పెండింగ్ కేసుల పై ప్రతేక దృష్టి సారించాలి : జిల్లా ఎస్పీ శ్రీ సన్ ప్రీత్ సింగ్ ఐపిఎస్.
- పటిష్ట మైన ప్రణాళికతో రానున్న లోక్ సభ ఎన్నికల నిర్వహణ.
జగిత్యాల మార్చి 29 (ప్రజా మంటలు) :
నేర విచారణ మరింత సమర్ధవంతంగా చేయడంతో పాటు కేసులను సత్వరం పరిష్కరించే విధంగా పోలీస్ అధికారులంతా సమర్ధవంతంగా పని చేయాలని జిల్లా ఎస్పీ సన్ ప్రీత్ సింగ్ ఐపిఎస్ సూచించారు.
జిల్లా పోలీసు కార్యాలయంలో నిర్వహించిన నేర సమీక్షా సమావేశంలో ఎస్పీ మాట్లాడుతూ మారుతున్న పరిస్థితులకు అనుగుణంగా నేర విచారణ మరింత సమర్ధవంతంగా, అన్ని స్థాయిలలో అవసరమైన సాంకేతిక పరిజ్ఞానం వినియోగిస్తూ ముందుకు సాగాలని అన్నారు.పోలీసు స్టేషన్లలో నమోదయ్యే ప్రతీ కేసు వివరాలను ఆన్లైన్లో ఎప్పటికప్పుడు పొందుపరచాలని తెలిపారు.
దీర్ఘకాలంగా పెండింగులో ఉన్న కేసులపై ప్రత్యేక దృష్టి సారించి వెంటనే వాటిని పరిష్కరించేలా చర్యలు తీసుకోవాలని అధికారులను ఆదేశించారు. డీఎస్పీ లు, సి.ఐ లు తమ పరిధిలో ఉండే పోలీస్ స్టేషన్ లలో నమోదైన వివిధ రకాల కేసులు యొక్క స్థితిగతులను ఎప్పటికప్పుడు సమీక్షిస్తూ సంబంధిత ఎస్.ఐలకు కేసుల దర్యాప్తు కు సంభందించి సూచనలు ఇవ్వాలని సూచించారు.
పెండింగ్లో ఉన్న కేసుల సత్వర పరిష్కారానికి న్యాయధికారులతో సమన్వయం పాటిస్తూ భాదితులకు న్యాయం చేకూరేలా పనిచేయాలని కోరారు. ప్రతి పోలీస్ స్టేషన్ పరిధిలో ప్రతి రోజూ డ్రంక్ అండ్ డ్రైవ్ టెస్ట్ లు, వాహన తనిఖీలు నిర్వహించాలని,బహిరంగ ప్రదేశాలలో మద్యం సేవించే ప్రాంతాల పై నిఘా ఉంచాలని వారి పై కేస్ లు నమోదు చేయాలని అన్నారు.
బ్లాక్ స్పాట్స్(రోడ్డు ప్రమాదాల ప్రమాదాలు అధికముగా జరుగు ప్రదేశాలు) గుర్తించి పంచాయతీ రాజ్ మరియు ఆర్&బి ప్రబుత్వ శాఖల సమన్వయంతో ప్రమాదాల నివరణ పై దృష్టి సారించాలని అన్నారు.
రాష్ట్ర, జిల్లాల సరిహద్దుల నుండి వచ్చే గంజాయి, సరఫరా చేసే వ్యక్తులను గుర్తించి వారిపై కేసులు నమోదు చేసి రవాణా ను పకడ్బందీగా నియంత్రించాలన్నారు. జిల్లాలో గంజాయి,మత్తు పదార్థాలు పూర్తి స్థాయిలో నిర్ములించేందుకు జిల్లా పోలీస్ యంత్రంగం ప్రత్యేక ప్రణాళికలను ఏర్పాటు చేసుకొని మండలాల్లో, గ్రామాల్లో నిత్యం తనిఖీలు నిర్వహిస్తు ముందుకు సాగుతుంది అన్నారు.
