2047 నాటికి తెలంగాణ టెక్స్‌టైల్ రాజధాని గా అభివృద్ధి - ముఖ్యమంత్రి ఎ. రేవంత్ రెడ్డి.

On
2047 నాటికి తెలంగాణ టెక్స్‌టైల్ రాజధాని గా అభివృద్ధి - ముఖ్యమంత్రి ఎ. రేవంత్ రెడ్డి.

(సిరిసిల్ల .రాజా విక్రాంత్ శర్మ - 9963349493/9348422113).

హైదరాబాద్ 03 ఏప్రిల్ (ప్రజా మంటలు) : 

వస్త్ర పరిశ్రమ రంగంలో 2047 నాటికి తెలంగాణను దక్షిణాసియాలోనే గొప్ప టెక్స్‌టైల్ రాజధానిగా తీర్చిదిద్దుతామని ముఖ్యమంత్రి ఎ. రేవంత్ రెడ్డి చెప్పారు.

టెక్స్‌టైల్ రంగ అభివృద్ధి కోసం ప్రభుత్వం నిర్దేశించుకున్న విజన్‌కు అనుగుణంగా ప్రపంచాన్ని మార్చగల వాతావరణాన్ని సృష్టించడంలో మాతో భాగస్వామ్యం కావాలని పారిశ్రామిక వేత్తలకు పిలుపునిచ్చారు.

  • రాష్ట్ర ప్రభుత్వం, కాన్ఫెడరేషన్ ఆఫ్ ఇండియన్ టెక్స్‌టైల్ ఇండస్ట్రీ (CITI) తో కలిసి 13వ ఏషియా టెక్స్‌టైల్ సదస్సు (ATEXCON 2026)ను నిర్వహించింది. ఈ సదస్సులో ముఖ్యమంత్రి అటెక్స్‌కాన్-2026 నివేదికను విడుదల చేశారు.
  • ఈ సదస్సులో మంత్రులు దుద్దిళ్ల శ్రీధర్ బాబు, తుమ్మల నాగేశ్వర రావు, అధికారులు, జాతీయ, అంతర్జాతీయ ప్రతినిధులు పాల్గొన్నారు.
  • ఈ సదస్సు సందర్భంగా ఏర్పాటు చేసిన టెక్స్‌టైల్ ఎగ్జిబిషన్‌ను ముఖ్యమంత్రి మంత్రులతో కలిసి సందర్శించారు.

సదస్సులో ముఖ్యమంత్రి మాట్లాడుతూ.... 

