కాంగ్రెస్‌లో తలపడే రెండు సామ్రాజ్యాలు: ఒక పక్క రెడ్డి… మరో పక్క రావు

కానీ గద్దె మీద కూర్చున్నది మాత్రం సంజయ్!

On
 కాంగ్రెస్‌లో తలపడే రెండు సామ్రాజ్యాలు:  ఒక పక్క రెడ్డి… మరో పక్క రావు

డా.సంజయ్ కుమార్, కాంగ్రెస్‌లో చేరినప్పటి నుంచి జగిత్యాలలో రాజకీయ సమీకరణాలు పూర్తిగా మారిపోయాయి. జీవన్ రెడ్డి ఆధిపత్యానికి సవాల్ విసిరిన సంజయ్ వర్గంగా నిలుస్తుంది.

జగిత్యాల కాంగ్రెస్ పార్టీకి ఇప్పుడు ఏ పేరు సరిపోతుంది అంటే…
“వర్గాల వేటగాళ్ల లీగ్”
లేదా
“జగిత్యాల అడవి — రెండు పులులు, ఒక కుర్చీ”

ఎందుకంటే బయటకు కాంగ్రెస్ అంటే ఒకే పార్టీలా కనిపించినా…అసలు లోపల చూస్తే — అంతా గందరగోళమే.ei_1764077135488-removebg-preview

కాంగ్రెస్ లో ముందు నుండి ఉన్న గిరి నాగభూషణం, అడువల లక్ష్మణ్  లాంటి వారి పరిస్థితి అయోమయంగా మారిపోయింది. 
దళిత నాయకునిగా ఎదగాలని ఆశించే బండ శంకర్ పరిస్థితి మరి ఘోరం. వీరంతా పట్టిక సమావేశాల్లో కుర్చీలు ఖాళీగా లేకుండా, నింపే వారేనేమో!image (10)
ఒక పక్క జీవన్ రెడ్డి “సీనియారిటీ సామ్రాజ్యం”
మరో పక్క MLA సంజయ్ “క్యాడర్ ఖండాంతర శక్తి”

మరి ఈ మధ్యలో అనేవారు…
తమ తమ వర్గాలకు పదవుల పులిహోర కలుపుకునే శ్రేణులు.అంతా మాయ.

సంజయ్ కాంగ్రెస్‌లో చేరిన రోజు…

జీవన్ రెడ్డి రాజకీయ భవిష్యత్ కు గ్రహణం పట్టింది.అంతా తారుమారైందట!

సంజయ్ BRS నుండి గెలిచి కాంగ్రెస్‌లోకి వచ్చాక—
అతడే కాకుండా అతడి BRS క్యాడర్ కూడా ప్యాకేజీగా కాంగ్రెస్‌లో ల్యాండ్ అయ్యింది.

ఇప్పుడు ఆ క్యాడర్‌కు ఒకే మాట:
“మా MLA → మేం గెలిపించాం → కాబట్టి పార్టీ ఏదైనా, బాస్ మా MLA!”ఇక జీవన్ రెడ్డికి అప్పటి నుండి పరిస్థితి ఏమిటంటే…
“నేను జీవితాంతం కాంగ్రెస్ కోసం పని చేశాను…
కానీ MLA కోసం కొత్తగా, కొత్త క్యాడర్ రెడీ అయిపోయాడు. 40 ఏళ్లుగా కాంగ్రెస్ ను నమ్ముకొన్న మా గతేమిటని ప్రశ్నిస్తే, తాత్కాలికంగా శ్రీధర్ బాబు, అది శ్రీనివాస్ ఓదార్చారు. ఇక అంతే, ఇటు వైపు చూసేవారు లేరు.!”

అందుకే ఆయన ఇప్పుడు ప్రయత్నిస్తున్నది —
తన ఉనికి, తన ప్రభావం, తన క్యాడర్‌ను బతికించుకోవడమేనాని స్థానికులు ప్రశ్నించుకొంటున్నారు.

సంజయ్ మౌనం కూడా రాజకీయ ఆయుధమే!

జగిత్యాలలో ప్రస్తుతం ట్రెండ్ ఎలా ఉందేమిటి?

