వైభవంగా ఉగ్ర నరసింహ డోలోత్సవం భక్తులతో కిటకిటలాడిన ధర్మపురి క్షేత్రం
వైభవంగా ఉగ్ర నరసింహ డోలోత్సవం
భక్తులతో కిటకిటలాడిన ధర్మపురి క్షేత్రం
(రామ కిష్టయ్య సంగన భట్ల)
ధర్మపురి మార్చ్ 25 (ప్రజా మంటలు) : ధర్మపురి క్షేత్రంలో నిర్వహిస్తున్న శ్రీ లక్ష్మీనరసింహ, వేంకటేశ్వర బ్రహ్మోత్సవాలలో అంతర్భాగంగా సోమ వారం సాయంత్రం శ్రీ ఉగ్ర నారసింహుని తెప్పోత్సవ, డోలోత్సవాలను వైభవోపేతంగా నిర్వహించారు. సాయంత్రం క్షేత్ర సనాతన సాంప్రదాయ పద్దతిలో ఉగ్రనారసింహ స్వామి ప్రధానాలయం నుండి వేదమంత్రోచ్ఛాటనల, మంగళ వాద్యాలతో, భక్తజనం తోడు రాగా స్వామి ఉత్సవ మూర్తులను జయజయ ధ్వనాలతో ఊరేగించి, బ్రహ్మ పుష్కరిణి లోనికి కోనేరు ఉత్తర ద్వారం గుండా వేంచేపు చేయగా, అప్పటికే కోనేటిలో సోపానాలపై ఆసీనులై వేచియున్న భక్తజనం తమ ఇష్ట దైవాన్ని ఘనంగా స్వాగతించారు. అజ్ఞాత భక్తునిచే ప్రత్యేక నూతన నిర్మిత, బహూకృత హంస రూపు బల్లకట్టుపై స్వామిని ఆసీనులజేసి కోనేటి నీటిపై అయిదు ప్రదక్షిణలు నిర్వహించారు.
బ్రహ్మపుష్కరిణి సోపానాలపై నున్న భక్త జన సమూహం ప్రదక్షిణలను మెట్లపై నుండి అనుసరించారు. బుక్కా, గులాలు ఇత్యాది పూజా ద్రవ్యాలు ఉత్సవ మూర్తులపై చల్లి భక్తి శ్రద్దలతో కైమోడ్పులిడి ప్రార్ధించారు. అనంతరం కోనేరు మధ్య భాగానగల వేదికపైనున్న భోగ మటపంలోని ఊయలలో స్వామిని అసీనుల గావించి డోలోత్సవం విర్వహించారు. వేద పండితుల మంత్రోచ్చారణ మధ్య భక్తులు ఇరుకైన మార్గం గుండా ప్రవేశించి మొక్కులు తీర్చుకున్నారు. స్వామి డోలు ఊగుచుండగా దర్శించిన భక్తులకు వేద పండితులు చతుర్వేద మంత్ర పఠనాలతో ఆశీస్సులు అంద చేశారు. జయజయ ధ్వానాలు మిన్నంటగా, పూజా ద్రవ్యాలను చల్లి భక్తులు తమ ఇష్ట దైవాన్ని కొలిచారు. అర్చకులు శ్రీనివాసాచార్య, వంశీ, విజయ్, అరుణ్ లచే భక్తులు తులసీ కంకణాలను కట్టించు కున్నారు.
ఆధ్యాత్మిక ప్రాసంగికులు, ప్రముఖ గాయకులు జగదీశ్ శర్మ నరసింహ శతక పద్యాలు వినిపించారు. దేవ స్థానం ఈఓ శ్రీనివాస్ మార్గదర్శకత్వంలో, ఉత్సవ కమిటీ అధ్యక్షుడు జక్కు రవీందర్, సభ్యులు, సూపరింటెండెంట్ కిరణ్, సీనియర్ అసిస్టెంట్ శ్రీనివాస్ నేతృత్వంలో ఏర్పాట్లు చేయగా ధర్మపురి సర్కిల్ ఇన్స్పెక్టర్ రాం నరసింహా రెడ్డి, ఎస్ ఐ ఉదయ్ కుమార్ నేతృత్వంలో జగిత్యాల జిల్లాలోని ప్రత్యేక పోలీసు బృందాలు, హోంగార్డులు, ఎలాంటి అవాంఛనీయాలు చోటు చేసుకోకుండా బందోబస్తు చర్యలు చేపట్టారు. ప్రత్యేక బస్సుల ద్వారా భక్తులను గమ్యాలకు చేర్చారు.
ప్రభుత్వ విప్ లక్ష్మణ్ కుమార్, మాజీ మంత్రి కొప్పుల ఈశ్వర్, జగిత్యాల జెడ్పీ చైర్ పర్సన్, దావ వసంత, కరీంనగర్ డీ సీ ఎం ఎస్ చైర్మన్ శ్రీకాంత్ రెడ్డి, ధర్మపురి మున్సిపల్ చైర్ పర్సన్ సంగి సత్తమ్మ, వైస్ ఇందారపు రామయ్య, కమిషనర్ శ్రీనివాస్ రెడ్డి, దేవస్థాన అర్చకులు, సిబ్బంది, భక్తులు దర్శనాలు చేసుకున్నారు.
More News...
<%- node_title %>
<%- node_title %>
రాపల్లి శివారులో పేకాట స్థావరాలపై దాడి
1.jpeg)
మహాత్మ జ్యోతిబా పూలే గురుకుల పాఠశాలను ఆకస్మిక తనిఖీ చేసిన కలెక్టర్ సత్యప్రసాద్

టీయూడబ్ల్యూజే(ఐ జే యు) నూతన ఎన్నికైన జిల్లా కమిటీ సభ్యులను సన్మానించిన జంబి హనుమాన్ ఆలయ కమిటీ సభ్యులు

ప్లేట్లెట్లు దానం చేసి మానవత్వం చాటుకున్న పోలీస్ కానిస్టేబుల్

ఆయిల్ పామ్ మెగా ప్లాంటేషన్ కార్యక్రమంలో పాల్గొన్న జిల్లా కలెక్టర్ సత్య ప్రసాద్.

తల్లిని ఇంట్లోంచి గెంటేసిన కొడుకులు -ఆర్డీవోకు ఫిర్యాదు

దేవరకొండ ఎస్ టి గురుకుల బాలికల ఘటనపై కేసు నమోదు

అహ్మాదీయ ముస్లిం కమ్యూనిటీ మహిళా విభాగం ఆధ్వర్యంలో బ్లడ్ డోనేషన్

జర్నలిస్టుల సంక్షేమమే ధ్యేయంగా పనిచేయాలి.

బోనాల జాతరలో భక్తులకు సేవ చేయడం అదృష్టం

రాసుల కొద్దీ తెప్పించుకుంటున్నారు...కాని తనకు గోరంత కూడ దక్కడం లేదు- రంగంలో భవిష్య వాణి వినిపించిన స్వర్ణలత

వేలేరు మాజీ జడ్పిటిసి చాడ సరిత అంత్యక్రియల్లో పాల్గొన్న ప్రముఖులు