  • అత్యుత్తమ వస్త్రాలను తయారు చేసిన గొప్ప చరిత్ర భారతదేశానికి ఉంది. శతాబ్దాలుగా క‌ళలు, సంస్కృతి, సంప్రదాయాలు టెక్స్‌టైల్స్‌ రంగాన్ని పరిపూర్ణంగా తీర్చిదిద్దాయి.
  • నిజాం కాలంలో ప్రపంచ నలుమూలల నుంచి వ్యాపారులు హైదరాబాద్ నగరానికి వచ్చి వస్త్రాలు, ముత్యాలు కొనుగోలు చేశారు. తెలంగాణ రాష్ట్రం ఈ విషయాన్ని గర్వంగా చెప్పగలదు. టెక్స్‌టైల్స్ మా డీఎన్ఏలో ఉంది.
  • వస్త్ర పరిశ్రమలో తెలంగాణ ముందంజలో ఉండటానికి చారిత్రక కారణాలున్నాయి. దేశంలో పత్తి ఉత్పత్తిలో అగ్రగామిగా ఉన్నాం. పత్తి నాణ్యతకు ప్రపంచవ్యాప్తంగా పేరుంది. టెక్స్‌టైల్ తెలంగాణకు కేవలం పరిశ్రమ మాత్రమే కాదు. ప్రజల జీవనాధారం. ప్రసిద్ధి చెందిన పోచంపల్లి ఇక్కత్, గద్వాల చీరలు, వరంగల్ దుర్రీస్, నారాయణపేట చేనేత వరకు అనేకం ఇక్కడున్నాయి.
  • తెలంగాణలో నైపుణ్యం ఉంది. మంచి సంకల్పం కూడా ఉంది. డీప్‌టెక్, ఫార్మా, లైఫ్ సైన్సెస్, ఏరోస్పేస్, డిఫెన్స్ మాన్యుఫాక్చరింగ్, ఎనర్జీ వంటి అనేక రంగాల్లో తెలంగాణ ముందంజలో ఉంది. వరంగల్‌లో కాకతీయ ప్ర‌పంచ స్థాయి మెగా టెక్స్‌టైల్‌ పార్క్‌ను ఏర్పాటు చేశాం. అందులో అనేక అప్పరెల్‌ పార్కులున్నాయి.
  • తెలంగాణ రైజింగ్ 2047 విజన్ ద్వారా 2034 నాటికి ఒక ట్రిలియన్ ఆర్థిక వ్యవస్థగా, 2047 నాటికి మూడు ట్రిలియన్ డాలర్ల ఆర్థిక వ్యవస్థగా రాష్ట్రాన్ని తీర్చిదిద్దాలన్నది మా లక్ష్యం.
  • వస్త్ర పరిశ్రమకు సంబంధించి తెలంగాణ ప్రభుత్వం భూమి, విద్యుత్, నీరు వంటి మౌలిక సదుపాయాలను కల్పిస్తూ ప్రోత్సహిస్తుంది. అవసరమైన అనుమతులను వేగంగా మంజూరు చేస్తుంది. ప్రపంచ పోటీకి అనుగుణంగా విధానాలు అనుసరిస్తున్నాం. అత్యుత్తమ మానవ వనరుల బలం ఉంది.
  • తెలంగాణలోని పత్తి పొలాలకు.. లండన్, న్యూయార్క్, పారిస్, మిలాన్, టోక్యో, దుబాయ్ ఫ్యాషన్ షోలకు అనుసంధానం కావాలి. మీకు విజన్ ఉంటే, మేము సరైన భాగస్వాములం అవుతాం. అందరం కలిసి, ప్రపంచాన్ని మార్చగల టెక్స్‌టైల్ ఎకోసిస్టమ్‌ను నిర్మిద్దాం.
  • హైదరాబాద్ గ్లోబల్ సినిమా హబ్ గా ఎదుగుతోంది. ఇటీవల నెట్ ఫ్లిక్స్ ఐలైన్ స్టూడియోలను ఇక్కడ ప్రారంభించాను. టాలీవుడ్, బాలీవుడ్ ఇప్పటికే హైదరాబాద్‌ కేంద్రంగా పనిచేస్తుండగా, ఇప్పుడు హాలీవుడ్ కూడా చేరింది. సినిమా సంబంధిత ఫ్యాషన్ రంగాన్ని కూడా తెలంగాణ నుంచే అభివృద్ధి చెందేలా ప్రోత్సహిస్తాం.
  • పరిశ్రమల అభివృద్ధితోపాటే పర్యావరణ పరిరక్షణకు ప్రాధాన్యత ఇస్తున్నాం. గ్రీన్ టెక్స్‌టైల్ హబ్‌లను అభివృద్ధి చేస్తాం. సంప్రదాయ ఆలోచనలతో పాటు ఆధునిక పరికరాలతో కలిపి డిజైన్, కట్టింగ్, స్టిచింగ్‌లో యువతకు ముఖ్యంగా మహిళలకు శిక్షణనిస్తాం.
  • ప్రపంచంలోని ప్రతి దేశం తెలంగాణలో తయారైన దుస్తులను ధరించేలా చేయాలన్నది మా సంకల్పం. తెలంగాణ రైజింగ్ ప్రయాణంలో అందరూ భాగస్వాములు కావాలి..” అని ముఖ్యమంత్రి పెట్టుబడిదారులకు పిలుపునిచ్చారు.
Tags
Join WhatsApp

More News...