  • సంజయ్ మాట్లాడడు
  • మాట్లాడాల్సిన అవసరం కూడా ఉండదు
  • మాట్లాడకపోవడమే ఆయన శక్తి

మరి జీవన్ రెడ్డి పరిస్థితేమిటంటే…
మాట్లాడకుండా ఉండే పరిస్థితి లేదు.
ఎందుకంటే ఆయన మాట్లాడకపోతే—
తన క్యాడర్ మరింత జారిపోతుందనే భయం! అందుకే రోజుకో ప్రెస్ మీట్, గంటకో ఆరోపణ, నిమిషానికో విమర్శ.

అయినా ఎదుటి వర్గం నుండి కానీ, పార్టీ అధిష్టానం నుండి కానీ స్పందన లేదు.

మాజీ చైర్మన్ల పరుగు – ఎవరి వైపు?

పాత రెడ్డి గారి దగ్గరా?
లేక కొత్త శక్తివంతమైన సంజయ్ గారి దగ్గరా?**

ఒకప్పుడు జీవన్ వద్దే పట్టు వేసి తిరిగే మాజీ మున్సిపల్ చైర్మన్లు…
ఇప్పుడు MLA సంజయ్‌ను పట్టుకుని నేరుగా ముఖ్యమంత్రివద్దకు వెళ్లడం —
ఇది నిజానికి RGV సినిమా ట్విస్ట్‌లా క్యారెక్టర్ రివర్స్.

40 ఏళ్ల రాజకీయ జీవితాన్ని, జీవన్ రెడ్డి కొరకు ఖర్చుచేసిన గిరి నాగభూషణం, జీవన్ రెడ్డి దగ్గర భవిష్యత్ లేదని, కొత్తగా చేతిని MLA సంజయ్ తో చేరి, ముఖ్యమంత్రిని కలిశాడు.పార్టీ మిమ్మల్ని కాపాడుకుంటుందని, మీకు తగిన గుర్తింపు ఇస్తామని హామీ ఇచ్చారు. యాడది గడిచిపోయింది. మళ్ళీ పట్టించుకున్న కారు లేరు.

జిల్లా స్థాయిలోపడవి, గ్రంథాలయ సంస్థ చైర్మన్ పదవి అడిగినా, అదే ఏదో ఒక "రావు" కి అంటూ తప్పించుకుంటున్నారట.

ఇక మున్సిపల్ చైర్మన్ గా చేసిన గిరి నాగభూషణం కు మిగిలింది ఏమిటి? జీవన్ రెడ్డిని విడిచి, MLA వైపు వచ్చిన మొదటి, సీనియర్ కాంగ్రెస్ నాయకుడు ఈయన. ఇక్కడా ఆయనకు దక్కింది ఏమి లేదు. 

ఇన్నాళ్లు జీవన్ రెడ్డితో ఉన్న నాయకులు:
“సర్వజ్యోతిష్యానుకూలంగా” సంజయ్ వైపు జంప్.

ఆ జంప్ చూసి జీవన్  చెబుతున్నారట:
“ఇదంతా తెరవెనుక ఒక మంత్రి ప్లాన్!” అంటే, గతంలో ఉన్న మనస్పర్థల వల్ల, శ్రీధర్ బాబు, జగిత్యాలలో, జీవన్ రెడ్డి కథ ముగించే పనిలో ఉన్నాడని.

అయినా…
ముఖ్యమంత్రిని కలిసి ఫోటోలు దిగినప్పుడు ముఖాల్లో కనిపించిన సంతోషం చూస్తే —ఇప్పుడు ఎవరి ముఖంలో కనపడడం లేదు.
అది ప్లాన్ కాదు…పదవుల పరిమళం!

నామినేటెడ్ పోస్టుల్లో సంజయ్ వర్గం దూసుకెళ్తే…

జీవన్ రెడ్డి మీడియా ముందు మంటలు! ఇటీవల నియమించిన కొన్ని ఆలయ పాలకవర్గాల పోస్టులు 
సంజయ్ వర్గానికే దక్కాయి.

దీంతో మాజీ మంత్రి జీవన్ రెడ్డి ముఖం మీద
“నో కామెంట్” అన్నట్టుండే వ్యంగ్య చిరునవ్వు కాకుండా
ప్రత్యక్షంగానే మీడియా ముందు మండిపడే ప్రసంగాలు మొదలయ్యాయి. ఒకనాటి అనుంగ శిష్యుడు, నేటి మంత్రి అడ్లూరి లక్ష్మణ్ కుమార్ ముందు ఆవేశంగా, తన అక్కసు వెళ్లగక్కారు. అయినా, ఆయన చేయగలిగింది, చేసింది, ఏమీ లేదు.

