అపర భద్రాద్రి, శ్రీ సీతారాముల బ్రహ్మోత్సవాలకు సర్వం సిద్ధం

On
అపర భద్రాద్రి, శ్రీ సీతారాముల బ్రహ్మోత్సవాలకు సర్వం సిద్ధం

అపర భద్రాద్రి, శ్రీ సీతారాముల బ్రహ్మోత్సవాలకు సర్వం సిద్ధం

ఇల్లందకుంట ఏప్రిల్‌ 15 (ప్రజామంటలు): ఇల్లందకుంట శ్రీ సీతా రాముల బ్రహ్మోత్సవాలు ఏప్రిల్‌ 15వ  తేదీ నుంచి 27వ తేదీ వరకు జరగబోయే స్వామి వారి కల్యాణ ఉత్సవాలు జరుగనున్న నేపథ్యంలో దేవాదాయ శాఖ ఆధ్వర్యంలో భక్తులకు ఎలాంటి అసౌకర్యలు కలగకుండా అన్ని సౌకర్యాలు కల్పించేందుకు చర్యలు చేపట్టారు. అలాయం చుట్టూ విద్యుత్‌ దీపాల వెలుగులో సర్వాంగ సుందరంగా తీర్చిదిద్ది. ఎండాకాలాన్ని ద్రృష్టి లో ఉంచుకోని బ్రహ్మోత్సవాలకు వచ్చే భక్తులకు చలువ పందిళ్ళు నీటి మరియు బస్సు సౌకర్యాలను కల్పించారు. అలాగే ఇల్లందకుంట శ్రీ సీతారామ చంద్ర స్వామి వారి కల్యాణ ఉత్సవాల్లో భాగంగా ఏలాంటి ఇబ్బందులు తలెత్తకుండా అన్ని ఏర్పాట్లు చేసినట్లు అలయ ఈవో కందుల సుధాకర్‌ తెలిపారు.

 

Tags