స్థానిక పోలీస్ స్టేషన్ లో పూజలు అందుకున్న లక్ష్మి నర్సింహుడు.

On
స్థానిక పోలీస్ స్టేషన్ లో పూజలు అందుకున్న లక్ష్మి నర్సింహుడు.

(సిరిసిల్ల రాజేంద్ర శర్మ - 9348422113/9963349493)

 

జగిత్యాల జిల్లా ప్రతినిధి, మార్చి 23(ప్రజా మంటలు) :

ధర్మపురి శ్రీ లక్ష్మీ నరసింహ స్వామి బ్రహ్మోత్సవాలలో భాగంగా మంగళవారం స్వామివారు దక్షిణ దిగ్యాత్రా బయలుదేరారు దీనిలో భాగంగా స్వామివారు స్థానిక పోలీస్ స్టేషన్ కు వెళ్లడం ఆనవాయితీగా వస్తుంది మంగళవారం కూడా స్వామివారిని స్థానిక పోలీస్ కుటుంబాలు ఘనంగా స్వామివారిని ఎదుర్కోవడం జరిగింది.

స్థానిక పోలీస్ స్టేషన్ లో పూజలు అందుకున్న తర్వాత ధర్మపురి లోని పురవీధుల గుండ స్వామివారు తిరిగి దేవాలయానికి చేరుకోవడం జరుగుతుంది. ఈ కార్యక్రమంలో జగిత్యాల డిఎస్పి రఘు చందర్ ధర్మపురి సిఐ రాం నరసింహారెడ్డి, ఎస్సైలు ఉదయ్ కుమార్ లు పాల్గొన్నారు.

Tags