పలు మండలాల్లో బిఆర్ఎస్ ఎంపీ అభ్యర్థికి మద్దతుగా జెడ్పి చైర్ పర్సన్ దావ వసంత ప్రచారం

On
పలు మండలాల్లో బిఆర్ఎస్ ఎంపీ అభ్యర్థికి మద్దతుగా జెడ్పి చైర్ పర్సన్ దావ వసంత ప్రచారం

(సిరిసిల్ల. రాజా విక్రాంత్ శర్మ - 9963349493/9348422113).

 

జగిత్యాల ఏప్రిల్ 28 (ప్రజా మంటలు)

రూరల్ మండలములోని జాబితపూర్,లక్ష్మీపూర్ గ్రామంలో బిఆర్ఎస్ పార్టీ ఎంపీ అభ్యర్థి బాజిరెడ్డి గోవర్దన్ గారికి మద్దతుగా ఎన్నికల ప్రచారం నిర్వహించిన జెడ్పీ చైర్ పర్సన్ దావ వసంతసురేష్.

అనంతరం స్థానిక ఉపాధి హామీ పని కూలీలతో కలిసి మాట్లాడి మన నిజామాబాద్ పార్లమెంట్ అభ్యర్థి బాజిరెడ్డి గోవర్ధన్ రెడ్డి ని కారు గుర్తుకు ఓటు వేసి భారీ మెజారిటీతో గెలిపించాలని కోరడం జరిగింది...

కాంగ్రెస్ ప్రభుత్వం ఉపాధి హామీ కూలీలకు ఇచ్చిన హామీ మేరకు పని దినాలు మరియు కూలీ పెంచే వరకు వారి పక్షాన పొరాడతాం అని అన్నారు...

ఈ కార్యక్రమంలో గ్రామ మండల ప్రజాప్రతినిధులు,నాయకులు,కార్యకర్తలు మహిళలు తదితరులు పాల్గొన్నారు.

Tags