ఒక ప్రత్యామ్నాయ సంస్కృతి : ప్రజా కళాకారులు, గ్రంథాలయాలు
రంగవల్లి స్మారక గ్రంథాలయ వార్షికోత్సవం: జూకంటి అనుభూతి
నేటి ఆధునిక ప్రపంచానికి దూరంగా,.. నిజమైన ప్రజా ప్రతినిధులతో....
ఈనెల 13న రంగవల్లి విజ్ఞాన కేంద్రం( గ్రంథాలయం) వార్షికోత్సవం వేములవాడ దగ్గర మరియు ఆమె 26వ వర్ధంతిని పురస్కరించుకొని ఒక సమావేశం రంగవల్లి విజ్ఞాన కేంద్రం కార్యవర్గం ఏర్పాటు చేయడం జరిగింది. అందులో నన్ను "ప్రజా గ్రంధాలయాల ఆవశ్యకత" ' విమల మిగతా ముఖ్యులు కోరినారు. ఇందుకొరకు ఉదయం 11 గంటల వరకు నేను సిరిసిల్ల నుండి వేములవాడ కమాన్ దగ్గర నూతనంగా నిర్మించిన రంగవల్లి విజ్ఞాన కేంద్రానికి చేరుకున్నాను. తీవ్రమైన చలిని లెక్క చేయకుండా అప్పటికే ఉత్తర తెలంగాణ జిల్లాలలోని వివిధ ప్రజా సంఘాల ప్రతినిధులు అమరుల కుటుంబాల వారు వచ్చారు . భుజాన గొంగడి వేసుకున్న పురుషులు ఎర్ర దుస్తువులు ధరించిన స్త్రీలు యువకులు మొత్తానికి అరుణోదయ కళాకారులందరూ రోడ్డు దగ్గరికి నుంచి కొంచెం లోపల ఉన్న విజ్ఞాన కేంద్రం వరకు ఒక పాటల ఊరేగింపుగా వెళ్లడానికి తయారు అవుతున్నారు. కొందరి యువకులు డప్పుతో కొందరు నడుస్తున్నారు . విమల నన్ను" అన్నా నడుస్తారే మీరు" అడిగింది . "నేనూ నడుస్తాను" అంటూ తారు రోడ్ వైపు అడుగులు వేశాను . సిరిసిల్ల కరీంనగర్ రోడ్డు పక్కన పాతిన రంగవల్లి విజ్ఞాన కేంద్రం బోర్డు దగ్గర నుండి కొంతమంది ఎర్రజెండాలు చేత పట్టుకోగా పనికొందరు డప్పు దరువు వాయిస్తూ పాటలు పాడుకుంటూ ఒక గోగు పూల ఊరేగింపు భవనం వైపు కదిలింది.
సభకు అధ్యక్షత వహించిన విమల తో పాటు ప్రత్యేక అతిథి ప్రొఫెసర్ కొల్లపురం విమల,విశిష్ట అతిథిగా నేనూ పాల్గొన్నాను.
సహజంగా అధికార, విపక్ష పార్టీలు నిర్వహించే సభలకు ముందు వెనుక ఉండే ఆర్భాటాలు అట్టి సభలకు ప్రజలు తరలించడానికి వాహనాలు ఏర్పాటు చేయడం సభకు వచ్చిన వారికి ఇతోదికంగా మర్యాదలు చేయడం యాంత్రికంగా జరుగుతున్నవి. అందుకు భిన్నంగా ఒక ప్రత్యామ్నాయ ప్రజా సంస్కృతి కి గుర్తుగా స్వచ్ఛందంగా తరలివచ్చిన వారికి సమాజం పట్ల స్పష్టమైన అవగాహన కలిగిన ఈ ప్రాంతంలో జరిగిన అనేక పోరాటాలలో ప్రత్యక్షంగానో పరోక్షంగానో పాల్గొని వారి వారి కారణాలవల్ల మౌనం వహించి జరుగుతున్న అన్ని పరిణామాలను ప్రేక్షకుడిగా గమనిస్తున్న వారు కూడా ఈ సమావేశంలో బాధ్యులుగా చురుకైన పాత్ర నిర్వహించారు .
