విజయమే లక్ష్యంగా శ్రమే ఆయుధంగా.... ముందుకు సాగుతున్న  వర్ధమాన యువ నటుడు జయదేవ్

On
విజయమే లక్ష్యంగా శ్రమే ఆయుధంగా.... ముందుకు సాగుతున్న  వర్ధమాన యువ నటుడు జయదేవ్

విజయమే లక్ష్యంగా శ్రమే ఆయుధంగా.... ముందుకు సాగుతున్న  వర్ధమాన యువ నటుడు జయదేవ్

నెపం ఒకరిపై వెయ్యను
ప్రయత్నం ఎన్నడూ వీడను!!

విజయమే లక్ష్యంగా
శ్రమే ఆయుధంగా....
ముందుకు సాగుతున్న 
వర్ధమాన యువ నటుడు జయదేవ్

"స్వీయలోపంబెరుగుట పెద్ద విద్య" అన్న ఆర్యోక్తికి బ్రతికున్నంత కాలం అక్కినేని నాగేశ్వరావు 'బ్రాండ్ అంబాసడర్'గా ఉండేవారు. ఎన్ఠీఆర్, ఎస్వీఆర్ వంటి ధీశాలులను ఢీకొని నెగ్గుకురావడం కోసం తన బలాలు, బలహీనతలను బేరీజు వేసుకుని ముందుకు సాగేవాడినని ఆయన తరచూ గుర్తు చేసుకునేవారు. వర్ధమాన యువ నటుడు జయదేవ్ కూడా తన లోపాలు తానే సరి చేసుకుంటూ... తెలుగు చిత్రసీమలో తనకంటూ ఒక చిన్న ప్రత్యేక స్థానం సంపాదించుకోవడం కోసం అహరహం శ్రమిస్తున్నానని అంటున్నాడు. "ఆ లోపం... ఆడిషన్ పరమైనది, లేదా ప్రయత్నం పరమైనది కావొచ్చు... లేదా అప్రోచ్ పరమైనది కావొచ్చు. నాకంటే తర్వాత వచ్చినవాళ్ళు రేసులో దూసుకుపోతుంటే... నేను ఇంకా "స్టగులర్"గానే ఉండదానికి కచ్చితంగా నాదే లోపంగా భావిస్తాను" అంటున్నాడు!!

సంచలన దర్శకుడు తేజ కొత్తవాళ్ళతో ఒక సినిమా తలపెట్టి చేసిన "స్టార్ హంట్"లో విజేతగా నిలిచాడు జయదేవ్. అప్పటికి అతడు నూనూగు మీసాల నవ యువకుడు. జస్ట్ 17.. అతడి వయసు. కొన్ని రోజులు వర్క్ షాప్ కూడా చేశారు. కానీ.. కారణాంతరాల వల్ల సదరు ప్రాజెక్ట్ పట్టాలెక్కలేదు. అయినా జయదేవ్ కుంగిపోలేదు. "చావో రేవో" తేల్చుకోవాల్సిందేనని ఫిక్స్ అయిపోయి... ప్రయివేటుగా చదువును కొనసాగిస్తూనే... పట్టువదలని విక్రమార్కుడిలా ప్రయత్నాలు ప్రారంభించాడు.
ప్రభాస్ "మిర్చి", రామ్ "ఎందుకంటే ప్రేమంట" తదితర చిత్రాల్లో నటించే అవకాశాలు దక్కించుకుని... తన తల్లిదండ్రులు, తన సోదరుడు తన మీద ఉంచిన నమ్మకాన్ని నిజం చేశాడు!!

"యుద్ధం శరణం" చిత్రంలో నాగ చైతన్య స్నేహితునిగా నటించే ఛాన్స్ సొంతం చేసుకున్న ఈ యువతేజం... ఆ చిత్రంతో మొదటిసారిగా "పోస్టర్" ఎక్కాడు. "ప్రేమిక" అనే షార్ట్ ఫిల్మ్ కోసం సైమా అవార్డ్ కు నామినేట్ అయ్యాడు. "ఆహా"లో స్ట్రీమింగ్ అవుతున్న అర్ధమైందా "అరుణ్ కుమార్"లో విలన్ గా నటించి మెప్పించిన జయదేవ్... మెల్లగా అందరి దృష్టిని ఆకర్షించడం మొదలుపెట్టాడు. ప్రస్తుతం "వార్ మెన్" వెబ్ సిరీస్ లో లీడ్ రోల్ చేస్తున్న జయదేవ్... కృష్ణ మామిడి దర్శకత్వంలో వరలక్ష్మి శరత్ కుమార్ ప్రధాన పాత్రలో తెరకెక్కుతున్న "ఆద్య"లో విలన్ గా నటిస్తున్నాడు!!

