శ్రీ హనుమాన్ చాలీసా పారాయణ సప్తాహం ప్రారంభం.

On
శ్రీ హనుమాన్ చాలీసా పారాయణ సప్తాహం ప్రారంభం.

(సిరిసిల్ల. రాజేంద్ర శర్మ - 9963349493/934842213)

ధర్మపురి ఏప్రిల్ 17 (ప్రజా మంటలు) : 

లోక కళ్యాణార్థం ధర్మపురి శ్రీలక్ష్మీనరసింహస్వామి దేవస్థానం శేషప్ప కళావేదికపై బుధవారం శ్రీ హనుమాన్ చాలీసా పారాయణ సప్తహం ప్రారంభమైంది. ఆలయ వేద పండితులు బొజ్జ.రమేష్ శర్మ ,కొరిడే.చంద్రశేఖర్ శర్మలు భక్తులతో సంకల్పము పటింపజేశారు.

అంతకుముందు హనుమ చిత్రపటంతో భక్తులు నగర సంకీర్తన నిర్వహించారు.

ఈనెల 23వ తేదీ వరకు కార్యక్రమం నిర్వహించబడునని నిర్వాహకులు సంగణభట్ల నరేందర్ శర్మ తెలియజేశారు.

కార్యక్రమ అనంతరం మంగళహారతి, మంత్రపుష్పం, తీర్థప్రసాద వితరణ చేశారు.

Tags