మధ్య మధ్య అరుణోదయ కళాకారుల పాటలతో ఇప్పటివరకు అమరత్వం పొందిన వీరుల త్యాగాలను కీర్తిస్తూ తలుచుకొని గణంగా నివాళులు అర్పించారు. పరిమితంగా నైనా ఆసక్తికరంగా స్త్రీలు పురుషులతో పాటు ఆలోచనా పరులు సామాన్యులు వచ్చారు . చాలామంది ఈ సమాజం ఎటు పోతుంది అనే ఆలోచనలను పంచుకున్న వారితో చివరి వరకూ జరిగింది.
అరుణోదయ కళాకారులు పాడుకునే పాటలలో ఎక్కువగా రచించిన కవి మిత్ర అలియాస్ అమర్ అలియాస్ కూర దేవేందర్ ఈ సభలో ఉండడం విశేషం. ఆయన సహచరి విమల అధ్యక్షత వహించడం వచ్చిన ప్రతి ఒక్కరినీ పేరు పేరునా పలకరించడం మాత్రమే కాదు వీరు ఎంతో ఆత్మీయంగా కలివిడిగా మాట్లాడే తీరును చూస్తే ప్రజా ఉద్యమాల నిర్మాణంలో నిబద్ధత ఆచరణ ప్రత్యక్షంగా కనబడింది.
అంతేకాకుండా ఒక ఆశయం కోసం లక్ష్యం కోసం పనిచేసే అమరవీరులైన వారి భార్యలు, అనేక విధాలుగా గాయపడిన మాజీ సహచరులు ఈ ఒక పూట సభలో తమ తమ ఊర్ల నుండి స్వచ్ఛందంగా వచ్చి ఎంతో ఉత్సాహంగా పాలుపంచుకున్నారు.
అమెరికాలోని ఇతర దేశాలలోని వివిధ యూనివర్సిటీలను హ్యుమానిటీస్ భాగంలో బోధన చేసింది. తిరిగి వచ్చి హైదరాబాదులోని అమెరికా స్టడీస్ లో ప్రొఫెసర్ గా పని చేస్తున్న కొల్లాపురం విమల ఉపన్యాసంలో స్థానిక ఉదాహరణ లను తీసుకొని సమాజ సంక్షోభం గురించి వివరించిన అంశాలు పాల్గొన్న వారిని దీర్ఘమైన ఆలోచనలు పడవేసింది. సమాజంలో స్త్రీ పురుషుల మధ్య అనేక చిక్కుముళ్లను సుధా రంగా విద్యార్థులకు చెప్పినట్టు విప్పి చెప్పింది.
సభాధ్యక్షత వహించిన గాయకురాలు, నాయకురాలైన విమల ఇక్కడ జరిగిన పోరాటాల గురించి ఆయా పోరాటంలో ఆయా సంఘటనలలో నేల కొరిగిన అమరవీరుల త్యాగాలను స్మరించుకుంటూ వివరించింది.
నేను ప్రజా గ్రంధాలయాల ఆవశ్యకతను నా యొక్క అనుభవాలు,నేను చదివిన పుస్తకాలు నన్ను తీర్చిదిద్దిన గ్రంధాల గురించి వివరించాను. ప్రస్తుత అత్యాధునిక కాలంలో ప్రపంచ ప్రసిద్ధి చెందిన తాత్వికవేత్తల గ్రంథాలను మహనీయుల ఆత్మకథలను జీవిత వాస్తవాలకు అద్దం పట్టిన గొప్ప కథలు, నవలలు వ్యాసాల పుస్తకాల అధ్యయనం చేయాల్సిన అవసరం ఎంతో ఉందన్నాను. నీ జీవితాన్ని నువ్వు నిర్మించుకోవడానికి నీ చుట్టూ ఉన్న సమాజాన్ని అర్థం చేసుకోవడానికి, ఒక ప్రజా దృక్పథం ఏర్పరచుకోవడానికి ప్రజా గ్రంధాలయాల అవసరం గ్రామ గ్రామాలలో నెలకొల్పాల్సిన ఆవశ్యకత మరింత ఏర్పడిందని చెప్పాను.
