స్వయంకృతంతో భారాస ప్రజలకు దూరం అవుతుందా? తెలంగాణలో బిజేపి కి ఆశ్రయం ఇస్తుంది ఎవరు ? బిజేపికి సహకరిస్తే ఆత్మహత్యాసదృశ్యమే

పరనిందతో తమ ప్రాభవాన్ని పదిలపరుచుకోలేరు
వ్యాపార, పారిశ్రామికవేత్తలతో పార్టీలు నిలవవు
భారాస నిర్లక్ష్య వైఖరే బిజేపికి బలం వ్యాపారాలే రాజకీయ పరమావధి కాకూడదు?
-సిహెచ్ వి ప్రభాకర్ రావు, సీనియర్ జర్నలిస్ట్. 9391533339
కాంగ్రెస్ పార్టీ రాష్ట్రాలలో బాలహీనపడిన చోట సాధారణంగా ప్రాంతీయ పార్టీలు బలంగా ఉన్నాయి. ముఖ్యమగా ఉత్తర భారతంలోని బీహార్, పశ్చిమ బెంగాల్, ఉత్తర ప్రదేశ్ లలో కాగణరెస్ నామ మాత్రం కావడానికి కారణం అక్కడి ప్రాంతీయ నాయకుల, ప్రజల ఆకానసఖ్యలను కాంగ్రెస్ పార్టీ గుర్తించక పోవడమే ప్రధాన కారణం. దక్షిణాన కర్ణాటకలో దేవ గౌడ నాయకత్వంలోని జే ది ఎస్ ఉన్నా, ఐ కర్ణాటకలోని ఒక ప్రాంతానికే పరిమితం కావడంతో, అక్కడ బిజేపి తన స్థానాన్ని పదిల పరుచుకోండి. దేశంలోని ఏ రాష్ట్రంలోనైనా, ప్రాంతీయ పార్టీలులు బలంగా లేవంటే అక్కడ బిజేపి తన ఉనికినిని చాటుకోవాడమే కాకుండా, బలంగా ఎదుగుతుంది. తమిళనాదువ నాగరేశ్ 1960-70 దశకంలో కనుమరుగు కాగా, కేరళ లో యునైటెడ్ ఫ్రంట్ లో భాగంగా మిగిలింది. ఇక తెలుగు రాష్ట్రాలలో తెలుగు దేశం పార్టీ ఆవిర్భావంతో కాంగ్రెస్ కు పెద్ద దెబ్బే తగిలింది. కాలనీ బిజేపి తెలుగుదేశం పార్టీతో పెట్టు పెట్టుకోవడంతో, ఇక్కడ అది తోక పార్టీగానే మిగిలిపోయింది.
ప్రత్యేక తెలంగాణ ఇస్తామన్నా, బిజేపిని ఉత్తరాది బనియా పార్టీగా గుర్తింపుఉన్న బిజేపి, తెలుగు వారికి తెలంగాణ ప్రత్యేక ఉద్యమం కొంత చోటు ఇచ్చింది. అప్పటి తెరాస తో పోవటు లేకున్నా, వయమ పక్షయభావాలున్న వారికి, ఆ పార్టీల ప్రభావం ఉన్న ఉత్తర తెలంగాణలో భూస్వాములకు, పెత్తందార్లకు అనుకూలంగా, నక్సలైట్లకు వ్యతిరేకంగా పోరాడి ,ప్రభుత్వానికి అనుకూలంగా ఉండడం వల్ల గ్రామీణ ప్రాంతాలలోకి చొచ్చుక పోయింది. భారస ఉద్యమం తరువాత పక్కా రాజకీయ పార్టీగా మారిపోవడం, కాంగ్రెస్ రాష్ట్రంలో బలహీనపడడం తో ఆ శూన్యాన్ని బిజేపి పూరించే ప్రయత్నం చేస్తుంది. అదీకాక, కేంద్రంలో అధికారంలో ఉండడంతో, ఆ పార్టీకి ఆర్థిక పరిపుష్టి కలగడం, అధికార యంత్రాంగంపై పట్టు దొరకడంతో, తాము అధికారంలో ఉన్న రాష్ట్రాలలో తెలుగు పారిశ్రామిక వేత్తలను ప్రోత్సహిస్తూ, తెలుగు రాష్ట్రాలలో పట్టు సాధించే ప్రయత్నాలు చేస్తుంది.
