లోక్ భవన్‌లో గవర్నర్‌ను కలిసిన కల్వకుంట్ల కవిత – భూ బాధితులకు న్యాయం చేయాలని విజ్ఞప్తి
హైదరాబాద్, మే 26 (ప్రజా మంటలు):
తెలంగాణ రక్షణ సేన చీఫ్ కల్వకుంట్ల కవిత మంగళవారం హైదరాబాద్‌లోని లోక్ భవన్లో తెలంగాణ గవర్నర్ శివప్రతాప్ శుక్లాను కలిసి వెలుగుమట్ల ఇళ్ల కూల్చివేత బాధితులు, ట్రిపుల్ ఆర్ భూ నిర్వాసితులు, పరిగి మండలం కడ్లాపూర్ ఇండస్ట్రియల్ పార్క్ ప్రభావితుల సమస్యలపై వినతిపత్రం సమర్పించారు.
ఈ సమావేశంలో ధర్మ సమాజ్ పార్టీ అధ్యక్షుడు విశారదన్ మహారాజ్‌తో పాటు వివిధ ప్రాంతాల బాధితులు కూడా పాల్గొన్నారు. వెలుగుమట్లలో ఇళ్ల కూల్చివేత, ట్రిపుల్ ఆర్ అలైన్‌మెంట్ మార్పులు, రాయగిరి భూసేకరణ, కడ్లాపూర్ ఇండస్ట్రియల్ పార్క్ కోసం జరుగుతున్న భూసేకరణ అంశాలను గవర్నర్ దృష్టికి తీసుకెళ్లినట్లు తెలిపారు.
సమావేశం అనంతరం మీడియాతో మాట్లాడిన కవిత, రాష్ట్ర ప్రభుత్వం వ్యవహార శైలిపై తీవ్ర విమర్శలు చేశారు. భూ నిర్వాసితులకు న్యాయం చేయాలని, రైతుల సమస్యలను ప్రభుత్వం అత్యవసరంగా పరిష్కరించాలని డిమాండ్ చేశారు. ప్రభుత్వం ఇప్పటివరకు తీసుకున్న చర్యలు పాక్షిక విజయాలే అయినప్పటికీ పూర్తి స్థాయి పరిష్కారం కోసం కేంద్ర స్థాయి జోక్యం అవసరమని పేర్కొన్నారు.
గవర్నర్ తమ వినతిని సానుకూలంగా స్వీకరించారని, సంబంధిత అంశాలపై ప్రభుత్వ నివేదిక తెప్పించి న్యాయం చేసే ప్రయత్నం చేస్తానని హామీ ఇచ్చినట్లు కవిత తెలిపారు. ట్రిపుల్ ఆర్‌కు సంబంధించి పలుమార్లు అలైన్‌మెంట్ మార్పు జరిగిన విషయాన్ని కూడా ఆయన దృష్టికి తీసుకెళ్లినట్లు చెప్పారు.
అలాగే రైతుల ధాన్యం కొనుగోళ్లలో జాప్యం జరుగుతోందని ఆరోపిస్తూ, రాష్ట్రంలోని పలు జిల్లాల్లో రైతులు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని అన్నారు. రైతుల ధాన్యాన్ని వెంటనే కొనుగోలు చేసి వారికి ఉపశమనం కల్పించాలని ప్రభుత్వాన్ని కోరారు.
అదేవిధంగా, బాధితులకు న్యాయం జరగకపోతే భవిష్యత్తులో ఉమ్మడి కార్యాచరణతో ఉద్యమాలు చేపడతామని హెచ్చరించారు.
More News...