వివిధ జిల్లాల వారీగా నుండి జిల్లాకు వచ్చే గంజాయి మూలలను,కీలక వ్యక్తులను గుర్తించి వారి పై కఠిన చర్యలు తీసుకుంటున్నామని అన్నారు. ప్రతి పోలీస్ స్టేషన్ పరిధిలో,కలశాలలో గంజాయ ,మత్తు పధార్థాలకు అలవాటు పడకుండా అవగాహన కార్యక్రమాలు నిర్వహించాలని అన్నారు. గంజాయి, మరే ఇతర మత్తు పదార్థాలు అమ్ముతున్నట్లు రవాణా చేస్తున్నట్లు సమాచారం ఉంటే వెంటనే పోలీస్ స్టేషన్ కి లేదా డయల్100 కు సమాచారం అందించాలని, సమాచారం అందించిన వారి పేర్లను గోప్యంగా ఉంచుతామని తెలిపారు.
ప్రాసిక్యూషన్ లో భాగంగా కోర్టు వారు జారిచేసిన నాన్ బెయిలబుల్ వారెంట్లను నిందితులపై లేదా తప్పించుకుని తిరుగుతున్న నేరస్తులపై అమలుపరచడానికి అధికారులు అందరూ కృషి చేయాలని సూచించారు.
నాన్ బెయిలబుల్ వారెంట్లను త్వరగా ఎగ్జిక్యూట్ చేయడం వల్ల కేసు విచారణ విజయవంతంగా పూర్తి అయి సకాలంలో బాధితులకు న్యాయం జరుగుటకు ఆస్కారం వుంటుంది అన్నారు.
జిల్లాలో పటిష్టమైన ప్రణాళికతో ప్రశాంత వాతావరణంలో రాబోవు లోక్ సభ ఎన్నికలు జరిగేలా ప్రతీ ఒక్క అధికారి ఇతర శాఖల సమన్వయంతో కలిసి పని చేయాలనీ సూచించారు.
జిల్లాకు అక్రమంగా డబ్బు, మద్యం, ఇతర వస్తువులు రానీయకుండా పకడ్బందీగా చెక్ పోస్టు ల నిర్వహణ ఉండాలనీ అన్నారు.
ఈ యొక్క సమావేశంలో ఏ ఎస్ పి శివం ఉపాధ్యాయ ఐపీఎస్ గారు , డీఎస్పీలు రఘు చందర్,ఉమామహేశ్వర రావు,రంగా రెడ్డి డిసిఆర్బి , సీసీఎస్ ,ఎస్బి, ఐటి కోర్ ఇన్స్పెక్టర్ లు శ్రీనివాస్, లక్ష్మీనారాయణ,నాగేశ్వర రావు, రఫీక్ ఖాన్, మరియు సి.ఐ లు, ఎస్.ఐ డి సి ఆర్ బి , ఐటీ కోర్ సిబ్బంది పాల్గొన్నారు.
More News...
<%- node_title %>
<%- node_title %>
శిశువుతో మహిళా జర్నలిస్టుకు సీసీఎస్‌లో గంటల తరబడి విచారణ
హైదరాబాద్, అక్టోబర్ 8 (ప్రజా మంటలు):
ఆరు నెలల పసికందును చేతుల్లో ఎత్తుకుని సెంట్రల్ క్రైమ్ స్టేషన్ (సీసీఎస్)కు వెళ్లిన మహిళా జర్నలిస్టు జల్లి రేఖను దాదాపు ఏడు గంటలపాటు అక్కడే ఉంచి ప్రశ్నించారనే ఆరోపణలు హైదరాబాద్‌లో తీవ్ర చర్చకు దారితీశాయి. ఆమె వెంట మూడేళ్ల కుమారుడు కూడా ఉన్నట్లు వార్తా కథనాలు పేర్కొన్నాయి. మహిళా... లక్ష్మీపూర్‌లో కోడి పందాలపై పోలీసుల దాడి
గొల్లపల్లి అక్టోబర్ 08 (ప్రజా మంటలు):
మండలంలోని లక్ష్మీపూర్ గ్రామ పరిధిలో కోడి పందాలు నిర్వహిస్తున్నారన్న నమ్మదగిన సమాచారంతో గొల్లపల్లి పోలీసులు దాడి నిర్వహించారు.
