తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు ఉద్యమ అమర వీరుల త్యాగఫలం   - జిల్లా కలెక్టర్ యస్మిన్ భాష  

On
తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు ఉద్యమ అమర వీరుల త్యాగఫలం   - జిల్లా కలెక్టర్ యస్మిన్ భాష  

తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు ఉద్యమ అమర వీరుల త్యాగఫలం    జగిత్యాలలో ఘనంగా రాష్ట్రావిర్భవ వేడుకలు జిల్లా కలెక్టర్ యస్మిన్ భాష  

తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు ఉద్యమ అమర వీరుల త్యాగఫలం 

 - జగిత్యాలలో ఘనంగా రాష్ట్రావిర్భవ వేడుకలు

- జిల్లా కలెక్టర్ యస్మిన్ భాష  

జగిత్యాల జూన్ 02  : తెలంగాణ రాష్ట్రం ఏర్పడి నేటితో పదేండ్లు నిండాయి. స్వరాష్ట్ర సాధన పోరాటంలో అసువులు బాసిన అమర వీరులకు ఘనంగా నివాళులు అర్పిస్స్తూ, ఎందరెందరో అమర వీరుల త్యాగాల పునాదుల మీద ఏర్పడిన తెలంగాణ రాష్ట్రం ఈ రోజు అన్ని రంగాల్లో అగ్రగామిగా నిలుస్తుందని, ఈ సందర్భంగా అమరుల కుటుంబాలకు, ఉద్యమ కారులకు, స్వరాష్ట్ర సాధన పోరాటంలో పాలుపంచుకున్న చిన్నా పెద్దలందరికీ.. పేరుపేరునా నమస్కారాలు తెలుపుకొంటున్నాని జిల్లా కలెక్టర్ యస్మిన్ భాష అన్నారు. 

ఇంకా, తెలంగాణ రాష్ట్రం గొప్ప చరిత్ర, సాంప్రదాయ కళలు మరియు విభిన్నమైన వంటకాలకు ప్రసిద్ధి చెందింది.తెలంగాణలో అనేక చారిత్రక ప్రదేశాలు మరియు స్మారక చిహ్నాలు కూడా ఎన్నో ఉన్నాయి. 
తెలంగాణలో విభిన్న జనాభా కలిగియుండి, వివిధ వర్గాలు మరియు వివిధ ప్రాంతాల ప్రజలు సామరస్యంతో జీవిస్తున్నరాణి, తెలంగాణ అవతరణ దినోత్సవం సందర్భంగా, రాష్ట్ర గొప్పతనం, వారసత్వం, చరిత్ర మరియు రాష్ట్ర గుర్తింపును జరుపుకోవడానికి, రాష్ట్రవ్యాప్తంగా వివిధ సాంస్కృతిక కార్యక్రమాలు నిర్వహించుకుంటున్నామనీ కలెక్టర్ యస్మిన్ భాషా అన్నారు. 
కొత్త ప్రభుత్వం ఏర్పడిన తరువాత ప్రతివారంలో రెండు రోజులు ప్రజలు తమ సమస్యలను నేరుగా అధికారులకు చెప్పుకునే అవకాశం కల్పించామని, వచ్చిన ప్రతి దరఖాస్తును సమగ్రంగా పరిశీలించి, సంబంధిత అధికారులకు పంపించి, సత్వర పరిష్కారం కోసం అవసరమైన చర్యలు తీసుకుంటున్నామనీ, మహిళల సంక్షేమం మరియు ఆర్థికంగా, సామాజికంగా అభివృద్ధి పరచడానికి పెద్దపీట వేసి వారిని ముందుకు తీసుకువెళ్తున్నామని, ఈ కార్యక్రమంలో భాగంగా 1,22,000 పిల్లల ఏకరూప దుస్తులు కుట్టించే పనులను స్వయం సహాయక గ్రూప్  మహిళలకు అందజేస్తూ, మహిళా స్వశక్తికరణకు బాటలు వేస్తున్నామని తెలిపారు. 

ప్రభుత్వ పాఠశాలలను ఆదర్శ పాఠశాలలుగా తీర్చిదిద్దేందుకు వినూత్న కార్యక్రమాన్ని ప్రారంభించుకోవడం జరిగింది. అన్ని పాఠశాలల్లో అమ్మ ఆదర్శ పాఠశాలల కమిటీలు ఏర్పాటు చేయడం జరిగింది. జూన్ లో పాఠశాలల ప్రారంభానికి ముందే జిల్లాలో నోట్ బుక్స్, టెక్స్ట్ బుక్స్, యునిఫార్మ్ పంపిణి చేయడం జరుగుతుంది. పాఠశాలల్లో అవసరమైన పనులన్నీ గ్రామాల్లో నిర్వహించడం జరుగుతుంది. ఇందులో భాగంగా అమ్మ ఆదర్శ పాఠశాలల కార్యక్రమం కింద జిల్లాలో 591 పాఠశాలల్లో విద్యుత్ సరఫరా, త్రాగునీరు, చిన్న, పెద్ద మరమ్మతులు, టాయిలెట్స్ ఏర్పాటు చేయడం జరుగుతున్నది. తెలంగాణ రైతులు దేశానికే ఆదర్శంగా ఉండాలనే లక్ష్యంతో రైతుల సంక్షేమం, వ్యవసాయ అభివృద్ధి కోసం ఆర్థికంగా బలపరుస్తూ రైతుల సమస్యలను పరిష్కరించడానికి రైతు వేదికల నుండి వీడియో కాన్ఫరెన్స్ 
ద్వారా రైతులు నేరుగా రాష్ట్ర అధికారులతో మరియు వ్యవసాయ నిపుణులతో మాట్లాడే అవకాశం కల్పించామని తెలీపారు. 

యువతకు ఉపాధి, ఉద్యోగ అవకాశాలు కల్పించడానికి జిల్లాలో అవసరమైన శిక్షణా కార్యక్రమాలు నిర్వహించడం జరుగుతుంది. శాంతి భద్రతలకు కృషి చేస్తున్న గౌరవ జిల్లా న్యాయమూర్తులకు, జిల్లా ఎస్.పి మరియు పోలిస్ యంత్రాంగానికి, జగిత్యాల జిల్లా ప్రజలకు, రాష్ట్ర సాధనలో భాగస్వామ్యమైన ఉద్యోగ, ఉపాధ్యాయ, కార్మిక, కర్షక, మేధావులు, కవులు, కళాకారులు, విద్యార్థులు, యువత, మహిళలు మరియు జర్నలిస్టులు, ప్రింట్ అండ్ ఎలక్ట్రానిక్ మీడియా వివిధ వర్గాల వారికి మరోసారి తెలంగాణ రాష్ట్ర అవతరణ దినోత్సవ నా హృదయపూర్వక శుభాకాంక్షలు చెబుతూ, అభినందనలు తెలిపారు.

Tags