తెలంగాణ కేబినెట్ ముఖ్యాంశాలు తేదీ. 23.03.26.
(సిరిసిల్ల. రాజా విక్రాంత్ శర్మ - 9963349493/9348422113).
నేటి తెలంగాణ కేబినెట్ ముఖ్యాంశాలు
హైదరాబాద్ 23 మార్చి (ప్రజా మంటలు). :
1. విద్వేషపూరిత ప్రసంగాలు.. విద్వేష పూరిత నేరాల నిరోధక బిల్లు (తెలంగాణ హేట్ స్పీచ్ అండ్ హేట్ క్రైమ్ ప్రివెన్షన్ బిల్లు 2026) ను మంత్రివర్గం ఆమోదించింది.
మత సామరస్యాన్ని భంగం కలిగించే పోస్టులు, అల్లర్లు ఘర్షణలు ప్రేరేపించే ప్రసంగాలను కట్టడి చేసేందుకు ఈ బిల్లును రూపొందించారు.
2. గిగ్, ప్లాట్‌ఫామ్ కార్మికుల సంక్షేమం.. భద్రత కోసం రూపొందించిన "తెలంగాణ ప్లాట్ ఫామ్ బేస్డ్ గిగ్ వర్కర్స్ (రిజిస్ట్రేషన్ , సోషల్ సెక్యూరిటీ అండ్ వెల్ఫేర్ ) యాక్ట్ , 2026" బిల్లును ఆమోదించిన కేబినెట్.
రాష్ట్రంలో దాదాపు 4.2 లక్షల మంది గిగ్ వర్కర్స్, ప్లాట్ ఫారం బేస్డ్ వర్కర్స్ ఉన్నారు. కొత్త బిల్లు ప్రకారం వర్కర్స్ రిజిస్ట్రేషన్ తో పాటు వెల్ఫేర్ బోర్డ్ ఏర్పాటు, సంక్షేమ నిధి ఏర్పాటు చేస్తారు.
ఈ బిల్లు ప్రకారం.. గిగ్ వర్కర్లకు చట్టబద్ధమైన గుర్తింపు, సామాజిక భద్రత లభించడంతో పాటు వారి సంక్షేమానికి బోర్డు ఏర్పాటు చేయడంతో వారి హక్కులకు రక్షణ లభిస్తుంది.
గతంలో మంత్రివర్గం ఆమోదించిన బిల్లును ఇటీవల కేంద్రం ప్రవేశపెట్టిన సోషల్ సెక్యూరిటీ కోడ్ కు అనుగుణంగా స్వల్ప మార్పులతో కేబినెట్ ఆమోదించింది.
3. హైదరాబాద్ లో ప్రస్తుతమున్న 69 కిలోమీటర్ల మెట్రో వ్యవస్థను ఎల్ అండ్ టీ కంపెనీ నుంచి స్వాధీనం చేసుకునే చర్యలు వేగవంతం చేయాలని కేబినెట్ నిర్ణయం తీసుకుంది.
రుణబారం సహా మొత్తం రూ.15 వేల కోట్లకు ప్రభుత్వం ఎల్ అండ్ టీ కి చెల్లించి ఫేజ్ 1 ప్రాజెక్టు స్వాధీనం చేసుకోవాల్సి ఉంటుందని ఇప్పటికే సబ్ కమిటీ నివేదికను సమర్పించింది
ప్రభుత్వం తరపున ఈ నిధుల చెల్లింపులు, లావాదేవీల బాధ్యతను నిర్వర్తించే బాధ్యతను హైదరాబాద్ మెట్రో రైల్ లిమిటెడ్ కు అప్పగించింది. HMRL ను నోడల్ ఏజెన్సీ గా నియమించేందుకు కేబినెట్ ఆమోదం తెలిపింది.
4. తెలంగాణ అడ్వకేట్ ప్రొటెక్షన్ బిల్లుకు కేబినెట్ ఆమోదం తెలిపింది. న్యాయవాదుల పై జరుగుతున్న దాడుల ఘటనలను కట్టడి చేసేందుకు, న్యాయవాదులకు రక్షణ కల్పించేందుకు ఈ బిల్లు రూపొందించారు. గతంలో జరిగిన అడ్వకేట్ దంపతులు వామనరావు హత్యల నేపథ్యంలో న్యాయవాదుల కు రక్షణ, తగిన భద్రత కల్పించాలని మంత్రివర్గం నిర్ణయించింది.