ఉపన్యాసానికి ఉపన్యాసానికి నడుమ అరుణోదయ కళాకారులు అద్భుతమైన పాటలు పాడారు. డబ్బు దరువులతో కాళ్ల గజ్జల సవ్వడితో సభా ప్రాంతమంతా ప్రతిధ్వనించింది. చివరగా ఆ సమావేశంలో పాల్గొన్న ప్రజాసంఘాల నాయకులతో మాట్లాడించడం వలన వివిధ సమస్యల సమాహారమైన సంధి కాలం దిశ దశల తీరు పైన వారి ఆలోచనలను మిగతావారు పంచుకున్నట్లు అయింది. సమావేశం దాదాపు మూడు గంటల పైగా జరిగింది. అనంతరం అందరూ కలిసి ముచ్చట్లు పెట్టుకుంటూ ఆయా వ్యక్తుల జీవితాలను ఒకరికొకరు కలబోసుకుంటూ భోజనం చేశాము.
సభ ముగియగానే ఎక్కడి వారు అక్కడికి వెళ్ళక విజ్ఞాన కేంద్రంలో కూర్చుని సాయంత్రం వరకు అందరూ కలిసి మెలిసి మాట్లాడుకున్నారు.
అనేక ప్రజా పోరాటాల సమావేశాలను, ప్రజాస్వామ్య పార్టీల సభలను దగ్గరగా చూసిన అనుభవాలు అనేకం ఉన్నాయి.. కానీ ఎన్నో దశాబ్దాల తర్వాత మళ్లీ ఇటువంటి సభలో పాల్గొనడం వలన నాకు ఒక ఆశాజనకమైన ఊరట లభించింది.ఒక ప్రత్యామ్నాయ సమాజ నిర్మాణం గురించిన కలలకు కొత్త రెక్కలు వచ్చాయి. మళ్ళీ కొన్ని సంవత్సరాలకు సరిపడా ఆశాజనకమైన ఇంధనాన్ని అందించింది. ఒకానొక నూతనోత్సాహాన్ని, ఉద్వేగాన్ని కలిగించిందనడంలో ఏమాత్రం సంశయం లేదు.
----జూకంటి జగన్నాథం, అధ్యక్షులు,
అఖిల భారతీయ తెలంగాణ రచయితల వేదిక.FB నుండి.
More News...
<%- node_title %>
<%- node_title %>
భారత మార్కెట్‌లో బ్రిటిష్ ఎయిర్వేస్ విస్తరణ – ఢిల్లీకి మూడో డైలీ ఫ్లైట్
న్యూఢిల్లీ డిసెంబర్ 14:భారతదేశంలో తన కార్యకలాపాలను మరింత విస్తరించేందుకు బ్రిటిష్ ఎయిర్వేస్ కీలక నిర్ణయం తీసుకుంది. భారత్–యూకే మధ్య పెరుగుతున్న ప్రయాణ అవసరాలను దృష్టిలో ఉంచుకుని ఫ్లైట్ ఫ్రీక్వెన్సీలు పెంచడంతో పాటు సేవలను అప్‌గ్రేడ్ చేయనున్నట్లు సంస్థ ప్రకటించింది.
2026 నుంచి (అనుమతులకు లోబడి) లండన్ హీత్రో – న్యూఢిల్లీ మార్గంలో మూడో డైలీ... మెహదీపట్నం రైతు బజార్‌ను సందర్శించిన కవిత – మోడ్రన్ మల్టీ లెవల్ మార్కెట్‌గా అభివృద్ధి చేయాలని డిమాండ్
మెహందీపట్నం డిసెంబర్ 14 (ప్రజా మంటలు):
మెహదీపట్నం రైతు బజార్‌ను తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు కల్వకుంట్ల కవిత గారు సందర్శించారు. ఈ సందర్భంగా రైతుల సమస్యలను అడిగి తెలుసుకున్నారు. చుట్టుపక్కల ప్రాంతాల నుంచి వచ్చే రైతులకు కనీస సదుపాయాలు కూడా లేవని ఆమె ఆవేదన వ్యక్తం చేశారు. బోర్డు లేకపోవటంతో చాలా మందికి ఇది రైతు... ప్రజాస్వామ్య బలోపేతానికి ఓటే ఆయుధం: మాజీ మంత్రి రాజేశం గౌడ్
జగిత్యాల (రూరల్) డిసెంబర్ 14 (ప్రజా మంటలు):
జగిత్యాల జిల్లా అంతర్గాం గ్రామంలోని ప్రభుత్వ పాఠశాల పోలింగ్ కేంద్రంలో మాజీ మంత్రి, తెలంగాణ రాష్ట్ర తొలి ఆర్థిక సంఘం చైర్మన్ జి. రాజేశం గౌడ్ గారు సతీమణి శ్యామలాదేవితో కలిసి ఓటు హక్కును వినియోగించారు.