కేంద్రం అధికారంతో బిజేపి ఉనికి
కేంద్రంలో అధికారం ఉండడంతో ఆంధ్ర ప్రాంత కాంట్రాక్టర్ లను ప్రోత్సహించినా, ఆంధ్ర ప్రాంత ప్రజలలో బిజేపి స్థానం సంపాదించుకోలేకపోయింది. అక్కడా ఇకా తెలుగుదేశం పార్టెకి తోక పార్టీలనీ మిగిలిపోయింది. తెలంగాణలో మాత్రం, ముఖ్యంగా ఉత్తర తెలంగాణలో, ఎక్కడైతే గతంలో నక్సలైట్ల ప్రభావం అధికంగా ఉందో ఆయా ప్రాంతాలలో బిజేపి కొంత పుంజుకొనది. దీనికి ఖమ్మం జిల్లా మినహాయింపుగా చెప్పుకోవాలి. ఖమ్మం జిల్లా మొదటి నుండి వామపక్ష రాజకీయాలకు కేంద్రం అయినా, అక్కడి ప్రజల భావాలు, ఆంధ్ర ప్రాంత రాజకీయాలకు అనుగుణంగా ఉంటాయి. అక్కడి ప్రజలలో ఆంధ్రప్రాంత వలస నాయకులు ఎక్కువగా ఉండడం, జిల్లా చుట్టూ అంతా ఆంధ్ర ప్రాంతమే కావడంతో, అది మొదటి నుండి మిగతా తెలంగాణ ప్రజల భావాలతో కాకుండా, ఆంధతర ప్రాంత ప్రజల మానవ భావాలతో ఎక్కువగా కలిసిమెలిసి ఉంటుంది. అందుకే, తెలంగాణ ఉద్యమం ఉవ్వెత్తున ఎగిసిన రోజుల్లో కూడా, ఖమ్మం జిల్లాలో ఉద్యమ ప్రభావం అంతగా లేదు.
భారాస నిర్లక్ష్య వైఖరే బిజేపికి బలం
ప్రస్తుత పరిస్థితులలో బిజేపికీ ఉతమిస్తుంది భారాస పార్టీ వైఖరే అని రాజకీయ విశ్లేషకులు భావిస్తున్నారు. మొన్నటిదాక స్తంబద్ధంగా ఉన్న కాంగ్రెస్, బి ఆర్ ఎస్ నియంతృత్వ పోకడల వల్ల ప్రజాలకన్నా, పార్టీ కింది స్థాయి నాయకుల కన్నా పెట్టుబడి దారులకు, పారిశ్రామిక వేత్తలకు, రియాలటర్లకు ప్రాధాన్యత ఇవ్వడం వల్ల కింది స్థాయి మధ్యతరగతి వతలర్లు ఆ పార్టీకి దూరం అయ్యారు. ఈ అవకాశాన్ని గ్రామాస్తాయిలో ఇంకా కార్యకర్తలు ఉన్న కాంగ్రెస్ సరిగ్గా ఉపయోగించుకొని, బొటాయబోటి మెజారిటీతోనైనా, అధికారంలోకి వచ్చింది. డబ్బు సంపాదనే లక్ష్యంగా భారాస లో చేరిన రాజకీయ వ్యాపారవేత్తలు అందరూ ధికారం కోసం, తమ వ్యాపార లావాదేవీల కొనసాగింపు కొరకు మళ్ళీ అధికార పార్టీ అయిన కాంగ్రెస్ లో చేరుతున్నారు. ఇది వ్యాపారవేత్తల సహజ లక్షణం. వారివారి వ్యాపారాలు ఎలాంటి వొడిదోడుకులు లేకుండా కొనసాగలనే అధికార పార్టీ అండ తప్పని సారి.
