సేవా సంకల్ప అభియాన్ లో చింతకుంట చెరువు శుభ్రం
జగిత్యాల, అక్టోబర్ 3( ప్రజా మంటలు)
‘సేవా సంకల్ప అభియాన్ లో భాగంగా బీజేపీ ఎస్సీ మోర్చా జిల్లా అధ్యక్షులు నారపాక అశోక్ ఆధ్వర్యం లో జగిత్యాల చింతకుంట చెరువు వద్ద స్వచ్ఛ భారత్ కార్యక్రమo నిర్వహించారు.
బీజేపీ జిల్లా అధ్యక్షులు రాచకొండ యాదగిరి బాబు, నియోజక వర్గ ఇంచార్జి డాక్టర్ భోగ శ్రావణి, బీజేపీ రాష్ట్ర కార్యవర్గ సభ్యులు డాక్టర్ వై. అనూప్ రావు, పూదరి అరుణ హాజర య్యారు. నాయకులు, కార్యకర్తలు చింతకుంట చెరువు పరిసరాలను శుభ్రం చేసి,చెత్తాచెదారo తొలగించి స్వచ్ఛతపై ప్రజలకవగాహన కల్పించారు.
ఈ సందర్భంగా నాయకులు మాట్లాడుతూ స్వచ్ఛత అనేది కేవలం ప్రభుత్వ బాధ్యత కాదని, ప్రతి పౌరుడి సామాజిక బాధ్యత అని పేర్కొన్నారు. పరిశుభ్రమైన పరిసరాలు ప్రజల ఆరోగ్యానికి ఎంతో ముఖ్యమని, ప్రతి ఒక్కరూ తమ ఇల్లు, వీధి, గ్రామం, పట్టణం పరిసరాలను పరిశుభ్రంగా ఉంచే బాధ్యత తీసుకోవాలని సూచించారు.

ప్రధాన మోదీ స్వచ్ఛతను ప్రజా ఉద్యమంగా మార్చే లక్ష్యంతో ప్రారంభించిన స్వచ్ఛ భారత్ స్ఫూర్తితో దేశవ్యాప్తంగా ప్రజల్లో పరిశుభ్రతపై అవగాహన పెరిగిందని తెలిపారు. స్వచ్ఛత కార్యక్రమాలు కేవలం ఒకరోజుకే పరిమితం కాకుండా నిరంతర ప్రక్రియగా కొనసాగాలన్నారు. చెత్త రహిత పరిసరాలు, పరిశుభ్ర నీరు ఆరోగ్యకర వాతావరణ ప్రజల జీవన ప్రమాణాలను మెరుగుపరచడంలో కీలక పాత్ర పోషిస్తాయన్నారు. చెరువులు, కాలువలు, పార్కులు, రహదారులు, ప్రజా ప్రదేశాల్లో చెత్త వేయక ప్రతి ఒక్కరూ బాధ్యతగా వ్యవహరించాలని కోరారు.
పరిసరాల పరిశుభ్రత లోపించడం వల్ల దోమలు, ఈగలు వృద్ధి చెంది వివిధ అనారోగ్య సమస్యలకు కారణమయ్యే అవకాశం ఉందని, పరిసరాలను పరిశుభ్రంగా ఉంచడం ప్రజారోగ్యాన్ని కాపాడుకో వచ్చన్నారు.
“స్వచ్ఛతే ఆరోగ్యానికి తొలి మెట్టు” అనే సందేశాన్ని ప్రతి ఇంటికి తీసుకెళ్లాల్సిన అవసరం ఉందని, స్వచ్ఛత చురుకుగా పాల్గొని సమాజానికి ఆదర్శంగా నిలవాలన్నారు. ప్రజలు తమ పరిసరాలను పరిశుభ్రంగా ఉంచడంతో పాటు ఇతరులకు కూడా స్వచ్ఛతపై అవగాహన కల్పించాలని సూచించారు.
మున్సిపల్ పారిశుద్ధ్య కార్మికులకు సన్మానం

స్వచ్ఛ భారత్ లో భాగంగా ప్రతిరోజూ పట్టణాన్ని పరిశుభ్రంగా ఉంచేందుకు కృషి చేస్తున్న మున్సిపల్ పారిశుద్ధ్య కార్మికులను ఘనంగా సన్మానించారు. వారి సేవలు అభినందిస్తూ, సమాజ ఆరోగ్యం,పరిశుభ్రత కోసం అందిస్తున్న సేవలు విలువైనవని నాయకులు పేర్కొన్నారు. మున్సిపల్ మహిళా పారిశుద్ధ్య కార్మికులకు చీరలు,దుస్తులు అందజేసి గౌరవాన్ని చాటు కున్నారు. ప్రజల ఆరోగ్యం, పరిశుభ్రత కోసం నిరంతరం శ్రమిస్తున్న కార్మికులన్నారు.