Local News 

శ్రీ శ్రీనివాస ఆంజనేయ భవాని శంకర దేవాలయంలో ఘనంగా స్వామివారి కల్యాణ వేడుకలు 

శ్రీ శ్రీనివాస ఆంజనేయ భవాని శంకర దేవాలయంలో ఘనంగా స్వామివారి కల్యాణ వేడుకలు  జగిత్యాలఏప్రిల్ 12(ప్రజా మంటలు) శ్రీ శ్రీనివాస ఆంజనేయ భవాని శంకర దేవాలయం లో ఆదివారం శ్రవణా నక్షత్రం పురస్కరించుకొని పద్మావతి అలివేలు మంగ సహిత శ్రీ వెంకటేశ్వర స్వామి కళ్యాణ వేడుకలు అంగరంగ వైభవంగా నిర్వహించారు. ఈ సందర్భంగా ఉత్సవ మూర్తులను ప్రత్యేక వేదికపై ఉంచి కళ్యాణాన్ని నిర్వహించారు. ఆలయాన్ని సర్వాంగ సుందరంగా అలంకరించారు. భక్తులు...
Read More...
Crime  State News 

విలేకరి ముసుగులో వసూళ్లు.. కత్తితో బెదిరించి ₹42వేలు దోపిడి – వేములవాడలో నకిలీ జర్నలిస్టు అరెస్ట్

విలేకరి ముసుగులో వసూళ్లు.. కత్తితో బెదిరించి ₹42వేలు దోపిడి – వేములవాడలో నకిలీ జర్నలిస్టు అరెస్ట్ వేములవాడ, ఏప్రిల్ 12 (ప్రజా మంటలు): విలేకరుల ముసుగులో కొందరు నకిలీ జర్నలిస్టులు ప్రజలను భయభ్రాంతులకు గురిచేస్తూ వసూళ్లకు పాల్పడుతున్న ఘటనలు వెలుగులోకి వస్తున్నాయి. తాజాగా వేములవాడ పట్టణంలో జరిగిన ఒక సంఘటనలో నకిలీ జర్నలిస్టుగా నటించిన వ్యక్తిని పోలీసులు అరెస్ట్ చేసి రిమాండ్‌కు తరలించారు. వేములవాడ టౌన్ సీఐ బి. వీర ప్రసాద్ తెలిపిన...
Read More...
Local News 

ఇంటర్ ఫలితాల్లో మెరిసిన ఆణిముత్యం – గుంటుకుల సహస్ర

ఇంటర్ ఫలితాల్లో మెరిసిన ఆణిముత్యం – గుంటుకుల సహస్ర గొల్లపల్లి, ఏప్రిల్ 12 (ప్రజా మంటలు): ఇంటర్మీడియట్ ప్రథమ సంవత్సరం పరీక్షా ఫలితాల్లో గొల్లపల్లి మండలానికి చెందిన లోత్తునూర్ గ్రామ విద్యార్థిని గుంటుకుల సహస్ర తన ప్రతిభను చాటుకుంది. తెలంగాణ ఇంటర్మీడియట్ బోర్డు విడుదల చేసిన ఫలితాల్లో మొత్తం 470 మార్కులకు గాను 467 మార్కులు సాధించి జగిత్యాల పట్టణంలో ప్రథమ స్థానం దక్కించుకుంది.ప్రస్తుతం...
Read More...
Local News 

వెనుకబడిన వర్గాల అభ్యున్నతికి కాంగ్రెస్ సర్కార్ కృషి –కంటోన్మెంట్ ఎమ్మెల్యే శ్రీగణేశ్

వెనుకబడిన వర్గాల అభ్యున్నతికి కాంగ్రెస్ సర్కార్ కృషి –కంటోన్మెంట్ ఎమ్మెల్యే శ్రీగణేశ్ సికింద్రాబాద్, ఏప్రిల్ 12 ( ప్రజామంటలు): సమాజంలో వెనకబడిన వర్గాల అభ్యున్నతికి కాంగ్రెస్ సర్కార్ కట్టుబడి ఉందని కంటోన్మెంట్ ఎమ్మెల్యే శ్రీగణేశ్ అన్నారు.  తెలంగాణ తోటి, మెహతార్ కమ్యూనిటీ సంఘం 12వ వార్షికోత్సవ వేడుకలు ఆదివారం బొల్లారం కొత్త బస్తీలోని కమ్యూనిటీ హాల్‌లో ఘనంగా జరిగాయి. ఈ కార్యక్రమానికి కంటోన్మెంట్ ఎమ్మెల్యే శ్రీగణేష్ ముఖ్య అతిథిగా...
Read More...
Local News 

