ప్రజలకు ప్రత్యామ్నాయ పార్టీ లేకపోవడంతోనే కాంగ్రెస్ గెలిచింది - కవిత
బీఆర్ఎస్, బీజేపీ మధ్య నార్త్ తెలంగాణలో అప్రకటిత పొత్తు
హైదరాబాద్, ఫిబ్రవరి 14 (ప్రజా మంటలు):
మున్సిపల్ ఎన్నికలు కేవలం ట్రైలర్ మాత్రమే, అసలు సినిమా ఇంకా మిగిలే ఉందని తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు కల్వకుంట్ల కవిత స్పష్టం చేశారు. హైదరాబాద్‌లో జరిగిన విలేకరుల సమావేశంలో ఆమెతో పాటు ఆల్ ఇండియా ఫార్వర్డ్ బ్లాక్ రాష్ట్ర కన్వీనర్ అంబటి జోజిరెడ్డి, హెచ్ఎంఎస్ ప్రధాన కార్యదర్శి రియాజ్ అహ్మద్ పాల్గొన్నారు.
ఈ సందర్భంగా కవిత మాట్లాడుతూ,
మున్సిపల్ ఎన్నికల్లో కాంగ్రెస్ ప్రజలకు ఇచ్చిన హామీలను అమలు చేయకుండానే ఎక్కువ స్థానాలు గెలుచుకుందని విమర్శించారు. మరోవైపు, ప్రజలు తమకు గుడులు కట్టారంటూ ప్రచారం చేసుకునే బీఆర్ఎస్ చాలా చోట్ల మూడు, నాలుగు స్థానాలకు పరిమితమైందన్నారు. గతంలో 90 శాతం మున్సిపాలిటీల్లో గెలిచిన బీఆర్ఎస్ ఇప్పుడు కేవలం 16 మున్సిపాలిటీలకే పరిమితమైందని తెలిపారు.
ప్రజలకు సరైన ప్రత్యామ్నాయం లేకపోవడం వల్లే కాంగ్రెస్‌కు ఓట్లు పడ్డాయని కవిత అభిప్రాయపడ్డారు. తెలంగాణకు రూపాయి కూడా ఇవ్వని బీజేపీ కరీంనగర్ మేయర్ స్థానం తప్ప మిగతా చోట్ల తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొందని అన్నారు. అయితే ఈ ఎన్నికల్లో తమలాంటి కొత్త తరహా రాజకీయ శక్తులను ప్రజలు ఆదరించారని చెప్పారు.
త్వరలోనే రాజకీయ పార్టీగా మారుతామని ప్రకటించినప్పటికీ, సమయం తక్కువగా ఉండటంతో ఆల్ ఇండియా ఫార్వర్డ్ బ్లాక్‌తో కలిసి పోటీ చేశామని తెలిపారు. ఈ ఎన్నికల్లో జాగృతి–ఫార్వర్డ్ బ్లాక్ కలిసి పోటీ చేసిన అభ్యర్థుల్లో మొత్తం 40 మంది గెలిచారని, అధికారికంగా 33 స్థానాలు వచ్చినప్పటికీ బీ–ఫామ్ సమస్యల కారణంగా మరో ఏడు స్థానాల్లో తమ అభ్యర్థులే గెలిచారని వివరించారు.
మున్సిపల్ ఎన్నికల్లో చట్టాలు, నిబంధనలు ఉల్లంఘించబడ్డాయని, ప్రభుత్వ ఖర్చుతోనే ప్రచారం జరిగిందని కవిత ఆరోపించారు. అయినప్పటికీ ఎన్నికల సంఘం, ప్రతిపక్షాలు స్పందించలేదని అసంతృప్తి వ్యక్తం చేశారు. బీఆర్ఎస్, బీజేపీ మధ్య నార్త్ తెలంగాణలో అప్రకటిత పొత్తు ఉందని, మున్సిపల్ ఎన్నికలు ఆ పొత్తుకు తొలి మెట్టు అని అన్నారు.