“స్వచ్ఛ భారత్ – ఆరోగ్య భారత్, పరిశుభ్రమైన జగిత్యాల – ఆరోగ్యకరమైన జగిత్యాల” అనే లక్ష్యంతో ప్రతిఒక్కరూ భాగస్వాములు కావాలని పిలుపునిచ్చారు. ప్రజల భాగస్వామ్యంతోనే పరిశుభ్రమైన, ఆరోగ్య కరమైన, పచ్చదనంతో కూడిన సమాజాన్ని నిర్మించగలమన్నారు. ఈ కార్ ద్వారా స్వచ్ఛతపై ప్రజా ఆరోగ్య పరిరక్షణ, సామాజిక బాధ్యతని అంశాలపై ప్రజల్లో చైతన్యం తీసుకురావడానికి కృషి చేశారు. ఈ కార్యక్రమం లో జిల్లా ప్రధాన కార్యదర్శిగా వడ్డేపల్లి శ్రీనివాస్,మున్సిపల్ బీజేపీ ఫ్లోర్ లీడర్ వేముల శ్రీనివాస్, పట్టణ అధ్యక్షులు కాశెట్టి తిరుపతి, కౌన్సిలర్లు సిరిపురం లత శ్రీనివాస్, నిమ్మల నాగరాజు, గట్టపల్లి మానస జ్ఞానేశ్వర్, ఎస్సీ మోర్చా రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ఓరుగంటి చంద్రశేఖర్, జిల్లా కన్వీనర్ డాక్టర్ పుప్పాల శ్రీనివాస్, జిల్లా కార్యదర్శి పాత రమేష్ ఆఫీస్ కార్యదర్శి జుంబర్తి దివాకర్, ఓబీసీ మోర్చా రాష్ట్ర కార్యవర్గ సభ్యులు మర్రిపల్లి సత్యం, మహిళా మోర్చా జిల్లా అధ్యక్షురాలు దురిశెట్టి మమత, బీజేపీ సీనియర్ నాయకులు సింగం పద్మ, కస్తూరి సత్యం, గుంటుక సదాశివ్, మంచే రాజేష్, ఆముద రాజు, పవన్ సింగ్, గంగరాజం, ఇట్యాల రాము, గదాస్ రాజేందర్, రవితేజ, మధురిమా, నారాయణ, శివ, లింగారెడ్డి, లావణ్య, భాగ్య శ్రీ, అంజలి, మానస, ఎస్సీ మోర్చా జిల్లా నేతలు బన్న సంజీవ్,సట్టా రవిరాజ్, కొండ యుగంధర్, కొత్తూరి అంజి, నక్క జీవన్, దుబ్బ శ్రవణ్ కుమార్, బొల్లం అజయ్ కుమార్, కంటే భూమేష్, బండ వంశీ కుమార్, సుద్దాల విజయ్, చందోలి హరికిరణ్ తదితర బీజేపీ నాయకులు, ఎస్సీ మోర్చా నాయకులు, వివిధ మోర్చాల ప్రతినిధులు, పార్టీ కార్యకర్తలు, యువత తదితరులు పాల్గొన్నారు.
More News...
<%- node_title %>
<%- node_title %>
సీనియర్ సిటిజెన్స్ అసోసియేషన్ కు పౌర సన్మానం
జగిత్యాల అక్టోబర్ 3(ప్రజా మంటలు)హైదరాబాద్ లో రాష్ట్ర ప్రభుత్వం నిర్వహించిన అంతర్జాతీయ వయో వృద్ధుల దినోత్సవంలో నిరాధరణ కు గురవుతున్న వృద్ధ తల్లి దండ్రుల సమస్యల పరిష్కారానికి కృషి చేస్తున్న తెలంగాణ అల్ సీనియర్ సిటిజెన్స్ అసోసియేషన్ జగిత్యాల జిల్లా శాఖ కు రాష్ట్ర స్థాయిలో ఉత్తమ సేవా అవార్డు లభించింది.ఈ సందర్బంగా శనివారం... సేవా సంకల్ప అభియాన్ లో చింతకుంట చెరువు శుభ్రం
జగిత్యాల, అక్టోబర్ 3( ప్రజా మంటలు) ‘సేవా సంకల్ప అభియాన్ లో భాగంగా బీజేపీ ఎస్సీ మోర్చా జిల్లా అధ్యక్షులు నారపాక అశోక్ ఆధ్వర్యం లో జగిత్యాల చింతకుంట చెరువు వద్ద స్వచ్ఛ భారత్ కార్యక్రమo నిర్వహించారు.బీజేపీ జిల్లా అధ్యక్షులు రాచకొండ యాదగిరి బాబు, నియోజక వర్గ ఇంచార్జి డాక్టర్ భోగ శ్రావణి,... శ్రీ దుర్గా దేవి శరన్నవరాత్రోత్సవాలకు చైర్ పర్సన్ "వాణికి " ఆహ్వానం
జగిత్యాల అక్టోబర్ 3(ప్రజా మంటలు)నకాష్ నవదుర్గ సేవా సమితి నిర్వాహకులు మున్సిపల్ చైర్‌పర్సన్ శ్రీమతి సమిండ్ల వాణి శ్రీనివాస్ ని మర్యాదపూర్వకంగా కలిసి, శ్రీ దుర్గా దేవి శరన్నవరాత్రోత్సవాలకు సాదరంగా ఆహ్వానించారు.