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, ప్రతి పౌరుడు తప్పనిసరిగా ఓటు... సీసీ కెమెరాల నూతన నైపుణ్యాలపై భారత్ భవన్లో ముగిసిన మూడు రోజుల ప్రదర్శనలు
ఢిల్లీ డిసెంబర్ 14 (ప్రజా మంటలు)ఢిల్లీలో ప్రతి ఏటా సీసీ కెమెరాలపై ఎప్పటికప్పుడు వస్తున్న నూతన పోకడలు వాడే ఉపకరణాలపై ప్రదర్శనలు నిర్వహిస్తారు ఇదిలా ఉండగా ఈనెల 11 12 13 తేదీలలోభారత్ భవన్ మంటపం లో ప్రదర్శనలు నిర్వహించారు.
దీనిలో ముఖ్యంగా ఆర్టిఫిషియల్ ఇంటిలిజెన్స్ (ఏఐ) ద్వారా రోబోలు సెక్యూరిటీగా వ్యవహరించడం... ఒక ప్రత్యామ్నాయ సంస్కృతి : ప్రజా కళాకారులు, గ్రంథాలయాలు
నేటి ఆధునిక ప్రపంచానికి దూరంగా,.. నిజమైన ప్రజా ప్రతినిధులతో....
ఈనెల 13న రంగవల్లి విజ్ఞాన కేంద్రం( గ్రంథాలయం) వార్షికోత్సవం వేములవాడ దగ్గర మరియు ఆమె 26వ వర్ధంతిని పురస్కరించుకొని ఒక సమావేశం రంగవల్లి విజ్ఞాన కేంద్రం కార్యవర్గం ఏర్పాటు చేయడం జరిగింది. అందులో నన్ను "ప్రజా గ్రంధాలయాల ఆవశ్యకత" ' విమల మిగతా ముఖ్యులు
సభ... 493 ఓట్ల మెజారిటి తో రాజగోపాల్ రావు విజయం
బీర్పూర్, డిసెంబర్, 14( ప్రజా మంటలు )
బీర్పూర్ మండలం తుంగూర్ గ్రామస్టులు రాజగోపాల్ రావు 30 ఏళ్ల తర్వాత కూడా మళ్లీ ఓటేసి అక్కున చేర్చుకున్నారు.
35 ఏళ్ల నాడు ఆ గ్రామంలో ప్రజాప్రతినిధి కావడం..అప్పటి పరిస్థితులకు ఇబ్బంది పడ్డ ఆయన ఎంతో ఆవేదనతో ఊరు విడిచి వెళ్లిపోయారు. దీంతో మళ్లీ వచ్చి ఆయన... జగిత్యాల జిల్లాలో 2వ విడత గ్రామపంచాయతీ ఎన్నికలు పూర్తి
జగిత్యాల (రూరల్) డిసెంబర్ 14 (ప్రజా మంటలు):
జగిత్యాల జిల్లాలో గ్రామపంచాయతీ ఎన్నికల రెండో విడత పోలింగ్ ప్రశాంతంగా ముగిసింది. 7 మండలాల్లో కలిపి మొత్తం 2,08,168 ఓట్లు ఉండగా 1,63,074 ఓట్లు పోలవ్వడంతో 78.34 శాతం పోలింగ్ నమోదు అయ్యింది. బీర్పూర్, జగిత్యాల, జగిత్యాల రూరల్, కొడిమ్యాల, మల్యాల, రాయికల్, సారంగాపూర్ మండలాల్లో ఆదివారం... ఒకే కుటుంబం నుండి ముగ్గురు వార్డు సభ్యుల గెలుపుపై గ్రామస్తుల హర్షం
