జగిత్యాల భూ వివాదంపై పారదర్శకంగా విచారణ జరపండి: దావ వసంత సురేష్
జగిత్యాల, నవంబర్ 10 (ప్రజా మంటలు):
జగిత్యాల పట్టణంలోని కొత్త బస్టాండ్ సమీపంలో ఉన్న విలువైన ప్రభుత్వ భూమి అక్రమ కబ్జా ఆరోపణలు మరోసారి తెరమీదకొచ్చాయి. ఈ వివాదంపై తక్షణమే పారదర్శక విచారణ జరపాలని జగిత్యాల జిల్లా పరిషత్ తొలి ఛైర్ పర్సన్ దావ వసంత సురేష్ జిల్లా కలెక్టర్ కార్యాలయంలో ప్రజావాణి కార్యక్రమంలో అధికారులకు వినతిపత్రం అందజేశారు.
70 ఏళ్లుగా సాగుతున్న వివాదం – “అధికారుల నిర్లక్ష్యమే మూలం”
వినతిపత్రం అందజేసిన అనంతరం మీడియాతో మాట్లాడిన వసంత సురేష్ గారు, ఈ భూమి విషయంపై గత 70 ఏళ్లుగా వివాదం కొనసాగుతోందని, కానీ అధికారుల నిర్లక్ష్యం, సమయానుకూలంగా నిర్ణయాలు తీసుకోకపోవడం వల్ల ప్రభుత్వానికి చెందిన వందల కోట్ల విలువైన భూమి వ్యక్తుల చేతుల్లో బందీ అయిపోయిందని తీవ్ర స్థాయిలో విమర్శించారు.
“జగిత్యాల పట్టణంలోని 138 సర్వే నెంబరు భూమి పరిస్థితి చూస్తే తలా పాపం చెరో పిడికెడు అన్నట్టుగా ఉంది. ప్రతి దశలో ఏదో ఒక లోపం, ప్రతి ఫైల్లో ఏదో ఒక అనుమానం, ప్రతి నిర్ణయంలో అధికార అనాసక్తి కనిపిస్తోంది” అని ఆయన వ్యాఖ్యానించారు.
అక్రమ నిర్మాణాలకు అనుమతులు ఇచ్చిన మున్సిపల్ అధికారులు ఎవరు?
“ఈ భూమిపై అక్రమ నిర్మాణాలకు అనుమతులు ఇచ్చింది ఏ విభాగం?”
“మున్సిపల్ అధికారులు ఎందుకు మౌనం వహిస్తున్నారు?”
“ప్రభుత్వ భూమిని వ్యక్తులకు ధారాదత్తం చేసే సమయంలో నిబంధనలు ఎలా ఉల్లంఘించారు?”
“ఈ వ్యవహారం మొత్తం కిబాల్స్ (Kibale) డాక్యుమెంట్స్ చుట్టూనే తిరుగుతోంది. వాటిని పూర్తి స్థాయిలో ట్రాన్స్‌లేట్ చేయించి వాస్తవాలు ఏమిటో ప్రజలకు వెల్లడిస్తాం” అని ఆయన తెలిపారు.
అక్రమాలు నిరూపితమైతే భూమి స్వాధీనం చేసుకోవాలి – బాధ్యులపై చర్యలు
“విచారణలో భూ ఆక్రమణ, అక్రమాలు నిరూపితమైతే భూమిని వెంటనే ప్రభుత్వ ఆధీనంలోకి తీసుకోవాలి. నిబంధనలను అతిక్రమించిన అధికారులు, సంబంధిత వ్యక్తులపై క్రిమినల్ కేసులు నమోదు చేయాలి.”
అలాగే ఈ వ్యవహారం ఇక్కడితో మూడిపోదని, అవసరమైతే హైకమాండ్ దృష్టికి తీసుకెళ్లి, వారి సహకారంతో రాష్ట్ర ప్రభుత్వ ముఖ్య కార్యదర్శిని కలిసి విజ్ఞప్తి చేసేందుకు సిద్ధంగా ఉన్నామని ఆయన స్పష్టం చేశారు.