మెడికల్‌ అండ్‌ హెల్త్‌ ఎంప్లాయిస్‌ ఫోరం అధ్యక్షునిగా డాక్టర్‌ రమేష్‌ 

మెడికల్‌ అండ్‌ హెల్త్‌ ఎంప్లాయిస్‌ ఫోరం అధ్యక్షునిగా డాక్టర్‌ రమేష్‌     సికింద్రాబాద్, ఏప్రిల్ 12 ( ప్రజామంటలు): టీఎన్‌జీవో మెడికల్‌ అండ్‌ హెల్త్‌ ఎంప్లాయిస్‌ ఫోరం హైదరాబాద్‌ జిల్లా అధ్యక్షునిగా సికింద్రాబాద్‌ గాంధీఆస్పత్రి ఫిజియోథెరపీ విభాగ వైద్యుడు డాక్టర్‌ పల్లాటి రమేష్‌ ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు.  టీఎన్‌జీవో యూనియన్‌ హైదరాబాద్‌ జిల్లా అధ్యక్షకార్యదర్శులు విక్రమ్, శ్రీనివాస్, కోశాధికారి బాలరాజుల నేతృత్వంలో  సంఘ కార్యాలయంలో ఆదివారం జరిగిన ఎన్నికల్లో నూతన...
Read More...
Local News 

స్కై ఫౌండేషన్ ఆధ్వర్యంలో 298వ అన్నదానం 

స్కై ఫౌండేషన్ ఆధ్వర్యంలో 298వ అన్నదానం  సికింద్రాబాద్,  ఏప్రిల్ 12 ( ప్రజామంటలు):  హైదరాబాద్ నగరంలో ఆకలితో అలమటిస్తున్న అనాథలు, నిరాశ్రయుల కోసం స్కై ఫౌండేషన్ ఆదివారం 298వ అన్నదాన కార్యక్రమాన్ని నిర్వహించింది. ఫౌండేషన్ సభ్యులు వాహనంలో వివిధ ప్రాంతాల్లో సంచరిస్తూ, ఫుట్‌పాత్‌లపై నివసించే నిరుపేదలను గుర్తించి వారికి ఆహారాన్ని పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ఫౌండేషన్ ప్రెసిడెంట్ డాక్టర్ వై. సంజీవ...
Read More...
Local News 

ఇంటర్ ఫలితాల్లో ప్రభుత్వ జూనియర్ కళాశాల మార్కుల ప్రభంజనం

ఇంటర్ ఫలితాల్లో ప్రభుత్వ జూనియర్ కళాశాల మార్కుల ప్రభంజనం ఇబ్రహీంపట్నం, ఏప్రిల్ 12 (ప్రజా మంటలు): ఇబ్రహీంపట్నంలోని ప్రభుత్వ జూనియర్ కళాశాల విద్యార్థులు ఇంటర్ ప్రథమ, ద్వితీయ సంవత్సర ఫలితాల్లో రాష్ట్రస్థాయి మార్కులు సాధించి తమ ప్రతిభను మరోసారి చాటారు. ద్వితీయ సంవత్సరం ఫలితాలు:MPC: ఎం. లవిష – 979/1000BiPC: కె. నవీన – 971/1000CEC: కె. రతిక – 935/1000...
Read More...
National  Filmi News 

బాలీవుడ్ గానకోకిల ఆశా భోస్లే కన్నుమూత – 92 ఏళ్ల వయసులో సంగీత యుగానికి ముగింపు

బాలీవుడ్ గానకోకిల ఆశా భోస్లే కన్నుమూత – 92 ఏళ్ల వయసులో సంగీత యుగానికి ముగింపు ప్రఖ్యాత బాలీవుడ్ గాయని Asha Bhosle (92) కన్నుమూశారు. గుండెపోటుతో ముంబైలోని ఆసుపత్రిలో చికిత్స పొందుతూ ఆమె మరణించినట్లు కుటుంబ సభ్యులు ధృవీకరించారు. ఆమె మరణంతో భారతీయ సినీ సంగీతంలో ఒక మహా యుగానికి ముగింపు పలికినట్టైంది. ఎనిమిది దశాబ్దాల పాటు సాగిన ఆమె సంగీత ప్రయాణంలో 12,000కు పైగా పాటలు పాడి కోట్లాది అభిమానుల...
Read More...
Crime 