<%- node_title %>
<%- node_title %>
లోక్ భవన్‌లో గవర్నర్‌ను కలిసిన కల్వకుంట్ల కవిత – భూ బాధితులకు న్యాయం చేయాలని విజ్ఞప్తి
హైదరాబాద్, మే 26 (ప్రజా మంటలు):
తెలంగాణ రక్షణ సేన చీఫ్ కల్వకుంట్ల కవిత మంగళవారం హైదరాబాద్‌లోని లోక్ భవన్లో తెలంగాణ గవర్నర్ శివప్రతాప్ శుక్లాను కలిసి వెలుగుమట్ల ఇళ్ల కూల్చివేత బాధితులు, ట్రిపుల్ ఆర్ భూ నిర్వాసితులు, పరిగి మండలం కడ్లాపూర్ ఇండస్ట్రియల్ పార్క్ ప్రభావితుల సమస్యలపై వినతిపత్రం సమర్పించారు.ఈ సమావేశంలో ధర్మ... ట్రాఫిక్ సిబ్బంది ఆరోగ్య రక్షణకు ప్రత్యేక చర్యలు ట్రాఫిక్ సిబ్బందికి కూలింగ్ గాగుల్స్, వాటర్ ఫ్లాస్క్స్ పంపిణీ చేసిన జిల్లా ఎస్పీ అశోక్ కుమార్
జగిత్యాల మే 25(ప్రజా మంటలు) జిల్లాలో పెరుగుతున్న ఎండ తీవ్రతను దృష్టిలో ఉంచుకొని ట్రాఫిక్ విధులు నిర్వహిస్తున్న పోలీస్ సిబ్బంది ఆరోగ్య రక్షణ కోసం జిల్లా పోలీస్ శాఖ ప్రత్యేక చర్యలు చేపట్టింది. ఇందులో భాగంగా స్థానిక ట్రాఫిక్ ట్రైనింగ్ ఇన్స్టిట్యూట్‌లో జిల్లా ఎస్పీ అశోక్ కుమార్ ట్రాఫిక్ సిబ్బందికి కూలింగ్ గాగుల్స్ మరియు వాటర్... శాంతి కళ్యాణంతో ఘనంగా ముగిసిన విష్ణు పురాణ ప్రవచన సప్తాహం
జగిత్యాల మే 24 ( ప్రజా మంటలు)జిల్లా కేంద్రం కృష్ణ నగర్ లోని ఉమా శంకర్ గార్డెన్స్ లో గత వారం రోజులుగా ప్రముఖ పౌరాణిక వేద పండితులు బుర్రా భాస్కర శర్మ చే అంగ రంగ వైభవంగా జరిగిన శ్రీ మహా విష్ణు పురాణం ప్రవచనం సమాప్తి సందర్బంగా శ్రీ లక్ష్మి నారాయణుల... చదువుతోనే చక్కటి జీవితం జగిత్యాల జిల్లా అడిషనల్ కలెక్టర్ రాజా గౌడ్
జగిత్యాల మే 24 (ప్రజా మంటలు)చదువుతోనే సమాజంలో గుర్తింపు, చక్కటి జీవితం లభిస్తుందని జగిత్యాల జిల్లా అడిషనల్ కలెక్టర్ రాజా గౌడ్ అన్నారు పట్టణంలోని ఎల్ ఎల్ గార్డెన్స్ లో జరిగిన గౌడ ప్రొఫెషనల్ అండ్ అఫీషియల్స్ అసోసియేషన్ (గోప) జగిత్యాల జిల్లా కమిటీ నిర్వహించిన ప్రతిభ పురస్కారాల అవార్డ్స్ మహోత్సవంలో ఆయన ముఖ్య... భాగవత ప్రవచకునికి భాగవత చూర్ణిక అందజేత
జగిత్యాల మే 24 (ప్రజా మంటలు)జిల్లా కేంద్రంలోని గీత భవన్ లో ఖండవల్లి ఆదిత్య శర్మచే శ్రీమద్ భాగవత సప్తాహం కొనసాగుతుండగా ఆదివారం ఉదయము కీ"శే " సరాబు మందిరం వెంకటేశ్వర శర్మచే తెలుగులో అనువదించబడిన భాగవత సప్తాహ చూర్ణిక పుస్తకాలను వెంకటేశ్వర శర్మ కుమారుడు భారవిశర్మ పురాణ ప్రవచకులు ఆదిత్య శర్మకు అందజేశారు. ... ఆరవ రోజు కొనసాగుతున్న విష్ణు పురాణం
జగిత్యాల మే 23(ప్రజా మంటలు) జిల్లా కేoద్రం కృష్ణా నగర్ లోని ఉమా శంకర్ గార్డెన్స్ లో, ప్రముఖ పౌరాణిక, వేద, పండితులు, మంచిర్యాల వాస్తవ్యులు, బహ్మ శ్రీ బుర్రా భాస్కర శర్మ చే, ఎంతో వైభవంగా ,జరుగుతున్న విష్ణు పురాణం శనివారం 6వ రోజు కు చేరింది. సామూహిక శ్రీ విష్ణు స హస్ర... క్రీడల్లో ప్రతిభ కనబరిచిన వారికి జ్ఞాపికలు, అందజేసిన అదనపు కలెక్టర్ బి రాజా గౌడ్
జగిత్యాల మే 23(ప్రజా మంటలు)జిల్లా యువజన మరియు క్రీడల శాఖ ఆధ్వర్యంలో వారం రోజుల పాటు నిర్వహించిన “99 రోజుల యాక్షన్ ప్లాన్ – ప్రజా పాలన ప్రగతి ప్రణాళిక” ముగింపు కార్యక్రమం జిల్లా యువజన మరియు క్రీడల శాఖ స్వామి వివేకానంద ఇండోర్ మినీ స్టేడియంలో ఘనంగా నిర్వహించబడింది.