“ఎవరి పూర్వపరాలు ఏమిటో తెలుసుకోవాలి!” అంటూ ఆరోపణలు.అంటే సింపుల్‌గా:
సంజయ్ వర్గం గెలుపు = జీవన్ గారి అక్రోషం.

జిల్లా కాంగ్రెస్ అధ్యక్ష పదవి జీవన్ వద్దకు వచ్చిందని…

వర్గపోరు ముగిసిందా? హాహా… ఇంకా మొదలైంది!**

జీవన్ రెడ్డి తన వర్గానికే జిల్లా కాంగ్రెస్ అధ్యక్ష పదవి తెచ్చుకుని,కొంచెం పుంజుకున్నట్టు కనిపించినా—
అది రాజకీయంగా “ఓ చిన్న విశ్రాంతి కుర్చీ” మాత్రమే. 

ఎందుకంటే, సంజయ్ వర్గంలో అంతా వ్యాపారస్తులు. వారు పార్టీ పదవి తీసుకొని, పార్టీకే డబ్బులు ఖర్చుపెట్టగలిగి, రాజకీయంగా ఎదగాలనే, తపన,ఆశలు ఉన్నవారు ఎవరు లేరు. అంతా, స్థానిక ఆధిపత్యం చాలు అనే అల్ప సంతోషులు.

అందుకే, బిసి వర్గానికి చెందిన జీవన్ రెడ్డిని ఒకరోజు తీవ్రంగా విమర్శించిన వ్యక్తికే ఆ పదవి వచ్చింది. నిజానికి, అధ్యక్ష పదవికి దరఖాస్తు చేసుకోమని పార్టీ కోరినా, చెప్పుకో దగ్గ వారెవరు దరఖాస్తు చేసుకోలేదట.

ఇక్కడ అసలు ప్రశ్న:
జిల్లా కాంగ్రెస్ అధ్యక్షుడు ఎవరు?అని కాదు. నామినేటెడ్ పదవులు ఎవరి వర్గానికే వస్తాయి? క్యాడర్ గుసగుసలాడుతుంది.
ఈ విషయాలేవీ ప్రజలు పట్టించుకోరు.

కానీ కేడర్ మాత్రం అడుగుతున్నది:
“గ్రంథాలయ సంస్థ ఎవరికో?
మార్కెట్ కమిటీలు ఎవరికో?
నీటి సంఘాలు ఎవరికి వెళ్తాయో?”

అన్నీ ఒకే దిశగా చూపుతున్నాయి:
సంజయ్ దగ్గరే రిమోట్ కంట్రోల్.

ముగింపు:

జగిత్యాల కాంగ్రెస్ —
ఒకే పార్టీ కాదు…
రెండు నాయకులు, రెండు వర్గాలు, రెండు రాజ్యాలు!**

  • జీవన్ రెడ్డికి అనుభవం
  • సంజయ్‌కు క్యాడర్ + శక్తి + ఆర్థిక బలం
  • వర్గాలకు పదవుల ఆకలి
  • అధిష్టానానికి సైలెన్స్

మరి జగిత్యాలలో ప్రధాన ప్రశ్న:
రెడ్డి వర్గమే గెలుస్తుందా?
రావు వర్గమే పైచేయి సాధిస్తుందా?
లేక సంజయ్ ఒక్కరే కొత్తగా, జగిత్యాలను ఏలుతారా?

ప్రస్తుత పరిస్థితి చూస్తే —
“జగిత్యాలలో చక్రం సంజయ్ వైపే తిరుగుతోంది”
అనే మాటను కేడర్ బహిరంగంగానే అంటోంది.కాంగ్రెస్ అధిష్టానం, ఇక తాంబూలాలు ఇచ్చాం... కొట్టుక....అన్న  కన్యాశుల్కంలోని నానుడిగా ఉంది పరిస్థితి. రాబోయే స్థానిక సంస్థల ఎన్నికలలో ఎవరు ఎంత మందిని గెలిపించుకొని, ఆధిపత్యం నిలుపుకొంటారా అని ప్రజలు వింత పరిస్థితిని, ఆశ్చర్యంగా చూస్తున్నారు.

 

Join WhatsApp

More News...