శేఖర్ మాస్టర్ దగ్గర డాన్స్ సాధన చేసిన జయదేవ్... మార్షల్ ఆర్ట్స్ లోనూ తగిన తర్ఫీదు పొందాడు. కెరీర్ బిగినింగ్ లో ఫిల్మ్ ఇనిస్టిట్యూట్ లో చేరి శిక్షణ తీసుకున్న ఈ కుర్రాడు... "అద్దం" తన అసలు సిసలు గురువంటాడు. నటనను అర్ధం చేసుకోవడానికి అద్దం తనకు ఎంతగానో దోహదపడుతుందని చెబుతాడు. "నన్ను నాకంటే మిన్నగా నమ్మిన మా నాన్న, అమ్మ, నాన్నల నుంచి ఇప్పటివరకు తీసుకోవడం తప్ప... వాళ్లకు ఇచ్చిందన్నదే లేదు" అంటూ ఒకింత భావోద్వేగానికి లోనయ్యే ఈ వాస్తవవాది... తన "అమ్మానాన్న, అన్న" తనను చూసి గర్వపడేలా చేయడమే తన ముందున్న ధ్యేయంగా ప్రకటించుకుంటాడు.

"జయదేవ్"ను 
సంప్రదించాలనుకునేవారు 
*99 66 51 55 33*
నంబర్ కి కాల్ చేయవచ్చు!!

Tags
Join WhatsApp

More News...

State News 

ఎన్నికల లబ్ది కోసమే  ఫోన్ ట్యాపింగ్ కేసులో కేసీఆర్‌కు సిట్ నోటీసులు : కవిత 

ఎన్నికల లబ్ది కోసమే  ఫోన్ ట్యాపింగ్ కేసులో కేసీఆర్‌కు సిట్ నోటీసులు : కవిత  హైదరాబాద్, జనవరి 29 (ప్రజా మంటలు): ఫోన్ ట్యాపింగ్ కేసులో మాజీ సీఎం కేసీఆర్‌కు సిట్ నోటీసులు జారీ చేయడంపై తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు కల్వకుంట్ల కవిత స్పందించారు. ఎన్నికలు ఉన్నందునే కేసీఆర్ గారికి నోటీసులు ఇచ్చారని ఆమె వ్యాఖ్యానించారు. ఫోన్ ట్యాపింగ్ వంటి అత్యంత బాధాకరమైన అంశంపై ప్రభుత్వం నిజంగా సీరియస్‌గా లేదని అన్నారు....
Read More...
Local News 

ప్రభుత్వ ఖర్చులతో స్వదేశానికి చేరిన గల్ఫ్ కార్మికుని మృతదేహం

ప్రభుత్వ ఖర్చులతో స్వదేశానికి చేరిన గల్ఫ్ కార్మికుని మృతదేహం హైదరాబాద్, జనవరి 29 – ప్రజా మంటలు. ఓమాన్‌లో మృతి చెందిన నిజామాబాద్ జిల్లా నవీపేట మండలం యాంచా గ్రామానికి చెందిన గల్ఫ్ కార్మికుడు గొల్ల అబ్బులు మృతదేహం తెలంగాణ ప్రభుత్వ ఖర్చులతో హైదరాబాద్‌కు చేరింది. డిసెంబర్ 9న ‘ఇబ్రి’ ఎడారిలో మృతి చెందిన ఆయన మృతదేహం 52 రోజుల అనంతరం స్వదేశానికి వచ్చింది. కుటుంబం...
Read More...
Crime  State News 