ఈ సందర్భంగా ఉత్సవాల ఆహ్వాన పత్రికను అందజేసి, అమ్మవారి ఆశీస్సులతో నిర్వహించనున్న శ్రీ దుర్గా దేవి శరన్నవరాత్రి ఉత్సవాల్లో పాల్గొని కార్యక్రమాన్ని... ప్రభుత్వ ఆస్పత్రుల దుస్థితిపై కల్వకుంట్ల కవిత ఆగ్రహం
హైదరాబాద్, అక్టోబర్ 3 (ప్రజా మంటలు):
రాష్ట్రంలోని ప్రభుత్వ ఆస్పత్రుల పరిస్థితి అధ్వాన్నంగా మారిందని తెలంగాణ రక్షణ సేన చీఫ్ కల్వకుంట్ల కవిత ఆరోపించారు. భూపాలపల్లి ప్రభుత్వ ఆస్పత్రిలోని ఎస్ఎన్‌సీయూ వార్డులో సీలింగ్ కూలిన ఘటనపై ఆమె ‘ఎక్స్’ వేదికగా స్పందించారు. ఆదిలాబాద్ రిమ్స్‌లో అగ్ని ప్రమాదంలో చిన్నారులు మృతి చెందిన ఘటన మరవకముందే ఈ... 5వ వార్డులో మున్సిపల్ చైర్‌పర్సన్ పర్యటన
జగిత్యాల, అక్టోబర్ 3 (ప్రజా మంటలు):
జగిత్యాల మున్సిపల్ చైర్‌పర్సన్ సమిండ్ల వాణి శ్రీనివాస్ 5వ వార్డులో పర్యటించారు. వార్డు కౌన్సిలర్ వేముల శ్రీనివాస్‌తో కలిసి అష్టలక్ష్మి టెంపుల్ ఏరియాతో పాటు వార్డులోని పలు ప్రాంతాలను సందర్శించి ప్రజల సమస్యలను అడిగి తెలుసుకున్నారు.
వార్డులో నెలకొన్న మౌలిక వసతులు, పారిశుధ్యం తదితర సమస్యలను పరిశీలించారు. ప్రజలకు... ధరూర్ క్యాంప్‌లో ఉచిత మొక్కల పంపిణీ
జగిత్యాల, అక్టోబర్ 3 (ప్రజా మంటలు):
జగిత్యాల పట్టణంలోని ధరూర్ క్యాంప్‌లో పర్యావరణ పరిరక్షణ, పచ్చదనం పెంపుదల లక్ష్యంగా ఉచిత మొక్కల పంపిణీ కార్యక్రమం నిర్వహించారు. స్థానిక శ్రీ కోదండ రామాలయ ప్రాంగణంలో వార్డు కౌన్సిలర్ బోయినపల్లి ప్రశాంత్ రావు ఆధ్వర్యంలో వార్డు ప్రజలకు వివిధ రకాల మొక్కలను ఉచితంగా అందజేశారు.
ఈ సందర్భంగా కౌన్సిలర్... గాంధీ జయంతి సందర్భంగా రంగధామునిపల్లిలో పలు కార్యక్రమాలు
గొల్లపల్లి, అక్టోబర్ 2 (ప్రజా మంటలు):
గాంధీ జయంతి సందర్భంగా రంగధామునిపల్లి గ్రామపంచాయతీ కార్యాలయం వద్ద జాతిపిత మహాత్మా గాంధీ చిత్రపటానికి పూలమాల వేసి ఘనంగా నివాళులర్పించారు. అనంతరం గ్రామ ప్రజలకు స్మార్ట్ రేషన్ కార్డులను పంపిణీ చేశారు.