ఫార్వర్డ్ బ్లాక్ రాష్ట్ర కన్వీనర్ అంబటి జోజిరెడ్డి మాట్లాడుతూ, భవిష్యత్‌లోనూ జాగృతి–ఫార్వర్డ్ బ్లాక్ కలిసి పనిచేస్తాయని స్పష్టం చేశారు. వడ్డెపల్లి మున్సిపాలిటీని ఇరు పార్టీలూ కలిసే గెలుచుకున్నామని, దీనిపై ఎలాంటి గందరగోళం అవసరం లేదన్నారు.
హెచ్ఎంఎస్ ప్రధాన కార్యదర్శి రియాజ్ అహ్మద్ మాట్లాడుతూ, రామగుండం ఎమ్మెల్యే తమ అభ్యర్థులను బెదిరించారని ఆరోపించారు. ఉత్తర తెలంగాణలో సీపీఐ రాజకీయంగా పూర్తిగా బలహీనమైందని, భవిష్యత్‌లో కార్మికుల కోసం నిజంగా పోరాడే శక్తులకే ప్రజలు మద్దతు ఇస్తారని చెప్పారు.
ఈ సమావేశంలో ఫార్వర్డ్ బ్లాక్ కేంద్ర కమిటీ సభ్యులు ఆర్‌వీఆర్ ప్రసాద్, జాగృతి ప్రధాన కార్యదర్శి ఎల్. రూప్ సింగ్, నవీన్ ఆచారి తదితరులు పాల్గొన్నారు.
More News...
<%- node_title %>
<%- node_title %>
లీడ్ ఇండియా ఫౌండేషన్ ఆధ్వర్యంలో పరీక్షలపై అవగాహన కార్యక్రమం
జగిత్యాల ఫిబ్రవరి 14 (ప్రజా మంటలు):
జగిత్యాల పట్టణంలోని శ్రీ చైతన్య, శ్రీనిధి విద్యా సంస్థలలో లీడ్ ఇండియా ఫౌండేషన్ ఆధ్వర్యంలో విద్యార్థులకు పరీక్షల పట్ల అవగాహన కల్పించే శిక్షణ కార్యక్రమం నిర్వహించారు.
ఈ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా హాజరైన రాష్ట్రస్థాయి లీడ్ ఇండియా శిక్షణ సమన్వయకర్త తాడూరి శ్రీనివాస్ ఆచార్య మాట్లాడుతూ, విద్యార్థులు పరీక్షలకు ఎలా... పోలింగ్ బూత్‌లో మైనర్ ఓటింగ్ ఘటన
ముంబయి, ఫిబ్రవరి 14 (ప్రజా మంటలు):
మహారాష్ట్రలో జరిగిన జిల్లా పరిషత్, పంచాయతీ సమితి ఎన్నికల సమయంలో పోలింగ్ బూత్‌లో మైనర్ బాలుడు ప్రవేశించిన ఘటనపై మహారాష్ట్ర రాష్ట్ర ఎన్నికల కమిషన్ (SEC) తీవ్రంగా స్పందించింది. ఈ ఘటనకు బాధ్యులైన ఒక పోలింగ్ అధికారి, ఒక పోలీస్ కానిస్టేబుల్‌ను సస్పెండ్ చేయాలని ఆదేశాలు జారీ చేసింది.... మీనా ప్రధాన పాత్రలో ‘రోస్లిన్’ వెబ్ సిరీస్ ట్రైలర్ విడుదల
చెన్నై ఫిబ్రవరి 13:
థ్రిల్లర్ నేపథ్యంలో రూపొందిన కొత్త వెబ్ సిరీస్ రోస్లిన్ ట్రైలర్ విడుదలైంది. ఈ సిరీస్‌కు ప్రముఖ దర్శకుడు జితు జోసెఫ్ షోరన్నర్‌గా వ్యవహరిస్తున్నారు.
సిరీస్‌కు సుమేష్ నందకుమార్ దర్శకత్వం వహించగా, కథను వినాయక్ శశికుమార్ రచించారు. మాథ్యూ జార్జ్ ఈ సిరీస్‌ను నిర్మించారు.