అధికారం కోల్పోయిన భారాస పార్టీ ఇప్పటికీ క్షేత్ర స్థాయిలో ఉన్న కార్యకర్తల మోనో భావాలను గ్రహించలేకో. లేదా ఇంకా తమ అహంభావాన్ని విడవలేకో, పార్టీని ప్రక్షాళనం చేసే దిశలో కాకుండా, ఇంకా నాశనం చేసే దిశలో వెళుతున్నారు. కాంగ్రెస్ ను ఎదుర్కోవలంటే ముందు తాము బలంగా ఉండాలని, కనీసం ఊపిరితోనైనా ఉండాలనే వాస్తవాన్ని గ్రహించలేని భారాస, ఇంకా అధికార కాలంనాటి మత్తులోనే ఉన్నట్లు వ్యవహరిస్తున్నారు. అహదీకారం కోల్పోయి నాలుగు నెలలు కావస్తున్నా, పార్టీ ఓటమికి కారణాలను విశ్లేషించు కోవడానికి పూర్తి స్థాయి సమావేశాలు నిర్వహించలేదు. కాంగ్రెస్ పార్టీ ని ఎలా అధికారంలో నుండి దించాలనే ప్రయత్నిస్తుంది తప్ప, క్షేత్ర స్థాయిలో తమను నమముక్కోని ఉన్న అసలైన కార్యకర్తలు దిక్కుతోచని స్థితిలో ఉన్నారని, వారికి భరోసా కల్పించాల్సిన బాధ్యత పార్టీ అధినాయకత్వం ధే అనే భావనలో మాత్రం లేరనే విశ్లేషకులు భావిస్తున్నారు.
వ్యాపారాలే రాజకీయ పరమావధి కాకూడదు?
రాజకీయ అవగాహనతో కాకుండా, తమ వ్యాపార అవగాహనతో, ఆర్థిక లావాదేవిలే ప్రధానంగా ఇన్నాళ్ళూ కొనసాగిన భారాస రాజకీయాలనే ఇంకా కొనసాగించాలనుకోవడం, నాయకుల తీరుపై ఎలాంటి విమర్శలు, సమీక్షలు చేసుకోకుండా, ప్రజల వ్యతిరేకతను కూడగట్టుకొన్న కోటరీ కె ఇంకా పెద్దపీట వేయడంతో, ప్రజా, ధన బలం ఉన్న నాయకఉలు అటు అధికార పార్టీ అయిన కాంగ్రెస్ లోకో, మళ్ళీ కేంద్రంలో అధికారంలోకి వస్తునాదనే నమ్మకంతో బిజేపి లోకి వెళ్లిపోతున్నా, వారిని కట్టడి చేయడంలో భారాస అధినాయకత్వం విఫలం అయింది. ఇన్నాళ్ళూ ఎవరిపై కోపంతో, ద్వేషంతో ఉన్నారో వారినే మళ్ళీ ముందు పెట్టి రాజకీయయాలను నడపాలని చూడదమే భారసా చేస్తున్న పెద్ద తప్పుగా భావిస్తున్నారు.
కుటుంబ పార్టీగా నారిందని, ఆర్థిక, వ్యాపార బలం ఉన్న వారికే కోటరీ ప్రాధాన్యత ఇస్తుందనే వాదనలను ;వినిపించిన, కొంతమంది పార్టీ నాయకుల,పార్టీ వ్యతిరేకుల ప్రచారాన్ని, ప్రతిపక్షాల విమర్శలను తిప్పికొట్టే విధంగా భారాస అధినేత కల్వకుంట్ల చంద్ర శేఖర్ రావు, ఇప్పటి వరకు ఎలాంటి చర్యలు తీసుకొన్నట్లు ప్రజలు గ్రహించలేదు. అదీ కాకుండా, ఇంకా అన్నీ విషయాలలో వారికే ప్రాధాన్యత ఇస్తున్నట్లు వారి చర్యలు తెలుపుతున్నాయి. పార్టీలో అందరూ వలస నాయకులు వెళ్లిపోయినా, ఉద్యమ కాలంనాటి సహాచారులను అందరినీ కూడదీసుకోవడానికి బదులు కాంగ్రెస్ ప్రభుత్వాన్ని కూలదోయడానికి బిజేపితో కలిసి భారాస జప్రాయత్నిస్తుందనే ప్రచాలానికి ఊతమిచ్చే విధంగా వ్యవహరించడంతో, భారాస ను ప్రజలు శంకిస్తున్నారు. ప్రభుత్వం ఉంటే ఏమిటి, కూలితే ఏమిటి? తిరిగి అధికారంలోకి రావడానికి, అననికంటే ముందు ఈ పార్లమెంట్ ఎన్నికల్లో కనీసం గౌరవప్రదమైన సీట్లను గెలవడానికి కృషి చేయాల్సిన పార్టీ, ఇంకా మీనా మేషాలు లెక్కించడం, గతంలో చేసిన తప్పులే మళ్ళీమల్లి చేయడంతో, ఒక విధంగా ప్రజలు విసిగిపోయారు.
