31న అరవింద్ కేజ్రీవాల్‌కు సంఘీభావంగా ఇండియా కూటమి సభకు అనుమతి మంజూరు..

On
31న అరవింద్ కేజ్రీవాల్‌కు సంఘీభావంగా ఇండియా కూటమి సభకు అనుమతి మంజూరు..

(సిరిసిల్ల. రాజా విక్రాంత్ శర్మ - 9963349493/9348422113)

 

ఢిల్లీ మార్చి 29 (ప్రజా మంటలు) : 

ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్‌కు సంఘీభావంగా మార్చి 31న ఢిల్లీ లోని రాం లీలా మైదాన్‌‌ వేదికగా ఇండియా కూటమి తలపెట్టిన భారీ బహిరంగ సభకు అనుమతి లభించింది.

ఈ సభకు ఢిల్లీ పోలీసు విభాగం, కేంద్ర ఎన్నికల సంఘం అనుమతులు మంజూరు చేశాయి.

లిక్కర్ స్కాం కేసులో అరెస్టయిన ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్‌కు సంఘీభావంగా ఇండియా కూటమి ఈ సభ నిర్వహిస్తోంది.

అగ్ర నేతలు రాహుల్ గాంధీ, మల్లికార్జున ఖర్గే, శరద్ పవార్, ఉద్ధవ్ ఠాక్రే తదితరులు హాజరు కానున్నారు..

Tags