అంత్యక్రియలకు డబ్బులు లేక కొడుకుది దేహంతో 8 గంటలు స్మశానంలో కూర్చున్న తండ్రి
మహబూబ్‌నగర్‌లో హృదయ విదారక దృశ్యం
స్వచ్ఛంద సేవా సంస్థ సాయం
మహబూబ్‌నగర్, నవంబర్ 18 (ప్రజా మంటలు):
మహబూబ్‌నగర్‌లో చోటుచేసుకున్న ఒక హృదయవిదారక సంఘటన ప్రతి ఒక్కరి హృదయాన్ని కలచివేస్తోంది. అంత్యక్రియల ఖర్చు కూడా చేయలేని దారిద్య్రం ఒక తండ్రిని 8 గంటలపాటు తన చిన్నారి మృతదేహంతో స్మశానంలోనే కూర్చోబెట్టింది.
ఎంతో కష్టాల్లో కుటుంబం
ప్రేమ్ నాగర్ ప్రాంతానికి చెందిన బాలరాజ్, స్థానికంగా ఉన్న పత్తి మిల్లులో పని చేస్తూ భార్య, ఇద్దరు కుమారులను పోషిస్తూ జీవనం సాగిస్తున్నాడు. కొన్ని నెలల క్రితం పత్తి మిల్లు మూతపడడంతో బాలరాజ్ ఉపాధి కోల్పోయాడు. ఆర్థిక ఒత్తిళ్లతో విసిగిపోయిన భార్య, దివ్యాంగుడైన పెద్ద కుమారుడిని విడిచి చిన్న కొడుకుతో పుట్టింటికి వెళ్లిపోయింది.
దారిద్య్రం కరాళనృత్యం
తనతో ఉన్న దివ్యాంగుడు హరీష్ (8) ను చూసుకుంటూ బాలరాజ్ హోటల్‌లో చిన్నపని చేసుకుంటూ బతుకుతున్నాడు. ఈ క్రమంలో హరీష్ అనారోగ్యానికి గురై చికిత్స పొందక మృతి చెందాడు.
డబ్బులు లేక అంత్యక్రియలు చేయలేక....
కొడుకుది దేహానికి కనీస అంత్యక్రియలు చేయడానికి కూడా డబ్బులు లేని బాలరాజ్, హరీష్ మృతదేహాన్ని చేతుల్లో పట్టుకుని 8 గంటల పాటు స్మశానంలో ఒంటరిగా ఏడుస్తూ కూర్చున్నాడు.
“బ్రతుకున్నప్పుడు తిండి పెట్టలేకపోయాను… చనిపోయాక అంత్యక్రియలూ చేయలేకపోతున్నాను” అంటూ తండ్రి బాలరాజ్ విలపించిన మాటలు అక్కడున్న వారినీ కన్నీళ్లు పెట్టించాయి.
స్వచ్ఛంద సేవా సంస్థ సాయం
ఈ విషయం తెలిసిన స్థానిక స్వచ్ఛంద సేవా సంస్థ సభ్యులు వెంటనే సహాయం చేసి హరీష్‌కు అంత్యక్రియలు నిర్వహించారు.
సమాజంలో ఇంకా బతికే ఉన్న పేదరికం, ప్రభుత్వ పథకాలు అందని వారిపై ఈ సంఘటన తీవ్రమైన ప్రశ్నలు లేవనెత్తుతోంది.
More News...
<%- node_title %>
<%- node_title %>
సోనం వాంగ్చుక్‌పై ఎన్‌ఎస్‌ఏ కేసు ఉపసంహరణ… విడుదలకు మార్గం సుగమం
న్యూ ఢిల్లీ మార్చి 14 (ప్రజా మంటలు):
లడాఖ్ ప్రాంతానికి చెందిన ప్రముఖ విద్యావేత్త, పర్యావరణ ఉద్యమకారుడు సోనం వాంగ్చుక్‌పై నమోదైన ఎన్‌ఎస్‌ఏ కేసును ప్రభుత్వం ఉపసంహరించుకోవడంతో ఆయన విడుదలకు మార్గం సుగమమైంది. ఈ కేసుకు సంబంధించిన తదుపరి విచారణ ఈ నెల 17వ తేదీన జరగాల్సి ఉండగా, దానికి ముందుగానే కేసు ఉపసంహరణ నిర్ణయం... ఘనంగా కల్వకుంట్ల కవిత జన్మదిన వేడుకలు - గోధుమలతో భారీ చిత్రం, డాక్యుమెంటరీ విడుదల
హైదరాబాద్ మార్చి 13 (ప్రజా మంటలు):
తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు కల్వకుంట్ల కవిత జన్మదిన వేడుకలు హైదరాబాద్‌లో ఘనంగా నిర్వహించారు. అర్ధరాత్రి తర్వాత తెలంగాణ జాగృతి నాయకులు కేక్ కట్ చేసి వేడుకలను ప్రారంభించారు.