జగిత్యాల డిసెంబర్ 14 (ప్రజా మంటలు)జిల్లాలో జరిగినరెండో విడత పంచాయతీ ఎన్నికల్లో ఒకే కుటుంబం నుండి ముగ్గురు గెలిచిన సంఘటన గ్రామస్తులను ఆశ్చర్యానికి గురి చేసింది. ఆ కుటుంబం పైన ప్రజలకు విశ్వాసం వెరసి ఒకే కుటుంబం నుండి ముగ్గురు అభ్యర్థులు గెలవడం ఆ కుటుంబం పై ఉన్న విశ్వాసం అని గ్రామస్తులు... ఎంటర్‌టైన్‌మెంట్ కోసం గంటకు ₹10 కోట్లు ఖర్చు – సింగరేణి నిధులు దుర్వినియోగం
హైదరాబాద్ డిసెంబర్ 14 (ప్రజా మంటలు):
"జాగృతి జనం బాట" కార్యక్రమంలో భాగంగా బషీర్‌బాగ్ ప్రెస్ క్లబ్‌లో నిర్వహించిన ప్రెస్‌మీట్‌లో తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు కల్వకుంట్ల కవిత సీఎం రేవంత్ రెడ్డి ప్రభుత్వంపై తీవ్ర విమర్శలు గుప్పించారు. సీఎం గంట ఎంటర్‌టైన్‌మెంట్ కోసం పది కోట్ల రూపాయలు ఖర్చు చేశారని, అది కూడా సింగరేణి కార్మికుల... రెండో విడత 7 మండలాల్లోని గ్రామపంచాయతీ ఎన్నికలు ప్రశాంతం
జగిత్యాల డిసెంబర్ 14 (ప్రజా మంటలు)జిల్లాలో రెండో విడత నిర్వహించిన గ్రామపంచాయతీ పోలింగ్ కేంద్రాలను జిల్లా కలెక్టర్ బి సత్యప్రసాద్ సందర్శించి పోలింగ్ సరళిని అడిగి తెలుసుకున్నారు. ఆయనతోపాటు జగిత్యాల ఆర్డీవో మధుసూదన్ గౌడ్ డిపిఓ రఘువరన్ తదితరులు ఉన్నారు. ఇదిలా ఉండగా ఎలాంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా జిల్లా ఎస్పీ ఆధ్వర్యంలో పోలీసులు... రెండో విడత గ్రామ పంచాయతీ ఎన్నికల్లో ప్రభుత్వం మద్దతు ఇచ్చిన అభ్యర్థులే గెలుస్తారు ఎమ్మెల్యే డా సంజయ్ కుమార్
జగిత్యాల రూరల్ డిసెంబర్ 14 (ప్రజా మంటలు) మండలం అంతర్గాం గ్రామంలో ఎమ్మెల్యే సంజయ్ కుమార్ దంపతులు తమ ఓటు హక్కును వినియోగించుకున్నారు.ఈ సందర్భంగా ఆయన మాట్లాడారు.సీఎం రేవంత్ రెడ్డి ప్రభుత్వం మద్దతు ఇచ్చిన అభ్యర్థులే ఎక్కువ శాతం గెలుస్తారని ఎమ్మెల్యే డా .సంజయ్ కుమార్ ఆశాభావం వ్యక్తం చేశారు.జగిత్యాల నియోజకవర్గంలో... సత్యమే గెలుస్తుంది – ఓట్ల చోరీకి వ్యతిరేకంగా కాంగ్రెస్ పోరాటం : రాహుల్ గాంధీ
న్యూ డిల్లీ డిసెంబర్ 14:
“సత్యమనే నినాదంతో మోదీ నేతృత్వంలోని కేంద్ర ప్రభుత్వాన్ని గద్దెదించుతాం” అని కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ స్పష్టం చేశారు. అధికారంలో ఉన్న బీజేపీ ప్రభుత్వం ఓట్ల చోరీకి పాల్పడుతోందని, ఆ ప్రక్రియలో ఎన్నికల సంఘం (EC) కూడా కేంద్రంతో చేతులు కలిపి పనిచేస్తోందని ఆయన తీవ్ర ఆరోపణలు చేశారు.
ఓట్ల... 