ఫోన్ ట్యాపింగ్ కేసు: మాజీ సీఎం కేసీఆర్‌కు సిట్ నోటీసులు

ఫోన్ ట్యాపింగ్ కేసు: మాజీ సీఎం కేసీఆర్‌కు సిట్ నోటీసులు హైదరాబాద్, జనవరి 29 – ప్రజా మంటలు. తెలంగాణలో సంచలనంగా మారిన ఫోన్ ట్యాపింగ్ కేసులో మాజీ ముఖ్యమంత్రి, బీఆర్ఎస్ అధినేత కల్వకుంట్ల చంద్రశేఖర్ రావు (కేసీఆర్) కు ప్రత్యేక దర్యాప్తు బృందం (సిట్) నోటీసులు జారీ చేసింది. ఈ మేరకు సిట్ అధికారులు నందినగర్‌లోని కేసీఆర్ నివాసానికి వెళ్లి నోటీసులు అందజేశారు. నోటీసుల్లో భాగంగా,...
Read More...
Local News  State News 

జాతీయ జనగణనలో బీసీలను పక్కన పెట్టే కుట్ర – రౌండ్ టేబుల్ సమావేశంలో తీవ్ర విమర్శలు

జాతీయ జనగణనలో బీసీలను పక్కన పెట్టే కుట్ర – రౌండ్ టేబుల్ సమావేశంలో తీవ్ర విమర్శలు కేంద్ర ప్రభుత్వ డాక్యుమెంట్ ప్రమాదకరం : కల్వకుంట్ల కవిత
Read More...
Local News  State News 

కులగణనలో బీసీలకు కేంద్రం ద్రోహం : కల్వకుంట్ల కవిత

కులగణనలో బీసీలకు కేంద్రం ద్రోహం : కల్వకుంట్ల కవిత హైదరాబాద్, జనవరి 29  (ప్రజా మంటలు): దేశవ్యాప్తంగా జరుగుతున్న జనగణన–కులగణన ప్రక్రియలో కేంద్ర ప్రభుత్వం బీసీలకు తీవ్ర అన్యాయం చేస్తోందని తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు కల్వకుంట్ల కవిత ఆరోపించారు. జాతీయ జనగణనలో కులగణనపై సమగ్ర చర్చ కోసం నిర్వహించిన రౌండ్ టేబుల్ సమావేశంలో ఆమె ప్రసంగించారు. బిసి కాలం తొలగించడం అన్యాయం పదేళ్లకు ఒకసారి జరగాల్సిన...
Read More...

ఎమ్మెల్యే సంజయ్ అవినీతితో జగిత్యాల మున్సిపాలిటీ బ్రష్టు : మాజీ మంత్రి జీవన్ రెడ్డి

ఎమ్మెల్యే సంజయ్ అవినీతితో జగిత్యాల మున్సిపాలిటీ బ్రష్టు : మాజీ మంత్రి జీవన్ రెడ్డి జగిత్యాల, జనవరి 28 (ప్రజా మంటలు): జగిత్యాల మున్సిపాలిటీని ఎమ్మెల్యే సంజయ్ అవినీతి, అక్రమాలతో బ్రష్టు పట్టించారని మాజీ మంత్రి తాటిపర్తి జీవన్ రెడ్డి ఆరోపించారు. ఇందిరా భవన్‌లో జరిగిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ, గత ఐదేళ్లలో 16 మంది కమిషనర్లు మారటం, 8 మంది ఉద్యోగులు జైలు పాలవడం, ఏసీబీ–విజిలెన్స్ దాడులే ఎమ్మెల్యే...
Read More...
State News 

మున్సిపల్ ఎన్నికల్లో సింహం గుర్తుపై తెలంగాణ జాగృతి అభ్యర్థుల పోటీ

మున్సిపల్ ఎన్నికల్లో సింహం గుర్తుపై తెలంగాణ జాగృతి అభ్యర్థుల పోటీ ఆల్ ఇండియా ఫార్వర్డ్ బ్లాక్‌తో కలిసి ముందుకు వెళ్లాలని నిర్ణయం హైదరాబాద్, జనవరి 28 (ప్రజా మంటలు): రానున్న మున్సిపల్ ఎన్నికల్లో ఆల్ ఇండియా ఫార్వర్డ్ బ్లాక్ పార్టీ ‘సింహం’ గుర్తుపై తెలంగాణ జాగృతి ఔత్సాహిక అభ్యర్థులు పోటీ చేయనున్నట్లు ప్రకటించారు. ఈ నిర్ణయాన్ని తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు కల్వకుంట్ల కవిత సమక్షంలో ఆల్ ఇండియా...
Read More...
Today's Cartoon 

Today's Cartoon

Today's Cartoon Today's Cartoon
Read More...