ఈ సిరీస్‌లో ప్రముఖ నటి మీనా ప్రధాన... జగిత్యాల మున్సిపల్ ఎన్నికల్లో గెలిచిన బీఆర్ఎస్ అభ్యర్థులకు సన్మానం
జగిత్యాల ఫిబ్రవరి 14 (ప్రజా మంటలు):
జగిత్యాల పట్టణంలో జరిగిన మున్సిపల్ ఎన్నికల్లో విజయం సాధించిన బీఆర్ఎస్ పార్టీ అభ్యర్థులు దేవేందర్ నాయక్, అవారి పవిత్ర శివ కేసరి బాబు, కోరుగంటి రాము, హరీష్‌లు జిల్లా పార్టీ అధ్యక్షుడు కల్వకుంట్ల విద్యాసాగర్ రావు, ఎమ్మెల్సీ ఎల్. రమణ, కోరుట్ల ఎమ్మెల్యే డా. సంజయ్... దామోదరం సంజీవయ్య 105వ జయంతి: మాజీ సీఎం సేవలు చిరస్మరణీయం
కరీంనగర్, ఫిబ్రవరి 14 (ప్రజా మంటలు):
ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ తొలి దళిత ముఖ్యమంత్రి దామోదరం సంజీవయ్య 105వ జయంతి సందర్భంగా కరీంనగర్ డీసీసీ కార్యాలయంలో ఘన నివాళులర్పించారు. ఈ కార్యక్రమంలో మానకొండూరు ఎమ్మెల్యే, టీపీసీసీ ఎస్సీ సెల్ చైర్మన్ డా.కవ్వంపల్లి సత్యనారాయణ పాల్గొని సంజీవయ్య చిత్రపటానికి పూలమాల వేసి నివాళులర్పించారు.
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ,... ప్రజలకు ప్రత్యామ్నాయ పార్టీ లేకపోవడంతోనే కాంగ్రెస్ గెలిచింది - కవిత
హైదరాబాద్, ఫిబ్రవరి 14 (ప్రజా మంటలు):
మున్సిపల్ ఎన్నికలు కేవలం ట్రైలర్ మాత్రమే, అసలు సినిమా ఇంకా మిగిలే ఉందని తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు కల్వకుంట్ల కవిత స్పష్టం చేశారు. హైదరాబాద్‌లో జరిగిన విలేకరుల సమావేశంలో ఆమెతో పాటు ఆల్ ఇండియా ఫార్వర్డ్ బ్లాక్ రాష్ట్ర కన్వీనర్ అంబటి జోజిరెడ్డి, హెచ్ఎంఎస్ ప్రధాన కార్యదర్శి ... DMK కూటమిలో కాంగ్రెస్‌కు ఎక్కువ వాటా? 2021 ఫలితాల ప్రస్తావనతో మాణికం ఠాకూర్ వ్యాఖ్యలు
చెన్నై ఫిబ్రవరి 14:
తమిళనాడు రాజకీయాల్లో కూటమి సమీకరణలపై చర్చకు తెరలేపుతూ కాంగ్రెస్ ఎంపీ మాణికం ఠాకూర్ కీలక వ్యాఖ్యలు చేశారు.
2021 తమిళనాడు అసెంబ్లీ ఎన్నికలను ప్రస్తావించిన ఆయన,“డీఎంకే నేతృత్వంలోని కూటమి అధికారంలోకి వచ్చింది. కూటమిలో భాగస్వామిగా ఉన్న కాంగ్రెస్ పార్టీకి అధికార భాగస్వామ్యం కోరే హక్కు ఉంది. ప్రభుత్వంలో పంచుకునే హక్కు... జగిత్యాల మున్సిపల్ రాజకీయాలు: చైర్మన్ పదవిపై అనివార్య సయోధ్య
చైర్మన్ పదవి : ఘర్షణా? సయోధ్యా?
