ముత్యంపేట షుగర్ ఫ్యాక్టరిని వెంటనే పునరుద్దరించాలని అఖిలా పక్షం నాయకలు డిమాండ్.
మెట్టుపల్లి సెప్టెంబర్ 11 (ప్రజా మంటలు దగ్గుల అశోక్):
ముత్యంపేట షుగర్ ఫ్యాక్టరిని వెంటనే పునరుద్దరించాలని అఖిలా పక్షం నాయకలు డిమాండ్ చేసారు. గురువారం తులా గంగవ్వ ట్రస్ట్ మరియు తెలంగాణ జనసమితి పార్టీ రైతు విభాగం ఆధ్వర్యంలో రౌండ్ టేబుల్ సమావేశం.
నిర్వహించారు. ఈ సందర్బంగా సీపీఐ, సీపీఐ ఎమ్మెల్, న్యూ డెమోక్రసీ, బీఆరెస్ పార్టీ, సమాజ్ వాదీ పార్టీ, బీసివైసీ పార్టీల ప్రతినిధులు, చెరుకు రైతు సంఘం, రైతు సంఘాల ప్రతినిధులు, చెరుకు రైతులు పాల్గొని వివిధ తీర్మానాలు ఆమోదించారు.
ముత్యంపేట షుగర్ ఫ్యాక్టరీ పరిధిలో రైతులు 15 వేల ఎకరాల విస్తీర్ణంలో చెరుకు నాటాలని అందుకు ఫ్యాక్టరీని పునరుద్ధరణకు ప్రభుత్వం తరుపున రైతులకు నమ్మకం కల్పించాలని తీర్మానించారు. ఫ్యాక్టరీ పునరుద్ధరణ కోసం ఏర్పాటు అయిన శ్రీధర్ బాబు గారి కమిటీని జీవన్ రెడ్డి ద్వారా స్థానిక అధికార పార్టీ నాయకుల ద్వారా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారిని ఈ నెలలో కలిసి తొందరలో అనగా వచ్చే సీజన్ వరకు పునరుద్ధరణ పనులు ప్రారంభించుటకు వినతి పత్రం సమర్పించి ప్రభుత్వ హామీని అమలు చేయాలని తీర్మానించారు. ఫ్యాక్టరీ పరిధిలో అన్నీ గ్రామాల్లో రైతులని కలిసి చెరుకు నాటాడానికి కృషి చేయాలని అలాగే చెరుకు రైతు సంఘాలను ఏర్పాటు చేయాలని తీర్మానించారు.
ఈ సమావేశంలో తులా రాజేంధర్ కుమార్, కంతి మోహన్ రెడ్డి, తెలంగాణ జనసమీతి రైతు విభాగం రాష్ట్ర అధ్యక్షులు, కోరుట్ల నియోజకవర్గ ఇంచార్జీ. మామిడి నారాయణ రెడ్డి, ప్రవీణ్ గోరుమంతుల, చెన్నమననేని శ్రీనివాస రావు, దారిశెట్టి రాజేష్, మారు సాయిరెడ్డి, చెన్న విశ్వనాథం, ముజాహిద్, చింత భూమేశ్వర్, చింతకుంట శంకర్, గుయ్య సాయి కృష్ణ యాదవ్, లింబారెడ్డి, రాజారెడ్డి, ఎలిసే పాపన్న తదితరులు పాల్గొన్నారు.
More News...
<%- node_title %>
<%- node_title %>
నిద్రపోయిన విద్యార్థుల కళ్లకు జిగురు పోసిన అగంతకులు

వరంగల్ సిటీ విశ్రాంత ఉద్యోగుల నూతన కార్యవర్గం

భారతదేశంపై కన్ను వేసిన చైనా - టిబెట్ ప్రవాస ప్రభుత్వ మాజీ ప్రధాని లోబ్సాంగ్ సంగే హెచ్చరిక

గాంధీ సూపరింటెండెంట్‌తో జూడా ప్రతినిధుల భేటీ

అంగరంగ వైభవంగా కొనసాగిన వామన పురాణం

అంగన్వాడీ కేంద్రంలో, సంచార జాతుల వారి మధ్యలో స్కై ఫౌండేషన్ వేడుకలు

మైనార్టీలకు కాంగ్రెస్ పార్టీ సదా అండగా ఉంటుంది - రాష్ర్ట మంత్రి వివేక్ వెంకటస్వామి

మాజీ మంత్రి హరీష్ రావును కలిసిన మాజీ మంత్రి రాజేశం గౌడ్

సైన్స్ ల్యాబ్ నిర్మూణానికి శంకుస్థాపన చేసిన ఎమ్మెల్యే డా సంజయ్ కుమార్

సింగరేణి ఎన్నికల్లో గెలవబోయేది మనమే - కల్వకుంట్ల కవిత

జగిత్యాల జిల్లా పెగడపల్లి ఎమ్మార్వో రవీందర్ పై కేసు నమోదు

గాంధీ ఆసుపత్రి సూపరింటెండెంట్ గా ప్రొ. వాణి బాధ్యతల స్వీకరణ