శుక్రవారం ఉదయం వేద పండితులు ఆశీర్వాదాలు అందించగా, బంజారా పూజారులు సంప్రదాయ విధానంలో దీవించారు. జాగృతి నాయకులు, కార్యకర్తలు, అభిమానులు... క్రీడలు మానసిక ఉల్లాసం శారీరక దారుఢ్యం పెంపొందిస్తాయి- ఎమ్మెల్యే డా సంజయ్ కుమార్
జగిత్యాల మార్చి 12(ప్రజా మంటలు)క్రీడలు మానసిక ఉల్లాసానికి శారీరక దారుఢ్యాన్ని పెంపొందిస్తాయని ఎమ్మెల్యే డా సంజయ్ కుమార్ అన్నారు.పట్టణ వివేకానంద మినీ స్టేడియంలో తెలంగాణ యూత్ స్పోర్ట్స్ అథారిటీ వారి ఆద్వర్యం లో అంతర్జాతీయ మహిళా దినోత్సవం సందర్భంగా అస్మిత ఖేలో ఇండియా కార్యక్రమం లో భాగంగా జిల్లా స్తాయి అస్మిత లీగ్... జగిత్యాల ఎమ్మెల్యే సంజయ్ కుమార్ ను కలిసిన వీరశైవ సమాజం నూతన కార్యవర్గం
జగిత్యాల మార్చి 12 (ప్రజా మంటలు)ఎమ్మెల్యే సంజయ్ కుమార్ని కలిసిన జగిత్యాల పట్టణ వీర శైవ సమాజం నూతన కార్యవర్గ సభ్యులు.జగిత్యాల పట్టణ వీరశైవసమాజం నూతనంగా ఎన్నికైన కార్యవర్గం ప్రమాణస్వీకారానికి ఎమ్మెల్యే సంజయ్ కుమార్ ని కార్యవర్గ ప్రమాణ స్వీకారానికి ఆహ్వానించారు.ఈ సందర్భంగా నూతన కార్యవర్గ సభ్యులకు శుభాకాంక్షలు తెలిపి అభినందించారు. అసంబద్ధమైన తెలంగాణ విద్యా కమిషన్ సిఫార్సులను విరమించుకోవాలి తపస్ జిల్లా అధ్యక్షులు ప్రసాదరావు
జగిత్యాల, మార్చి 12:అసంబధ్ధమైన, ఆశాస్త్రియమైన తెలంగాణ విద్యా కమిషన్ సిపారసులను విరామించుకోవాలని జగిత్యాల జిల్లా తపస్ అధ్యక్షులు బోయినపల్లి ప్రసాద్ రావు కోరారు. తపస్ జగిత్యాల జిల్లా ఆధ్వర్యంలో తెలంగాణ విద్యా కమిషన్ సిఫార్సులపై గీత గ్రంధాలయం కేంద్రంగా గురువారం రౌండ్ టేబుల్ సమావేశం నిర్వహించారు. ఈ సమావేశంలో ప్రసాద్ రావు మాట్లాడుతూ తెలంగాణ... వెలుగుమట్ల బాధితులకు ఇళ్లు ప్రకటించడంతో కవిత దీక్ష విరమణ – భూదాన్ భూములపై శ్వేతపత్రం డిమాండ్
హైదరాబాద్, మార్చ్ 11 (ప్రజా మంటలు):
ఖమ్మం జిల్లా వెలుగుమట్లలో ఇళ్ల కూల్చివేతలకు గురైన బాధితులకు ప్రభుత్వం ఇళ్లు, ఇండ్ల పట్టాలు ఇవ్వనున్నట్లు ప్రకటించడంతో సోమాజిగూడ ప్రెస్ క్లబ్‌లో కొనసాగుతున్న నిరాహార దీక్షను తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు కల్వకుంట్ల కవిత మరియు ధర్మసమాజ్ పార్టీ నాయకుడు విశారదన్ మహారాజ్ విరమించారు.జస్టిస్ ఈశ్వరయ్య నిమ్మరసం ఇచ్చి... స్మశాన వాటికలో చెట్లు నాటిన ఎమ్మెల్యే, మున్సిపల్ చైర్ పర్సన్
జగిత్యాల మార్చి 11 (ప్రజా మంటలు)పట్టణ గొల్లపల్లి రోడ్ లో గల సత్య హరిచంద్ర స్మశాన వాటిక లో రోటరీ ఆపి రెడ్ క్రాస్ స్వచ్ఛంద సంస్థల ద్వారా ఏర్పాటుచేసిన మొక్కలు నాటే కార్యక్రమం,పలు అభివ్రుద్ది కార్యక్రమాల్లో పాల్గొని మొక్కలు నాటిన జగిత్యాల శాసనసభ్యులు డాక్టర్ సంజయ్ కుమార్ మున్సిపల్ చైర్ పర్సన్ సమిండ్ల... ఎస్ఎస్సి పరీక్షల నిర్వహణ సిబ్బందికి అవగాహన
జగిత్యాల మార్చి 11 (ప్రజా మంటలు)ఈనెల 14 నుండి ప్రారంభం కాబోయే ఎస్ఎస్సి పరీక్షల నిర్వహణకు కేటాయింపబడిన సిబ్బందికి అవగాహన కార్యక్రమం బుధవారం అవగాహన కార్యక్రమం నిర్వహించారు.