నలుగురి మధ్యలో పోటీ
జగిత్యాల ఫిబ్రవరి 13 (ప్రజా మంటలు):
జగిత్యాల మున్సిపల్ ఎన్నికలు జగిత్యాల రాజకీయాన్ని పూర్తిగా తలకిందులు చేశాయి. బీఆర్ఎస్ నుంచి గెలిచి, కాంగ్రెస్‌లో చేరిన ఎమ్మెల్యే డా. ఎం. సంజయ్ కుమార్ ఈ ఎన్నికల్లో తన రాజకీయ బలాన్ని స్పష్టంగా చూపించారు. కాంగ్రెస్ తరఫున... మెట్‌పల్లి మున్సిపల్ ఎన్నికల ఫలితాలు: బీజేపీ ఆధిక్యం, హంగ్ మున్సిపాలిటీ
మెటుపల్లి ఫిబ్రవరి 13 (ప్రజా మంటలు)
మెట్‌పల్లి మున్సిపల్ ఎన్నికల్లో అధికారికంగా గెలుపొందిన అభ్యర్థుల వివరాలు వెల్లడయ్యాయి. మొత్తం 26 వార్డులకు గానూ బీజేపీ 10 స్థానాలు సాధించి అతిపెద్ద పార్టీగా అవతరించింది. కాంగ్రెస్, బీఆర్ఎస్ పార్టీలకు తలా 6 స్థానాలు దక్కాయి. స్వతంత్ర అభ్యర్థులు 4 వార్డుల్లో విజయం సాధించారు. ఈ ఫలితాలతో మెట్‌పల్లి... జగిత్యాల మున్సిపల్ ఎన్నికల ఫలితాలు: కాంగ్రెస్ ముందంజ,
జగిత్యాల మున్సిపల్ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ అత్యధిక స్థానాలు సాధించి ముందంజలో నిలిచింది. బీజేపీ, బీఆర్ఎస్, ఎంఐఎం పార్టీలతో పాటు ఇండిపెండెంట్ అభ్యర్థులు గణనీయమైన సంఖ్యలో విజయం సాధించారు. మొత్తం 50 వార్డులకు గాను కాంగ్రెస్ 23 (ఇందులో 6-8 మంది జీవన్ రెడ్డి వర్గం)స్థానాలు, బీజేపీ 6, బీఆర్ఎస్ 4, ఎంఐఎం 2 స్థానాలు... తెలంగాణ మున్సిపల్ ఎన్నికల ఫలితాలు: వడ్డేపల్లిలో. తెలంగాణ జాగృతి - AIFB సంచలనం
హైదరాబాద్ ఫిబ్రవరి 13 (ప్రజా మంటలు):
తెలంగాణలో మున్సిపల్ ఎన్నికల ఫలితాలు వెలువడుతున్నాయి. పలు జిల్లాల్లో భిన్న పార్టీల ఫలితాలు రాజకీయంగా ఆసక్తికరంగా మారాయి.
వడ్డేపల్లి మున్సిపాలిటీ: AIFB ఘన విజయం
వడ్డేపల్లి మున్సిపాలిటీలో, తెలంగాణ jagruthi -ఆల్ ఇండియా ఫార్వర్డ్ బ్లాక్ (AIFB) సంచలనం సృష్టించింది. మొత్తం 10 వార్డులకు గానూ 8 వార్డుల్లో... ఇప్పటి వరకు జగిత్యాల మున్సిపల్ ఎన్నికల ఫలితాలు
ఇప్పటి వరకు11.30, ప్రకటించిన మున్సిపల్ ఎన్నికల ఫలితాలు, వారీగా
వార్డు నంబర్
పార్టీ
గెలిచిన అభ్యర్థి
1
ఇండిపెండెంట్
చెట్టే గంగాధర్
4
కాంగ్రెస్
క్యాదాసు నవీన్
7
బీఆర్ఎస్
కోరుకంటి రాము
10 (TR నగర్)
కాంగ్రెస్
చాంద్ పాషా
14
కాంగ్రెస్
బాలే లత శంకర్
16
కాంగ్రెస్
దూమాల రాజ్ కుమార్... 