ఎన్నికల నియమవళి పక్కాగా అమలు చేయాలి నామినేషన్ కేంద్రాలను పరిశీలించిన జిల్లా కలెక్టర్ బి. సత్యప్రసాద్

ఎన్నికల నియమవళి పక్కాగా అమలు చేయాలి  నామినేషన్ కేంద్రాలను పరిశీలించిన జిల్లా కలెక్టర్ బి. సత్యప్రసాద్ మెట్పల్లి/కోరుట్ల జనవరి 28 (ప్రజా మంటలు)మెట్ పెల్లి మరియు కోరుట్ల మున్సిపాలిటీల్లో జరుగుతున్న నామినేషన్ల ప్రక్రియను జిల్లా కలెక్టర్ బి. సత్యప్రసాద్ బుధవారం పరిశీలించారు. ఈ సందర్భంగా నామినేషన్ల స్వీకరణ ప్రక్రియ సజావుగా, పారదర్శకంగా జరుగుతోందా లేదా అనే విషయాన్ని స్వయంగా పరిశీలించారు.నామినేషన్లు దాఖలు చేసేందుకు వచ్చిన అభ్యర్థులకు ఎలాంటి అసౌకర్యాలు కలగకుండా...
Read More...

గోదావరి పుష్కరాలకు పకడ్బందీ ఏర్పాట్లు చేయాలి దేవదాయ శాఖ ప్రధాన కార్యదర్శి శైలజా రామయ్యర్

గోదావరి పుష్కరాలకు పకడ్బందీ ఏర్పాట్లు చేయాలి  దేవదాయ శాఖ ప్రధాన కార్యదర్శి శైలజా రామయ్యర్ జగిత్యాల జనవరి 28 ( ప్రజా మంటలు)2027 లో  గోదావరి పుష్కరాలు జరుగనున్న నేపథ్యంలో పుష్కరాలను పకడ్బందీగా నిర్వహించే క్రమంలో బుధవారం జిల్లా కలెక్టర్ లు మరియు సంబందిత అధికారులతో వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. జగిత్యాల జిల్లా నుండి జిల్లా కలెక్టర్ బి. సత్యప్రసాద్ పాల్గొన్నారు.  ఈ సందర్బంగా దేవదాయ శాఖ ప్రధాన కార్యదర్శి...
Read More...

శ్రీ వెంకటేశ్వర స్వామి బ్రహ్మోత్సవాల ఆహ్వాన పత్రిక ధర్మపురి సిఐ కి అందజేత

శ్రీ వెంకటేశ్వర స్వామి బ్రహ్మోత్సవాల ఆహ్వాన పత్రిక ధర్మపురి సిఐ కి అందజేత వెల్గటూరు జనవరి 28 (ప్రజా మంటలు) జక్కాపురం నారాయణస్వామి వెలగటూరుధర్మపురి సిఐ ఏ. నరసింహ రెడ్డి నీ మర్యాద పూర్వకం గా కలిసి శ్రీ వెంకటేశ్వర స్వామి బ్రహ్మోత్సవాలకీ ఆహ్వానం అందించిన ఆలయ చైర్మన్ చింతల రాజయ్య,సర్పంచ్ భూపల్లి రాజయ్య,ఉపసర్పంచ్ యాగండ్ల గంగయ్య, ప్రధాన అర్చకులు పవన్ కుమార్ ,హరి ప్రశాంత్,   ఈ కార్యక్రమం...
Read More...

ఈనెల 30న వెలగటూర్ మండల స్థాయి ( సీఎం కప్) సెకండ్ ఎడిషన్ సెలక్షన్స్

ఈనెల 30న వెలగటూర్ మండల స్థాయి ( సీఎం కప్) సెకండ్ ఎడిషన్ సెలక్షన్స్    వెల్గటూర్ జనవరి 28 ( ప్రజా మంటలు) జక్కాపురం నారాయణస్వామి వెల్గటూర్మండల స్థాయి సీఎం కప్ (సెకండ్ ఎడిషన్)  సెలక్షన్స్ తేదీ 30 జనవరి 2026 శుక్రవారం రోజున జడ్.పి.హెచ్.ఎస్ వెల్గటూర్ లో నిర్వహించబడతాయని ఎంఈఓ బోనగిరి ప్రభాకర్  తెలిపారు. మండలంలోని అన్ని గ్రామాల క్రీడాకారిని మరియు క్రీడాకారులు తమ వెంట రిజిస్ట్రేషన్ చేసుకున్న...
Read More...