భార్యను కాపురానికి పంపలేదని అత్తను కరెంట్ షాక్‌తో హత్యాయత్నం నిందితుడు అరెస్ట్ – రిమాండ్‌కు తరలింపు

భార్యను కాపురానికి పంపలేదని అత్తను కరెంట్ షాక్‌తో హత్యాయత్నం నిందితుడు అరెస్ట్ – రిమాండ్‌కు తరలింపు   గొల్లపల్లి, ఏప్రిల్ 11 (ప్రజా మంటలు): భార్యను తిరిగి కాపురానికి పంపలేదనే కోపంతో అత్తను కరెంట్ షాక్‌తో చంపేందుకు ప్రయత్నించిన ఘటన వెంగటూరు మండలంలో చోటుచేసుకుంది.వెల్గటూర్ మండలం జగదేవపేట గ్రామానికి చెందిన గాగిరెడ్డి మల్లారెడ్డి (48) తన భార్య పద్మతో గత కొన్నేళ్లుగా వివాదాలు కొనసాగుతున్నాయి. భర్త హింసను భరించలేక పద్మ తన పిల్లలతో...
Read More...
Local News 

ఘనంగా మహాత్మా జ్యోతిరావు ఫూలే జయంతి వేడుకలు సామాజిక అసమానతనలు తొలగించడమే పూలే ఆశయం

ఘనంగా మహాత్మా జ్యోతిరావు ఫూలే జయంతి వేడుకలు  సామాజిక అసమానతనలు తొలగించడమే పూలే ఆశయం జగిత్యాల ఏప్రిల్ 11 (ప్రజా మంటలు)మహాత్మ జ్యోతిబా పూలే ఆశయాలను, ఆలోచనలను ఆచరించాలి - రాష్ట్ర సంక్షేమ శాఖ మంత్రి అడ్లూరి లక్ష్మణ్ కుమార్ శనివారం సమీకృత జిల్లా కలెక్టరేట్ సమావేశం మందిరంలో జిల్లా వెనుకబడిన తరగతుల అభివృద్ధి శాఖ ఆధ్వర్యంలో నిర్వహించిన శ్రీ మహాత్మ జ్యోతిబా పూలే 200వ జయంతి వేడుకల్లో రాష్ట్ర...
Read More...
Local News 

మహాత్మ జ్యోతిరావు పూలే 199వ జయంతి వేడుకలు 

మహాత్మ జ్యోతిరావు పూలే 199వ జయంతి వేడుకలు  జగిత్యాల ఏప్రిల్ 11 ( ప్రజా మంటలు)  పూలమాలవేసి నివాళులర్పించిన తెలంగాణ రాష్ట్ర బీసీ సంఘం నాయకులు. మహాత్మ జ్యోతిరావు పూలే  ఆశయాలు భారత సమాజంలో సమానత్వం, న్యాయం, విద్య, సామాజిక సంస్కరణల మీద ఆధారపడి ఉన్నాయి. ఆయన ఆలోచనలు చాలా ముందుచూపుతో కూడినవిఅన్నారు.     ఇట్టి కార్యక్రమంలో తెలంగాణ రాష్ట్ర బీసీ సంఘం కార్యదర్శి
Read More...
Local News 

కష్టపడిన ప్రతి కార్యకర్తకు అండగా నిలుస్తాం రాష్ట్ర మంత్రి అడ్లూరి లక్ష్మణ్ కుమార్

కష్టపడిన ప్రతి కార్యకర్తకు అండగా నిలుస్తాం రాష్ట్ర మంత్రి అడ్లూరి లక్ష్మణ్ కుమార్ జగిత్యాల ఏప్రిల్ 11 ( ప్రజా మంటలు)  ప్రజల మధ్యలో ఉంటాం.. మరో మారు అధికారంలోకి వస్తాం.. జీవన్ రెడ్డి పై మంత్రి మరో మారు ఫైర్..   రాష్ట్ర సాంఘీక సంక్షేమ శాఖ మంత్రి అడ్లూరి లక్ష్మణ్ కుమార్ పార్టీ కోసం పనిచేసిన ప్రతి కార్యకర్తకు కాంగ్రెస్ పార్టీ అండగా నిలుస్తుందని రాష్ట్ర సాంఘీక సంక్షేమ...
Read More...