అలాగే గ్రామీణ ఉపాధి హామీ పథకం కింద గ్రామంలో చేపట్టనున్న పనులపై గ్రామసభ నిర్వహించారు. గ్రామ... ఉత్తమ ఉపాధ్యాయులకు అవొపా ఘన సన్మానం
ధర్మపురి, అక్టోబర్ 2 (ప్రజా మంటలు):
గాంధీ జయంతిని పురస్కరించుకుని ధర్మపురి పట్టణంలోని ఆర్య వైశ్య సంఘ సమావేశ మందిరంలో అవోపా ఆధ్వర్యంలో ఉత్తమ ఉపాధ్యాయుల సన్మాన కార్యక్రమం నిర్వహించారు.
తెలంగాణ రాష్ట్ర స్థాయిలో ఉత్తమ ఉపాధ్యాయ అవార్డు పొందిన కూరగాయల చంద్రశేఖర్, జగిత్యాల జిల్లా స్థాయిలో అవార్డు పొందిన దోంతుల శ్రీధర్,... తెలంగాణ ఉద్యమ కళాకారుడు రాజోజు మధు హౌస్ అరెస్ట్
ఎల్కతుర్తి, అక్టోబర్ 2 (ప్రజా మంటలు):
ఉద్యోగాల సాధన కోసం నిర్వహిస్తున్న కార్యక్రమాలకు మద్దతు తెలిపిన తెలంగాణ ఉద్యమ కళాకారుడు రాజోజు మధును ఎల్కతుర్తి పోలీసులు ముందస్తుగా హౌస్ అరెస్ట్ చేసినట్లు సమాచారం.
హనుమకొండ జిల్లా ఎల్కతుర్తి మండలం సూరారం గ్రామానికి చెందిన రాజోజు మధు, తెలంగాణ ఉద్యమ కళాకారులు, ఉద్యోగ సంఘాల సంయుక్త ఆధ్వర్యంలో... వల్భాపూర్ యూపీఎస్‌లో పూర్వ విద్యార్థుల ఆత్మీయ గెట్‌టుగెదర్
ఎల్కతుర్తి, అక్టోబర్ 2 (ప్రజా మంటలు):
ఎల్కతుర్తి మండల కేంద్రంలోని వల్భాపూర్ యూపీఎస్ పాఠశాలలో 1991–92 విద్యా సంవత్సరంలో ఏడో తరగతి చదివిన 55 మంది పూర్వ విద్యార్థులు గాంధీ జయంతి సందర్భంగా శుక్రవారం ఆత్మీయ గెట్‌టుగెదర్ నిర్వహించారు. సూరారం పెట్రోల్ బంకు సమీపంలోని చిన్న పార్కులో జరిగిన ఈ కార్యక్రమంలో పూర్వ విద్యార్థులు తమ... లోతట్టు ప్రాంత సమస్యలకు శాశ్వత పరిష్కారం చూపాలి
ఎల్కతుర్తి, అక్టోబర్ 2 (ప్రజా మంటలు):
ఎల్కతుర్తి గ్రామంలో శుక్రవారం సర్పంచ్ మునిగడప లావణ్య అధ్యక్షతన నిర్వహించిన గ్రామసభలో లోతట్టు ప్రాంత కుటుంబాలు తమ సమస్యలను అధికారుల దృష్టికి తీసుకెళ్లారు. ఈ మేరకు DRDA అదనపు ప్రాజెక్ట్ డైరెక్టర్, స్పెషల్ ఆఫీసర్ ఆదిరెడ్డికి వినతిపత్రం అందజేశారు.
ఈ సందర్భంగా అంబాల జగన్ మాట్లాడుతూ.. ఎత్తైన ప్రాంతాల... జగిత్యాల లలో జర్నలిస్టుల హక్కుల కోసం గాంధీ విగ్రహం వద్ద నిరసన.
జగిత్యాల,అక్టోబర్ 2(ప్రజా మంటలు)
జర్నలిస్టుల హక్కుల పరిరక్షణకు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు తక్షణమే స్పందించాలని తెలంగాణ యూనియన్ ఆఫ్ వర్కింగ్ జర్నలిస్ట్స్ (టీయూడబ్ల్యూజే) జగిత్యాల జిల్లా అధ్యక్ష, కార్యదర్శులు చీటీ శ్రీనివాసరావు, బెజ్జంకి సంపూర్ణ చారి లు డిమాండ్ చేశారు.
ఇండియన్ జర్నలిస్ట్స్ యూనియన్ (ఐజేయూ) పిలుపు మేరకు గాంధీ జయంతి సందర్భంగా జగిత్యాల మంచినీళ్ల... 