5.రాష్ట్రంలో చేపట్టిన కులగణనను అధ్యయనం చేయడానికి రాష్ట్ర ప్రభుత్వం నియమించిన స్వతంత్ర నిపుణుల కమిటీ నివేదికను కేబినెట్ ఆమోదించింది.
ఇండిపెండెంట్ ఎక్స్పర్ట్ వర్కింగ్ గ్రూప్ చైర్మన్ జస్టిస్ సుదర్శన్ రెడ్డి అధ్వర్యంలోని నిపుణుల కమిటీ ఈ నివేదిక తయారు చేశారు.
నిపుణుల కమిటీ సమర్పించిన నివేదికలోని అంశాలను కేబినెట్ చర్చించింది.
సామాజిక న్యాయం, అన్ని వర్గాల సాధికారత లక్ష్యంగా దేశంలోనే మొదటిసారిగా తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం సామాజిక, ఆర్థిక, కుల సర్వేను నిర్వహించింది.
2024 నవంబర్ 6వ తేదీ నుంచి డిసెంబర్ 25వ తేదీ వరకు 50 రోజుల పాటు రాష్ట్రమంతటా సర్వే నిర్వహించింది.
నిపుణుల కమిటీ ఇచ్చిన నివేదికను పరిశీలించే బాధ్యతను కేబినెట్ సబ్ కమిటీ కి అప్పగించింది.
6.విద్యాలయాల్లో కుల వివక్షను నియంత్రించేందుకు ఉద్దేశించిన రోహిత్ వేముల చట్టం విధివిధానాల రూపకల్పనకు ఉప ముఖ్యమంత్రి మల్లు భట్టి విక్రమార్క అధ్యక్షతన మంత్రివర్గ ఉప సంఘం ఏర్పాటుకు క్యాబినెట్ ఆమోదం.. మంత్రివర్గం ఉప సంఘం సభ్యులుగా మంత్రులు దామోదర రాజనరసింహ, దుద్దిళ్ల శ్రీధర్ బాబు, ఉత్తమ్ కుమార్ రెడ్డి, పొన్నం ప్రభాకర్...
7. వృద్ధాప్యంలో ఉన్న తల్లిదండ్రులను ఆదరించని ప్రజా ప్రతినిధులు, ప్రభుత్వ, ప్రైవేటు ఉద్యోగుల వేతనాల నుంచి 15 శాతం లేదా రూ.10 వేలు ఏది తక్కువైతే ఆ మొత్తం వేతనాల నుంచి పరిహరించి తల్లిదండ్రులకు అందజేసే తల్లిదండ్రుల మద్దతు బిల్లును ఆమోదించిన క్యాబినెట్.
More News...
<%- node_title %>
<%- node_title %>
తెలంగాణ కేబినెట్ ముఖ్యాంశాలు తేదీ. 23.03.26.
(సిరిసిల్ల. రాజా విక్రాంత్ శర్మ - 9963349493/9348422113).
నేటి తెలంగాణ కేబినెట్ ముఖ్యాంశాలు
హైదరాబాద్ 23 మార్చి (ప్రజా మంటలు). :
1. విద్వేషపూరిత ప్రసంగాలు.. విద్వేష పూరిత నేరాల నిరోధక బిల్లు (తెలంగాణ హేట్ స్పీచ్ అండ్ హేట్ క్రైమ్ ప్రివెన్షన్ బిల్లు 2026) ను మంత్రివర్గం ఆమోదించింది.
మత... విద్యార్థుల హాజరు శాతాన్ని పెంచేందుకు కృషి చేయాలి ఐసిడిఎస్ సిడిపిఓ మమత
జగిత్యాల, మార్చి 23: (ప్రజా మంటలు)విద్యార్థుల హాజరు శాతాన్ని పెంచే దిశగా అంగన్వాడి టీచర్లు కృషి చేయాలని ఐ సి డి ఎస్ సిడిపిఓ మమత అన్నారు. సోమవారం జగిత్యాల అర్బన్ మండలంలోని మోతె గ్రామంలో గల అంగన్వాడీ కేంద్రాలను ఆకస్మికంగా తనిఖీ చేశారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ అంగన్వాడి కేంద్రాలు సజావుగా... ప్రజావాణి లో వచ్చిన ఫిర్యాదులు సత్వరమే పరిష్కరించాలి పలు సమస్యలపై వినతులు స్వీకరించిన జిల్లా కలెక్టర్ బి. సత్యప్రసాద్
జగిత్యాల మార్చి 23 (ప్రజా మంటలు)
ప్రజావాణి అర్జీల పై సమగ్ర విచారణ జరిపి సమస్యలను త్వరగా పరిష్కరించాలని అధికారులను జిల్లా కలెక్టర్ బి. సత్యప్రసాద్ అధికారులను అదేశించారు.