వసంత గారు మాట్లాడుతూ, “ప్రజల ఆస్తి ప్రజలకే చెందాలనే కేసీఆర్ గారి స్ఫూర్తితోనే BRS తరఫున ఈ పోరాటం చేస్తున్నాం” అన్నారు.
ప్రభుత్వ ఆస్తులను కాపాడడం ఏ రాజకీయ వర్గానికీ కాకుండా రాష్ట్ర ప్రభుత్వ బాధ్యత అని చెప్పారు.
ఈ కార్యక్రమంలో మాజీ కౌన్సిలర్ దేవేందర్ నాయక్, BRS నాయకులు శీలం ప్రవీణ్, నాచుపెల్లి రెడ్డి అనురాధ, నక్క గంగాధర్, రిజ్వాన్, నీలి ప్రతాప్, గంగిపెల్లి వేణుమాధవ్, గాజుల శ్రీనివాస్, మధుకర్, ప్రణయ్, భగవాన్ రాజ్, కోటగిరి మోహన్, నవదీప్, జవీద్ తదితరులు పాల్గొన్నారు.
More News...
<%- node_title %>
<%- node_title %>
సామాజిక మార్పుతోనే మహిళా సాధికారత సాధ్యం: సీనియర్ సివిల్ జడ్జి నాగేశ్వర్ రావు
మెట్పల్లి, మార్చ్ 10 (ప్రజా మంటలు):
సమాజంలో సానుకూల మార్పులు వచ్చినప్పుడే మహిళలకు నిజమైన సాధికారత సాధ్యమవుతుందని మెట్పల్లి సీనియర్ సివిల్ జడ్జి డి. నాగేశ్వర్ రావు అన్నారు. మహిళా దినోత్సవాన్ని పురస్కరించుకొని సోమవారం మండల న్యాయసేవా సంస్థ ఆధ్వర్యంలో నిర్వహించిన ప్రత్యేక న్యాయ విజ్ఞాన సదస్సులో ఆయన పాల్గొని మాట్లాడారు.ఈ సందర్భంగా ఆయన... కాంగ్రెస్‌లో కొనసాగడంపై ఆలోచిస్తా – మాజీ మంత్రి జీవన్ రెడ్డి తీవ్ర వ్యాఖ్యలు
జగిత్యాల రూరల్, మార్చ్ 10 (ప్రజా మంటలు):
కాంగ్రెస్ పార్టీలో కొనసాగాలా లేదా అన్న విషయంపై తాను ఆలోచిస్తున్నానని మాజీ మంత్రి తాటిపర్తి జీవన్ రెడ్డి మరోసారి సంచలన వ్యాఖ్యలు చేశారు. జగిత్యాల జిల్లా కేంద్రంలోని ఇందిరా భవన్లో నిర్వహించిన విలేకరుల సమావేశంలో ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు.జగిత్యాల మున్సిపల్ చైర్పర్సన్ ఎన్నికల రోజే... కొత్త గవర్నర్ శివ ప్రతాప్ శుక్లాకు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి స్వాగతం
హైదరాబాద్, మార్చ్ 10 (ప్రజా మంటలు):
తెలంగాణ రాష్ట్రానికి కొత్త రాష్ట్రపతి ప్రతినిధిగా, గవర్నర్ gaa నియమితులైన శివ ప్రతాప్ శుక్లా రాష్ట్రానికి విచ్చేశారు. ఈ సందర్భంగా హైదరాబాద్‌లోని రాజీవ్ గాంధీ అంతర్జాతీయ విమానాశ్రయంలో రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఆయనకు ఘనంగా స్వాగతం పలికారు.ఈ స్వాగత కార్యక్రమంలో మంత్రి దుద్దిళ్ల శ్రీధర్ బాబు,... వెలుగుమట్ల ఇళ్ల కూల్చివేతపై కవిత నిరవధిక నిరాహార దీక్ష కొనసాగింపు
ఖమ్మం/హైదరాబాద్, మార్చ్ 10 (ప్రజా మంటలు):
ఖమ్మం జిల్లాలోని వెలుగుమట్లలో ఇళ్ల కూల్చివేత ఘటనకు నిరసనగా తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు కల్వకుంట్ల కవిత చేపట్టిన నిరవధిక నిరాహార దీక్ష కొనసాగుతోంది. సోమవారం రాత్రి ఖమ్మంలో దీక్ష ప్రారంభించిన కవితను మంగళవారం ఉదయం పోలీసులు అరెస్ట్ చేసి హైదరాబాద్‌కు తరలించారు.
