కార్యక్రమం లో భాగంగా జిల్లా స్తాయి అస్మిత లీగ్... జగిత్యాల ఎమ్మెల్యే సంజయ్ కుమార్ ను కలిసిన వీరశైవ సమాజం నూతన కార్యవర్గం
జగిత్యాల మార్చి 12 (ప్రజా మంటలు)ఎమ్మెల్యే సంజయ్ కుమార్ని కలిసిన జగిత్యాల పట్టణ వీర శైవ సమాజం నూతన కార్యవర్గ సభ్యులు.జగిత్యాల పట్టణ వీరశైవసమాజం నూతనంగా ఎన్నికైన కార్యవర్గం ప్రమాణస్వీకారానికి ఎమ్మెల్యే సంజయ్ కుమార్ ని కార్యవర్గ ప్రమాణ స్వీకారానికి ఆహ్వానించారు.ఈ సందర్భంగా నూతన కార్యవర్గ సభ్యులకు శుభాకాంక్షలు తెలిపి అభినందించారు. 