National  International  

సోనం వాంగ్చుక్‌పై ఎన్‌ఎస్‌ఏ కేసు ఉపసంహరణ… విడుదలకు మార్గం సుగమం

సోనం వాంగ్చుక్‌పై ఎన్‌ఎస్‌ఏ కేసు ఉపసంహరణ… విడుదలకు మార్గం సుగమం న్యూ ఢిల్లీ మార్చి 14 (ప్రజా మంటలు): లడాఖ్ ప్రాంతానికి చెందిన ప్రముఖ విద్యావేత్త, పర్యావరణ ఉద్యమకారుడు సోనం వాంగ్చుక్‌పై నమోదైన ఎన్‌ఎస్‌ఏ కేసును ప్రభుత్వం ఉపసంహరించుకోవడంతో ఆయన విడుదలకు మార్గం సుగమమైంది. ఈ కేసుకు సంబంధించిన తదుపరి విచారణ ఈ నెల 17వ తేదీన జరగాల్సి ఉండగా, దానికి ముందుగానే కేసు ఉపసంహరణ నిర్ణయం...
Read More...
State News 

ఘనంగా కల్వకుంట్ల కవిత జన్మదిన వేడుకలు - గోధుమలతో భారీ చిత్రం, డాక్యుమెంటరీ విడుదల

ఘనంగా కల్వకుంట్ల కవిత జన్మదిన వేడుకలు - గోధుమలతో భారీ చిత్రం, డాక్యుమెంటరీ విడుదల హైదరాబాద్ మార్చి 13 (ప్రజా మంటలు): తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు కల్వకుంట్ల కవిత   జన్మదిన వేడుకలు హైదరాబాద్‌లో ఘనంగా నిర్వహించారు. అర్ధరాత్రి తర్వాత తెలంగాణ జాగృతి నాయకులు కేక్ కట్ చేసి వేడుకలను ప్రారంభించారు. శుక్రవారం ఉదయం వేద పండితులు ఆశీర్వాదాలు అందించగా, బంజారా పూజారులు సంప్రదాయ విధానంలో దీవించారు. జాగృతి నాయకులు, కార్యకర్తలు, అభిమానులు...
Read More...
Local News 

క్రీడలు మానసిక ఉల్లాసం శారీరక దారుఢ్యం పెంపొందిస్తాయి- ఎమ్మెల్యే డా సంజయ్ కుమార్

క్రీడలు మానసిక ఉల్లాసం శారీరక దారుఢ్యం పెంపొందిస్తాయి- ఎమ్మెల్యే డా సంజయ్ కుమార్    జగిత్యాల మార్చి 12(ప్రజా మంటలు)క్రీడలు మానసిక ఉల్లాసానికి శారీరక దారుఢ్యాన్ని పెంపొందిస్తాయని ఎమ్మెల్యే డా సంజయ్ కుమార్ అన్నారు.పట్టణ వివేకానంద మినీ స్టేడియంలో తెలంగాణ యూత్ స్పోర్ట్స్ అథారిటీ వారి ఆద్వర్యం లో అంతర్జాతీయ మహిళా దినోత్సవం సందర్భంగా అస్మిత ఖేలో ఇండియా కార్యక్రమం లో భాగంగా జిల్లా స్తాయి అస్మిత లీగ్...
Read More...
Local News 

జగిత్యాల ఎమ్మెల్యే సంజయ్ కుమార్ ను కలిసిన వీరశైవ సమాజం నూతన కార్యవర్గం

జగిత్యాల ఎమ్మెల్యే సంజయ్ కుమార్ ను కలిసిన వీరశైవ సమాజం నూతన కార్యవర్గం    జగిత్యాల మార్చి 12 (ప్రజా మంటలు)ఎమ్మెల్యే సంజయ్ కుమార్ని కలిసిన జగిత్యాల పట్టణ వీర శైవ సమాజం నూతన కార్యవర్గ సభ్యులు.జగిత్యాల పట్టణ వీరశైవసమాజం నూతనంగా ఎన్నికైన కార్యవర్గం ప్రమాణస్వీకారానికి ఎమ్మెల్యే సంజయ్ కుమార్ ని  కార్యవర్గ ప్రమాణ స్వీకారానికి ఆహ్వానించారు.ఈ సందర్భంగా నూతన కార్యవర్గ సభ్యులకు శుభాకాంక్షలు తెలిపి అభినందించారు.
Read More...
Local News 