ఖమ్మం సీపీ ఆధ్వర్యంలో సుమారు 600... వెలుగుమట్ల బాధితులకు మద్దతుగా కల్వకుంట్ల కవిత నిరవధిక నిరాహార దీక్ష ప్రారంభం
ఖమ్మం, మార్చ్ 9 (ప్రజా మంటలు):
ఖమ్మం పోలీస్ స్టేషన్ నుంచి విడుదలైన అనంతరం తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు కల్వకుంట్ల కవిత అంబేద్కర్ భవన్లో వెలుగుమట్ల బాధితులతో కలిసి నిరవధిక నిరాహార దీక్ష ప్రారంభించారు.ఈ సందర్భంగా ఖమ్మం రూరల్ పోలీస్ స్టేషన్ వద్ద మాట్లాడిన ఆమె, తెలంగాణ జాగృతి, ఎస్సీ–ఎస్టీ–బీసీ జేఏసీ, ధర్మసమాజ్ పార్టీ... ప్రజావాణి ఫిర్యాదులను త్వరగా పరిశీలించాలి
జగిత్యాల మార్చ్ 9(ప్రజా మంటలు)ప్రజావాణి అర్జీల పై సమగ్ర విచారణ జరిపి సమస్యలను త్వరగా పరిష్కరించాలని అధికారులను జిల్లా అదనపు కలెక్టర్ (రెవెన్యూ) బి.ఎస్ లత అదేశించారు.
సోమవారం కలెక్టరేట్ ఆడిటోరియంలో నిర్వహించిన ప్రజావాణి కార్యక్రమంలో ప్రజల నుండి ఫిర్యాదులు, వినతులను ఆర్డీఓలతో కలిసి స్వీకరించారు.
అదనపు కలెక్టర్ (రెవెన్యూ) బిఎస్ లత మాట్లాడుతూ... ఇరాన్ సుప్రీం లీడర్‌గా మోజ్తభా ఖమెనీ నియామకం –
ఇరాన్ సుప్రీం లీడర్‌గా మోజ్తభా కామెనీ నియామకం
మధ్యప్రాచ్య దేశమైన ఇరాన్లో అత్యున్నత మత-రాజకీయ అధికారం అయిన సుప్రీం లీడర్ పదవికి మోజ్తభా కామెనీను ఎంపిక చేసినట్లు అంతర్జాతీయ మీడియా కథనాలు వెల్లడించాయి. ఈ నిర్ణయం ప్రపంచవ్యాప్తంగా రాజకీయ, దౌత్య వర్గాల్లో చర్చకు దారితీసింది.మోజ్తభా కామెనీ, ఇరాన్ మాజీ సుప్రీం లీడర్ అయిన అయాతొల్లా... ఖమ్మంలో కల్వకుంట్ల కవిత అరెస్ట్ – మహిళా కానిస్టేబుళ్లు లేకుండానే అరెస్టుపై వివాదం
ఖమ్మం, మార్చి 09 (ప్రజా మంటలు):
వెలుగుమట్ల బాధితులకు మద్దతుగా ఖమ్మం జెడ్పీ సెంటర్ వద్ద ఆందోళన నిర్వహిస్తున్న తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు కల్వకుంట్ల కవితను పోలీసులు అరెస్ట్ చేశారు. ఆమెతో పాటు ధర్మ సమాజ్ పార్టీ అధ్యక్షుడు విశారదన్ మహరాజ్, వెలుగుమట్ల బాధితులు మరియు జాగృతి నాయకులను కూడా పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.కవితతో... సైబర్ మోసలకు గురైతే వెంటనే 1930కి ఫిర్యాదు చేయాలి:సైబర్ క్రైమ్ డిఎస్పి వెంకటరమణ
జగిత్యాల మార్చ్ 9(ప్రజా మంటలు)అంతర్జాతీయ మహిళా దినోత్సవం సందర్భంగా నర్సింగ్ విద్యార్థినులకు సైబర్ నేరాల నివారణ పై అవగాహన కార్యక్రమం నిర్వహించారు.
