కాంగ్రెస్ పార్టీ ఓబీసీ సెల్ కరీంనగర్ పార్లమెంటు సంయుక్త సమన్వయకర్తగా పులి ఆంజనేయులు గౌడ్ నియామకం
కాంగ్రెస్ పార్టీ ఓబీసీ సెల్ కరీంనగర్ పార్లమెంటు
సంయుక్త సమన్వయకర్తగా పులి ఆంజనేయులు గౌడ్ నియామకం
కరీంనగర్ ఏప్రిల్ 15 (ప్రజామంటలు): రానున్న లోక్సభ ఎన్నికలను పురస్కరించుకొని కరీంనగర్ పార్లమెంటు అభ్యర్థి విజయమే లక్ష్యంగా తెలంగాణ రాష్ట్ర కాంగ్రెస్ బీసీ సెల్ అధ్యక్షులు నూతి శ్రీకాంత్ గౌడ్ రాష్ట్రంలోని పార్లమెంట్ నియోజకవర్గాలకు కాంగ్రెస్ పార్టీ ఓబీసీ సెల్ పక్షాన సమన్వయకర్తలను నియమించడం జరిగింది, ఇందులో భాగంగా కరీంనగర్ పార్లమెంట్ నియోజకవర్గానికి బీసీ సెల్ సంయుక్త సమన్వయకర్తగా కరీంనగర్ జిల్లా కాంగ్రెస్ బీసీ సెల్ అధ్యక్షుడైన పులి ఆంజనేయులు గౌడ్ గారిని నియమించడం జరిగింది. వీరు నియోజకవర్గంలో బీసీ ఓటర్లను ఆకర్షించే విధంగా కాంగ్రెస్ ప్రభుత్వంలో బీసీలకు జరిగిన మేలును కాంగ్రెస్ పార్టీలో బీసీలకు ఇస్తున్న ప్రాధాన్యతను కాంగ్రెస్ పార్టీకి ఓటు వేస్తే దేశవ్యాప్తంగా కాంగ్రెస్ పార్టీ ద్వారా అమలు చేయనున్న హామీలపై విస్తృతంగా ప్రచారం నిర్వహిస్తారు. రాబోయే ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ అభ్యర్థితో పాటు కాంగ్రెస్ పార్టీ పునర్నిర్మాణానికి పాటుపడతానని మంత్రి పొన్నం ప్రభాకర్ నాయకత్వంలో మరింత సమర్థవంతంగా పనిచేస్తానని టిఆర్‌ఎస్ బిజెపి రాక్షస పాలనపై ఆలు పెరుగని పోరాటం చేస్తానని పులి ఆంజనేయులు పేర్కొన్నారు. తన నియామకానికి సహకరించిన రాష్ట్ర రవాణా, బీసీ సంక్షేమ శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్, చొప్పదండి శాసనసభ్యులు మేడిపల్లి సత్యం, మానకొండూర్ శాసనసభ్యులు కవ్వంపల్లి డా. కవ్వంపల్లి సత్యనారాయణ, ఓబీసీ సెల్ పీసీసీ ప్రెసిడెంట్ నూతి శ్రీకాంత్ గౌడ్, వేములవాడ శాసనసభ్యులు, ప్రభుత్వ విప్ అది శ్రీనివాస్, జిల్లా కాంగ్రెస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కోమటిరెడ్డి పద్మాకర్ రెడ్డి, కరీంనగర్ నియోజకవర్గ ఇంచార్జి పురమళ్ళ శ్రీనివాస్, హుజురాబాద్ నియోజకవర్గం ఇంచార్జి ప్రణవ్ లకు, పులి ఆంజనేయులు గౌడ్ కృతజ్ఞతలు తెలియజేశారు.
More News...
<%- node_title %>
<%- node_title %>
ఘనంగా శ్రీసాయి సప్తాహం ముగింపువేడుకలు

మృతుల కుటుంబాలను పరామర్శించిన మాజీ శాసనసభ్యులు అలిగిరెడ్డి ప్రవీణ్ రెడ్డి

నేడు అధికారభాష హిందీ గోల్డెన్ జూబ్లీ వేడుకలు

కిమ్స్-సన్షైన్ హాస్పిటల్స్, బేగంపేటలో కేవలం 3 నెలల్లో 50 రోబోటిక్ సర్జరీలు

ఉద్యోగులు సామాజిక సేవా కార్యక్రమాల్లోనూ పాల్గొనాలి

ఆరోగ్యవంతులైన బాలికలే దేశ భవిత

మీ హామీలపై చర్చిద్దాం రండి - సీఎం రేవంత్ రెడ్డికి తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు, బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత సవాల్

కొండగట్టు 30.వ.గిరిప్రదక్షిణ ఆదివారం మద్యం, మాంసం మానేద్దాం'

కేజీవీలతో ట్రాక్టర్లు తారు రోడ్డుపై తిరిగితే కేసులు నమోదు - ఎస్ఐ, కృష్ణ సాగర్ రెడ్డి

బాల్య వివాహాల నిర్మూలనపై అవగాహన కార్యక్రమం

షిరిడి సాయి మందిరంలో ఘనంగా గురు పూర్ణిమ వేడుకలు

జగిత్యాల జిల్లా జర్నలిస్ట్ సంఘ్ అధ్యక్షునిగా చీటీ శ్రీనివాస్ రావు