బిజేపికి సహకరిస్తే ఆత్మహత్యాసదృశ్యమే
బిజేపి పార్టీకి ఏవిధంగా సహకరించినా, అది ఆయా పార్టీలకు ఆత్మహత్యాసదృశ్యం అయిందనేది చరిత్ర. బిజేపి పార్టీ తన ఉనికిని పెంచుకోవడానికి, తానే ఏకైక పార్టీగా నిలవడానికి ప్రయత్నించడం తప్పు కాదు. ఎవరైనా అదే చేస్తారు. అన్ని రాష్ట్రాలలో తనతో పొత్తుపెట్టుకొన్న చిన్నచిన్న పార్టీల ఉనికిని మాయం చేసిన చరిత్ర బిజేపి పార్టీది. ఈ వాస్తవాన్నికాదని, కాంగ్రెస్ పార్టీని నాశనం చేయడానికి బజపకీ పరోక్షంగా సహకరిస్తే, చివరికి నష్టపోయేది భారాస పార్టీ కాదు తెలంగాణలోని ప్రజాలనే వాస్తవాన్ని భారాస గ్రహించాలి. భారాస ఖాళీ చేసిన రాజకీయ స్థాననాన్ని ఆక్రమించేది బిజేపి. మొగుడు కొట్టిందని కాకుండా, తోటి కోడలు నవ్విందనే పాత సామెతలా వ్యవహరిసే నష్టం ప్రజాలకే కాదు భారాస ఉనికికే.
More News...
<%- node_title %>
<%- node_title %>
ఆదిలాబాద్ అభివృద్ధికి ప్రత్యేక ప్రణాళికలు – సీఎం రేవంత్ రెడ్డి
ఆదిలాబాద్ డిసెంబర్ 04 (ప్రజా మంటలు):
ఆదిలాబాద్ జిల్లాను రాష్ట్రంలోనే అత్యంత అభివృద్ధి చెందిన జిల్లాగా మార్చేందుకు ప్రభుత్వం కట్టుబడి ఉందని ముఖ్యమంత్రి ఎ. రేవంత్ రెడ్డి అన్నారు. ప్రజా పాలన – ప్రజా విజయోత్సవాల భాగంగా ఆదిలాబాద్‌లో పలు అభివృద్ధి కార్యక్రమాలకు శంకుస్థాపన చేసి బహిరంగ సభలో మాట్లాడారు.
తుమ్మిడిహట్టి వద్ద ప్రాణహిత–చేవెళ్ల ప్రాజెక్టు... IndiGo సంక్షోభం: దేశవ్యాప్తంగా 175 ఫ్లైట్లు రద్దు — బెంగళూరులో ఒక్కరోజులో 73 రద్దు
బెంగళూరు, డిసెంబర్ 04 (ప్రజా మంటలు):
దేశంలో అతి పెద్ద ఎయిర్‌లైన్ అయిన ఇండిగోలో కొనసాగుతున్న సిబ్బంది కొరత తీవ్ర ప్రభావం చూపుతోంది. డిసెంబర్ 4 ఉదయం నాటికి దేశవ్యాప్తంగా మొత్తం 175 ఇండిగో ఫ్లైట్లు రద్దయ్యాయి. వీటిలో బెంగళూరు కెంపేగౌడ అంతర్జాతీయ విమానాశ్రయంలో ఒక్కరోజులోనే 73 ఫ్లైట్లు రద్దు కావడంతో ప్రయాణికులు తీవ్ర... చెరువులు, ఫ్లైఓవర్, ఎస్టీపీ—ప్రజా సమస్యలపై కవిత ఘాటు వ్యాఖ్యలు
హైదరాబాద్/మేడ్చల్–మల్కాజిగిరి (ప్రజా మంటలు):
తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు కల్వకుంట్ల కవిత జనం బాట కార్యక్రమంలో భాగంగా మేడ్చల్–మల్కాజిగిరి జిల్లాలో పలు ప్రాంతాలను సందర్శించారు. ప్రజలు ఎదుర్కొంటున్న సమస్యలను దగ్గరగా పరిశీలించి, ప్రభుత్వం మరియు ప్రజా ప్రతినిధుల వైఖరిపై ఘాటుగా వ్యాఖ్యానించారు.