అసంబద్ధమైన తెలంగాణ విద్యా కమిషన్ సిఫార్సులను విరమించుకోవాలి  తపస్ జిల్లా అధ్యక్షులు ప్రసాదరావు

అసంబద్ధమైన తెలంగాణ విద్యా కమిషన్ సిఫార్సులను విరమించుకోవాలి   తపస్ జిల్లా అధ్యక్షులు ప్రసాదరావు   జగిత్యాల, మార్చి 12:అసంబధ్ధమైన, ఆశాస్త్రియమైన తెలంగాణ విద్యా కమిషన్ సిపారసులను విరామించుకోవాలని జగిత్యాల జిల్లా తపస్ అధ్యక్షులు బోయినపల్లి ప్రసాద్ రావు కోరారు.    తపస్ జగిత్యాల జిల్లా ఆధ్వర్యంలో తెలంగాణ విద్యా కమిషన్ సిఫార్సులపై గీత గ్రంధాలయం కేంద్రంగా గురువారం రౌండ్ టేబుల్ సమావేశం నిర్వహించారు. ఈ సమావేశంలో ప్రసాద్ రావు మాట్లాడుతూ తెలంగాణ...
Read More...
State News 

వెలుగుమట్ల బాధితులకు ఇళ్లు ప్రకటించడంతో కవిత దీక్ష విరమణ – భూదాన్ భూములపై శ్వేతపత్రం డిమాండ్

వెలుగుమట్ల బాధితులకు ఇళ్లు ప్రకటించడంతో కవిత దీక్ష విరమణ – భూదాన్ భూములపై శ్వేతపత్రం డిమాండ్ హైదరాబాద్, మార్చ్ 11 (ప్రజా మంటలు): ఖమ్మం జిల్లా వెలుగుమట్లలో ఇళ్ల కూల్చివేతలకు గురైన బాధితులకు ప్రభుత్వం ఇళ్లు, ఇండ్ల పట్టాలు ఇవ్వనున్నట్లు ప్రకటించడంతో సోమాజిగూడ ప్రెస్ క్లబ్‌లో కొనసాగుతున్న నిరాహార దీక్షను తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు కల్వకుంట్ల కవిత మరియు ధర్మసమాజ్ పార్టీ నాయకుడు విశారదన్ మహారాజ్ విరమించారు.జస్టిస్ ఈశ్వరయ్య నిమ్మరసం ఇచ్చి...
Read More...
Local News 

స్మశాన వాటికలో చెట్లు నాటిన ఎమ్మెల్యే, మున్సిపల్ చైర్ పర్సన్

స్మశాన వాటికలో చెట్లు నాటిన ఎమ్మెల్యే, మున్సిపల్ చైర్ పర్సన్    జగిత్యాల మార్చి 11 (ప్రజా మంటలు)పట్టణ గొల్లపల్లి రోడ్ లో గల సత్య హరిచంద్ర స్మశాన వాటిక లో రోటరీ ఆపి రెడ్ క్రాస్ స్వచ్ఛంద సంస్థల ద్వారా ఏర్పాటుచేసిన మొక్కలు నాటే కార్యక్రమం,పలు అభివ్రుద్ది కార్యక్రమాల్లో పాల్గొని మొక్కలు నాటిన జగిత్యాల శాసనసభ్యులు డాక్టర్ సంజయ్ కుమార్ మున్సిపల్ చైర్ పర్సన్ సమిండ్ల...
Read More...
Local News 

ఎస్ఎస్సి పరీక్షల నిర్వహణ సిబ్బందికి అవగాహన

ఎస్ఎస్సి పరీక్షల నిర్వహణ సిబ్బందికి అవగాహన జగిత్యాల మార్చి 11 (ప్రజా మంటలు)ఈనెల 14 నుండి ప్రారంభం కాబోయే ఎస్ఎస్సి పరీక్షల నిర్వహణకు కేటాయింపబడిన సిబ్బందికి అవగాహన కార్యక్రమం బుధవారం అవగాహన కార్యక్రమం నిర్వహించారు.   జిల్లా  వ్యాప్తంగా ఈనెల 14 నుండి ప్రారంభం కాబోయే ఎస్ఎస్సి పరీక్షల నిర్వహణకు కేటాయింపబడిన చీఫ్ సూపర్డెంట్ లకు మరియు డిపార్ట్మెంటల్ ఆఫీసర్లకు నియమ ఈ...
Read More...
Local News 