ఈ కార్యక్రమానికి ముఖ్య... తెలంగాణ రాష్ట్ర క్యాబినెట్ నిర్ణయాలు - 23.05.2026
(సిరిసిల్ల. రాజా విక్రాంత్ శర్మ - 9963349493/9348422113).
హైదరాబాద్ 23 మే (ప్రజా మంటలు) :
తెలంగాణ రాష్ట్ర క్యాబినెట్ నిర్ణయాలు మరియు హైలైట్స్.
1. రాష్ట్రంలో రెండో విడత ఇందిరమ్మ ఇళ్ల మంజూరుకు రాష్ట్ర క్యాబినెట్ ఆమోదం తెలిపింది.
మొత్తం 2 లక్షల 50 వేల మంది పేద కుటుంబాల ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణానికి... గొల్లపల్లి మండల కేంద్రంలో ట్రెయిన్డ్ డాగ్స్ నారకోటిక్ నిషేధిత గంజాయి మధిక ద్రవ్యాల ప్రత్యేక తనిఖీలు
గొల్లపల్లి మే 22 (ప్రజా మంటలు):
జగిత్యాల జిల్లా ఎస్పీ అశోక్ కుమార్ ఆదేశాల మేరకు, డీఎస్పీ పురుషోత్తం రెడ్డి ధర్మపురి సర్కిల్ రామ్ నరసింహ రెడ్డి ఆధ్వర్యంలో ఎస్ఐ, కృష్ణ సాగర్ రెడ్డి పోలీస్ సిబ్బంది ట్రెయిన్డ్ డాగ్ స్క్వాడ్ తో గంజాయి నిషేధిత మాదక ద్రవ్యాల కోసం విస్తృత తనిఖీలు చేపట్టారు. మాదక... ఘనంగా ప్రారంభమైన శ్రీమద్ భాగవత సప్తాహ జ్ఞాన యజ్ఞం
జగిత్యాల మే 21 (ప్రజా మంటలు) జిల్లా కేంద్రంలోని గీత భవన్ లో పండిత శిరోమణి బ్రహ్మశ్రీ ఖండవల్లి ఆదిత్య శర్మ చే శ్రీమద్భాగవత సప్తాహ జ్ఞాన యజ్ఞము గురువారం ప్రారంభమైంది. ఉదయము 9 గంటల నుండి మధ్యాహ్నం 12 గంటల వరకు తిరిగి సాయంత్రం 3_30 నుండి 6_30 వరకు కొనసాగుచున్నది.
ఈనెల 27వ... ధర్మపురి పట్టణ లో ట్రెయిన్డ్ డాగ్స్ సహాయంతో నారకోటిక్ నిషేధిత గంజాయి మధిక ద్రవ్యాల ప్రత్యేక తనిఖీలు
గొల్లపల్లి మే 21 (ప్రజా మంటలు)
జగిత్యాల జిల్లా ఎస్పీ అశోక్ కుమార్ ఆదేశాల మేరకు, డీఎస్పీ పురుషోత్తం రెడ్డి సూచనలతో, ధర్మపురి సర్కిల్ రామ్ నరసింహ రెడ్డి ఆధ్వర్యంలో ఎస్సై మహేష్ పోలీస్ సిబ్బంది ట్రెయిన్డ్ డాగ్ స్క్వాడ్ సహాయంతో గంజాయి నిషేధిత మాదక ద్రవ్యాల కోసం విస్తృత తనిఖీలు చేపట్టారు. జగిత్యాల జిల్లా... కుత్బుల్లాపూర్‌లో తెలంగాణ రక్షణ సేన జెండా ఆవిష్కరణ: ప్రభుత్వానికి కల్వకుంట్ల కవిత అల్టిమేటం
కుత్బుల్లాపూర్, హైదరాబాద్ | మే 21 (ప్రజా మంటలు):
తెలంగాణ ప్రజల హక్కులు, ఆత్మగౌరవ పరిరక్షణ కోసం తెలంగాణ రక్షణ సేన పార్టీ ఏర్పాటైందని కల్వకుంట్ల కవిత పేర్కొన్నారు. కుత్బుల్లాపూర్ నియోజకవర్గంలో జరిగిన పార్టీ జెండా ఆవిష్కరణ కార్యక్రమంలో ఆమె మాట్లాడుతూ పలు రాజకీయ, సామాజిక అంశాలపై ప్రభుత్వానికి డెడ్‌లైన్ విధించారు.
జూన్ 2లోగా హామీలు... 