అంతర్జాతీయ మహిళా దినోత్సవాన్ని పురస్కరించుకొని జగిత్యాల పట్టణంలోని ప్రభుత్వ మహిళా నర్సింగ్ కళాశాలలో సైబర్ నేరాలపై అవగాహన కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ కార్యక్రమానికి సైబర్ క్రైమ్ డీఎస్పీ వెంకటరమణ ముఖ్య అతిథిగా... వెలుగుమట్ల బాధితుల ఆవేదన చూస్తే కడుపు తరుక్కుపోతోంది: కల్వకుంట్ల కవిత
ఖమ్మం, మార్చ్ 09 (ప్రజా మంటలు):
ఖమ్మం జిల్లా వెలుగుమట్లలో ఇళ్ల కూల్చివేత బాధితుల ఆవేదన చూస్తే కడుపు తరుక్కుపోతోందని తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు కల్వకుంట్ల కవిత అన్నారు. బాధితులతో కలిసి కలెక్టరేట్‌కు ర్యాలీగా బయల్దేరిన సందర్భంగా ఆమె మాట్లాడుతూ ప్రభుత్వానికి, రాజకీయ నాయకులకు ఇక్కడున్న ఆడబిడ్డల ఉసురు తగులుతుందని తీవ్రంగా వ్యాఖ్యానించారు.పిల్లల పరీక్షల... సీనియర్ సిటిజెన్స్ ఆధ్వర్యంలో అంతర్జాతీయ మహిళా దినోత్సవం. సందర్భంగా సన్మానాలు
జగిత్యాల మార్చి 8:తెలంగాణ ఆల్ సీనియర్ సిటిజెన్స్ అసోసియేషన్ జగిత్యాల జిల్లా శాఖ అధ్యక్షులు హరి అశోక్ కుమార్ ఆధ్వర్యంలో అంతర్జాతీయ మహిళా దినోత్సవం వేడుకలను ఘనంగా నిర్వహించారు.ఆదివారం తెలంగాణ ఆల్ సీనియర్ సిటిజెన్స్ అస్సోసియేషన్ సమావేశ మందిరంలో జరిగిన ఈ వేడుకల్లో జిల్లాలో వివిధ రంగాల్లో విశిష్ట సేవలు అందించిన మహిళలను సన్మానించారు.
ధర్మపురి... హైదరాబాద్‌లో 2026 డిసెంబర్ 9 నాటికి 100% ఎలక్ట్రిక్ ఆర్టీసీ బస్సులు – సీఎం రేవంత్ రెడ్డి
హైదరాబాద్ మార్చ్ 08 (ప్రజా మంటలు):
దేశంలోని ఇతర మెట్రో నగరాలు ఎదుర్కొంటున్న సమస్యలు భవిష్యత్తులో హైదరాబాద్ నగరానికి రాకుండా ముందుగానే ప్రణాళికలు రూపొందిస్తున్నామని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి తెలిపారు. హైదరాబాద్‌ను ప్రపంచ స్థాయి నగరంగా తీర్చిదిద్దడమే ప్రభుత్వ లక్ష్యమని ఆయన అన్నారు.
అంతర్జాతీయ మహిళా దినోత్సవం సందర్భంగా హైదరాబాద్‌లోని జ్యోతిరావు పూలే భవన్లో జరిగిన... 