రామంతపూర్: ఐలమ్మ విగ్రహానికి నివాళులు – చెరువు పరిశీలన
కవిత రామంతపూర్ ఇందిరానగర్‌లోని చాకలి... ఘనంగా ముగిసిన గురు చరిత్ర పారాయణం
జగిత్యాల డిసెంబర్ 4 (ప్రజా మంటలు)దత్త జయంతి పురస్కరించుకొని స్థానిక షిరిడి సాయి మందిరంలో గత వారం రోజులుగా కొనసాగుతున్న గురు చరిత్ర పారాయణం గురువారం ముగిసింది. ప్రముఖ పౌరాణిక పండితులు సభాపతి బ్రహ్మశ్రీ తిగుళ్ల విశు శర్మ, రాజేశ్వర శర్మ, వైదిక కార్యక్రమ క్రతువు నిర్వహించారు.
సామూహిక పంచామృత అభిషేకం, అష్టోత్తర శతనామార్చన,... పలు వార్డుల అభివృద్ధి పనులకు శంకుస్థాపన చేసిన ఎమ్మెల్యే డా సంజయ్ కుమార్
జగిత్యాల డిసెంబర్ 4( ప్రజా మంటలు)జగిత్యాల పట్టణ కొత్త బస్టాండ్ నుండి నర్సింగ్ కళాశాల రోడ్డులో 1 కోటి రూపాయలతో డ్రైనేజీ ,20వ వార్డులో 20 లక్షలతో డ్రైనేజీ నిర్మాణ పనులకు శంకుస్థాపన చేసిన జగిత్యాల శాసనసభ్యులు డా సంజయ్ కుమార్
ఈ కార్యక్రమంలో కమిషనర్ స్పందన డిఈ ఆనంద్ కె డి సి... బాబ్రీ మసీదు వ్యాఖ్యలతో వివాదం – తృణమూల్ ఎమ్మెల్యే హుమాయున్ కబీర్‌పై సస్పెన్షన్
కోల్‌కతా, డిసెంబర్ 04 (ప్రజా మంటలు):
బెంగాల్లో బాబ్రీ మసీదు పునాది వేస్తామని చేసిన వివాదాస్పద వ్యాఖ్యలతో తీవ్ర విమర్శలకు గురైన తృణమూల్ కాంగ్రెస్ (TMC) ఎమ్మెల్యే హుమాయున్ కబీర్ పై పార్టీ కఠిన చర్యలు తీసుకుంది. భరత్పూర్ నియోజకవర్గానికి చెందిన ఈ ఎమ్మెల్యేను పార్టీ అధికారికంగా సస్పెండ్ చేసినట్లు TMC ప్రకటించింది.
