గురుకుల డిగ్రీ కాలేజీల్లో ప్రవేశాలకు నోటిఫికేషన్ 

On
గురుకుల డిగ్రీ కాలేజీల్లో ప్రవేశాలకు నోటిఫికేషన్ 

(సిరిసిల్ల. రాజేంద్ర శర్మ - 9348422113/9963349493).

జగిత్యాల మార్చి 27 (ప్రజా మంటలు)

తెలంగాణలోని ఎస్సీ, ఎస్టీ, బీసీ గురుకులాల పరిధిలోని డిగ్రీ కళాశాలల్లో ప్ర వేశాలకు నోటిఫికేషన్ వెలువడింది. 2024,25 విద్యా సంవత్సరంలో డిగ్రీ కాలేజీలలో అడ్మి షన్లకు టీఎస్ఆర్డీసీ సెట్ ను 2024 ఏప్రిల్ 28 న నిర్వ హించనున్నట్లు ఆయా విద్యాసంస్థలు ఉమ్మడి ప్రకటన విడుదల చేశాయి.

ప్రవేశ పరీక్ష కోసం ఏప్రిల్ 12 వరకు దరఖాస్తు చేసుకోవచ్చు. ఇంటర్మీడియట్ ద్వితీయ సంవత్సరం పూర్తయిన విద్యార్థులు ఈ పరీక్షకు అర్హులని తెలంగాణ సాంఘీక సంక్షే మ గురుకుల మహిళా డిగ్రీ కళాశాల జగిత్యాల ప్రిన్సిపల్ డాక్టర్ గోలి శ్రీలత మంగళవారం ఒక ప్రకటనలో పేర్కొన్నారు.

ప్రవేశ పరీక్ష కు సంబంధించిన హాల్ టికెట్లు ఏప్రిల్ 21 నుంచి వెబ్సైట్లో అందుబాటు లో ఉంటాయని తెలిపారు. దరఖాస్తు సంబంధిత ఇతర వివరాలకు వెబ్సైట్ను సందర్శించాలని సూచించారు.

గురుకుల డిగ్రీ కాలేజీల్లో ప్రవేశం పొందిన విద్యార్థులకు పూర్తి ఉచిత విద్య, భోజన వసతి తో పాటు యూని ఫామ్, పుస్తకాలు, నోట్ బుక్స్ తో పాటు పలు సదుపాయాలను కల్పించ నున్న ట్లు తెలిపారు.

ప్రస్తుతం బీసీ గురకులం పరిధిలో 15బాలురు,15 మహిళా డిగ్రీ కళాశాలలు, ఎస్సీగురుకులం పరిధిలో 26మహిళా కాలేజీలు, ఎస్టీ గురుకులంలో 6 బాలుర, 15 మహిళా కళాశాలలు ఉన్నాయి.

బీఏ , బీకామ్, బీ ఎస్సీ, బీబీఏ, బీహెచ్ఎంసీటీ, బీఎస్ సహా వివిధ కోర్సులు అందుబాటులోఉండగా ప్రతి కోర్సులో 40సీట్లు ఉన్నట్లు పేర్కొన్నారు.

Tags