సోమవారం కలెక్టరేట్ ఆడిటోరియంలో నిర్వహించిన ప్రజావాణి కార్యక్రమంలో ప్రజల నుండి ఫిర్యాదులు, వినతులను ఆర్డీఓలతో కలిసి స్వీకరించారు.
జిల్లా కలెక్టర్ బి. సత్యప్రసాద్ మాట్లాడుతూ
పలు... ప్రజావాణి లో వచ్చిన ఫిర్యాదులు సత్వరమే పరిష్కరించాలి పలు సమస్యలపై వినతులు స్వీకరించిన జిల్లా కలెక్టర్ బి. సత్యప్రసాద్
జగిత్యాల మార్చి 23 (ప్రజా మంటలు)
ప్రజావాణి అర్జీల పై సమగ్ర విచారణ జరిపి సమస్యలను త్వరగా పరిష్కరించాలని అధికారులను జిల్లా కలెక్టర్ బి. సత్యప్రసాద్ అధికారులను అదేశించారు.
సోమవారం కలెక్టరేట్ ఆడిటోరియంలో నిర్వహించిన ప్రజావాణి కార్యక్రమంలో ప్రజల నుండి ఫిర్యాదులు, వినతులను ఆర్డీఓలతో కలిసి స్వీకరించారు.
జిల్లా కలెక్టర్ బి. సత్యప్రసాద్ మాట్లాడుతూ
పలు... పోలీస్ శాఖను ప్రజలకు మరింత చేరువ చేయడమే గ్రీవెన్స్ డే లక్ష్యం జిల్లా ఎస్పీ అశోక్ కుమార్
జగిత్యాల మార్చి 23 ( ప్రజా మంటలు)
ప్రజల సౌకర్యార్థం నిర్వహించే గ్రీవెన్స్ డే లో బాగంగా జిల్లా పోలీసు కార్యాలయంలో జిల్లాలోని వివిధ ప్రాంతాల నుండి వచ్చిన 12 మంది అర్జీదారులతో నేరుగా మాట్లాడి వారి సమస్యలను తెలుసుకొని సంబంధిత అధికారులతో ఫోన్ లో మాట్లాడి ఫిర్యాదులపై తక్షణ చర్యలు తీసుకొని బాధితులకు న్యాయం... సిద్ధిపేటలో భారీ అభివృద్ధి పనులకు సీఎం రేవంత్ రెడ్డి శ్రీకారం – నర్మెట్టలో ఆయిల్ పామ్ ఫ్యాక్టరీ ప్రారంభం
సిద్ధిపేట, మార్చి 22 (ప్రజా మంటలు):
ప్రజా పాలనలో భాగంగా నిర్వహిస్తున్న రైతు ఉత్సవాల కార్యక్రమంలో ముఖ్యమంత్రి శ్రీ ఎ. రేవంత్ రెడ్డి ఆదివారం సిద్ధిపేట జిల్లాలో పలు కీలక అభివృద్ధి కార్యక్రమాలకు శ్రీకారం చుట్టారు.