హుమాయున్ కబీర్... బీహార్ BJP ఎమ్మెల్యే ప్రమోద్ మహిళలపై అనుచిత వ్యాఖ్య
ప్రతిపక్షం తీవ్ర విమర్శలు
పాట్నా డిసెంబర్ 04:
బీహార్‌లోని మోతిహారి నుంచి BJP ఎమ్మెల్యే ప్రమోద్ కుమార్ మహిళల గురించి తీవ్రంగా అవమానకర వ్యాఖ్యలు చేసిన వీడియో బయటకు వచ్చింది. ఢిల్లీకి చెందిన కాంగ్రెస్ రాజ్యసభ సభ్యురాలు రేణుకా చౌదరి తన పెంపుడు కుక్కతో కనిపించిన విషయంపై పత్రికారులు బుధవారం పాట్నాలో శాసనసభ బయట ప్రశ్నించగా,... ఏకగ్రీవ గ్రామాల పాలకవర్గ సర్పంచు, ఉప సర్పంచ్, వార్డు సభ్యులను అభినందించిన ఎమ్మెల్యే డా సంజయ్ కుమార్
జగిత్యాల డిసెంబర్ 4(ప్రజా మంటలు)రూరల్ మండలము చర్లపల్లి, బీర్పూర్ మండలం గోండు గూడెం గ్రామాలు గ్రామపంచాయతీ ఎన్నికల్లో నామినేషన్ పూర్తయి సర్పంచ్ ఉపసర్పంచ్ వార్డ్ సభ్యులకు ఒక్కో నామినేషన్ రాగా నూతన పాలకవర్గం ఏకగ్రీవంగా ఎన్నిక కాగా గురువారం జగిత్యాలలో ఎమ్మెల్యే డా సంజయ్ కుమార్ ని ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో మర్యాద పూర్వకంగా... హైదరాబాద్‌లో సినిమా అవకాశాల పేరిట 9వ తరగతి విద్యార్థినిపై లైంగిక దాడి
హైదరాబాద్, డిసెంబర్ 04 (ప్రజా మంటలు):
సినిమా, సీరియల్ అవకాశాలు ఇస్తామని చెప్పి ఒక 13 ఏళ్ల 9వ తరగతి విద్యార్థినిపై లైంగిక దాడికి పాల్పడిన ఘటన హైదరాబాద్‌ను కుదిపేసింది. ఫిల్మ్‌నగర్ పోలీస్ స్టేషన్ పరిధిలో జరిగిన ఈ షాకింగ్ కేసులో ఇద్దరు సినిమా ఇండస్ట్రీ వ్యక్తులు మరియు బాలిక పెద్దమ్మ అరెస్టయ్యారు.
నిందితులు:బండి... MCC, MCMC మరియు సహాయ కేంద్రాలను (కంట్రోల్ రూమ్) వినియోగించుకోవాలి
జగిత్యాల డిసెంబర్ 4(ప్రజా మంటలు)
జిల్లాలో గ్రామ పంచాయతీ ఎన్నికల జరుగుతున్న నేపథ్యంలో జిల్లా కలెక్టరేట్ లో మోడల్ కోడ్ అఫ్ కండక్ట్, మీడియా సర్టిఫికేషన్ &మానిటరింగ్ కమిటీ మరియు సహాయ కేంద్రంను (కంట్రోల్ రూమ్) ఇప్పటికే ప్రారంభించామని జిల్లా కలెక్టర్ బి. సత్యప్రసాద్ తెలిపారు.
జగిత్యాల జిల్లాలో గ్రామ పంచాయతీ ఎన్నికలు జరిగే... రంగారెడ్డి ల్యాండ్ రికార్డ్స్ ఏడి శ్రీనివాస్‌పై ఏసీబీ సోదాలు
హైదరాబాద్, డిసెంబర్ 04 (ప్రజా మంటలు):
రంగారెడ్డి జిల్లా ల్యాండ్ రికార్డ్స్ అసిస్టెంట్ డైరెక్టర్ (AD) శ్రీనివాస్ పై ఆదాయానికి మించి ఆస్తులు కూడబెట్టినట్లు ఆరోపణల నడుమ ఏసీబీ (ACB) అధికారులు భారీ స్థాయిలో సోదాలు నిర్వహిస్తున్నారు. తెల్లవారుజాము నుంచి హైదరాబాద్, రంగారెడ్డి, మహబూబ్ నగర్ జిల్లాల్లో అధికారుల దాడులు కొనసాగుతున్నాయి.
సమాచారం ప్రకారం, రంగారెడ్డి... గొల్లపల్లి మండల నామినేషన్ సెంటర్ ను పరిశీలించిన డీఎస్పీ రఘు చందర్
(అంకం భూమయ్య)
గొల్లపల్లి డిసెంబర్ 04 (ప్రజా మంటలు):
మూడో విడత స్థానిక సంస్థల ఎన్నికల నామినేషన్ లు జరుగుతున్న సందర్భంగా జగిత్యాల డిఎస్పి రఘుచందర్ గొల్లపల్లి కేంద్రంలో నామినేషన్ ఎలక్షన్ కేంద్రాలను సందర్శించి భద్రత ఏర్పాట్లు పర్యవేక్షించి, సిబ్బందికి తగు సూచనలను సూచించారు. నామినేషన్ కేంద్రాల వద్ద ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా ముందు... 