జిల్లా ప్రధాన వైద్యశాల లో విద్యుత్ సరఫరాను పరిశీలించిన ఎస్.ఈ.సత్యనారాయణ మరియు విద్యుత్ సిబ్బంది.

On
జిల్లా ప్రధాన వైద్యశాల లో విద్యుత్ సరఫరాను పరిశీలించిన ఎస్.ఈ.సత్యనారాయణ మరియు విద్యుత్ సిబ్బంది.

(సిరిసిల్ల. రాజా విక్రాంత్ శర్మ - 9963339493/9348422113) : 

 

జగిత్యాల మే 23 (ప్రజా మంటలు) : 

గురువారం జి.సత్యనారాయణ, ఎస్ ఈ, జగిత్యాల, జిల్లా హెడ్ క్వార్టర్ లోని జిల్లా ప్రధాన వైద్యశాల లోని విద్యుత్ సరఫరా చేస్తున్న 2 సర్వీస్ లను మరియు అత్యవసర సమయంలో విద్యుత్ సరఫరా కొరకు ఏర్పాటు చేసిన 3 జనరేటర్ లు, రెండు 125 కే వి ఏ సామర్థ్యం మరియు ఒకటి 10 కే వి ఏ సామర్థ్యం కలిగినవి ఆన్ చేయించి అన్ని కూడా సక్రమంగా పనిచేస్తున్నాయని నిర్దారణ చేశారు.

విద్యుత్ సరఫరా విషయంలో రోగులకు ఏలాంటి ఇబ్బందులు ఉండవని తెలిపారు.

అలాగే జగిత్యాల జిల్లాలో కల వేరొక మాత శిశు ఆరోగ్యం కేంద్రం లో కల హై వాల్యూ సర్వీస్ మీటర్ ను మరియు 125 కే వి ఏ సామర్థ్యం కల జనరేటర్ పని చేస్తున్న విధానాన్ని కూడా పరిశీలన చేశారు.

అలాగే జిల్లాలో కల విద్యుత్ అధికారులు అందరూ కూడా ప్రాథమిక ఆరోగ్యం కేంద్రాలను పరిశీలించి,విద్యుత్ సరఫరా నిరంతరాయముగా అందచేసి ప్రజల మన్నలను పొందాలని ఆదేశించారు.

నేటి ఇన్స్పెక్షన్ కార్యక్రమం లో శ్రీ రాజి రెడ్డి, డి ఈ, జగిత్యాల,న

గేష్ కుమార్, ఏ డి ఈ, టెక్నికల్,రహీం, ఏ ఈ, టౌన్ -3, జగిత్యాల, ఆరోగ్య కేంద్ర విద్యుత్ సరఫరా ఎలక్ట్రీషియన్ మరియు విద్యుత్ సిబ్బంది పాల్గొన్నారు.

Tags