ఇఫ్తార్ విందులో పాల్గొన్న ఎమ్మెల్యే డా సంజయ్ కుమార్, మున్సిపల్ చైర్ పర్సన్ సమిండ్ల వాణి

ఇఫ్తార్ విందులో పాల్గొన్న ఎమ్మెల్యే డా సంజయ్ కుమార్, మున్సిపల్ చైర్ పర్సన్ సమిండ్ల వాణి జగిత్యాల మార్చి 11 ( ప్రజా మంటలు)పవిత్ర రంజాన్ పండుగను పురస్కరించుకొని జగిత్యాల పట్టణం లో జగిత్యాల జిల్లా ఎంఐఎం పార్టీ అధ్యక్షులు లియాకత్ అలీ మోసిన్  స్వగృహం లో ఇఫ్తార్ విందు కార్యక్రమంలో పాల్గొని  శుభాకాంక్షలు తెలిపిన జగిత్యాల శాసనసభ్యులు డాక్టర్ సంజయ్ కుమార్, మున్సిపల్ చైర్ పర్సన్ సమిండ్ల వాణి .ఈ...
Read More...
Local News 

సామాజిక మార్పుతోనే మహిళా సాధికారత సాధ్యం: సీనియర్ సివిల్ జడ్జి నాగేశ్వర్ రావు

సామాజిక మార్పుతోనే మహిళా సాధికారత సాధ్యం: సీనియర్ సివిల్ జడ్జి నాగేశ్వర్ రావు మెట్‌పల్లి, మార్చ్ 10 (ప్రజా మంటలు): సమాజంలో సానుకూల మార్పులు వచ్చినప్పుడే మహిళలకు నిజమైన సాధికారత సాధ్యమవుతుందని మెట్‌పల్లి సీనియర్ సివిల్ జడ్జి డి. నాగేశ్వర్ రావు అన్నారు. మహిళా దినోత్సవాన్ని పురస్కరించుకొని సోమవారం మండల న్యాయసేవా సంస్థ ఆధ్వర్యంలో నిర్వహించిన ప్రత్యేక న్యాయ విజ్ఞాన సదస్సులో ఆయన పాల్గొని మాట్లాడారు.ఈ సందర్భంగా ఆయన...
Read More...
State News 

కాంగ్రెస్‌లో కొనసాగడంపై ఆలోచిస్తా – మాజీ మంత్రి జీవన్ రెడ్డి తీవ్ర వ్యాఖ్యలు

కాంగ్రెస్‌లో కొనసాగడంపై ఆలోచిస్తా – మాజీ మంత్రి జీవన్ రెడ్డి తీవ్ర వ్యాఖ్యలు జగిత్యాల రూరల్,  మార్చ్ 10 (ప్రజా మంటలు): కాంగ్రెస్ పార్టీలో కొనసాగాలా లేదా అన్న విషయంపై తాను ఆలోచిస్తున్నానని మాజీ మంత్రి తాటిపర్తి జీవన్ రెడ్డి మరోసారి సంచలన వ్యాఖ్యలు చేశారు. జగిత్యాల జిల్లా కేంద్రంలోని ఇందిరా భవన్‌లో నిర్వహించిన విలేకరుల సమావేశంలో ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు.జగిత్యాల మున్సిపల్ చైర్‌పర్సన్ ఎన్నికల రోజే...
Read More...
State News 

కొత్త గవర్నర్ శివ ప్రతాప్ శుక్లాకు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి స్వాగతం

 కొత్త గవర్నర్ శివ ప్రతాప్ శుక్లాకు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి స్వాగతం హైదరాబాద్, మార్చ్ 10 (ప్రజా మంటలు): తెలంగాణ రాష్ట్రానికి కొత్త రాష్ట్రపతి ప్రతినిధిగా, గవర్నర్ gaa నియమితులైన శివ ప్రతాప్ శుక్లా రాష్ట్రానికి విచ్చేశారు. ఈ సందర్భంగా హైదరాబాద్‌లోని రాజీవ్ గాంధీ అంతర్జాతీయ విమానాశ్రయంలో రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఆయనకు ఘనంగా స్వాగతం పలికారు.ఈ స్వాగత కార్యక్రమంలో మంత్రి దుద్దిళ్ల శ్రీధర్ బాబు,...
Read More...