ప్రభుత్వ స్థలములో ప్రహరీ నిర్మాణం

ఆందోళనకు దిగిన గ్రామస్తులు

On
ప్రభుత్వ స్థలములో ప్రహరీ నిర్మాణం

విశ్వనాథ కాలనీ గ్రామంలో ఉద్రిక్తత

భీమదేవరపల్లి మార్చి 29 (ప్రజామంటలు) :

మడలంలోని విశ్వనాధ కాలనీ గ్రామములో ఓ వ్యక్తి ప్రభుత్వ స్థలాన్ని ఆక్రమించి ప్రహరీ గోడ నిర్మాణం చేపట్టారు. సదరు స్థలం గ్రామ పంచాయతీకి కేటాయించగా తప్పుడు ఆధారాలతో నిర్మాణం చేపట్టినట్లు గ్రామస్తులు ఆరోపిస్తున్నారు. కాగా శుక్రవారం గ్రామస్తులు పనులను ఆపడంతో ఉద్రిక్త వాతావరణం చోటుచేసుకుంది. ఘటన స్థలానికి ఏఎస్ఐ సంపత్ చేరుకొని రెవెన్యూ అధికారులు హద్దులు నిర్ణయించేంతవరకు పనులను ఆపాలని వారికి సూచించారు.

Tags