. ఈ సందర్భంగా నంగునూరు మండలం నర్మెట్ట గ్రామంలో రూ.300 కోట్ల వ్యయంతో నిర్మించిన ఆయిల్ పామ్ ఫ్యాక్టరీని... కాంగ్రెస్‌కు గుడ్‌బై చెప్పనున్న జీవన్ రెడ్డి - 25న కీలక సమావేశం - రాజీనామా ప్రకటనకు సిద్ధం
జగిత్యాల, మార్చ్ 22 (ప్రజా మంటలు):
మాజీ మంత్రి తాటిపర్తి జీవన్ రెడ్డి కాంగ్రెస్ పార్టీకి రాజీనామా చేయడానికి సిద్ధపడ్డారు. ఈనెల 25న అభిమానులు, శ్రేయోభిలాషులతో సమావేశం నిర్వహించి, భవిష్యత్ కార్యాచరణ ప్రకటించనున్నట్లు తెలిపారు. అదే రోజు కాంగ్రెస్ పార్టీ సభ్యత్వానికి రాజీనామా చేయనున్నట్లు స్పష్టం చేశారు.జగిత్యాల జిల్లా కేంద్రంలోని ఇందిరా భవన్‌లో జరిగిన... ఇరాన్ అధికారులపై సౌదీ అరేబియా కఠిన నిర్ణయం – 24 గంటల్లో దేశం విడిచి వెళ్లాలని నిష్క్రమణ ఉత్తర్వులు
రియాద్ మార్చ్ 22:
మధ్యప్రాచ్యంలో కొనసాగుతున్న ఉద్రిక్త పరిస్థితుల నేపథ్యంలో ఇరాన్ మరియు సౌదీ అరేబియా మధ్య దౌత్య సంబంధాలు మరింత దిగజారుతున్నాయి. ఈ పరిణామాల్లో భాగంగా, సౌదీ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. సౌదీ అధికారులు ఒక ఇరాన్ సైనిక అధికారిని, అలాగే రాయబార కార్యాలయానికి చెందిన నలుగురు సిబ్బందిని “అనవసర వ్యక్తులు” (persona... రంజాన్ పర్వదినం సందర్భంగా ముస్లిం సోదరులకు శుభాకాంక్షలు: జిల్లా ఎస్పీ అశోక్ కుమార్
జగిత్యాల మార్చి 21 (ప్రజా మంటలు)ఈద్గా ల వద్ద బందోబస్తు ఏర్పాట్లను పరిశీలించిన ఎస్పీ
రంజాన్ పర్వదినాన్ని పురస్కరించుకొని జిల్లా ఎస్పీ అశోక్ కుమార్ ముస్లిం సోదర సోదరీమణులకు శుభాకాంక్షలు తెలిపారు. ఈ పవిత్ర పర్వదినాన్ని శాంతి, సామరస్య వాతావరణంలో ఆనందంగా జరుపుకోవాలని ఆకాంక్షించారు.
ఈ సందర్భంగా జిల్లాలోని పలు ఈద్గాల వద్ద ఏర్పాటు... ముస్లిం సోదరులకు శుభాకాంక్షలు తెలియజేసిన మాజీ జడ్పీ చైర్పర్సన్ వసంత
జగిత్యాల మార్చి 21 (ప్రజా మంటలు)పట్టణం లో పవిత్ర రంజాన్ పండుగ సందర్భంగా మంచినీళ్ల బావి ఈద్గా మరియు కిల్ల జగిత్యాల జమ మసీద్ దగ్గర బి ఆర్ ఎస్ నాయకులతో కలిసి మైనార్టీ సోదరులకు రంజాన్ పండుగ శుభాకాంక్షలు తెలియజేశారు.
జిల్లా తొలి జడ్పీ చైర్పర్సన్ దావ వసంత సురేష్ ఈ సందర్భంగా... జనాకర్షక పథకాల కి తప్ప విద్యారంగానికి కేటాయింపులు లేవు_ )ఎస్ టి యు
జగిత్యాల మార్చి 20(ప్రజా మంటలు)జనాకర్షక పథకాలకే తప్ప ప్రస్తుత విద్యా వ్యవస్థను బాగు చేసే విధంగా విద్యారంగానికి కేటాయింపులు లేవని స్టేట్ టీచర్స్ యూనియన్ జగిత్యాల జిల్లా శాఖ అభిప్రాయపడింది. శుక్రవారం రాష్ట్ర ప్రభుత్వం ప్రవేశ పెట్టిన బడ్జెట్ పై ఎస్టీయూ జగిత్యాల జిల్లా శాఖ అధ్యక్ష, ప్రధాన కార్యదర్శి లు బైరం హరికిరణ్,... అన్నాడీఎంకే కూటమిలో సీట్ల పంపకం ఎప్పుడు? ఏమిటి సమస్య? ఎవరికెంత?
చెన్నై మార్చ్ 19:
తమిళనాడు అసెంబ్లీ ఎన్నికలను దృష్టిలో ఉంచుకుని అన్నా ద్రవిడ మున్నేట్ర కళగం (అన్నాడీఎంకే) నేతృత్వంలోని జాతీయ ప్రజాస్వామ్య కూటమిలో సీట్ల పంపకం చర్చలు తుది దశకు చేరుకున్నాయని సమాచారం.. ఇప్పటి వరకు లభ్యమైన వివరాల ప్రకారం:భారతీయ జనతా పార్టీ (బీజేపీ)కి – 27 స్థానాలుపట్టాళి మక్కల్ కచ్చి (పామక)కు... 