గొల్లపల్లి పోలీస్‌స్టేషన్ ఎస్ఐ కృష్ణసాగర్ రెడ్డి ఆధ్వర్యంలో సిబ్బందితో కలిసి పోలీసులు లక్ష్మీపూర్ గ్రామానికి వెళ్లి తనిఖీలు చేపట్టారు. ఈ సందర్భంగా సుమారు ఎనిమిది మంది వ్యక్తులు, మరికొందరు కలిసి... విద్యుత్ సమస్యల పరిష్కారానికి తక్షణ చర్యలు చేపట్టాలి
ఎల్కతుర్తి, అక్టోబర్ 8 (ప్రజా మంటలు):
హనుమకొండ జిల్లా ఎల్కతుర్తి, భీమదేవరపల్లి 33/11 కేవీ సబ్స్టేషన్లతో పాటు 132/32 కేవీ భీమదేవరపల్లి సబ్‌స్టేషన్‌ను టీజీ ఎన్పీడీసీఎల్ సీఎండీ కర్ణాటి వరుణ్ రెడ్డి ఐఏఎస్ గురువారం తనిఖీ చేశారు. ఈ సందర్భంగా ఆయా సబ్స్టేషన్ల పరిధిలో విద్యుత్ సరఫరా పరిస్థితిని క్షేత్రస్థాయిలో సమీక్షించారు.
విద్యుత్ సరఫరాలో ఎదురవుతున్న... జగిత్యాల మెడికల్ కళాశాల భవనాలు ఎప్పుడు పూర్తి చేస్తారు?
జగిత్యాల, అక్టోబర్ 08 (ప్రజా మంటలు):
విద్య, వైద్యం ప్రతి పౌరుడి ప్రాథమిక హక్కులని, వాటిని అందించడం ప్రభుత్వ బాధ్యత అని మాజీ మంత్రి, బీఆర్ఎస్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి తాటిపర్తి జీవన్‌రెడ్డి అన్నారు. జగిత్యాల పట్టణంలోని తెలంగాణ భవన్లో జిల్లా పరిషత్ తొలి చైర్పర్సన్ దావా వసంత సురేష్, బీఆర్ఎస్ నాయకులతో కలిసి నిర్వహించిన... ఆర్టీసీ డిపో ఎన్నికల ప్రచారంలో పాల్గొన్న ఎమ్మెల్యే డా సంజయ్ కుమార్, డిసిసి అధ్యక్షులు నందయ్య
జగిత్యాల అక్టోబర్ 8 (ప్రజా మంటలు)తెలంగాణ రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థ జగిత్యాల డిపో వద్ద తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా నిర్వహిస్తున్న ఆర్ టి సి యూనియన్ ఎన్నికల్లో ఐ ఎన్ టి యు సి ,ఎస్ డబ్ల్యూ యూ, టి డబ్ల్యూయూ, ఎస్ డబ్ల్యూ ఎఫ్ లకు మద్దతుగా బాణం గుర్తుకే ఓటు... ఆలయ నిధులను ప్రభుత్వ నిధులుగా ప్రచారం చేయడం సరికాదు : బీజేపీ నేత ఖమ్మం వేంకటేశం
కోహెడ, అక్టోబర్ 08 (ప్రజా మంటలు):
ఆలయాల అభివృద్ధి కోసం భక్తులు, దాతలు సమకూర్చిన నిధులను రాష్ట్ర ప్రభుత్వ నిధులుగా ప్రచారం చేసుకోవడం సరికాదని బీజేపీ సిద్దిపేట జిల్లా ప్రధాన కార్యదర్శి ఖమ్మం వేంకటేశం అన్నారు. గురువారం కోహెడ మండల కేంద్రంలో నిర్వహించిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు.
హుస్నాబాద్ నియోజకవర్గంలోని కొత్తకొండ శ్రీ వీరభద్రస్వామి... రోల్లవాగు ప్రాజెక్టు పూర్తికి కృషి: ఎమ్మెల్యే సంజయ్ కుమార్
బీర్పూర్, అక్టోబర్ 8 (ప్రజా మంటలు):
గోదావరి పుష్కరాల నేపథ్యంలో బీర్పూర్ మండలంలోని రంగసాగర్, మంగేలా, కమ్మనూరు, చిత్రవేణిగూడెం, రేకులపల్లి గ్రామాల్లో ఎమ్మెల్యే డా. సంజయ్ కుమార్ పర్యటించి పుష్కర ఘాట్ల ఏర్పాట్లను పరిశీలించారు. భక్తులకు ఇబ్బందులు లేకుండా తాగునీరు, పారిశుద్ధ్యం, విద్యుత్, మరుగుదొడ్లు, భద్రతా ఏర్పాట్లు చేయాలని అధికారులను ఆదేశించారు.
