మహిళతో అక్రమ సంబంధం పెట్టుకున్న ఎ.ఎస్.ఐ వి. రామయ్య సస్పెండ్

On
మహిళతో అక్రమ సంబంధం పెట్టుకున్న ఎ.ఎస్.ఐ వి. రామయ్య సస్పెండ్

(సిరిసిల్ల రాజా విక్రాంత్ శర్మ - 9963349493/9348422113)

 

ఇబ్రహీంపట్నం మార్చి 26 (ప్రజా మంటలు) : 

మహిళా ఫిర్యాదురాలితో అక్రమ సంబంధం పెట్టుకున్న జగిత్యాల జిల్లా ఇబ్రహీంపట్నం పోలీస్ స్టేషన్ ఎ.ఎస్.ఐ ను సస్పెండ్ చేస్తూ మల్టీ జోన్ 1 ఐ.జీఎ.వి. రంగనాథ్ ఉత్తర్వులు జారీ చేసారు.

వివరాల్లోకి వెళితే.....

జగిత్యాల జిల్లా, ఇబ్రహీంపట్నం పోలీస్ స్టేషన్ పరిధిలోని ఓ మహిళా తన భర్త గత రెండు సంవత్సరాలుగా వేధింపులకు గురించేస్తున్నట్లుగా ఇబ్రహీంపట్నం పోలీస్ స్టేషన్ ఫిర్యాదు చేసింది. ఇదే పోలీస్ స్టేషన్ లో సస్పెండ్ కు గురైనా ఎ.ఎస్. ఐ వి. రామయ్య కూడా విధులు నిర్వహిస్తుండంతో సదరు బాధిత మహిళా బాధితురాలితో పరిచయం అయింది. బాధితురాలి కి తగు న్యాయం చేస్తానని బాధిత మహిళను నమ్మించి తో ఆమెతో పరిచయం పెంచుకోవడంతో పాటు సదరు మహిళ ఫోన్ నంబర్ తీసుకోని ముచ్చటించడంతో పాటుఆమెతో ఎ. ఎస్. ఐ రామయ్య అక్రమ సంబంధం కొనసాగించడంతో తాను బందోబస్తూ విధులు నిర్వహించే ప్రదేశానికి సదరును పిలిపించుకొని బందోబస్తు నిర్వహించే పరిసర ప్రాంతాల్లో మహిళతో ఏకాంతంగా గడిపేవాడు.

ఈ ఎ. ఎస్. ఐ రాసలీల భాగవతం స్థానిక సామజిక మధ్యామాల్లో ప్రచారం జరగంతో సదరు ఎ. ఎస్. ఐ నిర్వాహకంపై విచారణ జరుపగా ఎ. ఎస్. ఐ పిర్యాదు చేసేందుకు వచ్చిన మహిళతో అక్రమ సంబంధాన్ని కొనసాగిస్తున్న కారణంగా ఎ. ఎస్. ఐ ని సస్పెండ్ చేస్తూన్నట్లుగా మల్టీ జోన్ 1 ఐ. జీ ఎ. వి. రంగనాథ్ వెల్లడించారు.

Tags