జిల్లా వ్యాప్తంగా ఈనెల 14 నుండి ప్రారంభం కాబోయే ఎస్ఎస్సి పరీక్షల నిర్వహణకు కేటాయింపబడిన చీఫ్ సూపర్డెంట్ లకు మరియు డిపార్ట్మెంటల్ ఆఫీసర్లకు నియమ
ఈ... ఇఫ్తార్ విందులో పాల్గొన్న ఎమ్మెల్యే డా సంజయ్ కుమార్, మున్సిపల్ చైర్ పర్సన్ సమిండ్ల వాణి
జగిత్యాల మార్చి 11 ( ప్రజా మంటలు)పవిత్ర రంజాన్ పండుగను పురస్కరించుకొని జగిత్యాల పట్టణం లో జగిత్యాల జిల్లా ఎంఐఎం పార్టీ అధ్యక్షులు లియాకత్ అలీ మోసిన్ స్వగృహం లో ఇఫ్తార్ విందు కార్యక్రమంలో పాల్గొని శుభాకాంక్షలు తెలిపిన జగిత్యాల శాసనసభ్యులు డాక్టర్ సంజయ్ కుమార్, మున్సిపల్ చైర్ పర్సన్ సమిండ్ల వాణి .ఈ... సామాజిక మార్పుతోనే మహిళా సాధికారత సాధ్యం: సీనియర్ సివిల్ జడ్జి నాగేశ్వర్ రావు
మెట్‌పల్లి, మార్చ్ 10 (ప్రజా మంటలు):
సమాజంలో సానుకూల మార్పులు వచ్చినప్పుడే మహిళలకు నిజమైన సాధికారత సాధ్యమవుతుందని మెట్‌పల్లి సీనియర్ సివిల్ జడ్జి డి. నాగేశ్వర్ రావు అన్నారు. మహిళా దినోత్సవాన్ని పురస్కరించుకొని సోమవారం మండల న్యాయసేవా సంస్థ ఆధ్వర్యంలో నిర్వహించిన ప్రత్యేక న్యాయ విజ్ఞాన సదస్సులో ఆయన పాల్గొని మాట్లాడారు.ఈ సందర్భంగా ఆయన... కాంగ్రెస్‌లో కొనసాగడంపై ఆలోచిస్తా – మాజీ మంత్రి జీవన్ రెడ్డి తీవ్ర వ్యాఖ్యలు
జగిత్యాల రూరల్, మార్చ్ 10 (ప్రజా మంటలు):
కాంగ్రెస్ పార్టీలో కొనసాగాలా లేదా అన్న విషయంపై తాను ఆలోచిస్తున్నానని మాజీ మంత్రి తాటిపర్తి జీవన్ రెడ్డి మరోసారి సంచలన వ్యాఖ్యలు చేశారు. జగిత్యాల జిల్లా కేంద్రంలోని ఇందిరా భవన్‌లో నిర్వహించిన విలేకరుల సమావేశంలో ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు.జగిత్యాల మున్సిపల్ చైర్‌పర్సన్ ఎన్నికల రోజే... కొత్త గవర్నర్ శివ ప్రతాప్ శుక్లాకు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి స్వాగతం
హైదరాబాద్, మార్చ్ 10 (ప్రజా మంటలు):
తెలంగాణ రాష్ట్రానికి కొత్త రాష్ట్రపతి ప్రతినిధిగా, గవర్నర్ gaa నియమితులైన శివ ప్రతాప్ శుక్లా రాష్ట్రానికి విచ్చేశారు. ఈ సందర్భంగా హైదరాబాద్‌లోని రాజీవ్ గాంధీ అంతర్జాతీయ విమానాశ్రయంలో రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఆయనకు ఘనంగా స్వాగతం పలికారు.ఈ స్వాగత కార్యక్రమంలో మంత్రి దుద్దిళ్ల శ్రీధర్ బాబు,... 