మంగేలా ఆశ్రమ పాఠశాలలో... రూ.12 వేల లంచం తీసుకుంటూ అటవీ అధికారి అరెస్ట్
ఖానాపూర్ అక్టోబర్ 08 (ప్రజా మంటలు):
నిర్మల్ జిల్లా ఖానాపూర్ అటవీ శాఖ కార్యాలయంలో ఏసీబీ అధికారులు దాడులు నిర్వహించారు. టింబర్ డిపో పర్మిషన్ కోసం ఓ వ్యక్తి నుంచి రూ.12 వేల లంచం తీసుకుంటుండగా ఫారెస్ట్ సెక్షన్ అధికారి రవీందర్‌ను ఏసీబీ అధికారులు రెడ్‌హ్యాండెడ్‌గా పట్టుకున్నారు. అధికారులు తదుపరి విచారణ చేపట్టారు. ఓటు చోరీకి వ్యతిరేకంగా కాంగ్రెస్ ‘బ్లాక్ డే’
కరీంనగర్ అక్టొబర్ 08(ప్రజా మంటలు):
AICC, TPCC పిలుపు మేరకు కరీంనగర్ కార్పొరేషన్ కాంగ్రెస్ ఆధ్వర్యంలో గాంధీ రోడ్డులోని మహాత్మా గాంధీ విగ్రహం వద్ద ‘బ్లాక్ డే’ నిరసన చేపట్టారు. ఓటు చోరీకి వ్యతిరేకంగా రాహుల్ గాంధీ, ప్రియాంక గాంధీ, ఇండియా కూటమి ఎంపీలపై జరిగిన లాఠీచార్జ్‌ను నిరసిస్తూ నల్ల బ్యాడ్జీలతో ఆందోళన నిర్వహించారు.
కార్పొరేషన్... రేకుల షెడ్డులోనే వైద్య తరగతులా?
జగిత్యాల అక్టోబర్ 08 (ప్రజా మంటలు):
ప్రభుత్వ వైద్య కళాశాల విద్యార్థులు తమకు కనీస వసతులు కల్పించడంలేదని ఆరోపిస్తూ వరుసగా రెండో రోజు ఆందోళనకు దిగారు. కళాశాలలో మౌలిక సదుపాయాలు లేక తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నామని పేర్కొంటూ తరగతులను బహిష్కరించి నిరసన వ్యక్తం చేశారు.
విద్యార్థుల ఆందోళనలో ప్రధానంగా తరగతి గదులు, మౌలిక వసతుల కొరత... బాలీవుడ్ నటుడు నానా పటేకర్ కన్నుమూత
ముంబాయి అక్టోబర్ 08:
ముంబై: ప్రముఖ బాలీవుడ్ నటుడు, దర్శకుడు నానా పటేకర్ (75) కన్నుమూశారు. గురువారం తెల్లవారుజామున గోవాలోని తన నివాసంలో ఆయన అకస్మాత్తుగా అపస్మారక స్థితిలోకి వెళ్లారు. కుటుంబ సభ్యులు వెంటనే ఆసుపత్రికి తరలించగా, అప్పటికే ఆయన పరిస్థితి విషమంగా ఉన్నట్లు వైద్యులు తెలిపారు. మణిపాల్ ఆసుపత్రి వైద్యుల ప్రకారం నానా పటేకర్ ... రైతుల సంక్షేమానికి పీఏసీఎస్‌లు సమర్థవంతంగా పనిచేయాలి: ఎమ్మెల్యే డా. సంజయ్ కుమార్
రాయికల్, అక్టోబర్ 7 (ప్రజా మంటలు):
రైతుల సంక్షేమం కోసం ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘాలు (పీఏసీఎస్) మరింత సమర్థవంతంగా పనిచేయాలని జగిత్యాల ఎమ్మెల్యే డా. సంజయ్ కుమార్ సూచించారు.
రాయికల్ మండలం ఇటిక్యాల గ్రామంలో నిర్వహించిన ఇటిక్యాల పీఏసీఎస్ నూతన కార్యవర్గ ప్రమాణ స్వీకార కార్యక్రమానికి ఎమ్మెల్యే హాజరయ్యారు. నూతనంగా బాధ్యతలు స్వీకరించిన పీఏసీఎస్... 